» »ఇక్కడికి వెళితే...వెయ్యేళ్లు ఉంటారు... ఐతే ఆ రూపంలోనే

ఇక్కడికి వెళితే...వెయ్యేళ్లు ఉంటారు... ఐతే ఆ రూపంలోనే

Written By: Beldaru Sajjendrakishore

సువిశాల భారత దేశంలో అనేక పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. ఇందులో కొన్ని ఆధ్యాత్మిక భావనాన్ని కలుగ చేస్తే మరికొన్ని ఆహ్లాదకరమైన అనుభూతిని అందచేస్తాయి. ఇక శృంగార పరమైన ఆలోచనలను తట్టిలేపే ఖజురహో వంటి పర్యాటక ప్రాతాలకూ భారతదేశం నిలయమన్న విషయం ఎవరూ కాదనలేని నిజం. అదే సమయంలో కొన్ని పర్యాటక ప్రాంతాలు నిఘూడ రహస్యాలకు నిలయం. సదరు రహస్య ఛేదనలో ఎంతో మంది తమ ప్రాణాలను పోగొట్టుకున్నారు. మరికొంతమంది తమ పరిశోధనలను మధ్యలోనే వదిలి వచ్చేశారు. అటువంటి కోవకు చెందిన ఓ పర్యాటక ప్రాంతమే కిరాడు. ఇందుకు సంబంధించిన వివరాలు నేటివ్ ప్లానెట్ మీ కోసం తీసుకువచ్చింది....

1. మొత్తం ఐదు దేవాలయాలు...

1. మొత్తం ఐదు దేవాలయాలు...

Image source

ఇక చరిత్ర, పురవస్తు తవ్వకాల్లో లభించిన ఆధారాలను అనుసరించి కిరాడులో మొత్తం ఐదు దేవాలయాలు ఉండేవి. ఈ ఐదు ఆలయాల్లో ఒకటి వైష్ణవాలయం కాగా మిగిలిన నాలుగూ శివాలయాలు. ఈ దేవాలయాలను చాళుక్యుల కాలంలో నిర్మించారని తెలుస్తోంది.

2. కథ ఇలా మొదలు

2. కథ ఇలా మొదలు

Image source

స్థానికుల కథనం ప్రకారం కూడా కిరాడులో మొదట ఐదు దేవాలయాలు ఉండేవి. చాలా కాలం క్రితం ఒక ముని తన శిష్యులతో కలిసి ఇక్కడకు వచ్చాడు. శిష్యులు తాము ఇక నడవలేమని కొంత విశ్రాంతి కావాలని అడుగుతారు. దీంతో ముని తన శిష్యులను కిరాడులోని ఆలయల్లో ఉండమని చెబుతాడు. అటు పై చుట్టు పక్కల తన ఆశ్రమం ఏర్పాటుకు సరైన ప్రాంతాన్ని వెదకడం కోసం వెలుతాడు.

3. ఒక మహిళ మాత్రం

3. ఒక మహిళ మాత్రం

Image source

అయితే అక్కడ ఉన్న వాతావరణం పడక శిష్యుల్లో చాలా మందికి వాంతులు, విరేచనాలు పడుతాయి. ఈ విషయాలన్నీ తెలిసినా గ్రామ ప్రజలు ఎవరూ వారికి సహాయం చేయడానికి ముందుకురారు. అయితే గ్రామంలో ఉన్న కుమ్మర మహిళ వారికి కొంత సహాయం చేస్తుంది. అయినా ఏమి ప్రయోజనం ఉండదు.

4. వెనక్కు తిరగ కూడదు

4. వెనక్కు తిరగ కూడదు

Image source

కడుపునొప్పి, వాంతులు, విరేచనాలతో శిష్యులు బాధపడుతూనే ఉంటారు. తిరిగి వచ్చిన ముని విషయం తెలుసుకుని తీవ్ర ఆగ్రహం చెందుతాడు. కఠిన హ`దయం కలిగిన మీరంతా కఠిన శిలలుగా మారిపోతారని శపించాడు. అయితే సహకారం అందించడానికి ముందుకు వచ్చిన కుమ్మరి భార్యను మాత్రం నీవు వెనక్కు తిరగకుండా ఈ గ్రామం విడిచి పోతే బతికి పోతావని చెప్పారు.

5. ఆమె ఇప్పటికీ అలా

5. ఆమె ఇప్పటికీ అలా

Image source

దీంతో ఆ మహిళ గ్రామం విడిచి పోతూ చివరి సారిగా వెనక్కు తిరిగింది. దీంతో ఆమె అలా శిలగానే మారి పోయింది. ఇప్పటికీ ఈ శిలను మనం అక్కడ చూడవచ్చు. కాగా అటు పై ముని కొంత శాంతించి సూర్యాస్తమయం తర్వాత ఇక్కడ ఉన్నవారు శిలగా మారి పోతారని చెప్పారు. అందువల్లే గ్రామస్తులే కాకుండా పర్యాటకులు కూడా ఎవరూ అక్కడ ఉండరు.

6. వెయ్యేళ్లు అలాగే...

6. వెయ్యేళ్లు అలాగే...

Image source

ఇక దేవాలయం చుట్టు పక్కల అనేక రాళ్లు కనిపిస్తాయి. దీనిని అతిక్రమించి ఎవరైనా రాత్రి సమయాల్లో ఆ దేవాలయంలో ఉంటే శిలాగా మారి వెయ్యేళ్లు అలా ఉండిపోతారని ప్రతీతి. ఇదిలా ఉండగా ఐదు దేవాలయల్లో ప్రస్తుతం ఇక్కడ సోమేశ్వరాలయం మాత్రమే శిథిలావస్థలో ఉండగా మిగిలిన నాలుగు కాల గర్భంలో కలిసి పోయాయి.

7. విద్యార్థులు దౌడు తీశారు...

7. విద్యార్థులు దౌడు తీశారు...

Image source

ఇక్కడ సూర్యాస్తమయం తర్వాత ఎవరైనా ఉంటే తెల్లవారే సమయానికి కఠిన శిలగా మారిపోతారాని స్థానికులు చెబుతుంటారు. అందువల్లే పర్యాటకులు ఎవరూ ఇక్కడ సాయంత్రం తర్వాత ఉండటానికి సాహసించరు. కొన్నేళ్ల క్రితం కొంతమంది విద్యార్థులు ఈ రహస్యాన్ని చ్ఛేదించాలని భావించి అక్కడ సాయంత్రం తర్వాత ఉన్నారు. అయితే క్రమంలో గుడి పరిసర ప్రాంతాల్లో వస్తున్న మార్పులను గమనించి అక్కడి నుంచి పరిగెత్తి వచ్చేశారు. అటు పై ఇక ఎవరూ ఇక్కడకు వెళ్లే సాహసం చేయలేదు.

8.కేవలం శిథిల ఆలయాలు మాత్రమే

8.కేవలం శిథిల ఆలయాలు మాత్రమే

Image source

అందువల్లే పర్యాటకులు అక్కడ ఉన్న శిథిల ఆలయాలను మాత్రమే చూస్తారు. ఇక సోమేశ్వర దేవాలయం అద్భుత శిల్ప కళకు నింపుకున్నది. పురాతన శాస్త్రవేత్తలకు, శిల్పకళ పై అధ్యయనం చేసేవాళ్లు తప్పక ఈ ప్రాతానికి వెలుతుంటారు. అయితే సాయంత్రం ఐదు వరకూ మాత్రమే అక్కడ ఉండి అటు పై వెనుతిరుగుతూ ఉంటారు.

9 ఎక్కడ ఉంది...

9 ఎక్కడ ఉంది...

Image source

రాజస్థాన్ లోని బార్మర్ జిల్లాలో హత్మా అనే గ్రామం ఉంది. ఈ గ్రామానికి సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలో థార్ ఎడారిలో కిరాడు ఆలయం ఉంది. ఈ దేవాలయం ప్రముఖ పర్యాటక ప్రాంతం జైసల్మేర్ కు కూడా దగ్గరగానే ఉంది.

10 ఎలా చేరుకోవాలి...

10 ఎలా చేరుకోవాలి...

బార్మర్కు 35 కిలోమీటర్ల దూరంలో, జైసల్మేర్కు 157 కిలోమీటర్ల దూరంలో ఉన్న కిరాడుకు రోడ్డు ప్రయాణం ఉత్తమం.

11 ఇంకా ఏమేమి చూడవచ్చు...

11 ఇంకా ఏమేమి చూడవచ్చు...

బార్మర్ జిల్లాలో కిరాడుతో పాటు, నకోడ జైన్ టెంపుల్, తిల్వార తదితర ప్రాంతాలను చూడవచ్చు. అంతేకాకుండా థార్ ఎడారి అందాలను చూడటానికి ప్రత్యేక ప్యాకేజీలను అటు ప్రభుత్వ, ప్రైవేటు ఆపరేటర్లు ఏర్పాటు చేస్తున్నారు.