Search
  • Follow NativePlanet
Share
» »రాచరికం ఉట్టిపడే రాజస్తాన్ అందాలు !

రాచరికం ఉట్టిపడే రాజస్తాన్ అందాలు !

రాజస్తాన్ రాష్ట్రం పూర్తిగా రాచరికం ఉట్టి పడుతూ, ఎన్నో ఆనందాలను పర్యాటకులకు అందిస్తుంది. ఎన్నో పాలస్ లు, కోట లు, హెరిటేజ్ భవనాలు ఇవన్నీ రాజస్తాన్ చరిత్రను మీకు కళ్ళను కట్టి చూపుతాయి. అందమైన ఈ నగరాల గుండా వేసే ఒక రోడ్ ట్రిప్ మీకు జీవిత కాలంలో మరువ లేనిదిగా వుంటుంది. మరి రోడ్ ట్రిప్ లో రాజస్తాన్ లోని మంచి నగరాలకు మీకు ఒక ట్రావెల్ ప్లాన్ అందిస్తున్నాం. జైపూర్, పుష్కర్, ఉదయపూర్, కుమ్భాల్ ఘర్, జోద్ పూర్ మరియు జైసల్మేర్ అన్నీ పర్యాటక ప్రాధాన్యత గల నగరాలే.

ఈ రూట్ లో పర్యటన చేయాలంటే, మీరు ఒక లాంగ్ వీక్ ఎండ్ తీసుకోవాల్సిందే. దీని దూరం సుమారు 1030 కి. మీ. లతో డ్రైవింగ్ 16 గంటల వరకూ పడుతుంది. సైట్ సీయింగ్ చాలా సమయం తీసుకుంటుంది. కనుక లాంగ్ వీక్ ఎండ్ కావలసినదే మరి.

 ఎక్స్ ప్రెస్ వే

ఎక్స్ ప్రెస్ వే

మన పర్యటనను పింక్ సిటీ గా చెప్పబడే జైపూర్ నుండి మొదలు పెడదాం. దీనికి ముందుగా మీరు జైపూర్ - అజ్మీర్ ఆరు లేన్ లు కల ఎక్స్ ప్రెస్ వే ప్రవేశాంచాలి.

పుష్కర్

పుష్కర్

జైపూర్ నుండి పుష్కర్ చేరాలంటే, సుమారు రెండు గంటల సమయం పడుతుంది. ఇది సుమారు 145 కి. మీ. లు వుంటుంది. పుష్కర్ ఒక పవిత్ర నగరం తప్పక చూడాలి.

ఉదయపూర్

ఉదయపూర్

ఇపుడు మనం ఉదయపూర్ చూద్దాము. పుష్కర్ నుండి ఉదయపూర్ సుమారు 320 కి. మీ. ల దూరం. ఎన్ హెచ్ 79 మరియు ఎన్ హెచ్ 76 లపై ప్రయాణించాలి. ఈ రూట్ లో టోల్ గెట్ లు ఉన్నప్పటికీ జర్నీ ఇతర రూట్ ల కంటే సౌకర్యవంతంగా వుంటుంది. ఉదయపూర్ నగరం అనేక సరసులతో ఆహ్లాదకరంగా వుంటుంది.

కుంభాల ఘర్

కుంభాల ఘర్

ఇక్కడి పాలస్ అఫ్ క్లౌడ్స్ అంటే మేఘాల రాజ భవనం చూసారా ? అద్భుత సౌందర్యం. ఇటువంటి ప్రదేశాలు మీరు ఇక్కడ ఎన్నో చూడవచ్చు. కుమ్భాల్ ఘర్ ఉదయపూర్ కు 100 కి. మీ. లు. ఎన్ హెచ్ 76 ఎస్ హెచ్ 32 ఎన్ హెచ్ 162 ల గుండా ప్రయాణించాలి. సిటీ చేరేందుకు సుమారు రెండు గంటల సమయం పడుతుంది.

జోద్ పూర్

జోద్ పూర్

జోద్ పూర్ నగరం లో ఇండ్లు అన్నీ నీలి రంగులో పెయింటింగ్ వేయబడి వుంటాయి. కనుక దీనిని నీలి నగరం అంటారు. కుమ్భాల్ ఘర్ నుండి జోద్ పూర్ కు సుమారు 3 గంటల ప్రయాణం పడుతుంది. ఎన్ హెచ్ 65 గుండా ప్రయాణించాలి. ఈ నగనరంలో అందమైన ఆకర్షణలు అనేకం కలవు.

జై సల్మేర్

జై సల్మేర్

జైసల్మేర్ నగరాన్ని గోల్డెన్ సిటీ అంటారు. ఇక్కడి ఎడారులు బంగారు వన్నెల ఇసుకతో మెరిసి పోతూ వుంటాయి. ఎన్నో రాజ భవనాలు అందంగా తీర్చి దిద్ద బడి నట్లు వుంటాయి. జైసల్మేర్ సుమారు 285 కి. మీ. ల దూరంలో కలదు. ఎన్ హెచ్ 114 మరియు ఎన్ హెచ్ 15 ల పై ప్రయాణించాలి. జైసల్మేర్ చేరేందుకు సుమ్మరు నాలుగు గంటలపైన పడుతుంది. ఇక్కడ అనేక ఆకర్షణీయ ప్రదేశాలు కలవు. ఇక్కడి తో మీ ప్రణాళిక లోని రాయల్ రాజస్తాన్ రోడ్డు పర్యటన ముగుస్తుంది.

మ్యాప్

మ్యాప్

మీ ప్రయాణం సుఖమయంగా ఉండేందుకు, మీరు మంచి రోడ్డు మార్గంలో పర్యటించేందుకు అనుకూలంగా ఒక మ్యాప్ కూడా మీకు అందిస్తున్నాం.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X