Search
  • Follow NativePlanet
Share
» » హైదరాబాద్ లో రొమాంటిక్ ప్రదేశాలు: ప్రేమికుల రోజున ప్రేమజంటల కోసం

హైదరాబాద్ లో రొమాంటిక్ ప్రదేశాలు: ప్రేమికుల రోజున ప్రేమజంటల కోసం

ప్రేమలో పడటం ఓ మధురమైన అనుభూతి. మనసుతో ఊసులాడుకునే ఆ తీయని అనుభవాన్ని కోరుకోని యువతీయువకలు ఉంటారా? ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజు దగ్గరలో రాబోతున్నది. ప్రేమికుల రోజును ఒక వేడుకల జరుపుకునేందుకు ప్రేమ జంటలు సిద్దమైపోతారు. ఇక ఆ రోజు ఏ ప్రదేశాలకు వెళ్లాలి, ఎక్కడ గడపాలి అని ప్లాన్లు వేసుకొనే ప్రేమ పక్షులు ఎన్నో... మనసుపడ్డ వారికి మదిలోని ప్రేమను ఎక్కడ, ఎలా వ్యక్తపరిస్తే బాగుంటుందా అని ఆలోచిస్తుంటారు. అలాంటి జంటల కోసం కొన్ని ప్రత్యేకమైన ప్రదేశాలు ఉన్నాయి. ప్రకృతి అందాలు పరచుకున్న ఆ ప్రదేశాలు ప్రేమికులను అద్భుత లోకాల్లో విహరించేలా చేస్తాయి. అలాంటి ప్రదేశాలు హైదరాబాద్ ఒకటి.

హైదరబాద్ బ్యూటిఫుల్ సిటి మాత్రమే కాదు చారిత్రక కట్టడాలు రొమాంటిక్ వాతావరణం కలిగిన ప్రదేశం. వాలెంటైన్స్ డే రోజును ప్రేమ జంటలు తిరగడానికి అనేక రొమాంటిక్ ప్రదేశాలున్నాయి. ఈ ప్రదేశాలు పర్ఫెక్ట్ డేటింగ్ తో మీ పార్ట్నర్ ను సర్పైజ్ చేయవచ్చు. ప్రేమికులు మనస్సు ఆహ్లాదపరిచే విధంగా హైదరాబాల్ లో వాటర్ ఫాంట్ అట్రాక్షన్స్ చాలానే ఉన్నాయి. ఇవి ఫర్ఫెక్ట్ రొమాంటిక్ సెట్టింగ్ కలిగి ఉన్నాయి. నెక్లెస్ రోడ్ నుండి హుసేన్ సాగర్ లేక్, దుర్గం చెరువు, ఫలక్నూమా ప్యాలెస్ వరకు అద్భుతమైన ప్రదేశాలెన్నో ఉన్నాయి. ఈ ప్రదేశాలు ప్రేమను వ్యక్తపరచడానికి మరియు ప్రేమలో ఉన్నవారు వారి బంధం మరింత బలపడటానికి ఫర్ఫెక్ట్ ప్లేసులు. మరి వీటితో పాటు మరికొన్ని రొమాంటిక్ ప్రదేశాల గురించి తెలుసుకుందాం..

ఫలక్నూమా ప్యాలెస్:

ఫలక్నూమా ప్యాలెస్:

19వ శతాబ్దకాలం నాటి ఒక అద్భుతమైన కట్టడం ఫలక్ నూమా ప్యాలెస్. రాజసాన్ని ఉట్టిపడేలా చేసే ఈ ప్రదేశం ప్రేమ జంటలకు అద్భుతమైన ప్రదేశం. ఇక్కడ రెస్టారెంట్లో డిన్నర్ తో ఏర్పాటు చేసి కొంత సమయం గడపవచ్చు. కాబట్టి, మీ పాట్నర్ కోసం ప్రత్యేకంగా ఈ ప్రదేశాన్ని ప్లాన్ చేసుకోండి.

Photo Courtesy :Joe Lachoff

హుస్సేన్‌ సాగర్ ‌లేక్:

హుస్సేన్‌ సాగర్ ‌లేక్:

ఇది మానవ నిర్మిత సరస్సే అయినప్పటికీ హుస్సేన్ సాగార్ అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా సయం సంధ్యలో ప్రకుతి ప్రేమ పక్షులను. ప్రేమికుల రోజున ఈ ప్రదేశంలో కొన్ని వాటర్ యాక్టివిటీస్ జరుగుతాయి. మీ పార్ట్నర్ ను తీసుకెళ్ళడాని ఫర్ఫెక్ట్ ప్రదేశం ఇది. ఆహ్లాదకరమైన వాతావరణంతో ఆహ్వానిస్తుంది. ముఖ్యంగా సాయంత్రంలో సూర్యాస్తమయం సమయంలో చాలా అద్భుతంగా ఉంటుంది. హుస్సేన్‌సాగర్‌ తో పాటు దగ్గరలోని లుంబినీ పార్క్‌ - ఎన్‌టీఆర్‌ గార్డెన్స్‌, ఈట్‌స్ట్రీట్‌ వంటి ప్రాంతాలు ప్రేమికులకు అనుకూలంగా ఉంటాయి.

గోల్కొండ ఫోర్ట్ :

గోల్కొండ ఫోర్ట్ :

రొమాంటిక్ కపుల్స్ తప్పసరిగా సందర్శించవల్సిన ప్రదేశం గోల్కొండ కోట . ఫిబ్రవరి 14న మీ పార్ట్నర్ తో డేటింగ్ చేయడానికి ఒక అద్భుతమైన ప్రదేశం గోల్కొండ కోట. మనస్సులోని భావాలను వ్యక్తపరచడానికి ఒక ఉత్తమ ప్రదేశం గోల్కొండ కోట. ఇతర ప్రేమజంటలు హైదరాబాద్ లోని ప్రసిద్ద రెస్టారెంట్లు, రొమాంటిక్ ప్రదేశాలలో రద్దీగా ఉన్నప్పుడు మీరు ఏకాంతంగా ప్రశాంతమైన వాతావరణం కోరుకున్నప్పుడు గోల్కొండ కోట రొమాంట్ ప్రదేశం.

కేబీఆర్‌ పార్క్‌ :

కేబీఆర్‌ పార్క్‌ :

హైదరాబాద్ నగరం నడిబొడ్డున ప్రకృతి సోయగంతో విరాజిల్లుతున్న పార్క్‌ ఇది. ప్రేమ జంటలు చేతిలో చేయి వేసుకుని ఈ పార్క్‌లో నడుచుకుంటూ ఎన్నో జ్ఞాపకాలను నెమరువేసుకోవచ్చు. ప్రేమలో మునిగే వారు, ఇప్పటికే మునిగిన వారు ఈ పార్క్‌లో ఎంత దూరం నడిచినా అలసట అనిపించదు.

Photo Courtesy: Madison Berndt

గుఫా:

గుఫా:

థీమ్ బేస్డ్ రెస్టారెంట్ ఇది. పార్ట్నర్ కు ఒక సరికొత్త నార్త్ ఇండియన్ వంటకాలను రుచి చూపించడానికి ఒక పర్ఫెక్ట్ ప్లేస్ ఇది. ఒక గుహలోపల క్యాండిలైట్ డిన్నర్ కు ఫర్ఫెక్ట్ ప్రదేశం. వాలెంటైన్ డే రోజున మరింత ఉత్సాహాన్నిజోడిస్తాయి.

అనంతగిరి హిల్స్‌ :

అనంతగిరి హిల్స్‌ :

నగరానికి కాస్త దూరంగా, వికారాబాద్‌ దగ్గర ఉన్న అనంతగిరి హిల్స్‌... రొమాంటిక్‌ డెస్టినేషన్‌గా ప్రేమికులను ఆహ్వానిస్తుంది. ఒస్మాన్ సాగర్ మరియు హిమాయత్ సాగర్ కొండల నుండి జాలువారే జలాలు, దట్టమైన అటవీ ప్రాంతం మద్యలో అనంతగిరి హిల్స్ ప్రకృతి ప్రేమికులను మైమరిచిపోయేలా చేస్తుంది. నగరం నుండి సుమారు ఒక గంట ప్రయాణం చేస్తే అనంత గిరి కొండలు చేరుకోవచ్చు.ప్రకృతి ప్రేమికులకు అనువైన హిల్ స్టేషన్ ఇది. చల్లని, ఆహ్లాదకరమైన వాతావరణంతో పచ్చని ప్రకృతి దృశ్యం మీ ప్రియమైన వారిని మరింత దగ్గర చేర్చే శృంగార ప్రదేశం.

షామీర్‌పేట లేక్‌ :

షామీర్‌పేట లేక్‌ :

ఏకాంతంగా ప్రకృతి ఒడిలో సేదతీరుతూ వలస పక్షుల కిలకిల రాగాలు వినాలనుకుంటే ఇది ఎంతో అనుకూలమైన ప్రాంతం.

Photo Courtesy: Bhaskaranaidu

సీక్రెట్‌ లేక్‌ :

సీక్రెట్‌ లేక్‌ :

ఒకప్పుడు సీక్రెట్‌ లేక్‌గా ఇప్పుడు దుర్గం చెరువుగా ప్రసిద్ధిగాంచిన ఈ సహజసిద్ధమైన చెరువు లవర్స్‌కు మాత్రం ఎప్పటికీ అత్యంత అందమైన ప్రదేశాలలో ఒకటి.ఈ చెరువు లోయలో, కొండల మధ్య అత్యంత సుందరంగా ఉండేది, అయితే ఈ ప్రదేశం ఎక్కువ మందికి తెలియకపోవడం చాలా కొద్ది మంది ఉత్సాహవంతులకు, ప్రేమికులకు, సాహసికులకు మాత్రమే తెలిసి ఉండేది. అందువల్ల సీక్రెట్ లేక్, లేదా రహస్య చెరువు అని మారు పేరు ఉంది. ఇప్పటికీ తన సౌందర్యాన్ని కోల్పోకుండా పర్యాటకులను కనువిందు చేస్తుంది.

Photo Courtesy: Nishantshah

తారామతి - బారాదరి :

తారామతి - బారాదరి :

చరిత్రలోకి తొంగిచూస్తూ మధురస్మృతులలో జారిపోవాలనుకుంటే తారామతి - బారాదరి కూడా పర్ఫెక్ట్ వాలెంటైన్ డే ప్లేస్ అని చెప్పవచ్చు. సుఫి అండ్ గజల్స్‌, ఖవ్వాలీ సింగర్స్ తో ఇక్కడ ఆనందంగా గడపవచ్చు. ఒకప్పుడు భగ్మతి అనే ప్రముఖ నృత్యకారుడు ఇక్కడ డ్యాన్స్ ప్రాక్టీస్ చేసేవారట. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ద్వారా థియేటర్ గా మార్చబడినది. ఇది ఇప్పుడు గజల్స్ మరియు డ్యాన్స్ నైట్స్ నిర్వహించబడుతోంది. మీ ప్రియమైన వారితో ఈ ప్రదేశానికి వెళ్లడం ఒక మధురానుభూతిని కలిగిస్తుంది.

Photo Courtesy: Chiranjeevi Ranga

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X