• Follow NativePlanet
Share
» »ఇక్కడ శ్రీరంగనాథుడి పక్కన లక్ష్మీ దేవి కాక ఎవరు కొలువై ఉన్నారో తెలుసా?

ఇక్కడ శ్రీరంగనాథుడి పక్కన లక్ష్మీ దేవి కాక ఎవరు కొలువై ఉన్నారో తెలుసా?

Written By: Kishore

శ్రీరంగనాథుడిని విష్ణుమూర్తి అవతారంగా కొలుస్తారు. ఈ శ్రీ రంగనాథుడు శేష తల్పం పై పడుకొని ఉంటే ఆయన కాళ్ల దగ్గర లక్ష్మీదేవి ఉంటుంది. అయితే కర్నాటకలోని శ్రీరంగ పట్టణంలో మాత్రం ఇందుకు విరుద్ధం. శ్రీ రంగనాథుడి కాళ్లదగ్గర లక్ష్మీని కాక మనం కావేరి మాతను చూస్తాం. ఇటువంటి విగ్రహం దేశంలో ఇదొక్కటి మాత్రమే. ఇక శ్రీరంగ పట్టణం చారిత్రాత్మక ప్రాంతంగా కూడా ప్రసిద్ధి కెక్కింది. ప్రస్తుతం ఈ శ్రీ రంగ పట్టణం మాత్రమే కాకుండా చుట్టు పక్కల ఎన్నో పర్యాటక ప్రాంతాలు కూడా ఉన్నాయి. బెంగళూరు నుంచి ఒక రోజు ట్రిప్ గా కూడా ఇక్కడకు వెళ్లి రావచ్చు. దగ్గర్లోనే మైసూరు కూడా ఉంది. ఈ నేపథ్యంలో శ్రీరంగపట్టణకు సంబంధించిన వివరాలు మీ కోసం...

రెండు రోజుల్లో అక్కడి అందాలను ఆస్వాధించి రావచ్చు.

1. కావేరికి, రంగనాథుడికి అవినాభావ సంబంధం

1. కావేరికి, రంగనాథుడికి అవినాభావ సంబంధం

Image source:

రంగనాథుడికి, కావేరి నదికి అవినాభావ సంబంధం ఉంది. భారత దేశంలో ప్రసిద్ధ రంగనాథ స్వామి దేవాలయాలు ఐదు ఉండగా అందులో మూడు కావేరి నదీ తీరంలోనే ఉన్నాయి. అందులో మొదటిది శ్రీరంగ పట్టణం లో ఉన్న రంగనాథస్వామి దేవాలయం. అందువల్లే ఇక్కడ ఉన్న రంగనాథస్వామికి ఆదిరంగ అని పేరు. కొద్దిగా ముందుకు వెళితే శివన సముద్రం వద్ద మరో రంగనాథస్వామి దేవాలయం ఉంది. ఇక్కడ వెలిసిన స్వామివారిని మధ్య రంగ అని అంటారు. అదే విధంగా తమిళనాడులోని శ్రీరంగంలో వెలిసిన రంగనాథ స్వామిని అంత్య రంగ అని అంటారు. ఇలా కావేరికి రంగనాథుడికి అవినాభావ సంబంధం ఉందని చెబుతారు.

2. క్లుప్తంగా

2. క్లుప్తంగా

Image source:
ఇక శ్రీరంగపట్టణంలో రంగనాథస్వామి కొలువుదీరడానికి పురాణ కథనం ఉంది. దీని ప్రకారం గౌతమ మహర్షి బ్రహ్మహత్య పాతకాన్ని తొలగించుకోవడం కోసం ప్రస్తుతం శ్రీ రంగ పట్టణం ఉన్న చోట విష్ణుమూర్తి గురించి తప్పస్సు చేస్తాడు. చివరికి విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యి కావేరి నదిలో స్నానం చేయడం వల్ల పాపం పోతుందని చెబుతాడు. విష్ణుమూర్తి ఆదేశాల మేరకు గౌతమ ముని ఇక్కడ స్నానం చేసి తన పాపాలను పోగొట్టు కొంటాడు.

3. అందువల్లే కావేరి మాత

3. అందువల్లే కావేరి మాత

Image source:

తన భక్తుడైన గౌతమముని పాపం పొగొట్టిన కావేరి నదిని వరం కోరుకమని విష్ణువు చెబుతాడు. దీంతో మిమ్ములను ఎప్పుడూ సేవించే భాగ్యం ప్రసాదించాలని కోరుతుంది. ఇందుకు విష్ణుమూర్తి అంగీకరిస్తాడు. అందువల్లే ఇక్కడి దేవాలయంలో రంగనాథుడి పాదల వద్ద కావేరి మాత ఉంటుంది. అయితే ఉత్సవ మూర్తుల్లో మాత్రం స్వామి వారితో పాటు శ్రీ దేవి, భూ దేవి ఉంటారు. ఇక ఇక్కడి దేవాలయం ఎప్పుడు, ఎవరు నిర్మించారన్న దానికి సరైన ఆధారాలు లేవు. క్రీస్తుపూర్వం 3,600 ఏడాదిలో అంబ అనే ఓ భక్తురాలు స్వామి వారికి చిన్న దేవాలయం కట్టించిందని స్థానిక పూజారులు చెబుతారు.

4. అనేక రాజవంశాల వారు

4. అనేక రాజవంశాల వారు

Image source:

అటు పై కొన్ని ఏళ్లకు వివిధ రాజ వంశీయులు ఈ దేవాలయాన్ని సుందరంగా తీర్చి దిద్దడంలో తమ వంతు సహకారం అందించారు. ముఖ్యంగా గంగ, హోయసల, విజయనగర రాజుల ఏలుబడిలో ఈ దేవాలయం బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ముఖ్యంగా గర్భగుడి గంగరాజు శైలిలో ఉండగా లోపలి నిర్మాణాలు హోయశయ శైలిలో, రంగ పంటం, గోపురం విజయనగర శైలిలో ఉంటాయి. మఖ్యంగా ఈ దేవాలయంలో 700 పైగా అద్భుతమైన శిల్పసంపదతో కూడిన రాతి స్తంభాలు ఉన్నాయి.

5. 24 రూపాలు

5. 24 రూపాలు

Image source:

ఇదిలా ఉండగా ఈ దేవాలయంలో రెండు స్తంభాల మీద విష్ణుమూర్తి 24 రూపాలు చెక్కబడి ఉంటాయి. వీటిని చతుర్వింశతి స్తంభాలని పిలుస్తారు. ఈ శ్రీరంగ పట్టణం కొద్ది కాలం టిప్పుసుల్తాన్, హైదరాలి పాలనలో రాజధానిగా ఉంది. అందువల్ల ఇక్కడి భవనాలు, స్మారకాల్లో ఇండో ముస్లీమ్ వాస్తు శిల్ప శైలి కనిపిస్తుంది. ఈ ఆలయం మొత్తం 25 ఎకరాల విస్తీర్ణంలో ఉండగా రాజగోపురం ఎత్తు 100 అడుగులు.

6. టిప్పు కాలంలో

6. టిప్పు కాలంలో

Image source:

ఈ శ్రీరంగ పట్టణం టిప్పు సుల్తాన్ కాలంలో ఒక వెలుగు వెలిగింది. ఆయన హయాంలో నిర్మించిన దరియాదౌలత్ అనే భవనం ఇండో ముస్లీమ్ వాస్తు శిల్పికి ప్రత్యక్ష ఉదాహరణ. దీనిని ఆయన తన వేసవి విడిదిగా కూడా వినియోగించారు. ఆయన వాడిన దుస్తులు, ఆభరణాలు, ఆయుధాలు ఇక్కడ ఉన్న మ్యూజియలో చూడవచ్చు.

7. ఇతర పర్యాటక కేంద్రాలు

7. ఇతర పర్యాటక కేంద్రాలు

Image source:

శ్రీరంగ పట్టణంలోనే టిప్పు సుల్తాన్ సమాధి కూడా ఉంది. శ్రీరంగ పట్టణం వెళ్లిన వారు దీనిని తప్పక సందర్శిస్తారు. ఇక శ్రీరంగ పట్టణానికి దగ్గర్లోనే నిముషాంబ దేవాలయం, శివనసముద్రం, రంగనతిట్టు అనే ప్రముఖ పర్యాటక కేంద్రాలు మనలను రారమ్మని ఆహ్వనిస్తూ ఉంటాయి.

8. ఎక్కడ ఉంది.

8. ఎక్కడ ఉంది.

Image source:

శ్రీరంగ పట్టణ కర్నాటక రాజధాని బెంగళూరు నుంచి 127 కిలోమీటర్ల దూరంలో, మండ్యా నుంచి 13 కిలోమీటర్ల దూరంలో, మైసూరు నుంచి 9 కిలోమీటర్ల దూరంలో ఉంది. బెంగళూరు నుంచి నేరుగా బస్సు సౌకర్యం కూడా ఉంది.

పర్యాటకానికి సంబంధించిన వివరాలు తెలుసుకోండి
పర్యాటక చిట్కాలు, పర్యాటకానికి సంబంధించిన కథాలు తక్షణం పొందండి