Search
  • Follow NativePlanet
Share
» »శీతాకాల‌పు సంద‌ర్శ‌నీయ ప్ర‌దేశాలు

శీతాకాల‌పు సంద‌ర్శ‌నీయ ప్ర‌దేశాలు

శీతాకాల‌పు సంద‌ర్శ‌నీయ ప్ర‌దేశాలు

భారతదేశంలో సందర్శించడానికి అనేక ప్రదేశాలు ఉన్నాయి. ఈ ప్రదేశాలను సందర్శించడం చాలా సరదాగా ఉంటుంది. అయితే, ఇక్క‌డ‌ ఏడాది పొడువునా పర్యాటకుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఆ రద్దీ కారణంగా, అక్కడ నిజమైన అందాన్ని ఆస్వాదించడానికి అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.

అలాంటి ఇబ్బందుల‌ను అధిగ‌మించేందుకు స‌రికొత్త ప్ర‌దేశాల‌ను అన్వేషించేందుకు చాలామంది ఆస‌క్తి చూపిస్తుంటారు. ఈ శీతాకాల‌పు సెల‌వుల‌ను స‌ర‌దాగా కుటుంబంతో గ‌డిపేందుకు మీకోసం ప‌ర్యాట‌కుల ర‌ద్దీ తక్కువ‌గా ఉండి, ప్ర‌శాంత‌త‌ను చేరువ‌చేసే ప్ర‌కృతి అందాల ప్ర‌దేశాల‌ను ప‌రిచ‌యం చేస్తున్నాం. శీతాకాలపు సెలవుల్లో సందర్శించడానికి ఇవి ఉత్తమమైన ప్రశాంతమైన గమ్యస్థానాలుగా పేరుపొందాయి.

డామన్ మరియు డయ్యూ

డామన్ మరియు డయ్యూ

శీతాకాలపు సెలవులను బహిరంగ ప్రదేశాల‌లో గ‌డుపుతూ అక్క‌డి సహజ సౌందర్యంతో నిండిన ప‌ర్యాట‌క అందాల‌ను ఆస్వాదించాలంటే మాత్రం మీరు డామన్ మరియు డయ్యూలోని సముద్రం తీరాల్లో అడుగుపెట్టాల్సిందే. ఇక్క‌డి బీచ్‌లు అందించే ప్ర‌శాంత‌త‌ను అనుభ‌వించి తీరాల్సిందే.

చారిత్ర‌క నిర్మాణాల‌కు నిల‌యంగా పేరొందిన ఈ ప్రాంతంలో సంద‌ర్శ‌కుల మ‌న‌సుదోచే అనేక క‌ట్ట‌డాలు స్వాగ‌తం ప‌లుకుతాయి. గోవాలో కూడా ఇలాంటి వాతావరణాన్ని చూడవచ్చు. కానీ గోవా ఏడాది పొడువునా ప‌ర్యాట‌కుల‌తో చాలా రద్దీగా ఉంటుంది. డామన్-డయ్యూ చాలా మాత్రం ప్ర‌శాంత‌మైన వాతావ‌ర‌ణంతో సంద‌ర్శ‌కుల ర‌ద్దీ త‌క్కువ‌గా ఉండి, శీతాకాలంలో ప‌ర్యాట‌కుల‌కు ఆహ్వానం ప‌లుకుతోంది.

చక్రతాను మ‌ర‌వ‌ద్దు..

చక్రతాను మ‌ర‌వ‌ద్దు..

మీరు హిల్ స్టేషన్‌కి వెళ్లాలని ప్లాన్ చేస్తుంటే డెహ్రాడూన్‌లోని ఒక చిన్న గ్రామమైన చక్రతా ఒక గొప్ప ఎంపిక. ఎందుకంటే ఇది దాని ఎత్తు కారణంగా ప్ర‌కృతి అందాలకు కేరాఫ్ అడ్ర‌స్‌గా ప్ర‌సిద్ధి చెందింది. ప్ర‌శాంత‌త‌ను చేరువ చేసే ఈ ప్ర‌దేశం జ‌న‌జీవ‌నానికి దూరంగా ఉండ‌టం వ‌ల్ల మాన‌సిక ఉల్లాసాన్ని రెట్టింపు చేస్తుంది.

నేల‌ను తాకే పొగ‌మంచు ప‌ర్యాట‌కుల‌ను మ‌రో ప్ర‌పంచంలో విహ‌రించే అనుభూతిని చేరువ చేస్తుంది. ఎటుచూసినా ప‌చ్చ‌త‌నం క‌మ్మేసిన అక్క‌డి ప్ర‌కృతి అందాల గురించి ఎంత చెప్పినా త‌క్కువనే చెప్పాలి. ఇక్క‌డికి ద‌గ్గ‌ర‌లోని చిన్న చిన్న జ‌ల‌పాతాల స‌వ్వ‌డులు అద‌న‌పు ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తాయి.

తవాంగ్‌లో అడుగుపెట్టాల్సిందే..

తవాంగ్‌లో అడుగుపెట్టాల్సిందే..

కుటుంబ‌స‌మేతంగా విహార‌యాత్ర‌కు ప్లాన్ చేస్తే మాత్రం తవాంగ్ ఉత్తమమైన ప్రదేశంగా చెప్పొచ్చు. అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ కూడా చాలా ప్రశాంతమైన ప్రదేశం. డిసెంబరు మరియు జనవరి నెలల్లో ఇక్కడ మంచు ఎక్కువగా ఉంటుంది. అంచేత మంచుతో క‌ప్ప‌బ‌డిన ప‌చ్చిక‌బ‌యిళ్ల‌పై ఆట‌లాడేందుకు ఈ ప్ర‌దేశం అనువుగా ఉంటుంది. త‌వాంగ్ ప‌ర్యాట‌క అందాల గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు కాబట్టి, ఇక్కడ రద్దీ తక్కువగా ఉంటుంది.

సిక్కిం శీతాకాల‌పు అందాలు..

సిక్కిం శీతాకాల‌పు అందాలు..

సిక్కిం చాలా అందమైన ప్రదేశం. ఇక్కడ మీరు మీ సెలవులను గడపడానికి వెళ్ళవచ్చు. సిక్కింలో జనసందోహం తక్కువగా ఉంటుంది. ఈ కారణంగా ప్రజలు సిక్కింకు బదులుగా లడఖ్‌కు వెళతారు. కానీ సిక్కిం అనుభూతి భిన్నంగా ఉంటుంది. ఇక్క‌డి ప్ర‌జ‌ల జీవ‌న విధానం ద‌గ్గ‌ర‌గా చూసే అవ‌కాశం దొరుకుతుంది. వీరి ఆహార‌పు అల‌వాట్లు భ‌లే ఆశ్చ‌ర్యానికి గురిచేస్తాయి. అంచేత ప్ర‌శాంత‌త‌ను కోరుకునే ప‌ర్యాట‌కులు సిక్కిం శీతాకాల‌పు అందాల‌ను వీక్షించేందుకు త‌ప్ప‌నిస‌రిగా సిక్కింలో అడుగుపెట్టాల్సిందే.

Read more about: daman and diu goa
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X