Search
  • Follow NativePlanet
Share
» »అందుకే అంటారు.. బెంగ‌ళూరు సిటీ బెస్ట్ వీకెండ్ స్పాట్ అని.

అందుకే అంటారు.. బెంగ‌ళూరు సిటీ బెస్ట్ వీకెండ్ స్పాట్ అని.

అందుకే అంటారు.. బెంగ‌ళూరు సిటీ బెస్ట్ వీకెండ్ స్పాట్ అని..

బెంగళూరు పేరువిన‌గానే చల్లని వాతావరణం గుర్తుకొస్తుంది. ఎటు చూసినా వాహనాల రద్దీతో నిత్యం బిజీగానే దర్శనమిస్తుంది ఈ న‌గ‌రం. సాఫ్ట్‌వేర్‌ రంగంలో దూసుకుపోతున్న బెంగళూరు సిటీ ఓ అద్భుత వ్యాపార సామ్రాజ్యం కూడా! నిరంతరం ఒత్తిడితో గడిపే అక్కడివారు వారాంతపు సెలవుల కోసం ఆశగా ఎదురుచూస్తారు. అలాంటివారిని సేదతీర్చేందుకు వండర్, వాటర్ వరల్డ్, ఫన్ వరల్డ్, స్నోవరల్డ్ ఇలా నగరం చుట్టూ ఎన్నో రిసార్ట్స్, మనసు మెప్పించే ప్రకృతి పార్కులు ఉన్నాయి. మొన్నామ‌ధ్య మా మిత్రుల‌తో క‌లిసి స‌ర‌ద‌గా టూర్ ప్లాన్ చేశాం. అయితే, ఎక్కువ రోజులు సెలవు దొర‌క్క‌పోవ‌డంతో వీకెండ్‌లో ఎక్క‌డైనా వెళ్లాల‌ని అనుకున్నాం. బెంగ‌ళూరులో ఉన్న ఓ సాఫ్ట్‌వేర్ మిత్రుడు మాకు అవ‌స‌ర‌మైన అన్ని ఏర్పాట్లూ చేస్తాన‌ని మాటివ్వ‌డంతో మా ప్ర‌యాణం బెంగ‌ళూరు సిటీ వైపుగా సాగింది.

ముందుగా బెంగ‌ళూరు ప్ర‌ధాన బస్టాండ్‌కు చేరుకున్నాం. అక్క‌డి నుంచి క్యాబ్‌లో మా మిత్రుడు ఉన్న దుంలూరుకు ప్ర‌యాణ‌మ‌య్యాం. అక్క‌డే కాస్త అల్పాహారం తిన్నాం. త‌ర్వాత మాల్స్‌లో షాపింగ్ మొదలుపెట్టాం. ఆ న‌గ‌ర‌ లగ్జరీలైఫ్ ద‌గ్గ‌ర‌గా చూశాక, ఆ మాల్స్‌లోని వస్తువుల ధరల్లో మాకు పెద్ద‌గా వ్యత్యాసం కనిపించలేదంటే న‌మ్మండి. సిటీ అందాలు చూడాలంటే రాత్రి స‌మ‌య‌మే అని మాకు ఆ రోజు అర్థ‌మైంది. ఎక్క‌డ చూసినా మిరుమెట్లుగొలిపే లైట్ సెట్టింగ్‌ల‌తో మాల్స్ మా చూపు తిప్పుకోనియ‌లేదు. నైట్ టైంలో స‌రికొత్త‌ స్ట్రీట్ ఫుడ్ రుచులు టేస్ట్ చేశాం.

Bangalore

అదో స‌రికొత్త‌ నీటి ప్రపంచం..

మరుసటి రోజు జయామహల్ మెయిన్ రోడ్డులో గల ప్యాలెస్ గ్రౌండ్‌లోని వాటర్ వరల్డ్, ఫన్ వరల్డ్, స్నోవ‌ర‌ల్డ్‌కు వెళ్లాం. మేం వెళ్లే స‌మ‌యానికి సెలవుల ఆఫర్ ఉండడంతో ముందుగానే ఆన్‌లైన్‌లో టికెట్స్ బుక్ చేసుకున్నాం. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం వరకు అక్కడే ఉండాలని నిర్ణయించుకున్నాం. ముందుగా వాటర్ వ‌రల్డ్‌కు వెళ్లాం.

అదో స‌రికొత్త‌ నీటి ప్రపంచంలా అనిపించింది. అంతేకాదు, అక్కడి వేవ్ పూల్, ఆర్టిఫిషియల్ జలపాతాల్లోని నీటిని గంటకోసారి శుభ్రం చేస్తున్నారు. అనేక నీటి ఆట‌విడుపులు అక్కడ మమ్మల్ని ఎంతగానో ఆకర్షించాయి. ఆడుకున్నవారికి ఆడుకున్నంత అన్నవిధంగా ఉండడంతో కుటుంబ‌స‌మేతంగా వ‌చ్చిన కొంద‌రి పిల్లల సంతోషానికి అవధులు లేకుండా పోయాయి.

27-1506512029-1ramanagara-1668155237.jpg -Properties

బాల్యంలోకి తీసుకువెళ్లిన అనుభూతి..

రెయిన్ డ్యాన్స్, వాటర్ బ్లో, అమాంతం నీటిలో దూకటం, అనేక వాటర్ విన్యాసాలు మ‌మ్మ‌ల్ని అమాంతం బాల్యంలోకి తీసుకువెళ్లిన అనుభూతిని క‌లిగించాయి. వాటర్ పార్క్‌తోపాటు అమ్యూజ్మెంట్ పార్క్, ఫన్ వరల్డ్ అమ్యుస్మెంట్ పార్క్, స్నో వరల్డ్ ఇలా మూడింటిలో ఎంజాయ్ చేసే సరికి మాకు సమయమే తెలియలేదు. అయితే, అప్పటికే సాయంత్రం ఆరు గంటలు అవ్వడంతో అలసిపోయి, తిరుగు ప్రయాణమయ్యాం. ఈ పార్కులలో తినటానికి ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లను ఏర్పాటు చేశారు.

ఆ కల్చర్‌కు తగ్గట్టు అక్కడికి వచ్చేవారు కావాల్సినవి తినవచ్చు. ఇంకా బయట నుంచి వచ్చేవారు సొంతగా తినుబండారాలను తెచ్చుకునే వెసలుబాటూ ఉంది. మిత్రుల‌తో కలిసి సరదాగా గడిపేందుకు బెంగళూరు సిటీని ఎంపిక చేసుకున్నందుకు సంతృప్తి కలిగింది. ఎక్కువ రోజులు గడపాలనుకునే వారికి ఇంకా బెంగళూరు సిటీ చుట్టుపక్కలనే అనేక పార్కులు, రిసార్ట్స్ ఉన్నాయి. మ‌రెందుకు ఆల‌స్యం మీరూ ఓ వీకెండ్‌ను బెంగ‌ళూరులో గ‌డిపేందుకు ప్లాన్ చేయండి.

Read more about: bangalore city karnataka
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X