Search
  • Follow NativePlanet
Share
» » గోవాలో వన్య జీవుల ఆభయారణ్యాలు!

గోవాలో వన్య జీవుల ఆభయారణ్యాలు!

ఒక ప్రసిద్ధ పర్యాటక ప్రదేశంగా గోవా ఎన్నో ఏళ్ళు గా భారాత దేశంలోని ఇతర రాష్ట్రాల కంటే కూడా పేరు పడింది. గోవా లోని బీచ్ లు, సూర్య కాంతికి మెరిసే బీచ్ నీరు, తెల్లటి ఇసుక, వరుసలుగా వుండే తాటి చెట్లు పర్యాటకులకు మరువలేని అనుభవాలను అందిస్తాయి. అంతులేని వినోదాలు, ఏ మాత్రం కాలుష్యం లేని వాతావరణం గోవా ను పర్యాటక స్వర్గంగా చేసాయి.

బీచ్ ల తో పాటు, వసతి కొరకు అందమైన చిన్న చిన్న గుడిసెలు, మ్యూజిక్ ఫెస్టివల్స్, విక్రయ దుకాణాలు, చవకైన అల్కహోల్ నోటి రుచులు ఊరే తిండ్లు, వివిధ రకాల మొక్కలు, జంతువులు పర్యాటకులకు ఎంతో ఆసక్తి కలిగిస్తాయి. అక్కడ కల నదులు, అడవులు, జలపాతాలు వంటివి పర్యావరణ టూరిజం అనుభవాలు కలిగిస్తాయి. అదనంగా, ఇక్కడ అనేక వైల్డ్ లైఫ్ సంక్చురీ లు కూడా కలవు. వీటిలో వివిధ రకాల పక్షులు, జంతువులు, కనుమరుగవుతున్న అరుదైన జంతువులు కూడా మీరు చూడవచ్చు. గోవా లోని ఉత్తమ వైల్డ్ లైఫ్ సంక్చురి ల గురుంచి మరింత తెలుసుకోండి.

భగవాన్ మహావీర్ సంక్చురి
భగవాన్ మహావీర్ సంక్చురి గోవా కేపిటల్ అయిన పనాజి కి 57 కి. మీ. ల దూరం లో కలదు. పడమటి కనుమలలో కల ఈ సంక్చురి గోవాలో అతి పెద్దది. చిరుతపులి, కొండుముచ్చు, జింకలు, ముళ్ళ పంది , నల్ల పులి, అడవి ఎలుగు, మలబార్ కప్ప వంటి ప్రాణులను చూడవచ్చు.

ఈ సంక్చురి లో అరుదైన ద్రోన్గో, ఎమేరాల్ద్ డావ్, ఫెయిరీ బ్లూ బర్డ్, గోల్డెన్ ఒరియోల్, గ్రేట్ హార్న్ బిల్, వడ్రంగి పిట్టలను చూసి ఆనందించవచ్చు. ఈ ప్రదేశంలో కల దూద్ సాగర్ ఫాల్స్, తంబ్ది సుర్ల టెంపుల్, డెవిల్స్ కేనీన్ ప్రధాన ఆకర్షణలు.

బోండ్లా వైల్డ్ లైఫ్ సంక్చురి
బోండ్లా వైల్డ్ లైఫ్ సంక్చురి ఈశాన్య గోవా లో కలదు. ఇక్కడ కావలసినన్ని వన్య ప్రాణులు కలవు. సాంబార్ డీర్, ఇండియన్ బైసన్, మలబార్ ఉడుత, ఇండియన్ పీ ఫౌల్, వివిధ రకాల పాములు చూడవచ్చు. వేరే ప్రదేశాలలో అనేక కారణాలుగా గాయపడిన చిరుతలు, ఎలుగు బంట్లు, మొదలైన వాటిని బోండ్లా వైల్డ్ లైఫ్ సంక్చురి లో వుంచి చికిత్సలు చేస్తూ ఆశ్రయం ఇస్తారు.

కోటి గావో వైల్డ్ లైఫ్ సంక్చురి
కోటి గావో వైల్డ్ లైఫ్ సంక్చురి దక్షిణ గోవా లోని కనకోనా జిల్లా లో కలదు. ఈ అడవిలో వివిధ రకాల పక్షులు మరియు ఎగిరే ఉడత, ముంగీస, మౌస్ డీర్, నాలుగు కొమ్ముల జింక, మలబార్ పిట్ వైపర్ పాము, తెల్ల పొట్ట కల వుడ్ పెక్కర్ వంటివి చూడవచ్చు.

 గోవాలో వన్య జీవుల ఆభయారణ్యాలు!

అదనంగా, ఈ సంక్చురి లో ఒక ప్రకృతి వ్యాఖ్య కేంద్రం, రక్షణ కేంద్రం, ఒక లైబ్రరీ, రెస్ట్ రూమ్ లు, పిల్లల ఆట ప్రదేశాలు కూడా చేర్చి పర్యాటకులకు మరింత ఆసక్తిని కలిగిస్తున్నారు.

మహదీ వైల్డ్ లైఫ్ సంక్చురి
ఈ రక్షిత ప్రాంతం ఉత్తర గోవాలో పడమటి కనుమల వెంట కలదు. మహదీ సంక్చురి లో పుష్కలమైన జీవ వైవిధ్యం కలదు. బెంగాల్ టైగర్ లను కూడా చూడవచ్చు. ఆసియన్ పునుగు పిల్లి, నల్ల చిరుత పులి, బ్లాక్ ముఖాలు లంగూర్, కాషాయరంగు మద్దతుగల సూర్యపక్షి, మలబార్ గ్రే హార్న్, కాలర్ పిల్లి పాము, ఎరుపు ఇసుక పెద్దపాము పాము మరియు అనేక ఇతర జంతువులను చూడవచ్చు.
మరొక మారు మీరు గోవా వెళితే, ఈ వైల్డ్ లైఫ్ సంక్చురి లు తప్పక చూసి ఆనందించండి.

Read more about: panaji wildlife sanctuary goa
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X