Search
  • Follow NativePlanet
Share
» »కాశీకంటే పురాతనమైన ఈ పుణ్యక్షేత్రం గురించి తెలుసా

కాశీకంటే పురాతనమైన ఈ పుణ్యక్షేత్రం గురించి తెలుసా

వృద్ధ కాశి అని పిలువబడే విరుదాచలం గురించి కథనం.

తమిళనాడులోని ఓ పుణ్యక్షేత్రం కాశీ క్షేత్రం కంటే పురాతనమైనది. అందువల్లే ఇక్కడ స్వామివారిని పూజిస్తే కాశీలో విశ్వనాధుడిని సేవించిన దానికంటే ఎక్కువ పుణ్యం వస్తుందని నమ్ముతారు. అంతేకాకుండా ఇక్కడ పుట్టినా, చనిపోయినా అప్పటి వరకూ చేసిన తప్పులు సమిసిపోయి తప్పక కైలాసానికి వెలుతామని ప్రతీతి. అందుకే కాశీలో జీవిత చరమాంకం గడపడానికి వీలుకుదరని వారు ఇక్కడికి వచ్చి దైవ సన్నిదిలో తమ శేష జీవితాన్ని ముగిస్తారు. ఈ నేపథ్యంలో ఆ దేవాలయానికి సంబంధించిన కథనం.

విరుదాచలం, వృద్దాచలం

విరుదాచలం, వృద్దాచలం

P.C: You Tube

వృద్దాచలాన్ని వృద్ధ కాశి అని కూడా పిలుస్తారు. ఇందుకు కారణం లేకపోలేదు. కాశీలో మరణిస్తే మోక్షం లభిస్తుందని చెబుతారు. ఇక్కడి స్థల పురాణం ప్రకారం వృద్ధ కాశి అని పిలువబడే ఈ విరుదాచలంలో మరణిస్తే కాశీలో మరణించిన వారికంటే ఎక్కువ పుణ్యమే లభిస్తుందని చెబుతారు.

మహిళలు తమ పసుపు కుంకుమలు చల్లగా ఉండాలని ఈ దేవతను పూజిస్తారుమహిళలు తమ పసుపు కుంకుమలు చల్లగా ఉండాలని ఈ దేవతను పూజిస్తారు

విరుదాచలం, వృద్దాచలం

విరుదాచలం, వృద్దాచలం

P.C: You Tube

కాశీలో చెప్పినట్టే ఇక్కడ కూడా చనిపోతున్నవారి శిరస్సును తన ఒడిలో ఉంచుకొని ఇక్కడ కొలువై ఉన్న వృధ్ధాంబిక తన చీర కొంగుతో విసురుతూ ఉండగా వారి చెవిలో పరమేశ్వరుడు తారక మంత్రాన్ని ఉపదేశించి వారికి మోక్షం ప్రసాదిస్తాడని చెబుతారు.

విరుదాచలం, వృద్దాచలం

విరుదాచలం, వృద్దాచలం

P.C: You Tube

అదే విధంగా పరమశివుడు నటరాజ రూపంలో నాట్యానికి ప్రసిద్ధి ఈయన చిదంబరంలో కాళీతో పోటిపడి నాట్యం చేస్తే ఈ విరుదాలచలం లేదా వృద్దాచలంలో తన సంతోషం కోసం నాట్యం చేశాడని చెబుతారు.

విరుదాచలం, వృద్దాచలం

విరుదాచలం, వృద్దాచలం

P.C: You Tube

అంతే స్వామి సంతోష తరంగాల్లో తేలిపోతూ నాట్యం చేసిన ప్రదేశం ఇదే. ఈ ఆలయంలో 5 అంకెకు విశిష్ట స్థానం ఉంది. ఈ ప్రాంగణంలో పూజలందుకొనే మూర్తులు ఐదుగురు.

విరుదాచలం, వృద్దాచలం

విరుదాచలం, వృద్దాచలం

P.C: You Tube

వినాయకుడు, సుబ్రహ్మణ్యేశ్వరుడు, శివుడు, శక్తి, భైరవుడు. ఇక్కడ స్వామివారికి ఐదు పేర్లు ఉన్నాయి. అవి విరుధ గిరీశ్వరుడు, పఝమలైనాధార్, విరుద్ధాచలేశ్వర్, ముద్దుకుండ్రీశ్వరుడు, వృధ్ధ గిరీశ్వరుడు.

విరుదాచలం, వృద్దాచలం

విరుదాచలం, వృద్దాచలం

P.C: You Tube

ఆలయానికి ఐదు గోపురాలు ఉన్నాయి. అదే విధంగా ఐదు ప్రాకారాలు, ఐదు మండపాలు, ఐదు నందులు ఉన్నాయి. వేకువజాము నుంచి రాత్రిదాకా స్వామికి నిర్ణీత సమయంలో ఐదు సార్లు పూజలు చేస్తారు.

విరుదాచలం, వృద్దాచలం

విరుదాచలం, వృద్దాచలం

P.C: You Tube

సాధారణంగా ఏ ఆలయంలోనైనా ఐదు రథాలు ఉంటాయి. ఇక్కడ ఐదు రథాలు ఉన్నాయి. ఇక్కడ స్వామివారు స్వయంభువుడు. ఇక్కడ శివుడిని ప్రార్థించిన వారికి మన:శ్శాంతి కలగడమే కాకుండా అన్ని రకాల శరీర రుగ్మతల నుంచి వెంటనే విముక్తి కలుగుతుందని చెబుతారు.

విరుదాచలం, వృద్దాచలం

విరుదాచలం, వృద్దాచలం

P.C: You Tube

ఇక్కడ ఉన్న దుర్గాదేవిని పూజిస్తే వివాహం, సంతానం కలగడం వంటి కోరికలు నెరవేరుతాయని చెబుతారు. శ్రీ కాళహస్తిలో ఉన్నట్లు ఇక్కడ విగ్నేశ్వరుడు భూతలం నుంచి కిందికి ఉన్న ఆలయంలో ఉంటాడు.

విరుదాచలం, వృద్దాచలం

విరుదాచలం, వృద్దాచలం

P.C: You Tube

ఈ ఆలయంలోని స్వామివారిని సందర్శించడానికి 18 మెట్లు దిగి కిందికి వెళ్లాల్సి ఉంటుంది. చనిపోయిన వారి చితా భస్మాన్ని ఇక్కడున్న మణిముత్తా నదిలో నిమజ్జనం చేస్తే అవి చిన్న రాళ్లుగా మారి నది అడుగున చేరుతాయని చెబుతారు.

విరుదాచలం, వృద్దాచలం

విరుదాచలం, వృద్దాచలం

P.C: You Tube

ఈ విరుదాచలంలోని నదిలో వేసిన నాణాలు తిరువారూరు కోవెల పుష్కరిణిలో తేలుతాయని చెబుతారు. ఈ విషయానికి సంబంధించి ఎన్ని పరిశోధనలు జరిగినా ఫలితం మాత్రం శూన్యం. అరుణాచలంలో చేసినట్లుగానే ప్రతి పౌర్ణమికి ఇక్కడ భక్తులు గిరి ప్రదక్షిణ చేస్తారు.

విరుదాచలం, వృద్దాచలం

విరుదాచలం, వృద్దాచలం

P.C: You Tube

ఇక్కడ వల్లీ దేవసేనలతో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుడు కొలువుతీరి ఉన్నాడు. ఆయన ఆలయంలో పైన చక్రాలు ఉంటాయి. అవి శ్రీ చక్రం, సుబ్రహ్మణ్య చక్రం, అమ్మవారి చక్రం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ఇలాంటి చక్రాలు చాలా తక్కువ శివాలయంలో చూస్తాం. అందులో ఇది ఒకటి.

విరుదాచలం, వృద్దాచలం

విరుదాచలం, వృద్దాచలం

P.C: You Tube

అందుకే ఇక్కడ స్వామివారికి విన్నించుకొన్న కోరికలు త్వరగా తీరుతాయని చెబతారు. శైవ సిద్ధంతం ప్రకారం ఇక్కడ 28 ఆగమ శాఖలు ఉన్నాయి. సుబ్రహ్మణ్యేశ్వరుడు ఈ 28 సిద్ధాంతాలకు ప్రతీకగా 28 శివలింగాలను ఇక్కడ ప్రతిష్టించి పూజించాడని నమ్ముతారు.

విరుదాచలం, వృద్దాచలం

విరుదాచలం, వృద్దాచలం

P.C: You Tube

ఈ సిద్ధాంల వల్లే ఈ ఆలయానికి ఆగమ ఆలయమని పేరు. ఈ విశేషం ఉన్న ఆలయం ఇదొక్కటే. ఈ ఆలయం ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకూ అదే విధంగా సాయంకాలం 3.30 గంటల నుంచి 9 గంటల వరకూ భక్తుల కోసం అందుబాటులో ఉంటుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X