Search
  • Follow NativePlanet
Share
» » వీకెండ్ ను సరదాగా గడపాలనుకొంటున్నారా మీ కోసమే ఈ కథనం

వీకెండ్ ను సరదాగా గడపాలనుకొంటున్నారా మీ కోసమే ఈ కథనం

బెంగళూరుకు దగ్గరగా ఉన్న పర్యాటక ప్రాంతాలకు సంబంధించిన కథనం.

చిన్నపిల్లలమయితే ఎంత బాగుంటుంది. ఇటువంటి ఆలోచన రాని పెద్దవారు ఉండరంటే అతిశయోక్తి కాదు. కాంక్రీట్ జంగిల్ వంటి మహానగరాల్లో ట్రాఫిక్ పద్మవ్యూహాన్ని ఛేదించుకుని వారంలో ఐదు రోజులు నాలుగు గోడల మధ్య కుర్చీలకు అతుక్కుపోయి పనిచేయడం మనకందరికీ అలవాటే. ఇక టార్గెట్ లు వాటిని చేరుకోవడానికి పడే తిప్పలు అన్నీ ఇన్నీకావు.

ఇంత చేసినా బాస్ ఇచ్చిన టార్గెడ్ మనకు ఎప్పుడూ అందనంత ఎత్తులోనే ఉంటుంది. దీంతో వారాంతానికి ముందు రోజు అంటే శుక్రవారం లేదా నెలాఖరులో 'అక్షింతలు’ తప్పనిసరి. ఈ నేపథ్యంలో ఈ గొడవలన్నీ మరిచిపోయి ప్రకృతిలో మమేకమవుతూ వీకెండ్ ను గడపాలనుకోనివారు బెంగళూరులో ఉండరంటే అతిశయోక్తి కాదు.

అందువల్లే బెంగళూరుకు అతి దగ్గరగా ఉన్న కొన్ని పర్యాటక ప్రాంతాల వివరాలు మీ కోసం అందిస్తున్నాం. మరెందుకు ఆలస్యం చదివి ఈ వీకెండ్ లేదా వచ్చే వీకెండ్ లో ఏదో ఒక ప్రాంతానికి వెళ్లేలా ప్లాన్ చేసుకోండి.

మైసూరు

మైసూరు

P.C: You Tube

బెంగళూరుకు అతి దగ్గరగా ఉన్న వీకెండ్ పర్యాటక ప్రాంతాల్లో మైసూరుది మొదటి స్థానం అని చెప్పడం తప్పుకాదు. పురాణ, చారిత్రాత్మకంగా ప్రాముఖ్యత చెందిన ఈ పట్టణంలో ప్రకృతి ప్రేమికులకు ఇష్టమైన ఎన్నో ప్రాంతాలకు కొదువులేదు.

దూరం ........ బెంగళూరు నుంచి 150 కిలోమీటర్ల దూరం

ప్రయాణం ఎలా.......బెంగళూరు నుంచి నేరుగా ట్రైన్ సదుపాయం ఉంది. అదేవిధంగా ప్రభుత్, ప్రైవేటు, బస్సులు, క్యాబ్ లు అందుబాటులో ఉన్నాయి. చాలా మంది బైక్ ల ద్వారా కూడా ఈ పట్టణానికి వెలుతుంటారు.

ఏమేమి చూడవచ్చు.....మైసూర్ ప్యాలెస్, మైసూర్ జూ, బృందావన్ గార్డెన్స్, జగన్మోహనప్యాలెస్, చాముండేశ్వరీ హిల్స్, రైల్ మ్యూజియం, వ్యాక్స్ మ్యూజియం, సెయింట్ ఫిలోమినా చర్చ్

కూర్గ్

కూర్గ్

P.C: You Tube

ప్రకృతి ప్రేమికులు ఎంతగానో ఇష్టపడే పర్యాటక ప్రాంతాల్లో కూర్గ్ మొదటిస్థానంలో ఉంటుంది. బెంగళూరు నుంచి కేవలం ఒక రోజు రాత్రి ప్రయాణంలో కూర్గ్ ను చేరుకోవచ్చు. పచ్చని కనుచూపుమేర పచ్చటి చెట్లు ఉన్న కూర్గ్ పశ్చిమ కనుమల్లో ప్రముఖ హిల్ స్టేషన్. ఇక్కడ మూడు అభయారణ్యాలు ఉన్నాయి. విభిన్న జంతు, పక్షి, వృక్ష జాతులను ఎన్నింటినో మనం ఇక్కడ చూడవచ్చు.

దూరం ........ బెంగళూరు నుంచి 263 కిలోమీటర్ల దూరం

ప్రయాణం ఎలా.......బెంగళూరు నుంచి రోడ్డు మార్గం ద్వారా ప్రయాణం ఉత్తమం

ఏమేమి చూడవచ్చు.....గోల్డెన్ టెంపుల్, తలకావేరి, అబ్బేఫాల్స్, దుబారే ఎలిఫెంట్ క్యాంప్, నాగర్ హోల్ నేషనల్ పార్క్, ఇడుప్పు ఫాల్స్

ఊటి

ఊటి

P.C: You Tube

హిల్ స్టేషన్లలో ఊటిని రాణిగా అభివర్ణిస్తారు. ఇక్కడి టీ, చాకోలేట్ లతో పాటు ప్రకృతి మన మనస్సులను ఉల్లాసపరుస్తుంది. ఇక్కడికి ఒక్కసారి వెళితే అక్కడి వాతావరణం మన మనస్సులను మరొక్కసారి...మరొక్కసారి అంటూ అటువైపు లాగుతూ ఉంటుంది.

దూరం ........ బెంగళూరు నుంచి 270 కిలోమీటర్ల దూరం

ప్రయాణం ఎలా.......బెంగళూరు నుంచి రోడ్డు మార్గం ద్వారా ప్రయాణం ఉత్తమం. రైలు సౌకర్యం కూడా అందుబాటులో ఉంది.

ఏమేమి చూడవచ్చు.....బొటానికల్ గార్డెన్, రోజ్ గార్డెన్, వ్యాక్స్ మ్యూజియం, నీలగిరి మౌంటైన్ రైల్వే లైన్, ఊటి లేక్ లో బోటింగ్ వీటితో పాటు మరెన్నింటినో మనం ఇక్కడ చూడవచ్చు.

పాండిచ్చేరి

పాండిచ్చేరి

P.C: You Tube

చరిత్రతో పాటు ప్రకృతితో మమేకం కావాలనుకొనేవారికి పాండిచ్చేరి ఉత్తమమైన ప్రాంతం. ఇక్కడ విభిన్న సంస్కృతి కనిపిస్తుంది. పురాతన దేవాలయాలు, చర్చిలతో పాటు అందమైన భవంతులను కూడా చూడవచ్చు. ఇక ఇక్కడి బీచ్ లను ఉల్లాసానికి కేరాఫ్ అడ్రస్ గా చెప్పవచ్చు. పాండిచ్చేరిలోని చాలా బీచ్ లలో స్కూబా డైవింగ్ కూడా అందుబాటులో ఉంది.

దూరం ........ బెంగళూరు నుంచి 321 కిలోమీటర్ల దూరం

ప్రయాణం ఎలా.......బెంగళూరు నుంచి రోడ్డు, రైలు మార్గాల ద్వారా పాండిచ్చేరిని చేరుకోవచ్చు.

ఏమేమి చూడవచ్చు.....పాండిచ్చేరి బొటానికల్ గార్డెన్, రాక్ బీచ్, బెసిలికా చర్చ్, రొమైన గ్రంథాలయం తదితరాలు

మంగళూరు

మంగళూరు

P.C: You Tube

మంగళూరు అన్న తక్షణం మనకు గుర్తుకు వచ్చేది బీచ్ లే. అయితే మంగళూరులో ఈ బీచ్ లతో పాటు చూడదగ్గ పురాణ, ఆధ్యాత్మిక ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. దీనిని కర్నాటక గేట్ వే అని కూడా అంటారు. కర్నాకట సంప్రదాయ వంటకాలకు మంగళూరు పెట్టింది పేరు. ముఖ్యంగా సముద్ర చేపలు, రొయ్యలు, పీతలతో వండే పదార్థాలు చాలా రుచికరంగా ఉంటాయి.

దూరం ........ బెంగళూరు నుంచి 350 కిలోమీటర్ల దూరం

ప్రయాణం ఎలా.......బెంగళూరు నుంచి రోడ్డు, రైలు మార్గాల ద్వారా పాండిచ్చేరిని చేరుకోవచ్చు. మంగళూరుకు బెంగళూరు నుంచి విమానయాన సర్వీసులు అందుబాటులో ఉన్నాయి.

ఏమేమి చూడవచ్చు..... తన్నీర్ బావి బీచ్, మంగళదేవి దేవాలయం, పన్నంబూర్ బీచ్, సీతాకోక చిలుక పార్క్, సోమేశ్వర దేవాలయం, లైట్ హౌస్ తదితరాలు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X