Search
  • Follow NativePlanet
Share
» »చిల్కూరు బాలాజీ కి వీసా ఎఫెక్ట్ !

చిల్కూరు బాలాజీ కి వీసా ఎఫెక్ట్ !

చిలుకూరు బాలాజీ దేవాలయం రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ మండలంలోని చిలుకూరు గ్రామంలో ఉంది. బాలాజీ వెంకటేశ్వరుని అనేక నామాల్లో ఒకటి. ఈ ఆలయం పెద్ద ఆర్భాటాలు లేకుండా, సీదా సాదాగా ఉంటుంది.

By Venkatakarunasri

చిలుకూరు బాలాజీ దేవాలయం రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ మండలంలోని చిలుకూరు గ్రామంలో ఉంది. బాలాజీ వెంకటేశ్వరుని అనేక నామాల్లో ఒకటి.

ఆలయం ప్రాముఖ్యత

ఈ ఆలయం పెద్ద ఆర్భాటాలు లేకుండా, సీదా సాదాగా ఉంటుంది. భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొంటుంటారు. మ్రొక్కుగా ప్రదక్షిణలు చేస్తుంటారు. ఇక్కడ మొక్కుకుంటే వీసా తొందరగా వస్తుందని చాలామంది నమ్మకం. అందుకే ఇక్కడి బాలాజిని వీసా బాలాజీ అని పిలుస్తారు.

చిల్కూరికి ట్రంపు ఎఫెక్ట్ !

చిల్కూరికి ట్రంపు ఎఫెక్ట్ !

చిల్కూరు బాలాజీ భారతీయులకు వరమా ! అమెరికన్లకు ఋణమా !

చిల్కూరు బాలాజీ భారతీయులకు వరమా ! అమెరికన్లకు ఋణమా !త్వరలో చిలుకూరి బాలాజీ బిజినెస్ మొత్తం పడిపోతుందా? వీసాల వేంకటేశ్వరుడిగా పేరొందిన ఈ దేవుడి వ్యాపారం మొత్తం ట్రంపు ఖాతాలో కలిసిపోతుందా!ఇక నుంచి దేవుడ్ని చూడటానికి వచ్చే వాళ్ళ సంఖ్య క్రమంగా తగ్గుతుందా?అంటే అవుననే చెప్పాలి.

PC:youtube

చిల్కూరికి ట్రంపు ఎఫెక్ట్ !

చిల్కూరికి ట్రంపు ఎఫెక్ట్ !

కారణం

అమెరికాలో హెచ్‌-1బి వీసా మీద జరుగుతున్న దాడులు మామూలుగా లేవు.ఇన్నాళ్ళపాటుమనమంతా ట్రంపు వల్లే ఈ గొడవ జరుగుతోందని భావిస్తున్నామా.అలా కాదట.రిపబ్లికన్లు,డెమోక్రాట్లు తేడాలేకుండా ప్రతిఒక్కరూ భారతీయులు తమ వుద్యోగాలను ఎగరేసుకుపోతున్నారట.

PC:youtube

చిల్కూరికి ట్రంపు ఎఫెక్ట్ !

చిల్కూరికి ట్రంపు ఎఫెక్ట్ !

హెచ్‌-1బి వీసాలతో వచ్చే వారంతా తమ ఉద్యోగాలను మింగేస్తున్నారు.వీళ్ళకు కళ్ళెం వెయ్యాల్సిందేనంటూ అమెరికా సెనెట్ ప్రజలసభ్యులలోని మెజారిటిసభ్యుల అభిప్రాయం. ఒకటికాదు రెండు కాదు.ఉభయసభల్లో వీసాకి వ్యతిరేకంగా 6బిల్లులు ప్రవేశపెట్టారంటే సీనేంటోతెలుస్తుంది.

PC:youtube

చిల్కూరికి ట్రంపు ఎఫెక్ట్ !

చిల్కూరికి ట్రంపు ఎఫెక్ట్ !

ఉద్యోగాల్లో అమెరికన్లకే ప్రాధాన్యతఇవ్వాలన్నది ఇందులోని సారాంశం.అంతే కాదు రోటరీపధ్ధతి మార్చేయాలని అమెరికాలో చదువుకున్న వాళ్ళకే వుద్యోగాలు ఇవ్వాలన్న ప్రతిపాదన సైతం చేసారు.50కంటే ఎక్కువ ఉద్యోగాలు వుండివాళ్ళల్లో సగం హెచ్‌-1బి లేదా ఎల్-1 వీసాదారులున్న కంపెనీలు అదనంగా విదేశీయులను నియమించుకోరాదని కూడా ప్రతిపాదించారు.

PC:youtube

చిల్కూరికి ట్రంపు ఎఫెక్ట్ !

చిల్కూరికి ట్రంపు ఎఫెక్ట్ !

తాత్కాలిక శిక్షణకు హెచ్‌-1బి, ఎల్-1వీసాదారులను రప్పించే ఔట్ సోర్సింగ్ కంపెనీలపై గట్టి చర్యలను తీసుకోవాలని కూడా కోరారు.ఒక అమెరికన్ వుద్యోగిని పక్కనపెట్టి ఆ స్థానంలో విదేశీయులను నియమించుకోరాడని అందరూ ముక్తకంఠంతో నినదీస్తున్నారు.అమెరికాలో జరిగిన కొన్ని సంఘటనలు వుదహరిస్తూ తమప్రతిపాదనలను పొందుపరుస్తున్నారు.

PC:youtube

చిల్కూరికి ట్రంపు ఎఫెక్ట్ !

చిల్కూరికి ట్రంపు ఎఫెక్ట్ !

కాంగ్రెస్ లో సిలికాన్ వ్యాలీ కి సంబంధించి డెమోక్రటిక్ నేత కూడా ఒక బిల్లు ప్రవేశ పెట్టారు.హెచ్‌-1బి వీసాలపై వచ్చేవాళ్ళకు కనీస జీతం రెట్టింపు చేసి లక్షా ముప్పైవేల డాలర్లకు పెంచాలని కోరారు. హైస్కిల్ ఇంటిగ్రిటీ యాక్ట్ పేరిట ఈ బిల్లు ప్రవేశపెట్టింది ఈయనే.

PC:youtube

చిల్కూరికి ట్రంపు ఎఫెక్ట్ !

చిల్కూరికి ట్రంపు ఎఫెక్ట్ !

ఒక్కో దేశానికి ఇన్నేసి చొప్పున కోటాపెట్టకుండా ముందు ఎవరు కోరితే వారికి ఫస్ట్ కం ఫస్ట్ వీసాలు జారీచేయాలన్నది ఒక ప్రతిపాదన. అమెరికన్లకు వుద్యోగాలు ఇచ్చే కంపెనీలకే ప్రభుత్వం పన్నులను అప్పగించాలన్నది ఈ బిల్లు సారాంశం.ఇటీవల భారతసంతతికి చెందిన కాంగ్రెస్ సభ్యుడు ఖన్నా మరో ముగ్గురుతో కలిసి హెచ్‌-1బి, ఎల్-1 వీసాలపై సమగ్రసవరణలు తీసుకురావాలని స్పెషల్ బిల్ తీసుకువచ్చారు.

PC:youtube

చిల్కూరికి ట్రంపు ఎఫెక్ట్ !

చిల్కూరికి ట్రంపు ఎఫెక్ట్ !

వలసవిధానాన్నే సంపూర్ణంగా మార్చాలని ట్రంపుప్రభుత్వం భావిస్తున్న ఈ సమయంలో బిల్లుకు విశేషప్రాధాన్యత సంతరించుకుంటోంది. ఇది వలసదారుల్లో ముఖ్యంగా భారతీయులలో గుబులు రేపుతోంది.
ముఖ్యంగా హెచ్‌-1బిలతో వచ్చి గ్రీన్ కార్డు పొందటానికి సంబంధించి రిపబ్లికన్ సెనెటర్ టాంకాటన్ సంచలనప్రతిపాదనలు చేసారు.

PC:youtube

చిల్కూరికి ట్రంపు ఎఫెక్ట్ !

చిల్కూరికి ట్రంపు ఎఫెక్ట్ !

వలస దారుల్లో పి.హెచ్.డి,కంప్యూటర్ సైంటిస్ట్ లను మాత్రమే తాముకోరుతున్నామని మిడిల్ లెవల్ వుద్యోగులెవ్వరూ తమకు అక్కరలేదని ఈ ప్రతిపాదన ప్రధానవుద్దేశ్యం. దీన్ని బట్టి చెప్పండివీసాల వేంకటేశ్వరుడు క్రేజ్ అమాంతం పడిపోయే పరిస్థితి ఉందా?లేదా?ప్రస్తుతం వీసాలు ఆశించి అమెరికాలో సెటిల్ అవ్వాలనుకుంటున్నవాళ్ళంతా చిలుకూరుబాలాజీ మీదే భారంవేసి బతుకుతున్నారు.

PC:youtube

చిల్కూరికి ట్రంపు ఎఫెక్ట్ !

చిల్కూరికి ట్రంపు ఎఫెక్ట్ !

ఇప్పుడీబిల్లులన్ని పాసవకుండా చూడాల్సినభాద్యత బాలాజీదే ఏమంటారు.చిలుకూరుస్వామి నీ భక్తులకు అభాయమిస్తావా?లేక నువ్వు కూడా అమెరికాలో సగటు అమెరికన్ వుద్యోగికి మద్దతుగా నిలుస్తావా?భారతీయులకు వరమాఅమెరికన్లకు కరుణమా.మీరే తేల్చుకోవాలిదేవా అంటూ పడీపడీ మొక్కేస్తున్నారు ఇక్కడిభక్తులు.

PC:youtube

చిల్కూరికి ట్రంపు ఎఫెక్ట్ !

చిల్కూరికి ట్రంపు ఎఫెక్ట్ !

స్థల పురాణం

ఒకప్పుడు శ్రీనివాసుని భక్తుడొకాయన ప్రతి సంవత్సరం తిరుపతి వెళ్ళి ఏడుకొండల స్వామిని దర్శించుకొనేవాడు. ఒకమారు అనారోగ్యకారణంగా ఆయన తిరుపతి యాత్ర చేయలేకపోయాడు. ఆయనకు కలలో వెంకటేశ్వర స్వామి కనిపించి, చింతించవద్దు. నీ సమీపంలోని అడవిలోనే నేనున్నాను అని చెప్పాడు.

PC:youtube

చిల్కూరికి ట్రంపు ఎఫెక్ట్ !

చిల్కూరికి ట్రంపు ఎఫెక్ట్ !

కలలో కనిపించిన స్థలానికి వెళ్ళి, ఆ భక్తుడు అక్కడి పుట్టను త్రవ్వుతుండగా పలుగుకు రాతి విగ్రహం తగిలి రక్తం కారసాగింది. అపచారానికి దుఃఖిస్తున్న భక్తునికి పాలతో కడగమని వాణి వినిపించింది. అలా చేయగా పుట్టనుండి శ్రీదేవీభూదేవీ సమేతుడైన శ్రీవేంకటేశ్వరుని విగ్రహం బయల్పడింది. ఇలా మూడు మూర్తులు ఒకే విగ్రహంలో ఉండడం అరుదు.

PC:youtube

చిల్కూరికి ట్రంపు ఎఫెక్ట్ !

చిల్కూరికి ట్రంపు ఎఫెక్ట్ !

ఆ విగ్రహాన్ని శాస్త్రోక్తంగా ప్రతిష్ఠించి, మందిరాన్ని నిర్మించారు. ఇలా స్వయంభూమూర్తిగా ఉభయ నాంచారులతో వెలసిన శ్రీవేంకటేశ్వరుని భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో అర్చిస్తారు. 1963లో రాజ్యలక్ష్మి అమ్మవారిని ప్రతిష్ఠించారు. అమ్మవారు మూడు చేతులలో పద్మాలు ధరించి ఉంటారు. నాలుగవ చేయి భక్తులను శరణాగతులను కమ్మని చూపుతూ ఉంటుంది.

PC:youtube

చిల్కూరికి ట్రంపు ఎఫెక్ట్ !

చిల్కూరికి ట్రంపు ఎఫెక్ట్ !

ప్రదక్షిణలు

ఇక్కడ ప్రదక్షిణలు చేయడం ఒక ముఖ్య ఆచారం. భక్తులు మొదటిసారి వచ్చినప్పుడు పదకొండు సార్లు ప్రదక్షిణలు చేస్తారు. తమ కొరికలు తీరిన తరువాత ఇంకోసారి వచ్చి 108 సార్లు ప్రదక్షిణలు చేసి, తమ మొక్కు తీర్చుకొంటారు.

PC:youtube

చిల్కూరికి ట్రంపు ఎఫెక్ట్ !

చిల్కూరికి ట్రంపు ఎఫెక్ట్ !

ఎలా వెళ్ళాలి?

హైదరాబాద్ లోని మెహిదీపట్నం నుండి చిలుకూరుకు బస్సులు ఉన్నాయి. అవేకాక హైదరాబాద్ వివిధ ఏరియాల బస్ స్టేషన్ల నుండి బస్సులు నడుస్తున్నవి. మెహిదీపట్నం నుండి 288D బస్సు ఎక్క వలెను. ప్రయాణ సమయం గంట.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X