Search
  • Follow NativePlanet
Share
» »విహంగాల విడిది - అడయార్ పార్క్ !

విహంగాల విడిది - అడయార్ పార్క్ !

By Mohammad

విహారాలు కోసం మనం ఎలాగైతే ప్రపంచం చుట్టివస్తామో ... అలాగే పక్షులు కూడా చుట్టి వస్తాయి. ఇవి ప్రధానంగా చుట్టిరావటానికి కారణం సంతానోత్పత్తి. దీని కోసం సహజ సిద్ధ కేంద్రాలను, వాతావరణ అనుకూల ప్రదేశాలను వెతుకుతూ దేశాటన చేస్తాయి.

సంతానోత్పత్తి కోసం ... పక్షులు మన దేశంలో కొన్ని సహజ సిద్ధ విడిది స్థావరాలకు వలస వస్తుంటాయి. వీటి స్వీయ రక్షణ కోసం పర్యాటక శాఖ వారు కూడా కొన్ని కృతిమ విడిది కేంద్రాలను ఏర్పాటుచేసి వలస పక్షులు ప్రోత్సహిస్తున్నారు. అలాంటి విడిది కేంద్రాలలో ఒకటే అడయార్ పార్క్.

అడయార్ పార్క్ లో విస్తరించిన మర్రిచెట్లు

అడయార్ పార్క్ లో విస్తరించిన మర్రిచెట్లు

చిత్ర కృప : chandrasekaran arumugam

పక్షులు సుమారు 20 వేల కిలోమీటర్లు ప్రయాణించి చెన్నై లోని అడయార్ పార్క్ కు వలస వస్తుంటాయి. పార్క్ వాతావరణం వలస పక్షులకు సంతానోత్పత్తికి అనుకూలంగా ఉంటుంది. ఏడాదిలో ఆరునెలలు అవి ఇక్కడే మకాం వేస్తాయి.

ఇది కూడా చదవండి : వేదాంతంగల్ - ఒక పురాతన పక్షి అభయారణ్యం !

పక్షులు గుడ్లు పెట్టి, పొదిగి, పిల్లలకు శక్తి వచ్చేంత వరకు ఇక్కడే తలదాచుకుంటాయి. ఆ తర్వాత పిల్లలతో కలిసి తమ స్వస్థలాలకు తరలివెళతాయి. నిజానికి ఇటువంటి సన్నువేశాలు, దృశ్యాలు అద్భుతంగా ఉంటుంది.

వలస పక్షులు, అడయార్ పార్క్

వలస పక్షులు, అడయార్ పార్క్

చిత్ర కృప : Balu Velachery

పిల్లలను పెంచడానికి, ఈ వలస పక్షులు ప్రత్యేకంగా గూళ్ళను కట్టుకుంటాయి. ఆరు నుంచి ఏడు నెలలపాటు హాయిగా సేదతీరి, తమ పిల్లలతో కలిసి స్వస్థలాలకు లేదా స్వదేశాలకు ఎగిరివెళతాయి. వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించే ఈ పక్షులు తమిళనాడు రాష్ట్రంలోని వేడన్‌ తాంగల్‌, కొడైకెనాల్‌, నీలగిరి, కన్యాకుమారి తదితర ప్రాంతాలకు వచ్చి.. అనువైన వాతావరణం కోసం గాలించి ప్రాంతాన్ని ఎంచుకొని, అక్కడ స్వేచ్ఛగా విహరిస్తూ గుడ్లు పెడతాయి.

పుట్టిన పిల్లలకు ఎగరటం, ఆహారం వెతుక్కోవడం వంటివి తల్లి పక్షులు నేర్పుతాయి. ఈలోగా తాము వచ్చిన సమయం (ఆరు -ఏడు నెలలు) పూర్తయితే తల్లీపిల్లలు వచ్చిన దారినే ఎగిరిపోతాయి.

చెట్టు మీద వాలిన వలస పక్షులు

చెట్టు మీద వాలిన వలస పక్షులు

చిత్ర కృప : B Balaji

అడయార్ పార్క్‌ను ప్రకృతి సిద్ధంగా ఉంచేందుకు ఇక్కడి ప్రభుత్వం బాగానే కృషి చేస్తుందనే చెప్పాలి. ఈ పార్కులోని మురికినీటిని రీసైక్లింగ్‌ చేసే ప్రక్రియతో పాటు ప్లాస్టిక్‌ వ్యర్థాలు లేకుండా బయో ఎరువు తయారీ ప్లాంట్‌ స్థాపించారు. ఇక్కడ 60 వేల మొక్కలను నాటినట్లు స్థానికులు, ఏటా 160 రకాల పక్షులు వలస వచ్చివెళ్తున్నాయని ఇక్కడి స్థానికులు చెబుతారు. పార్క్ లోని మూడు ప్రాంతాలలో వలస పక్షులకు ఆహారంగా చేపపిల్లలను వదిలినట్లు చెబుతారు.

3 కిలోమీటర్ల మేరకు నిర్మించిన ఫుట్‌పాత్‌ పై నడుస్తూ.. పక్షులను చూడవచ్చు. సందర్శకుల వల్ల పక్షులకు ఎలాంటి హానీ లేకుండా కట్టుదిట్టమైన రక్షణ ఏర్పాట్లు ఉంటాయి. ఇక్కడ ప్లాస్టిక్‌ పూర్తిగా నిషేధం.

పార్క్ లోని పక్షుల ప్రదర్శన శాల

పార్క్ లోని పక్షుల ప్రదర్శన శాల

చిత్ర కృప : Arun Ganesh

సందర్శనా సమయం

అడయార్ నేషనల్ పార్క్ ప్రతి మంగళవారం మరియు గురువారం ప్రజల సందర్శనార్థం తెరిచి ఉంచుతారు. మధ్యాహ్నం 2: 30 నుండి సాయంత్రం 4 : 30 వరకు పార్క్ సందర్శించవచ్చు. లోనికి వెళ్లాలంటే టికెట్ కు ఒక్కొక్కరు రూ. 20 లు చెల్లించాలి.

పార్క్ లోని ఫుట్ పాత్ బ్రిడ్జ్

పార్క్ లోని ఫుట్ పాత్ బ్రిడ్జ్

చిత్ర కృప : chandrasekaran arumugam

అడయార్ పార్క్ ఎలా వెళ్ళాలి ?

వాయు మార్గం

అడయార్ పార్క్ కు సమీపాన చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం కలదు. ఇక్కడికి దేశ, విదేశాల నుంచి విమానాలు వస్తుంటాయి. విమానాశ్రయం బయట టాక్సీ లేదా క్యాబ్ లను అద్దెకు తీసుకొని అడయార్ పార్క్ చేరుకోవచ్చు.

రైలు మార్గం

తిరుమయిలై MRTS స్టేషన్ అడయార్ పార్క్ సమీపాన కలదు. ఇదొక మెట్రో స్టేషన్. సమీపాన ఉన్న ప్రధాన స్టేషన్ లు ఎగ్మోర్, చెన్నై సెంట్రల్ స్టేషన్ లు. దేశంలోని అన్ని ప్రాంతాల నుండి రైళ్లు ఈ స్టేషన్ ల మీదుగా వెళ్తాయి.

అడయార్ పార్క్ చేరుకోవటం ఎలా ?

అడయార్ పార్క్ చేరుకోవటం ఎలా ?

చిత్ర కృప : Aravind Sivaraj

రోడ్డు / బస్సు మార్గం

చెన్నై లోని కోయంబేడు బస్ స్టాండ్ నుండి అడయార్ పార్క్ కు సిటీ బస్సులు తిరుగుతాయి. బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, కన్యాకుమారి, మధురై, విశాఖపట్టణం తదితర ప్రాంతాల నుండి ప్రభుత్వ బస్సులు చెన్నై కు వస్తుంటాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X