అంబోలి మహారాష్ట్రలోని సముద్ర మట్టానికి సుమారు 700 మీటర్ల ఎత్తునగల ఒక చిన్న హిల్ స్టేషన్. పర్యాటకులను అమితంగా ఆకర్షించే ఈ ప్రదేశం సహ్యాద్రి శ్రేణులలో సింధుదుర్గ జిల్లాలో కలదు. అంబోలి - చారిత్రక ప్రాధాన్యం అంబోలి పట్టణం ఒకప్పుడు బ్రిటీష్ పాలనలో కేంద్ర మరియు దక్షిణ భారత దేశాలకు రక్షణ దళ అవసరాలను సరఫరా చేసే ప్రాంతంగా ఉండేది. ఈ సమయంలోనే అంబోలి పట్టణాన్ని సుమారు 1880 లలో ఒక హిల్ స్టేషన్ గా ప్రకటించారు. సావంతవాది స్ధానికులు ఈ చిన్న ప్రదేశ ప్రాధాన్యాన్ని బ్రిటీష్ పాలకులకంటే ముందే గ్రహించారు. అయితే, మహారాష్ట్రలోని వర్షాలు ఎల్లపుడూ ఈ ప్రదేశాన్ని తడిగా ఉంచటం చేత బ్రిటీష్ వారు ఈ ప్రదేశాన్ని వదిలి తమ వేసవి విడిదిగా మాధేరన్ ను ఎంపిక చేసుకున్నారు. ఫలితంగా అంబోలి పట్టణం మహా రాష్ట్ర మ్యాప్ లో ప్రాధాన్యతగలదిగా అధిక కాలం నిలువలేకపోయింది.
ప్రశాంతత కల హిల్ స్టేషన్వారాంతపు సెలవులు వచ్చాయంటే, ప్రశాంతమైన వాతావరణం గడపాలనుకునేవారికి అంబోలి హిల్ స్టేషన్ అద్భుతంగా ఉంటుంది. ఎంతో వేగవంతంగా నడిచే మన నగర జీవితాలనుండి కొద్దిపాటి విరామం కావాలంటే, ఈ ప్రదేశం ఎంపిక చేయదగినది.
అంబోలి లో ఎన్నో జలపాతాలు. షిర్గాంవ్ కర్ జలపాతాలు, మహాదేవ్ జలపాతాలు, మరియు నగట్టా జలపాతాలు వంటివి అనేకం కలవు. నగట్టా జలపాతాలు విశ్రాంతి, వినోద విహారాలకు అద్భుతంగా ఉంటాయి. హిరణ్యకేశి జలపాతాలు సమీపంలో గుహల ముందు భాగంలో ఒక చిన్న శివాలయం కూడా ఉంది. ఈ శివాలయాన్ని సాక్షాత్తూ శివుడే ప్రతిష్టించాడని చెపుతారు. అయితే, ఈ దేవాలయానికి హిరణ్య కేశి దేవాలయం అని మాత పార్వతి దేవి పేరు రావటం జరిగింది.
హిల్ స్టేషన్ కావటం వలన, అంబోలి అనేక ప్రదేశాలను చూపుతుంది. సముద్రం, కేవల్సడ్ పాయింట్, పరీక్షిత్ పాయింట్ మరియు మహదేవగఢ్ పాయింట్ వంటివి ఇక్కడినుండి చూడవచ్చు. ఈ ప్రాంతాలన్ని అరేబియా సముద్రం మరియు కొంకణ్ తీరం కలిసే చోట ఏర్పడినవి. అంబోలికి ఎపుడు వెళ్ళాలి ? ఎలా వెళ్ళాలి? అంబోలి హిల్ స్టేషన్ కావటం వలన, సముద్ర మట్టానికి ఎంతో ఎత్తున ఉండటం చేత మండు వేసవిలో కూడా పర్యటించవచ్చు. అయితే, మే నెల మాత్రం ఎంతో వేడి కనుక సూచించదగినది కాదు. వర్షాకాలం ఈ ప్రాంతంలో ఆనందించవచ్చు. ఈ సమయంలో ఉష్ణోగ్రతలు 20 డిగ్రీలు గా ఉండి ఆహ్లాదంగా ఉంటుంది. ఈ ప్రదేశ సందర్శనకు చలికాలం కూడా అనుకూలమే.
అంబోలి విమానం, రైలు, రోడ్డు మార్గాలలో చేరవచ్చు. ఇది సావంత్ వాడి మరియు గోవాలకు సమీపంలో ఉంటుంది. విమానం ద్వారా చేరాలనుకునేవారు గోవాలోకల స్ధానిక విమానాశ్రయం 70 కి.మీ.ల దూరంకలది ఉపయోగించవచ్చు. రైలు ప్రయాణానికి సావంత్ వాడి రైలు స్టేషన్ అనుకూలం. అక్కడనుండి అంబోలికి క్యాబ్ లలో చేరవచ్చు. అంబోలి నుండి ముంబైకి 490 కి.మీ.లు, పూనేకు సుమారుగా 343 కి.మీ.ల దూరం ఉంటుంది. ఈ పట్టణాలనుండి అనేక బస్సులు నడుస్తాయి.
అంబోలి ఒక పర్యావరణ పర్యాటక ప్రదేశం. ఎన్నో రకాల మొక్కలు, జంతువులు కనపడతాయి. కొద్దిపాటి ప్రశాంతత వినోదం కావాలనుకునేవారికి అంబోలి హిల్ స్టేషన్ విశ్రాంతి ఎంతో నచ్చుతుంది. ఎత్తైన కొండలు, దట్టమైన అడవులు చల్లటి గాలి, ఈ ప్రదేశాన్ని స్వర్గంలా చేశాయి. దీనిని కొంకణ్ తీర మహా బలేశ్వర్ అని కూడా పిలుస్తారు.



Click it and Unblock the Notifications