Search
  • Follow NativePlanet
Share
» »ఆకాశగంగతీర్థంలో పుణ్యస్నానం చేసి, శ్రీవేంకటేశ్వరుడిని దర్శిస్తే, పాపప్రక్షాళ, సర్వశుభాలు

ఆకాశగంగతీర్థంలో పుణ్యస్నానం చేసి, శ్రీవేంకటేశ్వరుడిని దర్శిస్తే, పాపప్రక్షాళ, సర్వశుభాలు

ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ది చెందిన పుణ్యక్షేత్రం తిరుమల. ఆంధ్రప్రదేశ్ లో అతి పెద్ద పుణ్యక్షేత్రంగా అలరారుతున్న క్షేత్రం తిరుమల . అను నిత్యం లక్షలాది మంది భక్తుల రద్దీతో, అమూల్యమైన కానుకలతో ఈ తిరుమల పుణ్యక్షేత్రం నిత్యం కళకళలాడుతుంటుంది. సప్తగిరులపై వెలసిన కలియుగ వైకుంఠ పురి తిరుమల. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుని నిలయము అయిన తిరుమలలో ప్రతీ శిల చింతామణి , ప్రతీ చెట్టు, ప్రతీ తీగ మహర్షులు, ప్రతీ తీర్థం దేవగంగా స్వరూపాలని, వేంకటాచల మహాత్మ్యములో తెలుపబడినది.

దేశంలో మహా ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం తిరుమల. అసంఖ్యాకమైన పవిత్రతీర్థాలు ప్రవహించే తిరుమలలో కొన్ని తీర్థాలు మాత్రమే ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. మిగిలిన తీర్థములను దర్శించుట కొంచెం కష్టతరము. శ్రీనివాసుని దర్శించిన భక్తుడు సమీపంలో ఉన్న కొన్ని ప్రసిద్ద తీర్థాల్ని దర్శించి పాపాలను తొలగించుకుని, స్వామి వారి ఆశిస్సులు పొందవచ్చు. అలాంటి పున్యతీర్థాల్లో ముఖ్యమైనవి..

తిరుమలతిరుపతి పున్యతీర్థాలు

తిరుమలతిరుపతి పున్యతీర్థాలు

1.శ్రీస్వామిపుష్కరిణి, 2.కుమారధార 3.తుంబుర తీర్థం 4.రామకృష్ణ తీర్థం 5.ఆకాశగంగ 6.పాపవినాశన తీర్థం 7.పాండవతీర్థం.

తిరుమల తిరుపతి క్షేత్రంలో ఆకాశగంగ

తిరుమల తిరుపతి క్షేత్రంలో ఆకాశగంగ

తిరుమల తిరుపతి క్షేత్రంలో ఆకాశగంగ పరమపవిత్రమైనది. తిరుమలలోని పవిత్ర తీర్థాల్లో ఇదొకటి. ఇది ఇది శ్రీవారి ఆలయానికి ఉత్తరదిశలో సుమారు 3.5 కిలోమీటర్ల దూరం ఉంది. ఈ ఆకాశగంగ నీళ్ళు ఎక్కడి నుండి వస్తున్నాయో ఇప్పటికి తెలియని ఒక అంతుచిక్కని రహస్యం. ప్రక్రుతి సిద్దంగా సహజసిద్దంగా ప్రవహించే ఈ తీర్థానికి వివిధ రకాల కథలు ఉన్నాయి...

ఆకాశరాజు తన కుమార్తె

ఆకాశరాజు తన కుమార్తె

ఒకటి ఆకాశరాజు తన కుమార్తె పద్మావతీదేవికి వేంకటేశ్వరస్వామితో వివాహం జరిపించే సందర్భంలో గంగను భువికి రప్పించడం వల్ల ఈ తీర్థానికి ఆకాశగంగ అనే పేరు వచ్చింది.

హిమచలంలో ప్రవహించిన గంగ

హిమచలంలో ప్రవహించిన గంగ

హిమచలంలో ప్రవహించిన గంగ మూడు పాయలయిoది.ఆకాశభాగాన ప్రవహిస్తూ సాక్షాత్కరించిన గంగ, ఈ ఆకాశగంగ మర్త్యగంగ శ్రీ విశ్వేశ్వరస్వామి అభిషేకాధులకు ఉపయోగపడుతూ ఉంది. ఆకాశగంగ తీర్ధమహత్యాన్ని వరాహ-పద్మ-స్కంద పురాణాలూ విశదం చేస్తున్నాయి. సంతానం లేని వ్యక్తిని భోక్తగా నియమించి శ్రాద్ధం చేయడం వల్ల గార్ధభముఖుడయిన పుణ్యశిలుని కడతేర్చిన తీర్ధం.మేషమాసం చిత్తనక్షత్రంతో కూడిన పూర్ణిమా దినం ఈ తిర్ధానికి పర్వదినం.

శ్రీవారి పాద పద్మముల నుండి

శ్రీవారి పాద పద్మముల నుండి

శ్రీవారి పాద పద్మముల నుండి ఈ తీర్థము ఉద్భవించిందని భక్తుల ప్రగాడ విశ్వాసం. ఆకాశ గంగలో స్నానం ఆచరిస్తే తము చేసిన పాపాలు తొలగిపోయి 100 పుణ్యకార్యములు చేసినంత ఫలితం దక్కుతుందని భక్తుల నమ్మకం.

అంజనాదేవి తపస్సుచేసి

అంజనాదేవి తపస్సుచేసి

ఆకాశ గంగా ప్రదేశంలో ఒక పుష్కరంపాటు అంజనాదేవి తపస్సుచేసి, ఆంజనేయుని గర్భాన ధరించిందని ప్రతీతి.

ప్రతినిత్యం స్వామివారి అభిషేకానికి

ప్రతినిత్యం స్వామివారి అభిషేకానికి

ప్రతినిత్యం స్వామివారి అభిషేకానికి మూడు రజత పాత్రలనిండా ఆకాశతీర్థాన్ని తిరుమల నంబి వంశస్తులు తేవడం సంప్రదాయం.

ఆ పురాణ గాథ ఏంటంటే?

ఆ పురాణ గాథ ఏంటంటే?

తిరుమల నంబి పాపనాశనం నుంచి రోజూ తెచ్చిన జలముతో శ్రీ వేంకటేశ్వర స్వామి వారి అర్చామూర్తికి అభిషేకం జరిగేది. వయోవృధ్ధుడైన తిరుమల నంబి చాలా దూరము నుండి అలా కుండలో పాపనాశనం జలము తెస్తుంటే శ్రీవేంకటేశ్వర స్వామి కలతచెంది ఒకరోజు ఒక బాలుడు రూపంలో తాతా అని పిలిచి దాహంగా ఉంది కుండలో ఉన్న జలం యివ్వమని కోరుతాడు.

తిరుమల నంబి

తిరుమల నంబి

తిరుమల నంబి దానిని మూర్తి యొక్క అభిషేకమునకు తెస్తున్నానని ఇవ్వనని అంటాడు. కాని బాలుడు రాయితో కుండకు చిల్లు పెట్టి నీరు త్రాగుతాడు. దానికి నంబి ఎంతపని చేసావు. స్వామివారి అభిషేకానికి తీసుకొనివెళ్తున్న జలం అంతా త్రాగేసావు" అని బాలునితో అంటాడు.

 దానికి ఆ బాలుడు

దానికి ఆ బాలుడు" తాతా

దానికి ఆ బాలుడు" తాతా యిక్కడే గంగ ఉండగా ఎందుకు అంత దూరం వెళతావు అని అప్పటి వరకూ లేని ఆకాశ గంగను చూపిస్తాడు. ఈ రోజు నుంచి ఈ ఆకాశగంగ జలంతో అభిషేకం చెయ్యి" అని అదృశ్యం అవుతాడు.

" ఈ రోజు నేను కడుపు నిండా నీరు త్రాగాను

" ఈ రోజు నేను కడుపు నిండా నీరు త్రాగాను. నా కడుపు చల్లగా ఉంది. ఈ రోజు నాకు అభిషేకం వద్దు" అని శ్రీవేంకటేశ్వర స్వామి అర్చకులను ఆవహించి చెప్తాడు.

అభిషేకం కోసం నీరు తేసుకొని

అభిషేకం కోసం నీరు తేసుకొని

" అభిషేకం కోసం నీరు తేసుకొని వస్తుంటే బాలుడు అన్ని త్రాగేసాడు. ఈ రోజు అభిషేకం చెయ్యటానికి నీరు లేదు.అభిషేకం చెయ్యటాం ఎలా ?" అని బెంగపడుతున్న తిరుమల నంబి శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయం లోకి వస్తాడు.

 అక్కడ అర్చకులు చెప్పింది

అక్కడ అర్చకులు చెప్పింది

అక్కడ అర్చకులు చెప్పింది విని " శ్రీస్వామియే బాలుని రూపంలో వచ్చి కుండలో నీరు త్రాగి, అభిషేకాన్ని ఆకాశగంగా జలం తో చెయ్యమని చెప్పాడు" అని తిరుమల నంబి చాలా సంతోషిస్తాడు.

అప్పటి నుంచి ఆకాశగంగ జలం తో స్వామివారికి అభిషేకం నిర్వహిస్తున్నారు.

ఈ కథనం తరువాత నుంచి తిరుమల నంబి " తాతాచార్యుడు" గా కూడా పిలవబడ్డారు.

ఎలా వెళ్లాలి?

ఎలా వెళ్లాలి?

రైలు, రోడ్డు, విమాన మార్గంలో తిరుపతికి చేరుకోవచ్చు. తిరుపతి రైల్వే స్టేషన్ కు సమీపంలోనే ఆర్టీసీ బస్సులు నిలిపే స్టాండ్ ఉంటుంది. అక్కడి నుంచి తిరుమలకు నిమిషానికో బస్సు ఉంటుంది. ప్రధాన బస్ స్టేషన్ కు చేరుకున్నా అక్కడి నుంచి కూడా తిరుమలకు వెంట వెంట బస్సులు ఉన్నాయి. కొన్ని డిపోల నుంచి ఆర్టీసీ బస్సులు నేరుగా తిరుమలకు నడుస్తుంటాయి. ప్రైవేటు ట్యాక్సీలు కూడా బోలెడన్ని అందుబాటులో ఉన్నాయి. విమానంలో అయితే రేణిగుంట విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో తిరుమలకు వెళ్లాల్సి ఉంటుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X