Search
  • Follow NativePlanet
Share
» »మన ఆంధ్రాలో ఉన్న వరల్డ్ ఫేమస్ టెంపుల్స్ ఇవే..!

మన ఆంధ్రాలో ఉన్న వరల్డ్ ఫేమస్ టెంపుల్స్ ఇవే..!

మన ఇండియాలో ఆంధ్రప్రదేశ్ 4వ అతి పెద్ద రాష్ట్రం. ఆంధ్రప్రదేశ్ ఆధ్యాత్మిక ప్రదేశాలకు నెలవు. ముఖ్యంగా తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం తెలియని వారంటూ ఉండరు. ప్రపంచంలోనే అతి పెద్ద దేవాలయం. చాల

మన ఇండియాలో ఆంధ్రప్రదేశ్ 4వ అతి పెద్ద రాష్ట్రం. ఆంధ్రప్రదేశ్ ఆధ్యాత్మిక ప్రదేశాలకు నెలవు. ముఖ్యంగా తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం తెలియని వారంటూ ఉండరు. ప్రపంచంలోనే అతి పెద్ద దేవాలయం. చాలా వరకూ ఆంధ్ర ప్రదేశ్ లోని దేవాలయాన్ని విజయనగర సామ్రాజ్య రాజుల కాలంలో కట్టినవే. ఈ దేవాలయాల నిర్మాణంలో శిల్పశైలి చాలా అద్భుతంగా ఉంటాయి. పర్యాటకు సందర్శించే ఈ ప్రదేశాలలో వివిధ రకాల పండగలు జరుపుతుంటారు.

ఆథ్యాత్మిక రంగంలో తీర్థయాత్రలు గొప్ప నైతిక ప్రాముఖ్యం కలిగినవి. పర్యాటక రంగం యొక్క ముఖ్య ఉద్దేశ్యం దేవాలయాలకు, మసీదులకు, చర్చ్ లకు తీర్థయాత్రలు నిర్వహించడం. తీర్థయాత్రా స్థలాల్లో గొప్ప వైవిధ్యం కలిగించే దేవాలయాలు మరియు విగ్రహాలు ప్రసిద్ది చెందాయి. తీర్థయాత్రా స్థలాలు గొప్ప సంప్రదాయాలకు, వారసత్వ సంపదకు, చారిత్రక ప్రాముఖ్యతకు ప్రసిద్ధి చెందాయి. తీర్థ యాత్ర ప్రదేశాలకు వెళ్ళడం అంటే ఒక పవిత్ర ప్రదేశాన్ని సందర్శించడం. ఈ యాత్రా ప్రయాణాల్లో ఒక నమ్మకాన్ని, విశ్వాసాన్ని కలిగి ఉండటం.

మన భారత దేశంలో ప్రతి మతంలోనే యాత్రా ప్రదేశాలున్నాయి, ప్రతి యాత్రికుడు యాత్రలలో పాల్గొంటారు. యాత్రా ప్రదేశాలకు ప్రయాణం చేసే వారికి

యాత్రికులు అని అంటారు. ఆంధ్రప్రదేశ్ లో యాత్ర స్థలాలకు సంబంధించిన కొన్ని ప్రదేశాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం..

1. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి:

1. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి:

తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామిగా పిలిచే శ్రీ బాలాజీ కలియుగ దైవం శ్రీ మహావిష్ణువు రూపమే. చిత్తూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ లో ఉంది. ఇండియాలోనే అత్యంత ముఖ్యమైన తీర్థయాత్ర ప్రదేశాల్లో తిరుమల తిరుపతి శ్రీ బాలాజీ టెంపుల్ ఏడుకొండలపైన కొలువుదీరి ఉన్నాడు. ఈ సప్తగిరుల్లో ఏడుకొండల స్వామి వారికి గుడి కట్టించింది తమిళ రాజైన తోండైమాన్.

1. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి:

1. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి:

తీర్థయాత్ర చేయడానికి ప్రసిద్ది చెందిన దేవాలయం అందుకే ప్రపంచంలోని నలుమూల నుండి యాత్రికులు, భక్తులు ఇక్కడి వచ్చి శ్రీవెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటుంటారు. ఇక్కడ ప్రసాదంగా అందించే లడ్డు అద్భుత రుచి నోరూరిస్తుంటుంది.

PC: youtube

శ్రీ శైలం:

శ్రీ శైలం:

శ్రీ శైలం శ్రీ మల్లికార్జునస్వామి. ఆంధ్రప్రదేశంలో టాప్ టెంపుల్స్ లో శ్రీశైలం ఒకటి. శివుడి యొక్క 12 జోతిర్లింగాలలో శ్రీశైలం ఒకటి. ఇది కర్నూల్ జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. హైద్రాబాద్ నుండి శ్రీశైలంకు వీకెండ్ గేట్ వే కు చాలా ప్రసిద్ది చెందిన దేవాలయం .

P.C: ADibyendu Jagatdev

శ్రీ శైలం:

శ్రీ శైలం:

ఈ శైవ క్షేత్రంలో హరహర మహదేవ శంభో శంకరా అంటూ భక్తుల గొంతులతో మారుమ్రోగుతూ నల్లమల అడవుల్లో కొండల మద్యగల శ్రీ మల్లికార్జునని పవిత్ర క్షేత్రం. ఇక్ష్వాకులు, పల్లవులు, విష్ణుకుండినులు, చాళుక్యులు, కాకతీయులు, రెడ్డిరాజులు , విజయనగర రాజులు, శివాజీ వింటి ఎందరో సేవలు చేసిన ఈ క్షేత్రాన్ని తప్పకదర్శించాల్సిందే.

pc:youtube

విజయవాడ:

విజయవాడ:

విజవాడ కనకదుర్గమ్మ తల్లి చాలా ఫేమస్. ఆంధ్రప్రదేశ్ లో రెండవ అతి పెద్ద నగరం. క్రిష్ణానది ఒడ్డున ఇంద్రకీలాద్రిపై శ్రీ కనక దుర్గమ్మ టెంపుల్ ఉంది. ఆంధ్రాలో చూడదగ్గ అతి ముఖ్యమైన యాత్రా స్థలాల్లో విజయవాడ కనకదుర్గమ్మ దేవాలయం.
P.C:Sridhar1000

విజయవాడ:

విజయవాడ:

8వ శతాబ్దానికి చెందిన వారు ఈ ఆలయాన్ని శ్రీ దుర్గా మల్లీశ్వర స్వామి ఆలయం అని పిలుస్తారు. మహిషాసుర మర్ధిని రూపంలో ఎనిమిది చేతులతో ఇంద్ర కీలాద్రి పై దుర్గామాత మహిషాసురాను హతమార్చిందని చెబుతారు. ఇటువంటి పుణ్యక్షేత్రంను తప్పక సందర్శించాలి.
PC:Youtube

 కాణిపాకం:

కాణిపాకం:

ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలో కాణిపాకం పుణ్యక్షేత్రం ఉంది. కోరిన వారి కోరికలను తీర్చే శ్రీ వరసిద్ది వినాయ టెంపుల్ ఇక్కడ చాలా ఫేమస్. ఈ ఆలయాన్ని చోళుల కాలంలో నిర్మింపబడినది. ఈ కాణిపాకం టెంపుల్ చాలా ఫేమస్, పురాతన కాలం నాటి ఈ ఆలయాన్ని లార్డ్ వినాయకునికి అంకితమివ్వబడినది.
P.C: విశ్వనాధ్.బి.కె.

 కాణిపాకం:

కాణిపాకం:

పురాణ శాస్త్రం ప్రకారం ఇక్కడ వినాయకుడు స్వయంగా వెలిసినాడని చెబుతుంటారు. ఆ ఆలయం యొక్క రహస్యం ఏంటంటే ఈ ఆలయంలోని వినాయకుడి విగ్రం కొద్దికొద్దిగా పెరుగుతుంటుందని చెబుతుంటారు.

P.C: విశ్వనాధ్.బి.కె.

.శ్రీ కాళహస్తి:

.శ్రీ కాళహస్తి:

శ్రీ కాళహస్తి, కాళహస్తిగా బాగా ప్రసిద్దిగాంచినది .సౌత్ ఇండియాలో అత్యంత ముఖ్యమైన శివుని క్షేత్రాలలో కాళహస్తి ఒకటి. చిత్తూరు జిల్లాలోని స్వర్ణముఖి నదీపై వెలసిన దేవాలయం. కాళహస్తిలో శ్రీ కాళహస్తి దేవాలయం చాలా ప్రసిద్ది.
P.C: You Tube

శ్రీ కాళహస్తి:

శ్రీ కాళహస్తి:

ఈ నగరం పేరు మూడు పదాల నుండి తీసుకొనబడినది. శ్రీ అంటే సాలీడు, కాళ అంటే సర్పం, హస్తి అనగా ఏనుగు. ఈ మూడు జీవులు ఇక్కడ శివుడిని పూజించి మోక్షం పొందారని ఇక్కడి వారు నమ్ముతారు. శ్రీ కాళహస్తి శివుడి యొక్క పంచభూత స్థలాలలో ఒకటిగా పరిగణించబడినది. మరో నాలుగు తురువన్నామలై, తిరువానైకావల్, చిదంబరం మరియు కాంచీపురంలో ఉన్నాయి.

P.C: You Tube

అన్నవరం:

అన్నవరం:

ఆంధ్రప్రదేశ్ లోని ఈస్ట్ గోదావరి జిల్లాలో పంపానది ఒడ్డున అన్నవరం గ్రామం ఉంది. ఇక్కడ శ్రీ సత్యనారాయణస్వామి ఆలయానికి చాలా ప్రసిద్ది. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పుణ్యక్షేత్రాల్లో అన్నవరం కూడా ప్రసిద్ది చెందిన తీర్థయాత్రా స్థలం. ఇక్కడ సత్యనారాయణ స్వామికి వ్రతం చేస్తే చాలా మంచి జరుగుతుందని భక్తుల విశ్వాసం.
P.C: benharlanes

అన్నవరం:

అన్నవరం:

ఈ దేవాలయాన్ని 1891లో ద్రావిడ శైలిలో నిర్మించారు. వీర వెంకట సత్యనారాయణ స్వామి ఆలయం రత్నగిరి కొండ పైన ఉంది. నాలుగు దేవాలయాలలో నాలుగు చక్రాలు కలిగిన రథం రూపంలో ప్రధాన ఆలయం నిర్మించబడింది. ఈ ఆలయం రెండు అంతస్తులలో నిర్మించబడింది. అంతస్తులో యంత్రము మరియు సత్యనారాయణస్వామి యొక్క పీఠం ఉన్నాయి.

P.C: vinayvarma4u

సింహా చలం:

సింహా చలం:

ఆంద్రప్రదేశ్ లోని యాత్ర స్థలాల్లో మరో దర్శించదగ్గ ప్రదేశం సింహాద్రి లేదా సింహాచలం. ఈ హిందు దేవాలయం విశాఖపట్నం నగర శివార్లలో వెలసిన హిందూ దేవాలయం. సింహాచలం శ్రీ వరహా నరసింహస్వామి ఆలయం నరసింహ స్వామికి అంకితం చేయబడింది.
pc:Adityamadhav83

సింహా చలం:

సింహా చలం:

సింహాచల కొండపైన ఉన్నది శ్రీ మహావిష్ణువు అవతారం. ఈ ఆలయం 1098 లో చోళ రాజు, కులోతుంగ చోళ ద్వారా నిర్మించబడినట్లు భావిస్తున్నారు. కళింగ రాణి విగ్రహానికి బంగారు కవచం బహుమతిగా ఇచ్చింది. సింహాచలం టెంపుల్ ఆంధ్రప్రదేశ్ లోని ధనిక దేవాలయాలలో ఒకటి.
PC:Adityamadhav83

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X