Search
  • Follow NativePlanet
Share
» »ఆగస్టు నెలలో ఈ ప్రదేశాల్లోని ప్రకృతి అందాలు మాయ చేస్తాయి..

ఆగస్టు నెలలో ఈ ప్రదేశాల్లోని ప్రకృతి అందాలు మాయ చేస్తాయి..

Luca Bravo

వాతావరణం ఆహ్లాదంగా ఉండే ఈ సమయంలో టూర్‌ ప్లాన్‌ చేసుకుంటే ఉరుకుల పరుగుల జీవితం నుంచి మంచి రిలీఫ్‌ దొరుకుతుంది.కొన్ని పర్యాటక ప్రాంతాలు ఎప్పుడూ చూసిన ఒకే రకంగా ఉంటాయి. మరికొన్ని ప్రాంతాలు వాతావరణంలో వచ్చే మార్పులకు అనుగుణంగా తమ అందాలను ద్విగుణీకృతం చేసుకొంటాయి.

ముఖ్యంగా వర్షాలు పడే సమయంలో కొన్ని ప్రాంతాల అందాలు పర్యాటకులను మంత్ర ముగ్దులను చేస్తూ ఉంటాయి. ఈ నేపథ్యంలో దేశంలో పలు ప్రాంతాల్లో ఆగస్టు నెలల్లో వర్షాలు పడి అక్కడి ప్రకృతిని అందాలమయం చేస్తున్నాయి. ఈ సమయంలో ఎయిర్‌లైన్స్‌, హోటల్స్‌ మంచి డిస్కౌంటును అందిస్తుంటాయి. ఈ నెలలో టూర్ ప్లాన్ చేసుకుంటే కనుక ఈ ప్రదేశాలను ఎంపిక చేసుకుని సందర్శించవచ్చు. మరి ఆ ప్రదేశాలేంటో చూసేద్దాం..

అతిరాప్పిల్లి

అతిరాప్పిల్లి

ఆగస్టు నెలలో భారతదేశంలో పర్యాటకులు తప్పక చూడవలసిన ప్రదేశం, ఈ ప్రదేశం భారతదేశంలోని నయాగరా. అడవి యొక్క ప్రకృతి సౌందర్యం మరియు నేపథ్యంలో మంచుతో కప్పబడిన కొండలు మరొకటి. అతిరాప్పిల్లి అద్భుతమైన జలపాతాలకి, అమోఘమైన వర్షాధార అడవులకి ఇది నెలవు. ఇక్కడ వైవిధ్యమైన వృక్షజాలం మరియు జంతుజాలం కనిపిస్తుంది. అతిరాప్పిల్లి జలపాతం, వళచల్ జలపాతం, చార్పా జలపాతం ఇక్కడ ప్రధానంగా చూడవలసినవి. మీరు ఇక్కడ ట్రెక్కింగ్, పిక్నిక్, షాపింగ్, రివర్ రాఫ్టింగ్, ఇంకా ఇతర వినోద కార్యక్రమాలలో మునిగితేలవచ్చు. మీరు ఆగస్ట్ మాసంలో సందర్శిస్తే జలపాతాల హోరులతో మారుమ్రోగుతూ ఈ ప్రాంతం ప్రతిద్వనిస్తుంది.

Souradeep Ghosh

ఔలి

ఔలి

ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలో చూడదగ్గ పర్యాటక ప్రదేశం ఔలి. ఈ అందమైన లోకంలో కొత్తగా విచ్చుకున్న మొగ్గలాంటి పర్యాటక ప్రదేశం ఇది. అందుకే, నిత్యం రాష్ట్రాన్ని టూరిస్ట్‌ హబ్‌గా మార్చేయాలన్న తపనతో పరుగులు తీస్తూనే ఉంటుంది ఉత్తరాఖండ్‌ పర్యాటకరంగం. ప్రపంచంలో ది బెస్ట్‌ స్కీయింగ్‌ రిసార్ట్‌ అనే ట్యాగ్‌లైన్‌ విదేశీ పర్యాటకులను అయస్కాంతంలా ఆకర్షిస్తోంది. గోండాలా కేబుల్‌ కార్‌లో ఔలి నుంచి జోషిమఠ్‌కు సాగే ప్రయాణంలో భారత్‌లోని టిబెట్‌ దేశాల సరిహద్దులో ఉన్న 'మానా' గ్రామం కనిపిస్తుంది. ప్రసిద్ధ హిమశిఖరాలు నీల్‌కాంత్‌, నందాదేవి కూడా దర్శనమిస్తున్నాయి ఇది ఆసియాలోని పొడవైన కేబుల్ క్యారెట్లు, ట్రెక్కింగ్ మార్గాలు మరియు పురాతన దేవాలయాలకు నిలయం.

జైపూర్

జైపూర్

రాజస్థాన్ రాజధాని నగరం జైపూర్ రాజ దృశ్యాలకు ప్రసిద్ధి చెందింది. చారిత్రక, పురాతణ మరియు విలాసవంతమైన అన్ని వైభవాలతో, ఆగస్టులో ఒక యాత్రను ప్లాన్ చేసేటప్పుడు ఈ ప్రదేశం సందర్శించదగినది. పింక్ సిటీ అనే పేరుతో కూడా పిలుస్తారు. ఈ నగరం ఆగస్టులో పింక్ గా అందంగా కనిపిస్తుంది. ఈ రంగు మార్పునే ఆగస్టులో ఈ ప్రదేశాన్ని ఇష్టమైన పర్యాటక ప్రదేశంగా మారుస్తుంది. కోటలు మరియు రాజభవనాలు ఈ ప్రదేశం యొక్క సుందరమైన సౌందర్యాన్ని ఇస్తాయి. హవా మహల్, అమీర్ ఫోర్ట్, బిర్లా మందిర్ మరియు రామ్ నివాస్ గార్డెన్ ఈ ప్రదేశం యొక్క ప్రసిద్ధ ఆకర్షణలు.

ఆలీబాగ్

ఆలీబాగ్

అలీబాగ్ మహారాష్ట్ర జిల్లాలో ఉన్న ఒక ప్రసిద్ధ పర్యాటక కేంద్రం.ఆలీబాగ్ మహారాష్ట్ర పడమటి తీరంలో ఒక చిన్న పట్టణం. ఇది కొంకణ్ ప్రాంతంలోని రాయ్ గడ్ జిల్లాలో కలదు.ఆలీబాగ్ ను అలీ గార్డెన్ పేరుపై నిర్మించారు. ఆలీ ఈ ప్రాంతంలో అనేక మామిడి మరియు కొబ్బరి చెట్లు నాటాడని చెపుతారు. ఈ ప్రదేశం సుమారుగా 17వ శతాబ్దానికి చెందినది. దీనిని మొదటిలో శివాజీ మహారాజు అభివృధ్ధి చేశాడు. ఆలీబాగ్ పట్టణ పేరునే బీచ్ కు కూడా ఆలీబాగ్ బీచ్ అని పెట్టారు. ఈ బీచ్ నుండి కొలబా ఫోర్ట్ చక్కగా చూడవచ్చు. ఈ బీచ్ లోని ఇసుక నల్లగా ఉంటుంది. సూర్యాస్తమయాన్ని ఆస్వాదిస్తూ లేలేత కొబ్బరి నీరు తాగుతూ అద్భుతంగా ఆనందించగల ప్రదేశం ఇది. ఇక్కడ నాగాన్ బీచ్, అలీబాగ్ బీచ్, మాండవా బీచ్ మరియు కనకేశ్వర్ ఫారెస్ట్ ఈ ప్రదేశం యొక్క ప్రసిద్ధ ఆకర్షణలు.

Rakesh Ayilliath

ఆగుంబె

ఆగుంబె

కర్నాటక మల్నాడు ప్రాంతం అయిన తీర్ధహళ్ళి తాలూకాలో ఈ చిన్న గ్రామం వుంది. అరేబియా మహా సముద్రంలోకి సూర్యుడు అస్తమించే సుందర దృశ్యాలను ఈ ప్రదేశం నుండి చూడవచ్చు. దక్షిణ భారతదేశంలోని ఈ ప్రాంతం అత్యధిక వర్షపాతాన్ని నమోదు చేస్తుంది. ఈ ప్రాంతంలో దట్టమైన అడవులు, వివిధ రకాల మొక్కలు, జంతువులు ఉంటాయి.

కన్యాకుమారి

కన్యాకుమారి

కన్యాకుమారి ఒక పర్యాటక హాట్ స్పాట్. కన్యాకుమారి పట్టణం ఇండియా కు దక్షిణ భూభాగాన చివరలో వుంది. ఈ ప్రదేశంలో అరేబియన్ సముద్రం మరియు బంగాళా ఖాతం మరియు హిందూ మహా సముద్రం కలుస్తాయి. కన్యాకుమారి పట్టణం సూర్యోదయాలకు మరియు సూర్యాస్తామయాలకు , ప్రత్యేకించి పౌర్ణమి రోజులలో ఈ ప్రాంతం చాలా అందంగా వుంటుంది. ఇవి యాత్రికులను, పర్యాటకులను బాగా ఆకర్షిస్తాయి. సిటీ లో ప్రధాన ఆకర్షణలు అంటే అవి వివేకానంద రాక్ మెమోరియల్, తిరువల్లువార్ విగ్రహం. సీఫుడ్ లు కన్యాకుమారి ప్రసిద్ధి చెందినది. కన్యాకుమారి సందర్శనకు ఉత్తమ సమయం ఆగస్ట్ నుండి డిసెంబర్ వరకు. ఈ సమయం లో వాతావరణం ఆహ్లాదకరంగా వుంటుంది.

Photo Courtesy: Gopinath Sivanesan

పహల్గామ్

పహల్గామ్

పహల్గామ్ జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర నడిబొడ్డున ఉంది. ఇది సముద్ర మట్టానికి 7200 అడుగుల ఎత్తులో ఉంది. మంచుతో కప్పబడిన హిమాలయలు సందర్శకులను అమితంగా ఆకర్షిస్తాయి.ఈ స్థలం దట్టమైన అడవులు, అందమైన సరస్సులు, స్వచ్చమైన ప్రవాహాలు, మరియు పువ్వుల పచ్చిక బయళ్లలతో నిండి ఉంటుంది. ఈ ప్రదేశం ప్రకృతి సౌందర్యానికి ఆటపట్టు, కాబట్టి ఇక్కడ సినిమా షూటింగ్ లు చాలా జరుగుతుంటాయి. సంవత్సరం అంతా పర్యాటకులు దేశవిదేశాలనుండి ఈ ప్రాంతాన్ని దర్శించటానికి వొస్తూనే ఉంటారు. ఆగస్ట్ నుండి నవంబర్ మధ్య వరకు పహల్గాం ను దర్శించటానికి అనువైన సమయం.

బికనేర్

బికనేర్

ఆగస్టు నెలలో, మాన్‌సూన్‌ సమయంలో సందర్శనకు అనువైన మరో ప్రదేశం ఇది. రాజాస్థాన్‌లోని థార్‌ ఎడారి మధ్యలో ఉండే ఈ పట్ణణం అందాలు చూసి తీరాల్సిందే. ఈ పట్టణం గొప్ప రాజపుత్ర సంస్కృతికి, అద్భుతమైన భవనాలు-శిల్పాలకు, ఇసుకరాయితో నిర్మించిన కోట బురుజులకు ప్రసిద్ది చెందింది. 16వ శతాబ్దం నాటి జూనాగఢ్‌ ఫోర్ట్‌, కర్ణిమాతా టెంపుల్‌ ఆకట్టుకుంటాయి. చారిత్రక ప్రదేశాలను ఇష్టపడే వారికి బికనీర్‌ బాగా నచ్చుతుంది. థార్‌ ఎడారిలో ఒంటెపై ప్రయాణం మధురానుభూతిని అందిస్తుంది. చూడదగిన ప్రదేశాలు జూనాగఢ్‌ ఫోర్ట్‌, కర్ణిమాతా టెంపుల్‌, లాల్‌గఢ్‌ప్యాలెస్‌, గజ్‌నిర్‌ ప్యాలెస్‌, జైన్‌ టెంపుల్‌.

మాండూ

మాండూ

వర్షాలు పడే సమయంలో ఏ ప్రాంతాలు సందర్శనకు అనువుగా ఉంటాయో చెక్‌ చేస్తే అందులో మొదటి స్థానంలో ఉంటుందీ మాండూ. మధ్యప్రదేశ్‌లోని ఈ ప్రాంతంలో ఆప్ఘన్‌ శైలి నిర్మాణాలు, చారిత్రక ప్రదేశాలు ఆకట్టుకుంటాయి.

ఇక్కడ ఆకర్షణీయమైన ప్రదేశాలు జహాజ్‌ మహల్‌, రాణీ రూపమతి పెవిలియన్‌, రాజ్‌ బహదూర్‌ ప్యాలెస్‌, జామీ మసీద్‌, హోషంగ్‌ టూంబ్‌, హిండోలా మహల్‌, జైన్‌ టెంపుల్‌, ఆష్రఫి మహల్‌.

Photo Courtesy: McKay Savage

చిరపుంజి

చిరపుంజి

ఏడాది పొడవునా వర్షం కురిసే ప్రదేశంగా మేఘాలయలోని చిరపుంజికి పేరుంది. అయితే మాన్‌సూన్‌ సీజన్‌లో వెళితే మరింత మజాగా ఉంటుంది. ప్రపంచంలో ఎప్పుడు తడిగా ఉండే ప్రదేశాల్లో దీనిది రెండో స్థానం. ఆగస్టు నెలలో వెళితే కొండల నిండా పరుచుకున్న పచ్చదనం కనువిందు చేస్తుంది. స్వచ్ఛమైన గాలి, వాతావరణం మనసుకు ఆహ్లాదాన్నిస్తాయి. ఇక్కడ ప్రధాన ఆకర్షణలు- నొహకలికై వాటర్‌ఫాల్‌, డబుల్‌ డెకర్‌ లివింగ్‌ రూట్‌ బ్రిడ్జ్‌, డైన్‌థెలెన్‌ వాటర్‌ ఫాల్‌, మౌస్మై ఫాల్‌.

Photo Courtesy: Sharath Chandra

లాహౌల్‌

లాహౌల్‌

హిమాచల్‌ప్రదేశ్‌లో ఉండే ఈ వ్యాలీ అందాలు సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తాయి. మంచు పర్వతాల అందాలు చూసి తీరాల్సిందే. అడ్వెంచర్‌ కావాలనుకునే వారికి ఇది బెస్ట్‌ ప్లేస్‌. సయాకింగ్‌, జడలబర్రెపై సఫారీ మధురానుభూతిని అందిస్తాయి.

ఇక్కడ ఆకర్షణలు- టబొ మొనాస్టెరీ, టబొ కేవ్స్‌, కిబ్బెర్‌, కీ మొనాస్టెరీ, చంద్రతాళ్‌ లేక్‌, స్పిటి రివర్‌.

Photo Courtesy: Bot

ఉదయపూర్‌

ఉదయపూర్‌

రొమాంటిక్‌ సిటీల్లో ఒకటిగా పేరుంది. ‘సిటీ ఆఫ్‌ లేక్స్‌'గా ప్రసిద్ధి. రాజస్థాన్‌లోని అందమైన నగరమిది. ప్రకృతి ప్రేమికులు, వారసత్వ సంపదలను ఇష్టపడే వారికి ఈ ప్రదేశం బాగా నచ్చుతుంది. ఆగస్టు నెలలో ఇక్కడి వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది.

ఇక్కడ ప్రధాన ఆకర్షణలు- సిటీ ప్యాలెస్‌, లేక్‌ పిచోల, ఫతేసాగర్‌ లేక్‌, మాన్‌సూన్‌ ప్యాలెస్‌, గులాబ్‌ బాగ్‌, మోతి మగ్రీ.

Photo Courtesy: Slick-o-bot

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Nativeplanet sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Nativeplanet website. However, you can change your cookie settings at any time. Learn more