• Follow NativePlanet
Share
» »హైదరాబాద్ లో రాత్రుళ్ళు ఇక్కడ తిరగొద్దు!

హైదరాబాద్ లో రాత్రుళ్ళు ఇక్కడ తిరగొద్దు!

Written By: Venkatakarunasri

శాస్త్ర సాంకేతికత ఇంతగా అభివృద్ధి చెందుతున్న ప్రస్తుత తరుణంలో ఇలాంటివి కూడా ఉన్నాయంటే చాలా మంది నమ్మకపోవచ్చు. కొంతమంది అటువంటి ప్రదేశాలలో చాలా ఆసక్తి కనబరుస్తారు. మరి అక్కడి స్థానికులు చెబుతున్న విషయాలెంటి ? అవి హైదరాబాద్ లో ఎక్కడెక్కడ ఉన్నాయో ఒకసారి పరిశీలిస్తే ...

ఇంత సందడిగా ఉండే హైదరాబాద్ నగరంలో కొన్ని భయానక ప్రదేశాలు ఉన్నాయంటే ఆశ్చర్యం కలిగించక మానదు. అక్కడి ప్రదేశాల్లో స్థానికంగా నివసిస్తున్న కొంత మందిని ఆరా తీస్తే నమ్మశక్యంకాని నిజాలు బయటపడ్డాయి. అవి పుకార్లు అనుకోవాలో లేదా వారి మూఢనమ్మకాలు అనుకోవాలో, ఏమనుకోవాలో అది మీరే అర్థం చేసుకోవాలి. రాత్రి అయితే వింత శబ్ధాలు, ధ్వనులు వినిపిస్తుంటాయని, వింతైనా ఆకారాలు సైతం కనిపిస్తుంటాయని వారు చెబుతున్నారు.

హైదరాబాద్ ... అందరికీ తెలిసిన ప్రదేశం. ఉదయం నుండి రాత్రి వరకు ఎప్పుడూ గజిబిజిగా, సందడిగా ఉంటుంది. ఛాయ్ దుకాణాలు, సమోస, కచోరీ, బిర్యానీ ఇలా ఎన్నో ఇక్కడ దొరుకుతాయి. సాయంత్రం అయ్యిందంటె షాపింగ్ మాల్ లు, చార్మినార్ సందులు, పార్క్ లు నగర ప్రజలతో కిటకిట లాడుతుంటాయి.

రవింద్ర నగర్

రవింద్ర నగర్

అది 2012 వ సంవత్సరం, హైదరాబాద్ లోని రవింద్ర నగర్ కాలనీ లో ఆతీత శక్తులు ఉన్నాయనే పుకార్లు చుట్టుప్రక్కల ప్రాంతాలన్నింటినీ కదిలించాయి. అందరూ ఇంటి గోడలపై, తలుపులపై వారి వారి మతాల కు సంబంధించిన మంత్రాలను వ్రాశారు. అలా వ్రాయని వారు దెయ్యం సమక్షంలో ఆత్మహత్య చేసుకున్నారని చెబుతారు. ఇక్కడ ఆతీత శక్తులు ఏర్పడటానికి కారణం దైవ కోపం యొక్క ఒక రూపం అని స్థానికుల కథనం.

రోడ్ నెంబర్ 12 గ్రేవ్ యార్డ్, బంజారా హిల్స్

రోడ్ నెంబర్ 12 గ్రేవ్ యార్డ్, బంజారా హిల్స్

హైదరాబాద్ లో విలాసవంతమైన, ఖరీదైన ప్రాంతం బంజారా హిల్స్. మరి అలాంటి బంజారా హిల్స్ లో కూడా పుకార్లు లేకపోలేదు. రోడ్ నెంబర్ 12 గ్రేవ్ యార్డ్ మార్గంలోని విద్యుద్దీపాలు వాటంతట అవే స్విచ్ ఆఫ్ అయిపోతాయి. రాత్రి పూట వాహనాలు ఈ మార్గం గుండా వెళితే పంచర్ అయిపోతాయట కూడా ..!

ఖైరతాబాద్ సైన్స్ కాలేజ్

ఖైరతాబాద్ సైన్స్ కాలేజ్

ఖైరతాబాద్ లోని సైన్స్ కాలేజ్ (ప్రస్తుతం ఉపయోగించడం లేదు) ప్రస్తుతం ఒక హంటెడ్ ప్రదేశం గా గుర్తించబడింది. సైన్స్ ల్యాబ్ లో చనిపోయిన శవాల మీద పరిశోధనలు చేస్తున్నప్పుడు ఏమైనా శవం లేసొచ్చిందో లేక ఏదైనా జరిగిందో తెలీదు కానీ ఇక్కడైకైతే ఎవ్వరూ రారు. కాలేజీ వాచ్ మెన్ లోనికి పోవడానికి ప్రత్నించాడో లేదా అతని చావు కూడా మిస్టరీ గానే మిగిలింది.

ఉప్పల్ స్టేడియం

ఉప్పల్ స్టేడియం

ఉప్పల్ స్టేడియం కూడా ఆ నోట ఈ నోట పడి చివరికి భయానక ప్రదేశాల జాబితాలో చోటు సంపాదించుకుంది. అక్కడి సిబ్బంది మరియు ప్రేక్షకులు స్టేడియంలోని లైట్ లేని కారిడార్ లో నల్లటి దుస్తులు ధరించిన ఒక వింతైనా ఆకారాన్ని చూసారని, ఆ తరువాత అక్కడి నుంచి మాయమైపోయిందని చెబుతారు.

శంషాబాద్ ఏర్ పోర్ట్

శంషాబాద్ ఏర్ పోర్ట్

శంషాబాద్ ఏర్ పోర్ట్, హైదరాబాద్ కే గర్వకారణం. సుమారు 5 వేల ఎకరాల్లో నిర్మించిన ఈ ఏర్ పోర్ట్ ఆతీత శక్తులకు నిలయంగా మారింది. ఏర్ పోర్ట్ నిర్మాణం ముందు వివాదాల సమయంలో కొంత మంది మరణించారని, వారి ఆత్మలు అక్కడే తిరుగుతున్నాయని చెబుతున్నారు. ఒక మనిషి 360 డిగ్రీలు తన తలను తిప్పుకొని కూర్చున్నట్లు మరియు రన్ వే మీద తెల్లని చీర కట్టుకొని ఒక మహిళ డ్యాన్స్ చేసుకుంటూ తిరిగినట్టు అక్కడి వీడియోలో దృశ్యాలు కనిపించినాయి.

ఎర్రమంజిల్

ఎర్రమంజిల్

హైదరాబాద్ లోని ఎర్రమంజిల్ లో తల లేని మనిషి ఆత్మ ఒక ఇంట్లో ఉందని పుకారు ఉంది. ఆ ఇంటిమీద తనకున్న మమకారం చంపుకోలేక ఆ మనిషి ఆ ఇంట్లోనే చనిపోయినప్పటి నుండి ఇప్పటి వరకు తల లేకుండా ఆత్మలా తిరుగుతున్నాడని స్థానికుల కథనం.

డెడ్ లఖ్ ఘర్

డెడ్ లఖ్ ఘర్

సుమారు 40. సంవత్సరాల క్రితం, 1.5 లక్షలు పెట్టి డెడ్ లఖ్ ఘర్ నిర్మించారు. ఆపార్ట్‌మెంట్ లోని అన్ని ఫ్యామిలీలు కొన్ని సంవత్సరాలు బాగానే జీవించారు కానీ ఏమైందో ఒకసారిగా అన్ని ఫ్యామిలీలు ఒకేసారి గొలుసువలే లైన్ గా చనిపోయారు. కానీ చుట్టుప్రక్కల వారు ఇప్పటికీ ఈ అపార్ట్ మెంట్ నుండి వింతైనా శబ్ధాలు వినిపిస్తున్నాయని ముఖ్యంగా అమ్మాయి దీనంగా ఏడుస్తున్నట్లు శబ్ధం వినిపిస్తుందని చెబుతున్నారు.

రామోజీ ఫిలిం సిటీ

రామోజీ ఫిలిం సిటీ

హైదరాబాద్ లో రామోజీ ఫిలిం సిటీ ఒక గొప్ప పర్యాటక ఆకర్షణ. కాని దీనిని కూడా ప్రేతాత్మల నిలయం అంటారు. విశాలంగా నిర్మించబడిన ఈ గొప్ప ఆకర్షణ ఒకప్పుడు నిజాం సుల్తానుల యుద్ధ భూమి. అక్కడ మరణించిన సైనికుల ఆర్త నాదాలు నేటికీ అక్కడ ప్రతిధ్వనిస్తూ ఉంటాయని చెపుతారు. ఇక్కడి హోటల్స్ లో ఎన్నో వింత సంఘటనలు జరుగుతూ వుంటాయి. షూటింగ్ లు జరిగేటపుడు మిస్టరీ గా వాటి అంతట అవే లైట్ లు ఆరిపోతాయి. అక్కడ ఉన్నవారిని ఎవరో తోసినట్లు అనిపిస్తుందని కొందరు చెపుతారు.

గోల్కొండ కోట

గోల్కొండ కోట

గోల్కొండ కోట హైదరాబాద్ చరిత్ర కు నిలువెత్తు సాక్ష్యం. ఇక్కడ కూడా ఆతీత శక్తులు ఉన్నాయన్న వాదన లేకపోలేదు. దొంగలు ఈ కోటలోని సంపద ని దోచుకోవటానికి వచ్చి అక్కడి వింత రూపాన్ని చూసి ఆత్మలుగా మారారని తెలుస్తుంది. కోట లోని తారామతి బారాదరి వద్ద వేశ్య రాణి సంచరిస్తున్నట్లు పుకారు కూడా ఉన్నది.

కుందన్ బాగ్ విచస్ లేర్

కుందన్ బాగ్ విచస్ లేర్

కుందన్ బాగ్ లో అంతు తెలీని మిస్టరీ ఇప్పటికీ అలానే ఉంది. ఒక దొంగ ఆ ఇంట్లో ప్రవేశించినప్పుడు అక్కడ 3 శవాలను గుర్తించినాడు. అప్పటికే ఆ శవాలు చనిపోయి 3 నెలలు కావస్తున్నాయి, కానీ స్థానికులు ఆ తల్లి, ఇద్దరు పిల్లల్ని మొన్న మొన్న నే వీధిలో తిరుగుతుంటే చూశామని చెబుతున్నారు. రాత్రి పూట ఆ ఇంటి చుట్టూ ఎవరో క్యాండిల్ పట్టుకొని తిరుగుతుంటారని, ఆ ఇంటి వరండా లో రక్తపు బాటిల్లు దొరికాయని పుకారు కూడా ఉన్నది.

భారత దేశంలో 15 భయానక ప్రదేశాలు !!

పర్యాటకానికి సంబంధించిన వివరాలు తెలుసుకోండి
పర్యాటక చిట్కాలు, పర్యాటకానికి సంబంధించిన కథాలు తక్షణం పొందండి