» »శాఖాహార మొసలి...అనంతుడికి రక్షణగా

శాఖాహార మొసలి...అనంతుడికి రక్షణగా

Written By: Beldaru Sajjendrakishore

మొసలి మాంసాహారి అన్న విషయం తెలిసిందే. అయితే ప్రపంచంలో ఒకే ఒక మొసలి శాఖ హారి. బియ్యం, బెల్లంతో తయారు చేసిన ప్రసాదాన్ని మాత్రమే రోజూ తింటుంది. ఆ మొసలి ఉన్న సరస్సులోకి దిగిన వారికి కూడా ఇప్పటి వరకూ ఎటువంటి హాని కలుగలేదు. ఈ మొసలి అనంత పద్మనాభ స్మామికి రక్షణగా ఉంటోంది. ఇన్ని విశిష్టతలు కలిగిన మొసలి, అది ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రానికి సంబంధించిన వివరాలు నేటివ్ ప్లానెట్ పాఠకుల కోసం

1. కేరళలో

1. కేరళలో

Image source:

కేరళలోని మంజేశ్వరం తాలూకా, కుంభళకు ఆరు కిలోమీటర్ల దూరంలోని అనంతపుర అనే గ్రమంలో అనంత పద్మనాభ స్మామి దేవాలయం ఉంది. ఈ దేవాలయం ఒక సరస్సు మధ్యలో నిర్మించారు.

2. దేవాలయం

2. దేవాలయం


Image source:

కేరళలో సరస్సు మధ్య నిర్మించిన దేవాలయం ఇదొక్కటే. 302 చదరపు అడుగుల విస్తీర్ణంలోని చెరువు మధ్య ఒక గుహలో ఈ దేవాలయం ఉంది. అంటే సుమారు 2 ఎకరాల విస్తీర్ణంలో సరస్సు ఉంది.

3. మూల విరాట్టు ఇక్కడే

3. మూల విరాట్టు ఇక్కడే

Image source:

ఇక్కడి స్థానికుల కథనం ప్రకారం తిరువనంతపురంలోని అనంత పద్మనాభ స్వామి మూల విరాట్టు ఇదే. ఇక్కడ ఉన్న ఈ గుహ నుంచే అనంతపద్మనాభ స్వామి తిరువనంతపురం వెళ్లినట్లు పురాణ కథనం

4. మొసలి కాపలా

4. మొసలి కాపలా

Image source:

ఈ దేవాలయాన్ని బబియా అనే మొసలి కాపాలా కాస్తూ ఉంటుంది. దేవాలయం దర్శనకు వెళ్లే సమయంలో చాలా మంది ఈ సరస్సులో స్నానం చేస్తుంటారు. అయితే ఇప్పటి వరకూ ఒక్కరికి కూడా ఈ మొసలి నుంచి అపాయం ఎదురుకాలేదని తెలుస్తోంది.

5. చేపలను కూడా తినదు

5. చేపలను కూడా తినదు

Image source:

ఈ సరస్సులో ఉన్నటు వంటి చేసలను కూడా ఈ మొసలి తినదు. ఈ సరస్సుకు చుట్టు పక్కల నదులు కాని సముద్రం కాని లేదు. దీంతోఈ మొసలి ఎక్కడి నుంచి వచ్చిందన్న విషయం పై ఇప్పటికీ నిర్థారణకు రాలేకపోతున్నారు.

6. ప్రతి రోజూ ప్రసాదం

6. ప్రతి రోజూ ప్రసాదం

Image source:

గుహలో ఉంటున్న మొసలికి దేవాలయం పూజారులు ప్రతి రోజు స్వామివారికి సమర్పించిన ప్రసాదాన్ని అందజేస్తారు. సరస్సు ఒడ్డుకు నిలబడి బిబియా అని పిలిచిన వెంటనే ఆ మొసలి అక్కడకు వచ్చి బియ్యం, బెల్లంతో తయారు చేసిన ప్రసాదాన్ని తిని తిరిగి వెళ్లి పోతుంది.

7. ఇతర ఆహారాన్ని ముట్టదు

7. ఇతర ఆహారాన్ని ముట్టదు

Image source:

పూజారులు పెట్టే ప్రసాదం తప్ప బబియా ఇతర ఆహారాన్ని ముట్టూకోదని ఇక్కడి వారు చెబుతున్నారు. అదే విధంగా స్థానిక కథనం ప్రకారం దాదాపు 150 నుంచి ఇక్కడ మొసలి ఉందని తెలుస్తోంది. అందరూ ఈ మొసలిని అనంతపద్మనాభ స్వామి ప్రతిరూపంగా కొలుస్తారు.

8. అప్పట్లో

8. అప్పట్లో

Image source:

ఇదిలా ఉండగా స్వతంత్రానికి పూర్వం ఒక బ్రిటీష్ సైనికుడు ఇక్కడ ఉన్న మొసలిని తుపాకీతో కాల్చి చంపాడు. మరుసటి రోజే ఎక్కడ నుంచి వచ్చిందో తెలియని ఓ మొసలి ఈ సరస్సులో ప్రతక్షతమయ్యింది.

ఎవరూ హాని తలపెట్టరు

ఎవరూ హాని తలపెట్టరు

Image source:

దీనిని అప్పటి నుంచి బబియా అనే పేరుతో పిలుస్తూ వచ్చారు. ఇక తుపాకీతో కాల్చిన సైనికుడు వారం లోపే చనిపోయాడు. దీంతో బబియాకు ఇక్కడి వారు ఎవరూ హాని తలపెట్టడానికి సాహసించరు.

10. దీని చూడటానికే

10. దీని చూడటానికే

Image source:

సాధారణంగ పుణ్యక్షేత్రాల్లో ఎవరైనా దేవతా మూర్తులను సందర్శించుకోవడానికి ప్రాధాన్యత ఇస్తారు. ఇక్కడ స్వామి వారితో పాటు ఈ శాఖహార మొసలిని చూడటానికి కూడా అంతే ప్రాముఖ్యత ఇస్తారు.