పుష్కర్, భారతదేశంలోని అతి పవిత్ర నగరాలలో ఒకటిగా గుర్తింపు పొందింది. ఇది అజ్మీర్ నగరం నుండి 14 కిలోమీటర్ల దూరంలో ఉంది. 4వ శతాబ్దపు చైనా యాత్రికుడు ఫాహియాన్ యాత్రా చరిత్ర వర్ణనల, మొఘలులు భారత దేశంపై దాడి చేసిన కాలంలోని ఇతర రచనలలో ఈ పవిత్ర నగర౦ ప్రస్తావన ఉంటుంది. ప్రఖ్యాత భారత కవి కాళిదాసు తన అభిజ్ఞాన శాకుంతలంలో పుష్కర్ కు ఎంతో గౌరవ౦ కల్పించాడు. ఈ చిన్న నగరం 400 దేవాలయాలు, 52 ఘాట్లకు పుట్టిల్లు. పుష్కర్ బ్రహ్మ దేవుని ఆలయం భారతదేశంలోని ఈ దేవుని ఆలయాలలో ఒకటి. వరాహ దేవాలయం, ఆప్తేశ్వర్ దేవాలయం, సావిత్రి దేవాలయం పుష్కర్ లోని కొన్ని ప్రసిద్ధ ఆలయాలు.
ఈ ప్రాంతపు మరొక ధార్మిక ఆకర్షణ పవిత్ర పుష్కర్ సరస్సు పుట్టుకకు ఒక పురాణ గాథ ప్రచారంలో ఉంది. దీని ప్రకారం బ్రహ్మ దేవుడు వజ్ర నాభుడనే రాక్షసుడ్ని ఒక కమలంతో చంపాడు.
తత్పలితంగా పువ్వు నుండి కిందపడిన మూడు రేకుల్లో ఒక రేకు పడిన పుష్కర్ లోని ప్రాంతం లో ఈ సరస్సు ఏర్పడింది. మోక్షానికి మార్గమనే నమ్మకం వల్ల లక్షల కొద్ది ప్రజలు కార్తిక పౌర్ణమి నాడు ఇక్కడ పవిత్ర స్నానాన్ని ఆచరిస్తారు. పుష్కర్ ఉత్సవాలు, పండగలకు కూడా ప్రసిద్ది.
ప్రతి ఏటా నవంబర్ నెలలో ఈ నగరంలో ప్రపంచపు పశువుల సంతలో పెద్దదైన ప్రపంచ ప్రసిద్ధ పుష్కర్ పశువుల సంత జరుగుతుంది. ఈ ఉత్సవంలో పశువుల సంతతో బాటుగా రాజస్థానీ సంస్కృతి, సంప్రదాయాలకు చెందిన వివిధ అంశాలను ప్రదర్శిస్తారు.
పర్యాటకులు ప్రపంచంలోని ఏ ప్రాంతం నుండైన పుష్కర్ కు సులువుగా చేరవచ్చు. పుష్కర్ కు జైపూర్ లోని సంగనేర్ విమానాశ్రయం, అజ్మీర్ రైల్వే స్టేషన్ దగ్గరగా ఉన్నాయి. అజ్మీర్ నుండి ఇతర రాష్ట్ర ప్రధాన నగరాలు జైపూర్, జైసల్మేర్, ఉదయ పూర్ లకు చక్కటి రోడ్డు సౌకర్యం ఉంది. ఉష్ణోగ్రత 8 డిగ్రీలనుండి 25 డిగ్రీల వరకు ఉండే శీతాకాలం పుష్కర్ సందర్శనకు ఉత్తమమైనది



Click it and Unblock the Notifications