Search
  • Follow NativePlanet
Share

కోట - అంతఃపురాలూ, కోటలు, ఆరు గజాల అధ్భుతం

38

 చంబల్ నది ఒడ్డున వున్న కోట నగరం రాజస్థాన్ రాష్ట్రంలోని అత్యంత ప్రాముఖ్య౦ కల్గిన నగరాలలో ఒకటి. అనేక ప్రధాన విద్యుదుత్పత్తి కేంద్రాలు, పరిశ్రమలకు పుట్టిల్లు అయినందున దీనిని రాష్ట్ర పరిశ్రమల రాజధాని అని అంటారు. ఆసియా లోని అతి పెద్ద ఎరువుల కర్మాగారం కోట లోనే ఉంది. గుజరాత్, ఢిల్లీ ల మధ్యన జరిగే వాణిజ్యానికి ఈ ప్రాంతం ఒక ప్రధాన కేంద్రం. రాజస్థాన్ లోని ఈ ప్రాంతంలో అనేక ఇంజనీరింగ్ కాలేజీలు, విద్యా సంస్థలూ ఉన్నందున దీనిని విద్యా కేంద్రం అని కూడా అంటారు.

కోట లో ఏమేమి చూడాలి?

రాజస్థాన్ లో భాగమైనందున అనేక హవేలీలు, రాజప్రాసాదాలు, కోటలు, ఇంకా ఇతర పర్యాటక ఆకర్షణలు కల్గి ఉండటం కోట లక్షణం. అంతే కాక అనేక ప్రసిద్ది చెందిన ధార్మిక కేంద్రాలు కూడా ఇక్కడ ఉన్నాయి. గురుద్వారా అజంఘర్ సాహెబ్, గోదావరి ధాం దేవాలయం, గరడియ మహాదేవ దేవాలయం, మధురాదీష్ మందిరం కోట లోని కొన్ని ప్రసిద్ధ ధార్మిక కేంద్రాలు.

కోట లో ఆజం ఘర్ సాహెబ్ గురుద్వారా అతి ముఖ్య మైన దేవాలయాల్లో ఒకటి. ఈ గురుద్వారా లో గల కత్తి, ఒక జత పాదుకలు శిక్కుల 10 వ గురువైన గురు నానక్ కు చెందినవిగా విశ్వసిస్తారు. అంతేకాక ఈ ప్రాంతం పేరొందిన కవి అయోధ్య సింగ్ హరి ఔద్ పుట్టిన ప్రదేశంగా ప్రసిద్ది చెందింది. కోటలో గల స్మారక నిర్మాణాలలో జగ్మందిర్ ప్యాలెస్ అపారమైన చారిత్రిక ప్రాముఖ్యత కల్గినది. అందమైన కృత్రిమ సరస్సు కిశోర్ సాగర్ లేక్ మధ్యన ఎర్ర రాతి తో నిర్మించిన అధ్భుతమైన కట్టడమిది. పర్యాటకులు ఈ ప్యాలెస్ వద్దకు బోట్ల ద్వారా చేరవచ్చు.

ప్రభుత్వ మ్యూజియం, మహారావు మాదో సింగ్ మ్యూజియం ఈ ప్రాంతంలో ఉన్న రెండు ప్రసిద్ధ మ్యూజియములు.

కోట చీరలు ఈ ప్రాంతంలో నేయబడి విస్తృతంగా ప్రశంసలు అందుకొన్న కోట చీరలు భారత దేశంలోని వివిధ ప్రాంతాల మహిళల అభిమానమే కాక అంతర్జాతీయ కీర్తిని కూడా ఆర్జించాయి. ఈ చీరలను కోట డోరియా అని కూడా అంటారు - డోరియా అంటే దారం అని అర్ధం ఈ చీరలకు ఒక ఆసక్తికరమైన పుట్టుక ఉంది.

మైసూర్ లో నేసిన ఈ చీరలు చూసి చేనేత పనివారిని మొఘల్ సేనాధిపతి కిషోర్ సింగ్ కోటకు తీసుకొని వచ్చాడని భావిస్తారు. అందువల్లనే ఈ చీర మసూరియా (మైసూర్ నుండి) అనే పేరుతో కోట లో ప్రసిద్ది చెందింది. అయితే దేశం లోని ఇతర ప్రాంతాలలో దీనిని కోట డోరియా అని పిలుస్తారు. క్లుప్తంగా చెప్పాలంటే ఇది నూలు, పట్టు లతో చేసిన ఆరు గజాల ఇంద్రజాలం.

కోట చేరుకోవడం యాత్రికులు రైలు, రోడ్డు, వాయు మార్గాల ద్వారా కోట చేరుకోవచ్చు. జైపూర్ లోని విమానాశ్రయం , కోట రైల్వే స్టేషన్, ఇక్కడికి దగ్గరలో వుంటాయి. కోట నుంచి చిత్తోర్ ఘర్, జైపూర్, అజ్మీర్, జోధ్పూర్, బికానేర్, ఉదయపూర్ లాంటి నగరాలకు నిత్యం కోట నుంచి బస్సులు తిరుగుతాయి.

కోట లోని వాతావరణం

బాగా వేడిగా వుండే వేసవి, అతి శీతలంగా వుండే శీతాకాలం కోట లో చూడవచ్చు. ఈ ప్రాంతాన్ని సందర్శించడానికి అక్టోబర్ నుంచ మార్చ్ మధ్య కాలం లోని శీతాకాలం బాగా అనువైనది.

కోట ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

కోట వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం కోట

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? కోట

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు మార్గం ద్వారా: దగ్గర లోని అన్ని ప్రధాన నగరాలనుండి కోటకు రాజస్థాన్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వారి బస్సులు నడుస్తాయి. పర్యాటకులు జోద్ పూర్, ఉదయ్ పూర్, చిత్తోర్ఘడ్, అజ్మీర్, బికనీర్, జై పూర్ నుండి కోటకు గల బస్సు ద్వారా చేరుకోవచ్చు.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైల్ మార్గం ద్వారా : దేశం లోని ఇతర ప్రాంతాలకు కోట రైల్వే స్టేషన్ నుండి నిత్యం రైళ్ళు నడుస్తాయి. రైల్వేస్టేషన్ నుండి అద్దె క్యాబ్ ల ద్వారా నగర కేంద్రానికి చేరవచ్చు.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    వాయు మార్గం ద్వారా : జై పూర్ లోని సంగనేర్, కోట కు చేరువలో వున్న విమానాశ్రయం. ఇక్కడి నుండి 245 కి. మీ. దూరంలో గల ఈ ప్రాంతానికి న్యూఢిల్లీ, ముంబాయి లతో బాటుగా భారతదేశం లోని అన్ని ప్రధాన నగరాలనుండి విమాన సౌకర్యం ఉంది. పర్యాటకులు విమానాశ్రయం నుండి నగర కేంద్రానికి బస్సులు, అద్దె క్యాబ్ ల ద్వారా చేరవచ్చు. న్యూఢిల్లీ లోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం కోట కు అతి దగ్గరగా ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయం.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
25 Apr,Sat
Return On
26 Apr,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
25 Apr,Sat
Check Out
26 Apr,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
25 Apr,Sat
Return On
26 Apr,Sun