» »బెళగావిలో తప్పనిసరిగా సందర్శించవలసిన ఏడు స్థలాలు

బెళగావిలో తప్పనిసరిగా సందర్శించవలసిన ఏడు స్థలాలు

Posted By: Venkata Karunasri Nalluru

నార్త్ కర్నాటకను ఉత్తర కర్నాటక అని కూడా పిలుస్తారు. ఇది ఒక అద్భుతమైన చరిత్ర మరియు సంస్కృతి గల ప్రదేశం. ఇక్కడ "చారిత్రక ప్రదేశాలు మరియు స్మారక చిహ్నాలు" అనేకం వున్నాయి. ప్రతి ఒక్క ప్రదేశానికి ఒక అద్భుతమైన కథ, వ్యాఖ్యానం వుంటుంది.

ఇది కూడా చదవండి: బెలగావిలో సందర్శించదగిన స్థలాలు

కృష్ణానది దాని ఉపనదులైన భీమ, ఘటప్రభ, మాలప్రభలతో కలిసి ఉత్తర కర్ణాటకలోని సెమీ శుష్క పీఠభూమి గుండా ప్రవహిస్తుంది. అయితే బెల్గాం జిల్లాలో వాతావరణం ఎక్కువగా పొడిగా వుంటుంది. కానీ ఇక్కడ భారీ వర్షాలు కూడా కురుస్తాయి. ఇక్కడ పచ్చని అడవులతో నిండి ఉంటుంది. బెలగావి మహారాష్ట్ర, గోవా సరిహద్దులలో గల అందమైన ప్రాంతం.

బెళగావి చరిత్ర

బెళగావి చరిత్ర

ప్రస్తుతం వున్న బెళగావి రత్త రాజవంశం క్రీ.శ. 12 వ శతాబ్దంలో నిర్మించారు. బెల్గాం యాదవులు రత్త పాలకులు ఓడించక ముందు క్రీ.శ. 1210-1250 మధ్య పరిపాలకులకు కూడా ఒక రాజధాని నగరం. బెళగావిని హొయసలులు మరియు విజయనగర సామ్రాజ్యంతో పాటు కిల్జీస్ మరియు ఆదిల్ షాహిస్ వీటిలో వివిధ రాజులు పరిపాలించారు.

PC : Belagavi Official Website

మిగిలిన చరిత్ర

మిగిలిన చరిత్ర

అద్భుతమైన చరిత్ర, సంస్కృతి మరియు వారసత్వం గల ఒక సుందరమైన వీక్షణ. అందమైన జలపాతాలు గల బెళగావిని అందరూ తప్పనిసరిగా సందర్శించాల్సిన ప్రదేశం.

PC : MohsinKhadri

1. గోకాక్ జలపాతాలు

1. గోకాక్ జలపాతాలు

బెలగావి నుండి దూరం - 73.2 కిలోమీటర్లు

ఘటప్రభ నదిపై గోకాక్ పట్టణానికి 6 కిలోమీటర్ల దూరంలో మంత్రముగ్దులను చేసే గోకాక్ జలపాతాలు ఉన్నాయి. జలపాతం గుర్రం షూ ఆకారంలో కలిగివుంటుంది. జలపాతం వర్షాకాలంలో పూర్తిగా అలలతో నిండి వుంటుంది. ఈ జలపాతాలలోని నీరు ఎరుపు గోధుమ రంగులో వుంటుంది. నీరు మధురంగా నిస్తేజంగా శబ్దాలు చేస్తూ ప్రవహిస్తూ వుంటుంది ఇది చూచుటకు కన్నుల విందుగా వుంటుంది. అక్కడ జలపాతాలలో రాతి ఇరుకుదారిని ఒడ్డున మచ్చల చేయవచ్చు చాళుక్యుల కాలం చెందిన కట్టడాలలో చాలా ఉన్నాయి.

PC : Shishir Kakaraddi

2. బెల్గాం ఫోర్ట్

2. బెల్గాం ఫోర్ట్

బెలగావి నుండి దూరం - 4 కిలోమీటర్లు

ఈ కోటను క్రీ.శ.1204 వ సం. లో రట్ట రాజవంశం యొక్క రాజా బిచి అనే పాలకుడు నిర్మించాడు. కర్నాటకలోని అతి పురాతన కోటలలో ఇది ఒకటి. దీనిని ప్రధానంగా ఇతర రాజ్యాల నుండి దాడులను నివారించేందుకు నిర్మించారు. కోట వెలుపల ఒక దిబ్బ ఉన్నది. కోట ప్రధాన ద్వారం క్రీ.శ. 1631 లో నిర్మించారు.

త్రవ్వకాలలో మెత్తగా వుండే ఎరుపు రాయి బయటపడినది. కోట యొక్క వాస్తు శైలి డెక్కన్ మరియు ఇండో-సార్సెనిక్ శైలుల మిశ్రమంగా వుంది.

PC : Burgess James

3. కిట్టూర్ ఫోర్ట్

3. కిట్టూర్ ఫోర్ట్

బెలగావి నుండి దూరం - 50 కిమీ

మీరు బెలగావి సందర్శించినప్పుడు కిట్టూర్ ను పరిపాలించిన ధైర్యవంతురాలు రాణి చెన్నమ్మకు సంబంధించిన ఈ స్థలంను తప్పనిసరిగా సందర్శించాలి. కిట్టూర్ ఫోర్ట్ ను బ్లాక్ బసాల్ట్ రాక్ ఉపయోగించి కిట్టూర్ సామ్రాజ్యమునకు ఐదవ పాలకుడు నిర్మించాడు. ఈ ప్యాలెస్ కోట లోపల రాణి చెన్నమ్మ నివాసం వుండేది. ప్రస్తుతం ఈ కోట పేష్వాల-ఇస్లామిక్ శైలిలో నిర్మించబడింది.

ధ్రువనక్షత్రము వీక్షించడానికి కోట లోపల ఒక ప్రత్యేక గది వుంది. కిట్టూర్ కోటలో ఒక పురావస్తు సంగ్రహాలయం కూడా ఉంది. ఇప్పుడు ఆర్కియాలజీ మరియు మ్యూజియం కర్ణాటక శాఖ ద్వారా నిర్వహించబడుతూ వుంది.

4. వజ్రపోహ ఫాల్స్

4. వజ్రపోహ ఫాల్స్

బెలగావి నుండి దూరం - 8.5 కిలోమీటర్లు

వజ్రపోహ జలపాతం జలపాతం గవలి మరియు చపోలి గ్రామాల మధ్య గల ఒక కొండ నుండి ప్రవహిస్తుంది. ఇది చూచుటకు ఎంతో మనోహరంగా వుంటుంది. పశ్చిమ కనుమల చుట్టూ గల జలపాతాలు ఋతుపవన కాలంలో (జూన్ నుంచి అక్టోబర్ వరకు) పర్యాటకులను చాలా ఆకర్షిస్తున్నాయి.

5. పరస్గడ్ ఫోర్ట్

5. పరస్గడ్ ఫోర్ట్

బెలగావి నుండి దూరం - 97 కిలోమీటర్లు

ఈ కోటను 10 వ శతాబ్దంలో రట్ట రాజవంశ పాలకులు నిర్మించారు. కోట చుట్టూ రాళ్ళు లంబాకారంగా వుంది. కోటలో అవశేషాలు కూడా ఉన్నాయి. కోట పైన చిన్న హనుమంతుని మందిరం వుంది.

PC : Manjunath Doddamani Gajendragad

6. చిఖలే ఫాల్స్

6. చిఖలే ఫాల్స్

బెలగావి నుండి దూరం - 40 కిలోమీటర్లు

చిఖలే ఫాల్స్ చిఖలే గ్రామంలో వున్నది. ఈ జలపాటం చేసే గుర్ర్ అనే శబ్దం దూరం నుండి వినవచ్చు. ఇక్కడ దట్టమైన పొగమంచు మరియు అందమైన ప్రకృతి దృశ్యాల నడుమ 2.5 కిలోమీటర్లు గల సులభమైన ట్రెక్ జలపాతాలు దారితీస్తుంది. చిఖలే జలపాతంను కాలిబాట ద్వారా పర్వాడ్ చేరవచ్చు.

PC: i.ytimg.com

7. భింగడ్ వైల్డ్ లైఫ్ సంక్చురి

7. భింగడ్ వైల్డ్ లైఫ్ సంక్చురి

బెలగావి నుండి దూరం - 35 కిలోమీటర్లు

ఈ భింగడ్ వైల్డ్ లైఫ్ సంక్చురి జంబోటి గ్రామ పశ్చిమ కనుమల్లో వుంది. ఈ ప్రాంతాన్ని ఛత్రపతి శివాజీ నిర్మించిన తర్వాత ఈ కోటకు భింగడ్ అనే పేరు పెట్టారు. అనేక రకాలైన వృక్షజాలం మరియు జంతుజాలాలు కలిగిన ఈ అభయారణ్యం బెల్గాంలో తప్పనిసరిగా సందర్శించాల్సిన ప్రదేశాలలో ఒకటి. భింగడ్ వన్యప్రాణుల అభయారణ్యంలో వాయువ్య భగవాన్ మహావీర్ మరియు మొల్లెం జాతీయ పార్క్ ఉంది.

PC : Kalyanvarma