Search
  • Follow NativePlanet
Share
» »చోళుల అద్భుత కట్టడం - ఐరావతేశ్వర ఆలయం !

చోళుల అద్భుత కట్టడం - ఐరావతేశ్వర ఆలయం !

తమిళనాడులో ఉన్నన్ని ఆలయాలు బహుశా భారతదేశంలో మరెక్కడా కనిపించవేమో. ప్రముఖ హిందూ రాజవంశాలు ఇక్కడ ఎన్నో దేవాలయాలను, ఆలయ గోపురాలను అద్భుత శిల్ప శైలిలో నిర్మించారు. అందులో ఒకటి ఐరావతేశ్వర ఆలయం

By Mohammad

తమిళనాడులో ఉన్నన్ని ఆలయాలు బహుశా భారతదేశంలో మరెక్కడా కనిపించవేమో. ప్రముఖ హిందూ రాజవంశాలు (చోళ, చేర, పాండ్య వంశాలు వాటిలో ముఖ్యమైనవి) ఇక్కడ ఎన్నో దేవాలయాలను, ఆలయ గోపురాలను అద్భుత శిల్ప శైలిలో నిర్మించారు. నేడు అవి ప్రపంచ పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి మరియు ప్రపంచ స్థాయి పేరుప్రఖ్యాతను (యునెస్కో గుర్తింపు) తెచ్చిపెడుతున్నాయి. అటువంటి ఆలయాలలో ఒకటి ఐరావతేశ్వర ఆలయం.

ఐరావతేశ్వర ఆలయం తమిళనాడు లోని దరాసురం అనే గ్రామీణ పట్టణంలో కలదు. దరాసురం ప్రముఖపట్టణమైన తంజావూరు కు 60 కి. మీ ల దూరంలో, చెన్నై మహానగరానికి 286 కిలోమీటర్ల దూరంలో మరియు మధురై పట్టణానికి 228 కిలోమీటర్ల దూరంలో కలదు. దరాసురం కు గల మరోపేరు రాజరాజపురం. ఇక్కడ గల సందర్శనీయ ప్రదేశాలను ఒకేసారి గమనిస్తే ....

ఐరావతేశ్వర ఆలయం

ఐరావతేశ్వర ఆలయం

ఐరావతేశ్వర ఆలయాన్ని క్రీ. శ. 12 వ శతాబ్దంలో, రెండవ రాజరాజచోళుడు నిర్మించారు. ఈ ఆలయంలో శివుడు ఐరావతేశ్వరుడిగా పూజలు అందుకుంటున్నాడు. పురాణాల మేరకు, ఐరావతం అనే పేరుగల ఏనుగుల రాజు, దుర్వాస ముని పాపం నుండి విముక్తిడిని చేయాలంటూ శివుణ్ణి ఇక్కడే ప్రార్థించిందని చెప్తారు.

చిత్ర కృప : Viswanath

ఐరావతేశ్వర ఆలయం

ఐరావతేశ్వర ఆలయం

ఐరావతేశ్వర ఆలయంలో క్లిష్టమైన రాతితో చెక్కిన శిల్పాలు అనేకం ఉన్నాయి. తంజావూరు బృహదీశ్వర ఆలయం మరియు గంగైకొండ ఆలయం కన్నా నిర్మినిర్మాణంలో ఇది చిన్నది అయినప్పటికీ వివరాలు విపులంగా వర్ణించటానికి చాలా ఉన్నాయి. యునెస్కో దీనిని ప్రపంచ వారసత్వ సంపద గా గుర్తించినది.

చిత్ర కృప : Vinoth Chandar Follow

పాపనాశనం

పాపనాశనం

పాపనాశనం అంటే 'పాపాలు నాశనం కావడం' అని అర్థం. ఇది దరాసురాం నుండి 10 కిలోమీటర్ల దూరంలో కలదు. ఇక్కడ ప్రసిద్ధి గాంచిన పళ్లైనాథస్వామి ఆలయం కలదు. దీనిని చోళరాజుల నిర్మించనట్లు తెలుస్తుంది. దీనిని హెరిటేజ్ స్మారకంగా భారతదేశం గుర్తించింది.

చిత్ర కృప : Joshua Remigius

పట్టీస్వరం

పట్టీస్వరం

పట్టీస్వరం, దరాసురం నుండి కేవలం మూడు కిలోమీటర్ల దూరంలో కలదు. పురాణాలమేరకు కామధేను దూడ పట్టీ, ఈశ్వరుని అనుగ్రహం కొరకు ఇక్కడే తపస్సు చేసాడని, అందుకే ఈ గ్రామానికి ఆ పేరొచ్చినట్లు చెబుతారు. ఇక్కడ దుర్గామాత గుడి ప్రసిద్ధి చెందినది.

చిత్ర కృప : VasuVR

పజ్హయారై

పజ్హయారై

పజ్హయారై చోళుల పూర్వ రాజధానిగా చెబుతారు. ఇక్కడ చోళులు అనేక ఆలయాలను నిర్మించారు. వాటిలో 'సోమేశ్వరార్ ఆలయం', 'మేత్రాలి', 'కెళ్తలి', 'తేన్తలి' ఆలయాలు ప్రసిద్ధి చెందినాయి. ఈ ఆలయాలు నిర్మాణశైలిలో వాటికవే సాటిగా నిలుస్తాయి.

చిత్ర కృప : Vinoth Chandar Follow

తిరునల్లూర్

తిరునల్లూర్

తిరునల్లూర్ కళ్యాణ సుందరేశ్వర దేవాలయానికి ప్రసిద్ధి చెందినది. పెళ్లికానివారు ఈ ఆలయాన్ని సందర్శిస్తే త్వరగా వివాహం జరుగుతుందని భక్తుల నమ్మకం. దరాసురం నుండి రోడ్డు మార్గం ద్వారా తిరునల్లూర్ చేరుకోవచ్చు.

చిత్ర కృప : VasuVR

దరాసురం ఎలా చేరుకోవాలి ?

దరాసురం ఎలా చేరుకోవాలి ?

వాయు మార్గం : ట్రిచి సమీప విమానాశ్రయం (100 KM).

రైలు మార్గం : దరాసురం లో రైల్వే స్టేషన్ కలదు. రాష్ట్రంలోని అన్ని ప్రధాన పట్టణాల నుండి ఇక్కడికి రైళ్లు వస్తుంటాయి

రోడ్డు మార్గం : తంజావూరు, కుంభకోణం, తిరుచిరాపల్లి, సేలం మొదలైన పట్టణాల నుండి దరాసురం కు ప్రభుత్వ / ప్రవేట్ బస్సులు తిరుగుతుంటాయి.

చిత్ర కృప : Vinoth Chandar

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X