Search
  • Follow NativePlanet
Share
» »జులై, ఆగస్టు నెలల్లో ఈ పర్యాటక ప్రాంతాల అందాలు ద్విగుణీకృతం

జులై, ఆగస్టు నెలల్లో ఈ పర్యాటక ప్రాంతాల అందాలు ద్విగుణీకృతం

జులై, ఆగస్టు నెలల్లో భారత దేశంలో చూడదగిన పర్యాటక ప్రాంతాలకు సంబంధించిన కథనం.

కొన్ని పర్యాటక ప్రాంతాలు ఎప్పుడూ చూసిన ఒకే రకంగా ఉంటాయి. మరికొన్ని ప్రాంతాలు వాతావరణంలో వచ్చే మార్పులకు అనుగుణంగా తమ అందాలను ద్విగుణీకృతం చేసుకొంటాయి. ముఖ్యంగా వర్షాలు
పడే సమయంలో కొన్ని ప్రాంతాల అందాలు పర్యాటకులను మంత్ర ముగ్దులను చేస్తూ ఉంటాయి. ఈ నేపథ్యంలో దేశంలో పలు ప్రాంతాల్లో ఈ జులై, ఆగస్టు నెలల్లో వర్షాలు పడి అక్కడి ప్రకృతిని అందాల మయం చేస్తున్నాయి.

అందువల్లే ఈ నెలల్లో అక్కడకు వెళ్లే పర్యాటకుల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. ఈ నేపథ్యంలో జులై, ఆగస్టు నెలల్లో భారత దేశంలో అత్యంత సుందరంగా మారిపోయే ఐదు పర్యాటక ప్రాంతాలకు సంబంధించిన వివరాలు మీ కోసం. మరెందుకు ఆలస్యం చదవి అక్కడకు వెళ్లడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకోండి.

లడక్

లడక్

P.C: You Tube

జమ్ము కాశ్మీర్ లోని ఈ ప్రాంతం జులై నెలలో కొంత అందాలను సంతరించుకొని పర్యాటకులను ఆహ్వానం పలుకుతోంది. ఈ ఆందాలు ఆగస్టు వరకూ ఉంటాయి. ముఖ్యంగా ఒంటరిగా ద్విచక్రవాహనం పై రోడ్డు ప్రయాణాలను ఇష్టపడే వారు ఎక్కవుగా ఈ హిల్ స్టేషన్ కు వస్తూ ఉంటారు. ఇందులో యువత సంఖ్య ఎక్కువ. ఇక్కడ ట్రెక్కింగ్ తోపాటు అందమైన సరస్సుల్లో బోటింగ్ కు కూడా అవకాశం ఉంది.

వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్

వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్

P.C: You Tube

సముద్రమట్టానికి దాదాపు 3,858 మీటర్ల ఎత్తులో ఉన్న వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ లో రంగురంగుల పుష్పాలు ఈ జులై, ఆగస్టు నెలల్లోనే వికసించి ఆ ప్రాంతానికి కొత్త అందాలను తీసుకువస్తాయి. ఈ ప్రాంతాన్ని దేవతలు
నాట్యం చేసే ప్రాంతంగా అభివర్ణిస్తారు. వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ యునెస్కో వారి సంరక్షించబడే ప్రాంతాల్లో కూడా చోటు సంపాదించుకొంది. ఉత్తరాఖండ్ లోని ఈ ప్రాంతం ప్రక`తి ఆరాధకులకు స్వర్గధామం

ఉదయ్ పూర్

ఉదయ్ పూర్

P.C: You Tube

రాజస్థాన్ లోని ఈ ఉదయ్ పూర్ మిగిలిన సమయాల్లో కొంత ఉక్కపోత వాతావరణాన్ని కలిగి ఉన్నా జులై, ఆగస్టు నెలల్లో వర్షాల వల్ల ఆహ్లాదకరమైన వాతారణాన్ని కలిగి ఉంటుంది. ముఖ్యంగా సరస్సుల నగరంగా పేరుగాంచిన ఈ ఉదయ్ పూర్ లో సరస్సులు కొత్త వర్షాపు నీటితో కళ కళ లాడుతూ ఉంటాయి. ఇక్కడ సిటీ లేక్, లేక్ పిచోలి లో బోటు షికారు జీవితంలో మరిచిపోలేని అనుభూతిని మిగులుస్తాయి.

గ్యాంగ్ టక్

గ్యాంగ్ టక్

P.C: You Tube

సిక్కిం రాజధాని అయిన ఈ పర్వత ప్రాంత నగరం జులైలో వచ్చే వర్షాల వల్ల ఇక్కడి చెట్లు కొత్త అందాలను సంతరించుకొంటాయి. పచ్చటి మైదాలను కనువిందును చేస్తాయి. ఇక్కడ అంతగా పర్యాటకులు లేకపోవడం వల్ల మీ పర్యాటకం చాలా ఆహ్లాదకరంగా సాగిపతుంది. అందువల్లే సిక్కిం పర్యాటకానికి చాలా వరకూ జులై, ఆగస్టు నెలల్లోనే ఎక్కువ మంది వెలుతుంటారు. ఇక్కడ నాథులా, రుమ్ టెక్ మాంటిస్సోరి, కిచియోపాల్రీ లేక్ వంటివి చూడదగిన ప్రాంతాలు.

పాంచ్ గని

పాంచ్ గని

P.C: You Tube

పాంచ్ గని మహారాష్ట్రలోని ప్రముఖ హిల్ స్టేషన్. ఇక్కడ జులై, ఆగస్టులో కనుచూపుమేర పచ్చదనం పర్యాటకులకు కనువిందును కలిగిస్తుంది. ట్రెక్కింగ్ కోసం ఎక్కువ మంది మహారాష్ట్రలో ఈ ప్రాంతాన్ని ఎంచుకొంటారు. ఇక్కడ రాజ్ పురి గుహలు, పార్సీ పాయింట్ తో పాటు ఎన్నో ధార్మిక ప్రదేశానలు కూడా మనం చూడవచ్చు. పూనే ఎయిర్ పోర్ట్ నుంచి పాంచ్ గని 92 కలోమీటర్ల దూరంలో ఉంటుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X