Search
  • Follow NativePlanet
Share
» »వీకెండ్ లో హైదరాబాద్ ను విడిచి ఇక్కడ విహరిద్దాం.

వీకెండ్ లో హైదరాబాద్ ను విడిచి ఇక్కడ విహరిద్దాం.

హైదరాబాద్ లోని ట్రాఫిక్ ను ఛేదించుకొని ఆఫీసును చేరుకొనే సరికి పద్మవ్యూహాన్ని ఛేదించిన అభిమన్యుడి వలే మనం ఫీలవుతుంటాం. ఇక ఆఫీసులో కొండను తలపించే పనితో ఇంటికి వెళ్లినా మనకు నిద్ర కరువయ్యే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఎందుకంటే అందుబాటులోకి వచ్చిన ల్యాప్ ట్యాప్ వల్ల ఆఫీసుపని, ఇంటికి కూడా మనతో పాటు వచ్చేస్తుంది. ఇంత చేసినా ఆఫీసులో పై స్థాయి అధికారులతో తిట్లు, చివాట్లు తప్పడం లేదు. ఇవన్నీ మనలో అందరికీ ఎప్పుడో ఒకసారి అనుభవమే కదా.

ఈ అనుభవాల నుంచి దూరంగా ప్రకృతికి దగ్గరగా మమేకం కావడానికి అవసరమైన పర్యాటక ప్రాంతాల్లో ముఖ్యమైన వాటిని మీకు అందిస్తున్నాం. మరెందుకు ఆలస్యం వచ్చే వీకెండ్ లేదా అటు పై వీకెండ్ ఏదో ఒక ప్రాంతానికి వెళ్లి రోటీన్ ఆఫీస్ పని నుంచి కొంత మానసిక, శారీరక పని నుంచి ఉల్లాసాన్ని పొందండి.

మారేడుమిల్లి, రంపచోడవరం

మారేడుమిల్లి, రంపచోడవరం

P.C: You Tube

మారేడుమిల్లి, రంపచోడవరంలో అందమైన జలపాతాలను చూడటానికి వీలువుతుంది. ముఖ్యంగా వర్షాలు ప్రారంభమైన ఈ జూన్ నెల చివరి నాటికి లేదా జులై నెల మొదటివారంలో ఈ జలపాతాల్లో తెల్లని నురుగులు గగ్గుతూ అంతెత్తు నుంచి కిందికి పడే జలపాతాలను చూస్తూ వారం మొత్తం పడిన శ్రమను ఇట్టే మరిచిపోవచ్చు. హైదరాబాద్ నుంచి ఇక్కడకు వెళ్లే సమయంలో ఈ రెండు జలపాతాలనే కాకుండా జలతరంగిణి, స్వర్ణధార వంటి అనేక జలపాతాలను కూడా పలకరించవ్చు. అంతేకాకుండా అందమైన ఉద్యానవనాలు కూడా మనకు ఎదురవుతాయి.

ఎంత దూరం.....హైదరాబాద్ నుంచి 450 కిలోమీటర్ల దూరంలో ఈ రెండు జలపాతాలు ఉంటాయి.

కర్నూలు

కర్నూలు

P.C: You Tube

హైదరాబాద్ నుంచి కర్నూలు ప్రయాణం చాలా ఆహ్లాదకరంగా సాగుతుంది. మధ్యలో అనేక వన్యప్రాణుల అభయారణ్యాలు, గుహాలయాలును మీకు ఎదురవుతాయి. ఇక తుంగభద్రనది ఒడ్డున ఉన్న కర్నూలులో కూడా భారదేశ చరిత్రకు ఆనవాలమైన అనేక రకాల కట్టడాలు మనలను పలకరిస్తాయి. ముఖ్యంగా కొండారెడ్డు బురుచు, ఓర్వకల్లు రాక్ గార్డ్ భారత దేశ ముఖ్యంగా రాయలసీమ చరిత్రకు సజీవ సాక్షాలు. ఇక కర్నాలు దగ్గర్లోని సంగమేశ్వర ఆలయం మనకు భారతీయ పురాణాలకు సంబంధించిన ఎన్నో కథలు చెబుతుంది.

ఎంత దూరం....హైదరాబాద్ నుంచి 213 కిలోమీటర్ల దూరంలో ఈ నగరం ఉంటుంది.

బాదామి

బాదామి

P.C: You Tube

భారతీయ శిల్పకళకు సజీవసాక్షమైన బాదామిలో అద్భుత గుహాలయాలు ఉన్నాయి. ఈ బాదామిని వాతాపి అని కూడా అంటారు. కొండను తొలిచి నిర్మించిన గుహాలయాలను చూస్తూ సమయాన్ని మనం ఇట్టే గడిపేయవచ్చు. ఒక్కొక్క శిల్పం ఒక్కొక్క శైలిలో ఉంటూ ఆ శిల్ప సౌదర్యం మన కంటికి ఇంపును కలిగిస్తుందని చెప్పడం అతిశయోక్తి కాదు. ఇక్కడ ఉన్న కోటలు దేవాలయాలు కూడా చూడదగిన పర్యాటక ప్రాంతాలు. ముఖ్యంగా భూతనాథ్ దేవాలయం, మల్లికార్జున దేవాలయం, దత్తాత్తేయ దేవాలయం ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణలు.

ఎంత దూరం....కర్నాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలోని బాదమిని చేరుకోవడానికి హైదారాబాదు నుంచి 424 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయాల్సి ఉంటుంది.

గుల్బర్గా

గుల్బర్గా

P.C: You Tube

గుల్బర్గాను కలబుర్గీ అని కూడా అంటారు. నిజాం ఏలుబడిలో ఈ ప్రాంతం అప్పట్లో ఒక వెలుగు వెలిగింది. ముఖ్యంగా భారత దేశ చరిత్రను చెప్పే ఎన్నో భవనాలను ఇక్కడ మనం చూడవచ్చు. అదేవిధంగా శిథలమైన కోట గోడలు కూడా ఇక్కడ ప్రధాన ఆకర్షణ. వీటితో పాటు బహమనీ సుల్తానుల అందమైన సమాధులను మనం ఇక్కడ చూడవచ్చు. సమాధులను చూడటం ఏమిటీ అని మీకు అనుమానం రావచ్చు. అయితే ఆ సమాధులు అందమైన భవనాల వలే నిర్మించారు. అందుకే 14 శతాబ్దంలో ఏర్పాటు చేసిన ఆ సమాధులు ఇప్పటికీ దేశంలోని నలుమూలల నుంచి పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. అదే విధంగా గుల్బార్గాలో ప్రపంచ ప్రఖ్యాతి చెందిన జామా మసీదును చూడటం మరిచిపోకూడదు. ఈ ఒక్క మసీదుకే 80 టోంబ్స్ ఉండటం గమనార్హం.

ఎంత దూరం....హైదరాబాద్ నుంచి గుల్బర్గాకు 234 కిలోమీటర్ల దూరం ఉంటుంది.

పట్టదకల్

పట్టదకల్

P.C: You Tube

మలప్రభ నది ఒడ్డున ఉన్న పట్టదకల్ మునెస్కో గుర్తించిన ప్రపంచ వారసత్వ సంపదల్లో ఒకటి. చాళుక్యుల శైలి శిల్పకళతో శోభిల్లుతున్న అనేక దేవాలయాలు పట్టదకల్ లో మనం చూడవచ్చు. ఇక్కడ హిందూ, బౌద్ధ, జైన దేవాలయాలు కనిపిస్తాయి. ముఖ్యంగా విరూపాక్ష దేవాలయం చూడదగినది.

ఎంత దూరం....కర్నాటకలోని బాగల్ కోటే జిల్లాలో ఉన్న పట్టదకల్ ను చేరుకోవడానికి హైదరాబాద్ నుంచి 398 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయాలి. ఇక ఈ పట్టదకల్ బాదమి నుంచి కేవలం 22 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X