Search
  • Follow NativePlanet
Share
» »నదిలో సాలగ్రామ శిల నుండి వెలసిన యోగానంద లక్ష్మీనరసింహస్వామి

నదిలో సాలగ్రామ శిల నుండి వెలసిన యోగానంద లక్ష్మీనరసింహస్వామి

వేదాద్రి క్షేత్ర మహాత్మ్యాన్ని గురించిన ప్రస్తావన శ్రీనాథుడి 'కాశీ ఖండం' లో కనిపిస్తుంది. 'వేదాద్రి'నరసింహ స్వామి అవతరించిన అత్యంత శక్తివంతమైన క్షేత్రాలలో ఒకటి. వేదాలను తనలో నిక్షిప్తం చేసుకున్న పర్వత ప్రదేశం కాబట్టి ఈ క్షేత్రానికి వేదాద్రి అనే పేరు వచ్చింది.కృష్ణానది తీరంలో కొలువుదీరి పుణ్య ఫలాలను అందించే ఈ దివ్య క్షేత్రం కృష్ణా జిల్లాకి వన్నె తెస్తూ భక్తుల హృదయాలను గెలుచుకుంటూ వుంది.

ఇక స్థలపురాణం ప్రకారం 'సోమకాసురుడు' అనే రాక్షసుడు బ్రహ్మ దేవుడి దగ్గర నుండి వేదాలను అపహరించి వాటిని సముద్రగర్భంలో దాచేశాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు మత్స్యవతారమెత్తి సోమకాసురుడిని సంహరించి వేదాలను రక్షించాడు. అప్పుడు వేదాలు స్వామివారి సన్నిథిలో తరించే భాగ్యాన్ని కలిగించమని కోరడంతో నరసింహవతారంలో హిరణ్య కశిపుడిని సంహరించిన అనంతరం ఆ కోరిక తీరుతుందని స్వామి చెప్పాడు. తనని అభిషేకించాలని 'కృష్ణవేణి' కూడా ఆరాట పడుతుందనీ, అందువల్ల తాను వచ్చేంత వరకూ ఈ నదిలో సాలగ్రామ శిలలుగా వుండమంటూ అనుగ్రహించాడు. ఆ తర్వాత హిరణ్య కశిపుడిని సంహరించిన అనంతరం, స్వామి అక్కడే అయిదు అంశలతో ఆవిర్భవించాడు.

సాలగ్రామ నరసింహ స్వామి

సాలగ్రామ నరసింహ స్వామి

జ్వాలా నరసింహ స్వామి'..సాలగ్రామ నరసింహ స్వామి ..వీర నరసింహ స్వామి , యోగానంద నరసింహ స్వామి..లక్ష్మీ నరసింహ స్వామి అనే అయిదు అంశలతో అవతరించిన స్వామి భక్తులపాలిట కొంగు బంగారమై అలరారుతున్నాడు. అయితే ఈ అయిదు అంశాలతో అవతరించిన స్వామి భక్తులపాలిట కొంగు బంగారమై అలరారుతున్నాడు. అయితే ఈ అయిదు అంశాలలో ప్రధాన మూర్తిగా..ప్రత్యేక శక్తిగా యోగానంద నరసింహ స్వామి' పూజలందుకుంటూ ఉంటాడు. ఇక కలియుగారంభంలో మానవులు తపస్సులు చేయవలసిన అవసరం లేదనీ, దైవ నామస్మరణ చేస్తే చాలని వ్యాస భగవానుడు చెప్పాడు. దాంతో బుషులంతా దైవ నామ సంకీర్తన చేస్తూ దేశాటన చేయసాగారు. ఆ సమయంలోనే కృష్ణానది నదీ తీరంలోగల పర్వతంపై నుంచి వేదాలు వినిపించడం వారికి ఆశ్చర్యం కలిగించింది. వేద పురుషులతో సహా శ్రీ మన్నారాయణుడు నరసింహ అవతారంలో అక్కడ వెలిశాడని తెలుసుకుని దర్శించి తరించారు.

ఇక్కడకి వచ్చే భక్తులు కృష్ణానదిలో పుణ్య స్నానాలు ఆచరించి

ఇక్కడకి వచ్చే భక్తులు కృష్ణానదిలో పుణ్య స్నానాలు ఆచరించి

ఇక్కడకి వచ్చే భక్తులు కృష్ణానదిలో పుణ్య స్నానాలు ఆచరించి స్వామి వారిని దర్శించుకుంటారు. ఆలయచుట్టూ ప్రదక్షిణలు చేసి స్వామికి ఇరుముడులు సమర్పించి మొక్కులు తీర్చుకుంటారు. ప్రతి సంవత్సరం వైశాఖ పౌర్ణమికి స్వామి వారి కళ్యాణం వైభవంగా జరుగుతుంది. యోగానంద నృసింహస్వామి వారి మూల రూపము ఈ ప్రపంచములో ఎక్కడా లేనంత సుందరముగా సాలిగ్రామ శిలతో చేయబడి త్రేతాయుగములో ఋష్యశృంగ మహర్షిచే ప్రతిష్ఠింపబడింది.

వేదాద్రి క్షేత్ర మహాత్మ్యం గురించి ప్రస్తావన శ్రీనాథుడి కాశీ ఖండంలో

వేదాద్రి క్షేత్ర మహాత్మ్యం గురించి ప్రస్తావన శ్రీనాథుడి కాశీ ఖండంలో

వేదాద్రి క్షేత్ర మహాత్మ్యం గురించి ప్రస్తావన శ్రీనాథుడి కాశీ ఖండంలో కనిపిస్తుంది. ఇక ఎర్రా ప్రగడ..నారాయణ తీర్థులు కూడా ఈ క్షేత్రాన్ని దర్శించినట్టు తెలుస్తోంది. విశ్వేశ్వరుడు క్షేత్ర పాలకుడిగా వ్యవహరించే ఈ క్షేత్రాన్ని దర్శించడం వల్ల సకల పుణ్య ఫలాలు ప్రాప్తిస్తాయని భక్తుల విశ్వాసం. విశేషమైనటువంటి పర్వదినాల్లో భారీ సంఖ్యలో తరలి వచ్చిన భక్తులతో ఈ క్షేత్రం కళకళలాడుతూ కనిపిస్తుంది.

పావన కృష్ణానదీ తీరంన గల కొండ పైన

పావన కృష్ణానదీ తీరంన గల కొండ పైన

పావన కృష్ణానదీ తీరంన గల కొండ పైన శ్రీ జ్వాలా నరసింహ స్వామి స్వయంభూ మూర్తి గా వెల్లిసినాడు. కొండ క్రింద శ్రీ యోగానంద నరసింహాలయం ఉంటుంది. ఆలయం నకు ఎదురుగా గల కృష్ణానది లో నరసింహ సాలగ్రామ్ ఉంది. క్షేత్రం నందు నిత్య పూజలు మరియు వైశాఖ శుద్ధ ఏకాదశి కి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఈ బ్రహ్మోత్సవాలకు దక్షిణ భారతదేశంలోని ఇతర రాష్ట్రాల నుండి భక్తులు తరలివస్తారు. ఈ క్షేత్రాన్ని సందర్శిస్తే అనేక దీర్ఘకాలిక రుగ్మతలకు, మానసిక వ్యాధులకు , కుటుంబపరమైన ఇబ్బందులకు సత్వర పరిష్కారం లభిస్తుందని భక్తులు కొంగుబంగారంగా భావిస్తారు.

ఆలయ దర్శన సమయాలు

ఆలయ దర్శన సమయాలు

ఉదయం 6: 30 నుండి మధ్యాహ్నం 1:00 వరకు .. మధ్యాహ్నం 3:00 నుండి 5:30 వరకు తిరిగి 6:30 నుండి 8 :30 గంటల వరకు.

వసతి సదుపాయాలు

వసతి సదుపాయాలు

వసతి సౌకర్యాలు స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు సరిపోవు(సత్రాలు ఉన్నప్పటికీ). కనుక భోజనం, వసతి సౌకర్యాలకు జగ్గయ్యపేట సూచించదగినది. గుర్తించుకోవలసినవి వేదాద్రి లో పూలు ఎక్కువగా దొరకవు. కనుక, దేవునికి పూలమాలలు జగ్గయ్యపేట నుండి తీసుకువెళ్ళండి ఆలయం వద్ద కోతుల బెడద ఎక్కువ కనుక జాగ్రత్త.

ఎలా చేరుకోవాలి

ఎలా చేరుకోవాలి

రవాణా సౌకర్యాలు
బస్సు మార్గం : విజయవాడ, జగ్గయ్యపేట ప్రాంతాల నుండి లోకల్ బస్సులు వేదాద్రి ఆలయం వరకు ప్రతి రోజూ తిరుగుతాయి. జగ్గయ్యపేట నుంచి షేర్ ఆటోలు, జీపులు కూడా దొరుకుతాయి.

రైలు మార్గం : వేదాద్రి ఆలయానికి సమీపాన మధిర రైల్వే స్టేషన్ కలదు. అక్కడ తిరిగే లోకల్ బస్సులలో ప్రయాణించి ఆలయానికి చేరుకోవచ్చు.

విమాన మార్గం : విజయవాడ లోని దేశీయ విమానాశ్రయం వేదాద్రి ఆలయానికి 90 కిలోమీటర్ల దూరంలో కలదు. అక్కడి నుండి క్యాబ్ లేదా టాక్సీ అలలో ఎక్కి ఆలయానికి చేరుకోవచ్చు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X