Search
  • Follow NativePlanet
Share
» »ఇండియాలోని బీచ్ లు - ప్రత్యేకతలు !!

ఇండియాలోని బీచ్ లు - ప్రత్యేకతలు !!

బీచ్ లంటే చాలా మంది ఇష్టం. అక్కడ ట్రిప్ వెళ్ళాలన్నా.. అక్కడ గడపాలన్నా చాలా మందికి మంచి సరదా..బీచ్ ఫాషన్ ఎల్లప్పుడూ ఉత్సాహంగా ఉంటుంది. బీచ్ కు వెళ్ళే వారు చాలా మంది సెక్సీ బికినీలు లేదా షార్ట్స్ ధరించడమంటే మహా సరదా..అంతే కాదండోయ్ సన్ బాత్ కూడా మరింత ఉత్సాహాన్ని ఆనందాన్ని కలిగిస్తాయి. బీచ్ వేర్ ధరించడానికి సమ్మర్ నేను రెడీ అంటూ వచ్చేస్తోంది. అయితే కొంత మంది మాత్రం బీచ్ కు వెళ్ళాలంటే కొద్దిగా జంకుతారు. సిగ్గుపడుతారు. తికమక పడుతారు. కొంత మంది మహిళలకు ఎటువంటి బిడియం లేకుండా హ్యాపీగా వివహారిస్తుంటారు. బీచ్ లు చాలా అందమైనవి , ఉత్సాహభరితమైనవి. కనుక అక్కడికి వెళ్ళి ఎలా ఆ ప్రకృతిని ఆశ్వాదించాలంటే....

బీచ్‌ అనగానే ప్రేమికులు తిరగే ప్రాంతాలే అనే విషయం ఠక్కున జ్ఞాపకమెుస్తుంది. కాని కుటుంబంతో సహా చాలా ఆనందంగా గడిపే తీర ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. స్నాక్స్‌ను కొరుకుతూ, వేడి వేడి సూప్‌ తాగుతూ కాలం గడిపేస్తే చాలా బాగుంటుంది. మనసు తేలికపడుతుంది. పిల్లలు తీర ప్రాంతంలోని ఇసుకలో ఆడుకుంటూ ఉంటే దంపతులు హాయిగా కబుర్లు చెప్పుకుంటూ తిరిగేయవచ్చు. మొత్తం కుటుంబానికి ఆ బీచ్‌లు ఆనందాన్ని పంచి పెడతాయి. మరి అలాంటి కోవకు చెందిన ఈ సాగరతీరాలు ఎలా ఉంటాయో చూద్దాం పదండి.

ఫ్రీ కూపన్లు : ఇప్పుడే త్వరపడండి అన్ని మేక్ మై ట్రిప్ కూపన్లు పూర్తి ఉచితంగా!!

విశాఖపట్నం బీచ్‌

విశాఖపట్నం బీచ్‌

ఎక్కడుంది : విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్‌
ప్రత్యేకత : ఇది చాలా సురక్షితమైన బీచ్‌ ఇక్కడి గాలికి ఒళ్ళు పులకించిపోతుంది.
బీచ్ గురించి సంక్షిప్తంగా : రిషికొండ బీచ్ వైజాగ్ లోనే చాలా అందమైన బీచ్ గా భావిస్తారు.నగరానికి 8కి.మీ దూరంలో వున్నది.బంగారు రంగులో ఉండే ఇసుక,అటుపోటు, కెరటాలు బాగా పెద్దవిగా ఉండుట వల్ల పర్యాటకులను బాగా ఆకర్షిస్తుంది. బీచ్ లో నీటి స్కీయింగ్ మరియు సర్ఫింగ్ ,వాటర్ స్పోర్ట్స్ వంటి రకాలుఉంటాయి.బీచ్ లో స్విమ్మింగ్ చేయటం సురక్షితమే.

Photo Courtesy: Khushwantsingh.ind

కోవలం బీచ్‌

కోవలం బీచ్‌

ఎక్కడుంది : కేరళ
ప్రత్యేకత : పిల్లలు ఈతకొట్టడానికి అనువెైన బీచ్‌ ఇది. ఇది చాలా సుందర ప్రదేశం జీవితాంతం మనసులో చెరగని ముద్రవేస్తుంది.
బీచ్ గురించి సంక్షిప్తంగా : ఈ నగరం అందం అంతా దాని తీరలలోనే ఉంది. మెల్లగా అలలు ఎగసిపడుతుండగా వెచ్చని ఇసుకమీద తీరం వెంబడి నడవడం జీవితంలో ఒక్కసారే ఎదురయ్యే అనుభవం. "అందమైన వస్తువు ఎప్పటికీ ఆనందాన్ని ఇస్తుంది" అనే నానుడిని అర్ధం చేసుకోవాలంటే మీరు కోవలం బీచ్ చూడాల్సిందే. చిక్కటి పచ్చదనం, ప్రశాంతమైన నీలిరంగుల మిశ్రమం మీ హృదయానికి హత్తుకొనేంత అందంగా ఉంటుంది. దీనిని చూడడానికి తెల్లవారుఝామున కానీ, బాగా సాయంత్రం గానీ వెళ్ళాలి - అలా అయితే ఇక్కడి అందమైన సూర్యోదయ, సూర్యస్తమయాలని మీరు ఆస్వాదించ గలుగుతారు. కోవలంలోని తీరాలలో ఉండే ఇసుక రంగు చాలా విశిష్టతతో కూడినది. ఇక్కడి ఇసుక కొద్దిగా నల్లగా ఉంటుంది. మోనజైట్, ఇల్మేనైట్ ల ఉనికివల్ల ఈ లక్షణం ఏర్పడిందంటారు.

Photo Courtesy: Sarath Kuchi

భీమునిపట్నం బీచ్‌

భీమునిపట్నం బీచ్‌

ఎక్కడుంది : విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్‌
ప్రత్యేకత : ఇది చాలా దూరం కనిపిస్తుంది. ఇక్కడకు దేశ విదేశాల నుంచి జనం వస్తుంటారు.
బీచ్ గురించి సంక్షిప్తంగా : భీమునిపట్నం బీచ్ భీమిలిబీచ్ గా ప్రాచుర్యం పొందిది.బీచ్ యొక్క పేరు పాండవులులో ఒక్కడైన భీముడు పేరు నుండి వచ్చినట్లు చెబుతారు.బీచ్ గోస్తని నది బంగాళాఖాతంలో కలుస్తుంది.భీమిలి బీచ్ విశాఖపట్నం బీచ్ రోడ్ పొడవునా వ్యాపించి ఉంది. బీచ్ లో ప్రశాంతత మరియు ఈత కోసం సురక్షితం. నేడు ఈ ప్రదేశం చుట్టూ అనేక మత్స్యకార గ్రామాలు ఉన్నాయి. భీమిలి బీచ్ పర్యాటకులకు ప్రశాంతత, నిర్మలమైన మరియు విశ్రాంతినిచ్చే వాతావరణం కలిగి ఉంటుంది.

Photo Courtesy: Adityamadhav83

 జూహూ బీచ్‌

జూహూ బీచ్‌

ఎక్కడుంది : ముంబయి
ప్రత్యేకత : అరేబియా మహా సముద్రంలోని ఇక్కడి సుందర దృశ్యాలు ఇంటిల్లి పాదినీ పులకింప జేస్తాయి.
బీచ్ గురించి సంక్షిప్తంగా : బీచ్ ప్రేమికులందరకూ జుహూ బీచ్ ఎంతో ఉత్సాహం కలిగిస్తుంది. ఇరవై నాల్గు గంటలు ఇక్కడ ఉన్నప్పటికి ఎంతో ఆనందిస్తారు. బంద్రా నుండి 30 నిమిషాల ప్రయాణంతో చేరుకోవచ్చు. బీచ్ లో దొరికే ఆహారాలు ముంబై లోనే ప్రత్యేకత. భేల్ పూరి, పాని పూరి ముంబై శాండ్ విచ్ లు దొరుకుతాయి. గోలాస్ అనే ఐస్ క్రీములు కూడా ఎంతో రుచికరం. జుహు బీచ్ లో లైఫ్ గార్డులు మరియు పోలీసులు ఇరవై నాల్గు గంటలూ ఉండటంతో ఎంతో భధ్రత భావిస్తారు. సాయంత్రం అయ్యిందలంటే చాలు వందల కొలది పర్యాటకులు సూర్యాస్తమయం చూసేందుకు బీచ్ కు వస్తారు.

Photo Courtesy: Alex Dixon

చౌపతి బీచ్‌

చౌపతి బీచ్‌

ఎక్కడుంది : ముంబయి, మహరాష్ట్ర
ప్రత్యేకత : స్నాక్‌ బార్‌ బీచ్‌గా పేరు పోయింది. సాయంత్రాలు మెరెైన్‌ డ్రెైవ్‌లు చాలా ఆనందదాయకంగా కనిపిస్తాయి.

Photo Courtesy: McKay Savage

మెరీనా బీచ్‌

మెరీనా బీచ్‌

ఎక్కడుంది : చెన్నై
ప్రత్యేకత : బీచ్‌లలో రెండవ అతి పెద్ద బీచ్‌ ఇది. ఎక్కువ కుటుంబాలు ఇక్కడకు చేరుతుంటాయి.
బీచ్ గురించి సంక్షిప్తంగా : చెన్నైలో ఉన్న ఈ బీచ్ అత్యంత ప్రాచుర్యం పొందినది. బే ఆఫ్ బెంగాల్ లో భాగం అయిన ఈ బీచ్ నగరానికి ఉత్తరాన ఉన్న ఫోర్ట్ సెయింట్ జార్జ్ నుండి దక్షిణాన ఉన్న బెసంట్ బీచ్ వరకు ఉంటుంది. మరీనా బీచ్ యొక్క మొత్తం పొడవు 13 కిలోమీటర్లు. భారత దేశం లో నే అతి పెద్దదైన బీచ్ గా ప్రసిద్ది చెందగా ప్రపంచంలోనే రెండవ అతి పెద్దదైన బీచ్ గా ప్రసిద్ది చెందింది. అత్యద్భుతమైన అందంతో ఈ బీచ్ పర్యాటకుల మనసులను దోచుకుంటుంది.

Photo Courtesy: WanderingGene

గోపాల్‌పూర్‌ బీచ్‌

గోపాల్‌పూర్‌ బీచ్‌

ఎక్కడుంది : ఒరిస్సా
ప్రత్యేకత : ఇక్కడున్న బీచ్‌ రీసార్ట్‌ చాలా సుందరమైనది. విశ్రాంతి, ఉత్సాహం, ఉల్లాసం కోరుకునే వారికి ఇది ఎంతగానో ఊరటనిస్తుంది.
బీచ్ గురించి సంక్షిప్తంగా : సెలవులలో కుటుంబం, స్నేహితులతో సందర్శించడానికి ఖచ్చితమిన ప్రదేశం గోపాల్పూర్ బీచ్. ఈ బీచ్ ద్వారా ప్రకృతికి చేరువవ్వచ్చు. ఈ సముద్రంలో స్నానం చేసి బాగా ఆనందించవచ్చు. భారతదేశంలో కొన్ని బీచ్ లు ఉన్నాయి వాటిలో ఈ బీచ్ వినోదాన్ని అందిస్తుంది, ఇది సందర్శకులకు ఒక గొప్ప అనుభవం. ఈ బీచ్ లో గుర్రం సవారీ, క్రుయిసింగ్, బాడీ మసాజ్ ఇంకా ఎన్నో వివిధ రకాల వినోద కార్యక్రమాలు అందుబాటులో ఉంటాయి. బీచ్ నుండి తరంగాలను గమనించడం, కొబ్బరినీళ్ళు తాగుతూ ఆనందించడం వంటివి పర్యాటకులకు పూర్తి సంతృప్తిని ఇస్తాయి.

Photo Courtesy: urmimala singh

చండీపూర్‌ బీచ్‌

చండీపూర్‌ బీచ్‌

ఎక్కడుంది : ఒరిస్సా
ప్రత్యేకత : ఇక్కడున్న నీటిలోతులు సుందరంగా కనిపిస్తాయి. ఇవే ఇక్కడ సుందర వాతావరణానికి కారణం. పిల్లలకైనా, పెద్దలకైనా ఇది సరిగ్గా సరిపోయే బీచ్‌గా చెప్పవచ్చు.
బీచ్ గురించి సంక్షిప్తంగా : ఈ మానవాతీత బీచ్ ప్రకృతి అద్భుతాలలో ఒకటి. కొన్ని నిమిషాలలోనే ఈ నీరు తగ్గుముఖం పట్టడం ఈ నీటి అద్భుతమైన దృగ్విషయం, మళ్ళీ కొన్ని నిమిషాలలోనే జతల అలలను ఎదుర్కుంటుంది. ఆటుపోట్లు తక్కువగా ఉన్నపుడు నీరు ముందుకు వస్తుంది, అధికంగా ఉన్నపుడు తిరిగి వెనక్కు వెళ్తుంది. ఈ బీచ్ లో కనిపించే ఇసుక దిబ్బలు, పచ్చని కాసువరినా చెట్లు ఈ బీచ్ అద్భుతమైన అందానికి మరింత ఆకర్షణీయతను జోడించాయి. ఈ బీచ్ లో ఎరుపు ఎండ్రకాయలు, గుర్రం-పాదాల పీతల నివాసాలు ఉన్నాయి.

Photo Courtesy: Sankara Subramanian

పూరీ బీచ్‌

పూరీ బీచ్‌

ఎక్కడుంది : ఒరిస్సా
ప్రత్యేకత : పూరీ జగన్నాథ దేవాలయ దర్శనం తరువాత చాలామంది ఇక్కడికే వస్తుంటారు. ఇక్కడికి వచ్చి పోయినవారు మంచి అనుభూతిగా ఫీలవుతుంటారు.
బీచ్ గురించి సంక్షిప్తంగా : పూరీ బీచ్ బంగాళాఖాతం తీరంలో పూరీ రైల్వే స్టేషన్ నుండి కేవలం 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. పూరీ బీచ్ నగరంలో ఒక ప్రముఖ పర్యాటక ఆకర్షణగా ఉంది. వార్షిక పూరీ బీచ్ ఫెస్టివల్ పర్యాటకులను పుష్కలంగాను విశేషంగాను ఆకర్షిస్తోంది. ఇక్కడ ఇసుక కళ ప్రదర్శించబడుతుంది. స్థానిక ఇసుక కళాకారుడు సుదర్శన్ పట్నాయిక్ గెలుచుకున్న అంతర్జాతీయ అవార్డును దృశ్య రూపం ఇసుక కళతో ఉన్న దానిని ఇక్కడ చూడవచ్చు. మీరు పండుగ సమయంలో పూరీలో వున్నట్లయితే దీనిని చూడటానికి తప్పనిసరిగా రావాలి. ముదురు బంగారు ఇసుక బీచ్ లో సముద్రం, ఆహ్లాదకరమైన గాలి, స్పష్టమైన మెరిసే నీరు మరియు సూర్యోదయం మరియు సూర్యాస్తమయం యొక్క వీక్షణ ఒక శాశ్వతమైన ఆకర్షణగా చేశారు.

Photo Courtesy: NOAA

కోణార్క్‌ బీచ్‌

కోణార్క్‌ బీచ్‌

ఎక్కడుంది : ఒరిస్సా
ప్రత్యేకత : ఇక్కడున్న ప్రధాన ఆకర్షణ సూర్య దేవాలయమే. అయితే ఈ బీచ్‌ నుంచి కనిపించే సూర్యాస్తమయం దృశ్యం మనసుకు ఆహ్లాదకరంగా ఉంటుంది.
బీచ్ గురించి సంక్షిప్తంగా : బీచ్ లో ని ఆహ్లాదకరమైన వాతావరణం వల్ల అనేకమంది పర్యాటకులు కుటుంబ సమేతంగా పిక్నిక్ లకి అలాగే ప్రియమైన వారితో ఔటింగ్ లకి విచ్చేస్తారు. యువ జంటలు కూడా ఈ బీచ్ పట్ల ఆకర్షితులవుతారు. ఈ ప్రదేశం పడవ ప్రయాణాలకు ఉత్తేజపూరితంగా ఉంటుంది. సందర్శకులు నీటిలో అంతటా ఈత మరియు వారి శరీరం, మనస్సు మరియు ఆత్మ పునరుద్ధరించడానికి ఒక అనువైన ప్రదేశం. స్వచ్చమైన నీటిని చూడటం మరియు స్వచ్ఛమైన బంగారు ఇసుక మీద నడవటం గొప్ప మధురమైన అనుభూతిని కలిగిస్తుంది.

Photo Courtesy: Vinay Chalageri

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X