Search
  • Follow NativePlanet
Share
» » రాత్రి పూట మాత్రమే వేటాడే పులులు చూడాలని ఉందా?

రాత్రి పూట మాత్రమే వేటాడే పులులు చూడాలని ఉందా?

సరిస్కా పులుల అభయారణ్యానికి సంబంధించిన కథనం.

పులులు, సింహాలు వంటి క్రూరమగాలను నేరుగానే కాదు జూలల్లోనూ చూడాలన్నా ఇప్పటికీ చాలా మందికి భయమే అయితే ఈ భయం వెనుక ఒక ఉత్సాహం కూడా దాగి ఉంటుంది. క్రూరమగాలు వాటి జీవన శైలిని తెలుసుకోవాలని చాలా మంది ఆసక్తి చూపుతుంటారు. అలాంటివారికి సరైన గమ్యం అంటే సరిస్కా అభయారణ్యం. ఇందులో కేవలం పులులు, సింహాలు వంటి క్రూరమగాలే కాకుండా అనేక వన్య ప్రాణులను తిలకించేందుకు అవకాశం ఉంది. అలాంటి సరిస్కా అభయారణ్యాల విశేషాలు మీ కోసం...

సరిస్కా పులులు అభయారణ్యం, రాజస్థాన్

సరిస్కా పులులు అభయారణ్యం, రాజస్థాన్

P.C: You tube

ఎడారి ప్రాంతంగా ప్రసిద్ధికెక్కిన రాజస్థాన్ లోని అల్వార్ జిల్లాలో పర్యాటకులను విశేషంగా ఆకర్షించే ఈ సరిస్కా జాతీయ అభయారణ్యం నెలకొని ఉంది. ఇది ముఖ్యంగా పులుల రక్షణ కోసం ఏర్పాటైన అభయారణ్యం. 27.8 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో వ్యాప్తి చెందిన ఈ అటవీ ప్రాంతం రాజస్థాన్ లోని ప్రముఖ పర్యాటక ప్రాంతల్లో ఒకటి.

సరిస్కా పులులు అభయారణ్యం, రాజస్థాన్

సరిస్కా పులులు అభయారణ్యం, రాజస్థాన్

P.C: You tube

సరిస్కా అభయారణ్యాన్ని క్రీస్తు శకం 1982లో భారత ప్రభుత్వం జాతీయ అభయారణ్యంగా అధికారికంగా ప్రకటించింది. దేశ రాజధాని ఢిల్లీ నగరం నుంచి 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రాంతానికి బస్సులతో పాటు అద్దెకు ట్యాక్సీలు కూడా చాలా సులభంగా లభిస్తాయి.

సరిస్కా పులులు అభయారణ్యం, రాజస్థాన్

సరిస్కా పులులు అభయారణ్యం, రాజస్థాన్

P.C: You tube

చుట్టూ ఆరావళి పర్వతాలు ఈ అభయారణ్యానికి మరింత రమణీయతను చేకూరుస్తున్నాయి. ఆల్వార్ సామ్రాజ్యంలోని మహారాజులు ఎక్కువగా ఈ ప్రాంతాన్ని సందర్శించి వేట కొనసాగించేవారు. అందుకోసమే ఈ అభయారణ్యం చుట్టూ వారు విశ్రాంతి కోసం నిర్మించిన భవణాలను చూడవచ్చు..

సరిస్కా పులులు అభయారణ్యం, రాజస్థాన్

సరిస్కా పులులు అభయారణ్యం, రాజస్థాన్

P.C: You tube

ఇక ప్రక`తి రమణీయతతో పాటు ఆధ్యాత్మికతను కూడా కోరుకొనే వారికి కూడా సరిస్కా సరైన గమ్యస్థానం. ఈ అభయారణ్యం చుట్టూ అనేక ప్రఖ్యాత ఆలయాలు ఉన్నాయి. ఇందులో నీలకంఠ దేవాలయం, భర్తారీ ఆలయం, హనుమాలయం చూడదగిన ధార్మిక క్షేత్రాలు.

సరిస్కా పులులు అభయారణ్యం, రాజస్థాన్

సరిస్కా పులులు అభయారణ్యం, రాజస్థాన్

P.C: You tube
ఇక్కడి పులులు నిషాచరులు. ఇతర పులుల అభయారణ్యాల్లో పులులు పగటి వేళల్లో సైతం సంచరిస్తూ కనిపిస్తాయి. అయితే ఈ సరిస్కా అభయారణ్యంలో మాత్రం పులులు రాత్రి పూట మాత్రమే సంచరిస్తూ కనిపిస్తాయి.

సరిస్కా పులులు అభయారణ్యం, రాజస్థాన్

సరిస్కా పులులు అభయారణ్యం, రాజస్థాన్

P.C: You tube
ఇక ఇక్కడి జీవ వైవిద్యాన్ని గమనిస్తే అనేక వన్యమ`గాలు, పక్షులకు ఈ అభయారణ్యం నిలయం. పలు జాతులకు చెందిన సరీస`పాలు కూడా ఇక్కడ కనిపిస్తాయి. నీల్ గాయ్, జింకలు, అడవి పిల్లి, అడవి కుక్కలు, తోడెళ్లు వివిధ జాతులకు చెందిన కోతుులు నెమళ్లతో పాటు చిరుతలు కూడా ఇక్కడ ఎక్కువగా కనిపిస్తాయి.

సరిస్కా పులులు అభయారణ్యం, రాజస్థాన్

సరిస్కా పులులు అభయారణ్యం, రాజస్థాన్

P.C: You tube
సరిస్కా అభయారణ్యానికి చేరుకోవాలంటే రాజస్థాన్ లోని అల్వార్ పట్టణానికి ముందుగా చేరుకోవాలి. అల్వార్ నుంచి సులభంగా సరిస్కాకు రవాణా సదుపాయం ఉంది. అయితే సరిస్కాను సందర్శించాలంటే స్థానిక అటవీశాఖ అనుమతి తప్పనిసరి. అక్కడ అనుమతి తీసుకున్న తర్వాత అద్దె ట్యాక్సీలు, జీపులు వంటి వాటి ద్వారా ఈ అభయారణ్యంలోకి సులభంగా చేరుకోవచ్చు.

సరిస్కా పులులు అభయారణ్యం, రాజస్థాన్

సరిస్కా పులులు అభయారణ్యం, రాజస్థాన్

P.C: You tube

ఈ అభయారణ్యంలో అన్ని రకాలైన వన్యప్రాణులను చూడాలంటే మాత్రం చలికాలంలో ఇక్కడికి వెళ్లడం ఉత్తమం. ఇందుకు తగ్గట్లు స్థానిక పర్యాటక శాఖ అన్ని ఏర్పాట్లు చేసి ఉంటుంది. వసతి మాత్రం ఆళ్వార్ లో చూసుకోవడం ఉత్తమం.

ఈ సరోవరంలోని నాగమణి కోసం ఆశపడి చాలా మంది...ఈ సరోవరంలోని నాగమణి కోసం ఆశపడి చాలా మంది...

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X