» »ఒబులమ్మ వీరత్వం చూడాలంటే చిత్రదుర్గ వెళ్ళాల్సిందే !

ఒబులమ్మ వీరత్వం చూడాలంటే చిత్రదుర్గ వెళ్ళాల్సిందే !

By: Venkata Karunasri Nalluru

చిత్రదుర్గ బళ్ళారి నుండి 125కి.మీ దూరంలో ఉంది. అలాగే బెంగుళూరుకు 210కి.మీ దూరంలో ఉంది. చిత్రదుర్గ కోటను పెద్ద రాళ్ళతో కట్టిన గోడలతో నిర్మించారు. దీనిని 'చితుర దుర్గ లేదా చిత్రకలా దుర్గ' అని పిలుస్తారు. కన్నడ భాషలో దీనిని కల్లినకొటె అంటారు. కన్నడలో కల్లు అంటే రాయి అని అర్థం. ఇక్కడ క్రీ.పూ.3 శతాబ్దానికి చెందిన అవశేషాలు కూడా లభించాయి.

ఇక్కడ దాదాపు 20 ఆలయాలు వున్నాయి. ఇందులో చాలావరకు పూర్తిగా శిధిలమైపోయినాయి. హైదర్‌ఆలీ పాలనలో నిర్మించిన మసీదు కూడా ఇక్కడ చూడవచ్చును. చిత్రదుర్గ కోట 7 రాతితో కట్టిన కోడలను కలిగివుంది. కోటలోకి రహస్యంగా వెళ్ళటానికి కొన్ని రహస్యమార్గాలు వున్నాయి.

1. చిత్రదుర్గ

1. చిత్రదుర్గ

మహాభారత యుద్ధం జరుగుతున్నప్పుడు హిడింబాసురుడు, భీముడు ఒకరిపై ఒకరు రాళ్ళు విసురుకున్నారని ఆ రాళ్ళు చిత్రవిచిత్రలుగా ఇక్కడ కనిపిస్తున్నాయని అందువల్ల చిత్రదుర్గ అని పేరు వచ్చిందని చెప్తారు.

pc:Ankit Darsi

2. చరిత్ర

2. చరిత్ర

మౌర్యుల పరిపాలనా కాలంలో రాష్ట్రకూటులు, చాళుక్యులు, హయసులులు ఈ దుర్గంను పాలించినట్లుగా తెలుస్తుంది.

pc:Haneeshkm

3. భాష

3. భాష

ఇక్కడి ప్రజల మాతృభాష కన్నడం. తెలుగు కూడా మాట్లాడుతారు.

pc: Nagarjun Kandukuru

4. వ్యవసాయం

4. వ్యవసాయం

దానిమ్మ పండ్ల సాగులో చిత్రదుర్గ దేశంలోనే మొదటి స్థానం ఆక్రమించింది. ఇంకా వరి, జొన్న, ఉల్లి, మిరప పంటలను కూడా సాగు చేస్తారు.

pc: Vcpvinay

5. వాల్మీకి మ్యుజియం

5. వాల్మీకి మ్యుజియం

చిత్రదుర్గకోటకు కొద్దిదూరంలో వాల్మికి మ్యుజియం వున్నది. ఇక్కడ చిత్రపటాలు, నాటి ఖడ్గాలు, కైజారులు, తుపాకులు, నాణెలు మొదలైనవాటిని చూడవచ్చును.

pc: Haneeshkm

6. దర్శించదగిన ఆలయాలు

6. దర్శించదగిన ఆలయాలు

ఇక్కడ దాదాపు 20 ఆలయాలు వున్నాయి. ఇందులో చాలావరకు పూర్తిగా శిధిలమైపోయినాయి. హైదర్‌ఆలీ పాలనలో నిర్మించిన మసీదు కూడా ఇక్కడ చూడవచ్చును.

pc: Arun Kumar Mathivaanan

7. ఇసురురాళ్ళు

7. ఇసురురాళ్ళు

ఇసురురాళ్ళను ఉపయోగించి రొట్టెల పిండి చేసేవారని చెప్తారు. కోటలో మొదటి కోట ద్వారాన్ని దాటిన తరువాత ఎడమవైపున 200 మీ దూరంలో పెద్ద పరిమాణంలో వున్ననాలుగు రాతి తిరగళ్ళను చూడవచ్చును.

pc: Kumarnithin029

8. టంకశాల

8. టంకశాల

టంకశాలను మట్టిగోడలతో నిర్మించారు. ఈ గోడలను కట్టి 200 సం.లు అయినను ఇప్పటికి వానలకు తట్టుకుని నిల్చి ఆకాలంనాటి భవన నిర్మాణ నిపుణుల నైపుణ్యానికి తార్కాణంగా నిసుస్తున్నాయి.

pc: Amigo&oscar

9. ఒబక ఒబవ్వనకుండి

9. ఒబక ఒబవ్వనకుండి

ఒకసామాన్యభటుని భార్య అయిన ఒబవ్వ వీర వనితగా నిలిచింది.ఇప్పటికి చిత్రదుర్గకు వచ్చే పర్యాటకుకు తప్పనిసరిగా ఈ కుండిని చూసి, ఆమె వీరత్వాన్ని తలచుకుని పులకిస్తారు. రాయలసీమలోని చాలా మంది ఆడవారికి ఒబవ్వ, ఒబులమ్మ అనేపేర్లు ఉన్నాయి.కన్నడలో అవ్వ అనగా 'అమ్మ'ని అర్ధం.

pc: Nirde102

10. చిత్రదుర్గ కోట

10. చిత్రదుర్గ కోట

చిత్రదుర్గ కోట 7 రాతితో కట్టిన కోడలను కలిగివుంది. కోటలోకి రహస్యంగా వెళ్ళటానికి కొన్ని రహస్యమార్గాలు వున్నాయి.

pc: Vedamurthy.j

11. గర్భగుడి

11. గర్భగుడి

నాల్గవ కోట దాటిన తర్వాత మొట్టమొదట గణపతి ఆలయం వున్నది. కోట గోడలు చాలా వరకు శిథిలమైపోయి వున్నాయి. గోడలను దాటుకొని లోపలికి వెళ్లగానే విశాలమైన బయలు ప్రదేశం దర్శనమిస్తుంది.

pc: Vivekjp

12. తిమ్మననాయక్

12. తిమ్మననాయక్

విజయనగర చక్రవర్తి 'తిమ్మననాయక్' అనే సైన్యాధిపతి యుద్ధాలలో కనపర్చిన ప్రతిభ, సేవలకు, అతనిని చిత్రదుర్గ పాలకునిగా నియమించాడు.

pc: Bhat.veeresh

13. ఒయల్‌ పరిపాలన

13. ఒయల్‌ పరిపాలన

1779 లో హైదర్‌ఆలి మరియు అతనికుమారుడు టిప్పు సుల్తానుతో జరిగిన యుద్ధంలో మదకరినాయక్‌ ఓడిపోవడంవలన చిత్రదుర్గ హైదర్‌ఆలి వశమైనది.తదనంతరం టిప్పిసుల్తాను బ్రిటీషు వారిచేతిలో ఓడిపొయ్యిన పిమ్మట 'చిత్రదుర్గ' మైసూరుకు చెందిన ఒయల్‌కుటుంబపాలనలోకి వెళ్ళినది.

pc: Nirde102

14. మహాభారత చరిత్ర

14. మహాభారత చరిత్ర

దుర్గానికి చెందిన ఈ కొండల(గుట్ట)లో 'హిడింబ'అనే అసురుడు,'హిడింబి' అనే అతని సోదరి నివసించెవారు. హిడింబాసురుడు కౄరస్వభావం కలిగి వుండి, ప్రజలను హింసిస్తూ, నరభక్షణ చేసెవాడు.అతని సోదరి హిడింబి సాత్విక స్వభావం కల్గి వుండేది. హిడింబుడు పాండవులను ఎదిరిస్తాడు. భీమునితో జరిగిన పోరాటంలో హిడింబుడు మరణిస్తాడు.

pc: Nagarjun Kandukuru

15. అవశేషాలు

15. అవశేషాలు

ఇక్కడ క్రీస్తు పూర్వం 3వ శాతాబ్దికి చెందిన అవశేషాలు పురాతత్వశాఖవారికి లభించాయి.

pc: Nagarjun Kandukuru

16. దుర్గలోని ఒక కోట కాపలా భటుని భార్య

16. దుర్గలోని ఒక కోట కాపలా భటుని భార్య

ఒబవ్వ దుర్గలోని ఒక కోట కాపలా భటుని భార్య. మదకరినాయకుడుకు హైదరిఆలికి (టిప్పుసుల్తాను తండ్రి) కి యుద్ధంజరుగుతున్న కాలంఅది.హైదర్‌ఆలి దాడిని మదుకర్‌ నాయక్‌ సమర్ధవంతంగా ఎదుర్కుంటున్నాడు.

pc: Nagarjun Kandukuru

17. హైదర్‌ఆలీ

17. హైదర్‌ఆలీ

ఏలాగైన సరే దుర్గంను స్వాధీనపరుచు కొనవలెనని హైదర్‌ఆలి ప్రయత్నంచేస్తున్న రోజులవి. ఒకరోజు కాపలావిధిలో వున్న భర్తకు మధ్యహ్నం భోజనం తీసుకెళ్ళినది ఒబవ్వ. ఆమే భర్త కాపలా స్దలానికి దగ్గరలో వున్న సత్రంలో భోజనంచేయుటకు ఉపక్రమించాడు. భర్తకు నీళ్ళు తేవటానికి నీటి చెలమ వద్దకు వెళ్ళుచున్న ఒబవ్వకు, రెండు బండ రాళ్ళ మధ్యనున్న సన్నని కన్నం నుండి హైదర్‌ఆలి సైనికుడు లోపలికి రావడం గమనించినది.

pc: wikimedia.org

18. రోకలి

18. రోకలి

కన్నంనుండి ఒకతూరి ఒకమనిసి అతికష్టమీద రాగలడు.అప్పూడే భోజనంచేస్తున్న భర్తను భజనంవద్దనుండి లీపడం ధర్మంకాదని భావించిన ఒబవ్వ, తనకు అందుబాటులో వున్న ఒనెకె (రోకలి) ని తీసుకునివెళ్ళి ఆ కుండి పక్కనే నిల్చుని, కన్నంనుండి లోపలికి వస్తున్న ఆలి సైనికుని తలమీద బలంగామోది, పక్కకు లాగివేసింది.ఆ కన్నంచాలా ఇరుకుగా వున్నందున ఇవతల జరుగుతున్నది అవతల వున్న సైనికులకు కన్పించె, తెలిసె వీలులేదు. ఆవిధంగా ఒబవ్వ లోపలికి వస్తున్న ఒక్కొక్క భటునుని రోకలితో తల మీద బాది చంపడం మొదలుపెట్టినది.

pc: Vedamurthy.j

19. గుట్టలుగా పడివున్న శవాలు

19. గుట్టలుగా పడివున్న శవాలు

భోజనం ముగించుకొని వచ్చిన ఒబవ్వభర్తకు, వందలసంఖ్యలో గుట్టలుగా పడివున్న హైదర్‌ సైనికుల శవాలమధ్య రోకలిపట్టుకుని వున్న ఒబవ్వ అపరకాళినే తలపించినది. ఆవిధంగా ఒకసామాన్యభటుని భార్య అయిన ఒబవ్వ వీర వనితగా నిలిచింది.

pc: Nagarjun Kandukuru

20. ఒబులమ్మ వీరత్వం

20. ఒబులమ్మ వీరత్వం

ఇప్పటికి చిత్రదుర్గకు వచ్చే పర్యాటకుకు తప్పనిసరిగా ఈ కుండిని చూసి, ఆమె వీరత్వాన్ని తలచుకును పులకిస్తారు. రాయలసీమలోని చాలా మంది ఆడవారికి ఒబవ్వ, ఒబులమ్మ అనేపేర్లు ఉన్నాయి.కన్నడలో అవ్వ అనగా 'అమ్మ'ని అర్ధం.

pc: Nagarjun Kandukuru

Please Wait while comments are loading...