Search
  • Follow NativePlanet
Share
» »మిమ్ములను అబ్బురపరిచే అజంతా గుహల అంద చందాలు

మిమ్ములను అబ్బురపరిచే అజంతా గుహల అంద చందాలు

By Venkatakarunasri

మహారాష్ట్ర లోని అజంతా గుహలు రాతి శిల్పకళ ను కలిగిన గుహ నిర్మాణాలు. ఇవి సుమారుగా క్రీ.పూ. రెండవ శతాబ్దము నకు చెందినవి. ఇక్కడి శిల్ప చిత్ర కళలు బౌద్దమత కళకు చెందినవి. మరియు 'విశ్వజనీయ చిత్రకళలు'. ఔరంగాబాద్ జిల్లా లోని మహారాష్ట్రలో నెలకొని ఉన్న అజంతా గుహలు మనకు వారసత్వంగా అందిన అపురూపమైన చారిత్రక సంపద.

ఇవి సుమారుగా క్రీ.పూ. రెండవ శతాబ్దం నాటివని చెబుతారు. ఇక్కడ కనబడుతున్న చిత్రకళలో ఎక్కువ భాగం బౌద్ధ మతానికి చెందినవి. గుహల లోపల అద్భుతమైన నిర్మాణ సౌందర్యం కనబడుతుంది. అజంతా గ్రామము బైట ఉన్న ఈ గుహలు 1983 నుండి యునెస్కో (UNESCO) వారిచే ప్రపంచ వారసత్వ ప్రదేశం గా పరిగణించబడుతున్నాయి.

ఔరంగాబాద్‌ జిల్లాలోని అజంతా గ్రామానికి వెలుపల ఈ గుహలు ఉన్నాయి. దట్టమైన అడవుల మధ్య గుర్రపు నాడా ఆకారంలో ఉన్న కొండపై ఇవి నెలకొని ఉన్నాయి. 56 మీటర్ల ఎత్తులోని పర్వతాల మీద ఇవి పడమర నుండి తూర్పునకు వ్యాపించి ఉన్నాయి.

పులిని వేటాడుతూ గుహలోకెళ్ళాడు అందులో ఏమున్నాయో తెలుసా ?

జాన్ స్మిత్

జాన్ స్మిత్

క్రీ.శ. 1819ఏప్రెల్ 28,ఆకాలంలో భారత దేశం బ్రిటీష్ ప్రభుత్వం ఆధీనంలో వున్న సంగతి మనందరికీ తెలిసిందే. జాన్ స్మిత్ అను ఒక బ్రిటిషర్ ఆఫీసర్ తన సహచరులతో అజంతా నగరానికి దగ్గరలో వున్నటువంటి అడవిలో వేటకి వెళ్ళాడు.

పులి

పులి

అంతలో జాన్ స్మిత్ కి ఒక పులి కనిపించింది. ఎలాగైనా ఆ పులిని వేటాడాలని జాన్ దాన్ని వెంబడించాడు. అది చాలా దూరం అలాగే పరిగెత్తుతూ అడవిలో నుండి ఒక్క సారిగా మాయమయ్యింది.జాన్ కి ఆశ్చర్యమేసింది.ముందరి అడవి కూడా ముగిసింది.

ద్వారం

ద్వారం

అక్కడ కొండలు తప్ప ఏమీలేవు. పులి ఎక్కడికి వెళ్ళినట్లు అంతలో దూరంగా ఒక ద్వారం కనిపించింది.

ఆఫీసర్స్

ఆఫీసర్స్

జాన్ మరియు మిగతా ఆఫీసర్స్ దట్టంగా పెరిగిన చెట్లమధ్య నుంచి అతి కష్టంమీద లోపలి వెళ్ళగలిగారు.

 గుహ

గుహ

అక్కడికి దగ్గరలో వున్నటువంటి ప్రజలుకూడ వారికి సహాయం చేసారు. అదేదో పాడుబడ్డ కోటగా జాన్ మొదట్లో భావించాడు.కానీ లోపలికి వెళ్లి చూస్తే జాన్ దిమ్మతిరిగిపోయింది. అది ఒక గుహ.

 గుహ

గుహ

అది అలాంటి ఇలాంటి గుహ కాదు.ఒకే పెద్ద బండరాయి చెక్కి గుహగా మలచబడింది.గోడలపై కళ్ళు చెదిరేటట్టుగా బుద్ధుని శిల్పాలు,ఒకదాన్ని మించి మరొకటి చెక్కబడి వున్నాయి,జాన్ ఆ గుహను దాటి కొంత ముందుకు వెళ్ళాడు.ప్రక్కనే మరొక గుహ వుంది.

29కేవ్స్

29కేవ్స్

అందులోను శిల్పాలు,విగ్రహాలు కళ్ళు చెదిరిపోయే పెయింటింగ్స్ వున్నాయి.అలా ఒకటి కాదు రెండు కాదు మొత్తం 29కేవ్స్ వున్నాయి.

అద్భుతమైన శిల్పకళ

అద్భుతమైన శిల్పకళ

ఆ గుహలు బ్రిటీష్ ఆఫీసర్ కి ఇదిరా భారతదేశ ఘనచరిత్ర అంటూ చెంపపై కొట్టినట్లు తమ అద్భుతమైన శిల్పకళను చూబిస్తూ మౌనంగా సమాధానం ఇచ్చాయి.

పురాతత్వశాస్త్రవేత్తలు

పురాతత్వశాస్త్రవేత్తలు

అలా అజంతాగుహలు ప్రపంచానికి పరిచయం అయ్యాయి.నిజానికి ఈ బుద్ధిస్ట్ కేవ్స్ నిర్మాణం క్రీ.పూ.200 నుండి క్రీ.శ.600వరకు జరిగిందని పురాతత్వశాస్త్రవేత్తలు చెబుతున్నారు.

భారతదేశం

భారతదేశం

6వ శతాబ్దం తర్వాత బుద్ధిజం రోజురోజుకు భారతదేశంలో అంతరిస్తూ వచ్చింది. దాంతో ఈ గుహల్లోకి రావటం జనాలు మానేసారు.

చెట్లు కప్పేసాయి

చెట్లు కప్పేసాయి

దాంతో కొద్దిరోజుల్లోనే కేవ్స్ చుట్టుపక్కల చెట్లు విపరీతంగా పెరిగిపోయి ఆ కేవ్స్ ని బాహ్యప్రపంచానికి కనిపించకుండా పూర్తిగా కప్పేసాయి.

ఏప్రెల్ 28,1918 న

ఏప్రెల్ 28,1918 న

ఇక అప్పటినుండి ఆ కేవ్స్ సూర్యుని చూడటానికి మౌనంగా నిరీక్షిస్తూనే వున్నాయి. ఆఖరికి జాన్ పుణ్యమా అని ఏప్రెల్ 28,1918 న ఈ కేవ్స్ అస్థిత్వం బయటపడింది.

 జాతకకథలు

జాతకకథలు

ఈ కేవ్స్ చిత్రాల్లో బుద్ధుడు మరియు ఇతర బోధిసత్వుల జీవితాలు మరియు జాతకకథలు చిత్రీకరించారు.రెండు గుహలో బుద్ధునికి సంబంధించిన చిత్రాలు వుంటాయి.

హంసలు బారులు తీరిన చిత్రం

హంసలు బారులు తీరిన చిత్రం

పైన హంసలు బారులు తీరిన చిత్రం సూపర్బ్ గా వుంటుంది. ఆ నాటి ప్రజలు వాడిన దుస్తులు, పరుసులు, దుప్పట్లు, చెప్పులను సైతం చిత్రాల్లో చూడవచ్చును.

ఆశ్చర్యచకితులను

ఆశ్చర్యచకితులను

ఆనాడు వేసిన రంగులు ఇప్పటికీ చెక్కుచెదరకుండా వుండటం చూపరులను ఆశ్చర్యచకితులను చేస్తుంది. 26వ గుహలో బుద్ధుని నిర్యాణాన్ని తెలిపే బౌద్ధవిగ్రహం విశ్రాంతిగా పడుకొనివున్నట్లుగా తెలుస్తుంది.

అజంతా

అజంతా

క్రింద ఆయన అనుచరులు దుఃఖించడం పైన దేవతలు ఆనందంగా స్వాగతాలు పలకడం ఆ చిత్రాల్లో మనం చూడొచ్చు. అప్పట్లో అజంతా హైదరాబాద్ రాజ్యంలో భాగంగా వుండేది.

నిజాం ప్రభువు

నిజాం ప్రభువు

నిజాం ప్రభువు ఈ కేవ్స్ ని మ్యూజియంగా మలిచి టూరిస్ట్ ల నుండి డబ్బులు సంపాదించేవాడు. నిజాం ప్రభువు డబ్బుల మీద వున్న శ్రద్ధ కేవ్స్ పై చూపించలేకపోయాడు.

టూరిస్ట్ ప్లేస్

టూరిస్ట్ ప్లేస్

దాంతో ప్రకృతి ఒడిలో బద్రంగా వున్నటువంటి గుహలు చాలావరకు పాడయ్యాయి. ఇండిపెండెన్స్ తర్వాత అజంతా మహారాష్ట్ర స్టేట్ కి వెళ్ళింది.మహారాష్ట్ర ప్రభుత్వం ఈ కేవ్స్ ని టూరిస్ట్ ప్లేస్ గా మలిచి బద్రంగా చూసుకొంటుంది.

ఏ సమయంలో దర్శించాలి?

ఏ సమయంలో దర్శించాలి?

అజంతా గుహలు దర్శించాలంటే సవత్సరంలో ఏ సమయంలో అయినా అనుకూలమే. వాతావరణ పరిస్ధితులతో పని లేదు. అయితే, కొద్దిపాటి నడక ఉంటుంది కనుక వేసవిలో వేడి కారణంగా అసౌకర్యంగా ఉంటుంది. మీకు అలసట కలిగిస్తుంది. ఈ ప్రదేశం చూడాలంటే వర్షాకాలం కూడా మంచి సమయమే. గుహల కింది భాగంలో ఉన్న నది ప్రవహిస్తూ చక్కటి పూర్తి ప్రవాహంతో పచ్చటి పరిసరాలతో మీకు మరచిపోలేని అనుభూతులు కలిగిస్తుంది.

ఎలా చేరాలి?

ఎలా చేరాలి?

అజంతా గుహలను విమానం, బస్ లేదా రైలుపై తేలికగా చేరవచ్చు. 100 కి.మీ. ల దూరంలో కల ఔరంగాబాద్ విమానాశ్రయం సమీప విమానాశ్రయం. దేశంలోని వివిధ నగరాలనుండి ఔరంగాబాద్ మరియు జలగాంవ్ లకు రైళ్ళు కలవు. ఇక్కడనుండి అజంతా గుహలు ఎంతో దగ్గర. బస్ పై ప్రయాణించగోరే వారికి ప్రభుత్వ మరియు ప్రయివేటు బస్ లు లభ్యంగా ఉంటాయి. ఔరంగాబాద్ నుండి అజంతా గుహలు రెండు లేదా మూడు గంటల ప్రయాణంలో చేరుకోవచ్చు.

అద్భుతాలను తప్పక చూడండి

అద్భుతాలను తప్పక చూడండి

అజంతా గుహల గురించి చదివి ఆనందించేకంటే, వ్యక్తిగతంగా వాస్తవంలో చూసి ఆనందించటం మెరుగు. ప్రపంచ వారసత్వ సంపదలలో ఒకటిగా చేర్చిన ఈ గుహలను మరణానికి ముందు ఏదో ఒక సమయంలో తప్పక చూసి ఆనందించవలసిందే. ఈ ప్రపంచ అద్భుతాలను తప్పక చూడండి. ఈ గుహల అంద చందాలు మిమ్ములను అబ్బుర పరుస్తాయి.

ఎలా వెళ్ళాలి?

ఎలా వెళ్ళాలి?

హైదరాబాద్ నుండి నిజామాబాద్, నాందేడ్, ఔరంగాబాద్ మీదుగా అజంతా గుహలను చేరవచ్చును. 11గంటల సమయం పడుతుంది.

pc: google maps

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X