» »భారత దేశ పర్యటన - పది ప్రదేశాలు !

భారత దేశ పర్యటన - పది ప్రదేశాలు !

Posted By:

భారత దేశం వాస్తవానికి వివిధ సంస్కృతుల సమ్మేళనం. అన్ని సంస్కృతులు, అన్ని మతాలు, ఎన్నో భాషలు, వివిధ రకాల వంటకాలు ఇక్కడ చూడవచ్చు. ప్రస్తుతం ఇండియా ప్రపంచంలోనే రెండవ అత్యధిక జనాభా కల దేశంగా పేరొందినది. భూ భాగం లో ఇండియా ఏడవ అత్యధిక విస్తీర్ణం కల భూమిగా పేర్కొంటారు. కనుక సహజంగానే ఈ దేశం భౌగోళికంగా అనేక పర్వతాలు, బీచ్ లు, సముద్రాలు, అటవీ ప్రదేశాలు, జంతు జాలాలు కలిగి వుంది. మరి ఇటువంటి దేశానికి చెందినా ఒక్క పది వాస్తవ అంశాలను ఆయా పర్యాటక ప్రాంతాలకు సంబంధించి మీ ముందు ఉంచుతున్నాము. పరిశీలించండి. ఈ వాస్తవిక అంశాలు ప్రపంచంలో భారత దేశం మాత్రమే ప్రత్యేకంగా కలిగి వుంది. మరి అవి ఏవి ?

ముంబై - దేశ ఆర్ధిక రాజధాని

ముంబై - దేశ ఆర్ధిక రాజధాని

ముంబై నగరం భారత దేశ ఆర్ధిక రాజధాని. వాణిజ్యపరంగా ఎంతో అభివృద్ధి చెందినది. హిందీ చలన చిత్రాలకు పుట్టినిల్లు. ఈ నగరం గురించి ప్రపంచంలోని హార్వర్డ్ విశ్వ విద్యాలయం తో పాటు మరొక పది ఉన్నత బిజినెస్స్ స్కూల్స్ కూడా పరిశీలిస్తున్నాయి. ఇక్కడ మధ్యాహ్నం వేల కార్యాలయాలలో భోజనాలు అందించే డబ్బా వాలాలు ఒక ప్రత్యేకత. వీరు సుమారు ప్రతి రోజూ రెండు లక్షల లంచ్ బాక్స్ లు అందిస్తారు. ఇండియా లోని గొప్పదైన ఈ మహానగరం తప్పక చూడదగినది.

Photo Courtesy: Ana Raquel S. Hernandes

పశ్చిమ బెంగాల్ - సుందర్బన్ నేషనల్ పార్క్

పశ్చిమ బెంగాల్ - సుందర్బన్ నేషనల్ పార్క్

అనేక సముద్ర తీర ప్రాంతాలు కల ఈ రాష్ట్రం ఎంతో ప్రసిద్ధి చెందినది. ప్రపంచంలోని అతి పెద్ద మాన్గ్రోవ్ ఫారెస్ట్ ఇక్కడ కలదు. భారత దేశ జాతీయ జంతువు బెంగాల్ టైగర్ కు ఇక్కడ కల సుందర్బన్ నేషనల్ పార్క్ నివాసంగా కలదు. ఇది ప్రస్తుతం యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. తప్పక చూడదగిన ప్రదేశం.

Photo Courtesy: Joiseyshowaa

మేఘాలయ - అత్యధిక వర్షపాతం

మేఘాలయ - అత్యధిక వర్షపాతం

వార్షికంగా 1,200 సెం. మీ. ల వర్షపాతం నమోదు అయ్యే ఈ ప్రాంతం ఈ భూమి పై ప్రపంచంలోనే అత్యధిక వర్షపాతం కల ప్రదేశంగా పెర్కొనబడుతోంది. ఇక్కడ అనేక సున్నపురాతి గుహలు, ఖాసి తెగల వారు నిర్మించిన సహజ బ్రిడ్జి లు మరియు ఆసియా లోనే అతి శుభ్రమైన విలేజ్ గా చెప్పబడే మాలి నాంగ్ విలేజ్ ఇక్కడ కలవు. మరువలేని పర్యాటక అనుభూతికి మేఘాలయ తప్పక చూడాలి.
Photo Courtesy: Pankaj Kaushal

నలంద, బీహార్ - విశ్వవిద్యాలయం

నలంద, బీహార్ - విశ్వవిద్యాలయం

ప్రపంచంలోని అతి పురాతన విశ్వ విద్యాలయం నలంద విశ్వ విద్యాలయం. ప్రస్తుతం ఇది పునర్ నిర్మాణం లో కలదు. ఎర్రటి ఇటుక రాతి తో కట్టబడిన ఈ నిర్మాణం ఆసియా లోని వివిధ ప్రాంతాల నుండి విద్యార్ధులను ఆకర్షిస్తుంది. ఈ విశ్వ విదాలయ లైబ్రరీ అతి పెద్దది. ఒకప్పుడు మన దేశం పై దండెత్తిన ముస్లిం లు ఈ లైబ్రరీ ని తగులబెట్టగా అది మూడు నెలల పాటు మంటలు కలిగి వుందని చెపుతారు. ప్రస్తుతం పునర్నిర్మాణం లో కల ఈ యూనివర్సిటీ తప్పక చూడదగినది.

Photo Courtesy: Wonderlane

ఢిల్లీ - భారత దేశ రాజధాని నగరం

ఢిల్లీ - భారత దేశ రాజధాని నగరం

ఢిల్లీ దేశ రాజధాని నగరం గానే కాదు ప్రపంచంలో అతి పెద్ద సుగంధ ద్రవ్యాల మార్కెట్ గా కూడా ప్రసిద్ధి చెందినది. సుమారు 17 వ శతాబ్దం నుండి ఇక్కడ సుగంధ ద్రవ్యాలు ఇతర దేశాలకు సైతం ఎగుమతులు చేయబడుతున్నాయి. ఖారి బావోలి మార్కెట్ లోని వరుస దుకాణాలు రంగు రంగుల మసాలాలతో మిమ్ములను మత్తెక్కిస్తాయి.

Photo Courtesy: Michael Vito

నాసిక్ - కుంభమేళ

నాసిక్ - కుంభమేళ

నాసిక్ ప్రపంచం లోనే అతి పెద్ద పండుగగా జరుపబడే కుంభమేళ కు ప్రసిద్ధి. మహారాష్ట్ర లో కల ఈ నాసిక్ ప్రాంతంలో కుంభమేళ సమయంలో జన సమూహాలతో కిక్కిరిసి పోతుంది. యాత్రికులు ఇక్కడి త్రయంబ కేశ్వర్ పవిత్ర నీటిలో పుణ్య స్నానాలు ఆచరిస్తారు.

Photo Courtesy: Lokankara

బెంగుళూరు - సిలికాన్ నగరం

బెంగుళూరు - సిలికాన్ నగరం

సిలికాన్ సిటీ గా పేరొందిన బెంగుళూరు నగరం ఇండియా కు అవుట్ సోర్సు చేయబడిన కంప్యూటర్ పనులలో సగానికి పైగా నిర్వహిస్తుంది. ఇక్కడ కల ఐ టి కంపెనీ ల కారణంగా లక్షలాది ప్రజలు వివిధ రకాల ఉపాధి పొందుతున్నారు. వీరు ఇండియా లోని వివిధ ప్రాంతాలనుండి తరలి వస్తున్నారు. ఈ కారణంగా పట్టాన సంస్కృతి ఇక్కడ ఎంతో అభివృద్ధి చెందినది.
Photo Courtesy: Ishwar

లడఖ్ - అతి ఎత్తు కల వాహన చాలిత రోడ్డు

లడఖ్ - అతి ఎత్తు కల వాహన చాలిత రోడ్డు

లడఖ్ లో కల ఖార్ డాంగ్ లా రోడ్డు ప్రపంచంలోని అత్యధిక ఎత్తు లో కల వాహన సంచార రోడ్డు గా కీర్తి గడించి గిన్నిస్ బుక్ లోకి సైతం చేరింది. లడఖ్ లో పర్యాటకులకు అనేక అద్భుత ఆకర్షణలు కలవు. అద్భుత పర్వత శ్రేణుల నుండి సుందరమైన లోయలు, బౌద్ధ ఆరామాలు వంటివి లడఖ్ లో తప్పక చూడదగినవి.

Photo Courtesy: Elroy Serrao

ఆంధ్ర ప్రదేశ్ - పండ్లలో రా రాజు మామిడి పండు

ఆంధ్ర ప్రదేశ్ - పండ్లలో రా రాజు మామిడి పండు

ఇండియా లో అత్యధిక మామిడి పండ్ల పంటలు ఇక్కడ పండుతాయి. ఇక్కడ దొరికే బనగానపల్లె మరియు నూజి వీడు రసాలు వంటి మామిడి పండ్లు వివిధ దేశాలకు సైతం ఎగుమతి అవుతాయి. ఈ రాష్ట్రంలో పురాతన స్మారకాల నుండి ఆధునిక హై టెక్ నగరాల వరకు ఎన్నో పర్యాటక ఆకర్షణలు కలవు.

Photo Courtesy: ruurmo

అస్సాం - తేయాకు పంటల అగ్ర స్థానం

అస్సాం - తేయాకు పంటల అగ్ర స్థానం

ప్రపంచంలో అత్యధికంగా తేయాకు లేదా టీ ఉత్పత్తి చేసే దేశాలలో ఇండియా ఒకటి. ఇండియాలో అస్సాం రాష్ట్రాన్ని టీ కేపిటల్ అఫ్ ది వరల్డ్ అని పిలుస్తారు. బ్రిటిష్ వారు వాణిజ్య పర టీ అమ్మకాలు ప్రారంభించక ముందే ఇక్కడ టీ ఉత్పత్తులు అధికంగా ఉండేవి. విశాలమైన ఇక్కడి తేయాకు తోటల తాజా వాతావరణం, సహజ సుందర దృశ్యాలు, పర్యాట కుడికి మరువలేని అనుభూతులు అందిస్తుంది. అస్సాం లోని కాజి రంగ మరియు మానస వైల్డ్ లైఫ్ సాన్క్చురి లు యునెస్కో ప్రపంచ గుర్తింపు పొందిన సైట్ లు గా పేరొంది, అతి గొప్ప పర్యాటక ఆకర్షణలు గా నిలిచాయి.

Photo Courtesy: Akarsh Simha

Please Wait while comments are loading...