• Follow NativePlanet
Share
» »ఇండియాలో టాప్ 10 ఖరీదైన హోటళ్లు !

ఇండియాలో టాప్ 10 ఖరీదైన హోటళ్లు !

దేశంలో పర్యాటక రంగం బాగా అభివృద్ధి చెందుతోంది. అందుకు గాను పర్యాటకుడికి సకల సౌకర్యాలు ఎంతో తేలికగా లభ్యం అవుతున్నాయి. అయితే, ప్రతి దానికి, దానికి తగిన ఖర్చు కూడా వుంటుంది అనటంలో సందేహం లేదు. సామాన్యులు సాధారణ వసతులు కోరితే, ధనికులైన వారు అన్ని వసతులతో కూడిన అతి ఖరీదైన హోటళ్లకు వెళ్లి ఆనందిస్తారు. ఖర్చులకు వెనుకాడరు. ఈ విధంగా వ్యయం చేసే వారు ఉండబట్టే, స్టార్ హోటళ్ళ సంఖ్య దేశంలో దిన దిన ప్రవర్ధాన మవుతోంది. ఎన్నో హోటళ్ళు వెలిశాయి. కోరిన ప్రతి సౌకర్యం లభిస్తోంది. ఇక వసతి ఎంపిక మీదే. అటువంతి స్టార్ హోటల్లు కొన్ని మన దేశంలోనివి పరిశీలిద్దాం

అతిధి దేవో భావ అంటే అతిధులను దేవుళ్ళుగా భావించి ఆతిధ్యం ఇవ్వమని అర్ధం. భారత దేశ సంస్కృతిలో ప్రాచీన కాలం నుండి అతిధులకు మర్యాదలు చేసే ఆచారం వుంది. ఈ సంస్కృతిని అక్షరాలా అమలు పరుస్తున్నాయి మన స్టార్ హోటళ్ళు. పర్యటనలో సాధారణంగా పర్యాటకుడు కోరే వాటిలో మంచి వసతి ఒకటి. పగలంతా ఎక్కడ తిరిగినా, ఏమేమి చూసినా, రాత్రి అయ్యే సరికి సరైన వసతి కి చేరి సుఖంగా గడపాలని ఆశిస్తాడు. వసతి ఆహ్లాద కరంగా వుంటే, మరో రెండు రోజులు అధికంగా వుండి కూడా తన పనులు చక్క పెట్టుకుంటాడు. లేదా మరి కొన్ని ప్రదేశాలు చూసి ఆనందిస్తాడు.

ఇండియాలో టాప్ 10 ఖరీదైన హోటళ్లు !

ఇండియాలో టాప్ 10 ఖరీదైన హోటళ్లు !

ది తాజ్ మహల్ పాలస్ అండ్ టవర్స్, ముంబై

ముంబై నగరానికి వచ్చే ప్రతి ఒక్కరికి ఈ హోటల్ పేరు తప్పక తెలిసి తీరుతుంది. ఈ హోటల్ లో అన్ని సౌకర్యాలు కల ప్రీమియం రూమ్ అంటే రోజుకు రూ.21,500/- విలాసవంతమైన రూము అంటే రూ.1.70 లక్షల రూపాయలుగా వుంటుంది.

ఫోటో క్రెడిట్ : తాజ్ హోటల్స్

ఇండియాలో టాప్ 10 ఖరీదైన హోటళ్లు !

ఇండియాలో టాప్ 10 ఖరీదైన హోటళ్లు !

ది లీలా పాలస్, ఉదయపూర్

ఒకప్పుడు రాజులు నివసించిన ప్రదేశం ఉదయపూర్. ఈ నగరంలో పర్యాటకుడు చూడవలసిన ఆకర్షణలు అనేకం కలవు. ఇక్కడ పిచోలా సరస్సు వద్ద నిర్మించిన ఒక విలాసవంతమైన హోటల్ వసతి మీకు ఆరావళి పర్వత దృశ్య అందాలు చూపుతూ ఆనంద పరుస్తుంది. అక్కడి పర్వతాలు, సరస్సు చూస్తూ రూమ్ లో కూర్చోవాలంటే, రూమ్ బాడుగ రూ. 26,000 మొదలు కొని రూ. 2 లక్షల వరకూ కలదు.

ఫోటో క్రెడిట్ The Leela

ఇండియాలో టాప్ 10 ఖరీదైన హోటళ్లు !

ఇండియాలో టాప్ 10 ఖరీదైన హోటళ్లు !

తాజ్ ఫలక్ నామా పాలస్

హైదరాబాద్ తో పరిచయమున్న ప్రతి వారికి తాజ్ ఫలక్నామ పాలస్ గురించి తెలుస్తుంది. ఈ అద్భుత భవనం ఒకప్పుడు ప్రపంచంలోనే అతి ధనవంతుడైన హైదరాబాద్ పాలకుడు నిజాము కు చెందినది. ఆయన తదనంతరం దీనిని ఒక హోటల్ గా మార్చి వేసారు. దీనిలో కల రూముల రెంట్ రూ. 33,000 నుండి మొదలై అతి ఖరీదైన సూట్లు రూ.1.95 లక్షల వరకు కలవు.

ఫోటో క్రెడిట్ : Oberoi Hotels

ఇండియాలో టాప్ 10 ఖరీదైన హోటళ్లు !

ఇండియాలో టాప్ 10 ఖరీదైన హోటళ్లు !

తాజ్ లాండ్స్ ఎండ్, ముంబై

ముంబై నగరంలోని తాజ్ హోటల్స్ గ్రూప్ హోటళ్ళ లో ఇది ఒకటి. బాంద్రా ప్రదేశంలో కల ఈ హోటల్ మీకు అరేబియా మహాసముద్ర దృశ్యాలు చూపుతుంది. దీనిలోని రూములు రెంట్ రోజుకు రూ. 23,000 నుండి మొదలై అత్యంత ఖరీదైన సూట్ అంటే రూ.2.5 లక్షల వరకూ కలదు. ఒబెరాయ్ అమర విలాస్, ఆగ్రా ఆగ్రా లో కల ఒబెరాయ్ అమర్ విలాస్ హోటల్ అన్ని అద్భుత సౌకర్యాలు తన ఖాతాదారుకు అందిస్తుంది. ఈ హోటల్ లో రూముల బాడుగ ఒక రోజుకు రూ.35,000 నుండి మొదలై అతి ఖరీదైన విలాసాల రూము బాడుగ 2.5 లక్షల రూపాయలుగా వుంటుంది.

ఇండియాలో టాప్ 10 ఖరీదైన హోటళ్లు !

ఇండియాలో టాప్ 10 ఖరీదైన హోటళ్లు !

ఒబెరాయ్ హోటల్, ముంబై

అరేబియా సముద్రానికి ఎదురుగా నిలబడే ఈ ముంబై నగర హోటల్ విలాస జీవనానికి మారుపేరుగా వుంటుంది. ఈ హోటల్ లో రూమ్ రెంట్ ఒక రోజుకు 25,000 రూపాయలతో మొదలై, అతి ఖరీదైన సూట్ రూమ్ రెంట్ ఒక రోజుకు 3 లక్షల రూపాయలుగా వుంటుంది.

ఫోటో క్రెడిట్ : Oberoi Hotels

ఇండియాలో టాప్ 10 ఖరీదైన హోటళ్లు !

ఇండియాలో టాప్ 10 ఖరీదైన హోటళ్లు !

ది ఒబెరాయ్, గుర్గావ్

గుర్గావ్ నగరంలో కల ప్రతిష్టాత్మక ఒబెరాయ్ హోటల్ ఒక ఇంద్ర భవనంవలె వుంటుంది. ఈ హోటల్లో భారత దేశ విలాసవంత రాచరికపు సాంప్రదాయాలు ఉట్టి పడుతూ వుంటాయి. ఈ హోటల్ లో రూమ్ రెంట్ రోజుకు 30,000 రూపాయలతో మొదలై, అతి ఖరీదైన రూమ్ రెంట్ 3 లక్షల రూపాయల వరకూ వుంటుంది.

ఫోటో క్రెడిట్ : Oberoi Hotels

ఇండియాలో టాప్ 10 ఖరీదైన హోటళ్లు !

ఇండియాలో టాప్ 10 ఖరీదైన హోటళ్లు !

ది లీలా పాలస్, న్యూ ఢిల్లీ

ఢిల్లీ లో ప్రతిష్టాత్మక ప్రదేశమైన చానిక్య పురి లో కల ఈ వైభవోపేత హోటల్ నగరంలో అత్యంత విలాసవంతమైన హోటల్. ఈ హోటల్ నిర్మాణంలో ప్రతి ఒక్క భాగం విశిష్టత కలిగి నాణ్యమైన మెటీరియల్ ఉపయోగించబడింది. అద్భుత సేవలు. ఈ హోటల్ లోని రూము రెంట్ 25,000 రూపాయలతో మొదలై 4.5 లక్షల రూపాయలవరకు కలదు.

ఫోటో క్రెడిట్ : The Leela

ఇండియాలో టాప్ 10 ఖరీదైన హోటళ్లు !

ఇండియాలో టాప్ 10 ఖరీదైన హోటళ్లు !

తాజ్ లేక్ పాలస్, ఉదయపూర్

ప్రస్తుతం భారత దేశంలో అత్యంత విలాసమైన హోటల్ ఇది. రాజస్థాన్ రాష్ట్రంలోని సరోవర నగరంగా ప్రసిద్ధి చెందిన ఉదయపూర్ లో ఒక సరస్సు మధ్యలో ఈ హోటల్ నిర్మించారు. సరస్సు మంధ్యలో వుండటంచే ఎంతో చల్లగా వుండి ఆహ్లాదం కలిగిస్తుంది. ఈ హోటల్ లోని గదులు అద్దె రోజుకు 36000 రూపాయల తో మొదలై 6 లక్షల రూపాయాల వరకు కలదు.

ఫోటో క్రెడిట్ : Taj Hotels

ఇండియాలో టాప్ 10 ఖరీదైన హోటళ్లు !

ఇండియాలో టాప్ 10 ఖరీదైన హోటళ్లు !

ఒబెరాయ్ రాజ్ విలాస్, జైపూర్

అతి విలాసవంతమైన ఈ హోటల్ రాజస్తాన్ లోని పింక్ సిటీ జైపూర్ లో కలదు. దీనిలోని రూమ్ రెంట్ 35000 రూపాయలతో మొదలై, ఖరీదైన సూట్ రెంట్ రోజు, 2.3 లక్షల రూపాయలుగా వుంటుంది.

ఫోటో క్రెడిట్ : : Oberoi Hotels

పర్యాటకానికి సంబంధించిన వివరాలు తెలుసుకోండి
పర్యాటక చిట్కాలు, పర్యాటకానికి సంబంధించిన కథాలు తక్షణం పొందండి