Search
  • Follow NativePlanet
Share
» »ఇండియన్ నయాగరా ఫాల్స్:చిత్రకూట్ వాటర్ ఫాల్ అందాలు చూడటం నయన మనోహరం

ఇండియన్ నయాగరా ఫాల్స్:చిత్రకూట్ వాటర్ ఫాల్ అందాలు చూడటం నయన మనోహరం

చుట్టూ కొండలు, దట్టమైన అరణ్య ప్రాంతం..ప్రకృతి ఒడిలో గలగలా పారుతున్న నదిలో పడవ ప్రయాణం కనువిందు చేసే జలపాత అందాలుఎంతో రమణీయం. పవరళ్ళు తొక్కుతూ కిందకు గలగల పారే జలపాతం. ఒక్కో రుతువుకు ఒక్కో రంగు మార్చే జలపాతం...ప్రపంచ ప్రసిద్ది గాంచిన నయగరా జలపాత్ని పోలి ఉండే జలపాతం, దేశంలోనే అతి వెడల్పైన జలపాతం ఛత్తీస్ గఢ్ లోని జగదల్పూర్ కి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ సుందర జలపాతమే ''చిత్రకూట్'' వింధ్య పర్వత శ్రేణుల్లో పరుగులు పెట్టే ఇంద్రావతి నది నుండి ఈ జలపాతం ఏర్పడింది. దాదాపు వంద అడుగుల ఎత్తు నుండి నీటి ధారలు పడుతుంటాయి. మన భారతదేశంలోనే అత్యంత వెడల్పుగా విస్తరించి కనువిందుచేసే ఈ జలపాతం ఛత్తీస్ గఢ్, బస్తర్ జిల్లా జగదల్ పూర్ కు అతి సమీపంలో ఉంది.

గుర్రపు డెక్క ఆకారంలో

గుర్రపు డెక్క ఆకారంలో

ఈ చిత్రకూట్ జలపాతాన్ని ఇండియన్ నయాగరా ఫాల్స్ అని పిలుస్తారు. నయాగరా, చిత్రకూట్ ఈ రెండు వాటర్ ఫాల్స్ చూడటానికి గుర్రపు డెక్క ఆకారంలోనే ఉంటాయి. అందుకనే చిత్రకూట్ ని అలా పిలుస్తారు. చిత్ర కూట్ వాటర్ పాల్ చూడటానికి రెండు కళ్ళు సరిపోవు. ఎందుకంటే నీటి ధారలపై ఇంద్రధనుస్సు రంగులు పడటంతో జలపాతం మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది.

Photo Courtesy : en.wikipedia.org

వర్షాకాలంలో ఈ చిత్రకూట్ జలపాతం

వర్షాకాలంలో ఈ చిత్రకూట్ జలపాతం

వేసవిలో నీరు ఎక్కువగా లేకపోయినప్పటికీ వర్షకాలంలో మాత్రం జలపాతం హోరున శబ్దం చేస్తుంటుంది. వర్షాకాలంలో ఈ చిత్రకూట్ జలపాతం దాదాపు వెయ్యి అడుగల వెడల్పుతో పరవళ్ళు తొక్కుతుంది. ఈ జలపాత అందాలు చూడటానికి వర్షకాలం సరైన సమయం. వర్షాలు పడటంతో చిత్రకూట్ చుట్టూ ఉన్న అరణ్య ప్రాంతం పచ్చందాలు పులుముకుని కొత్తందాలతో కనువిందు చేస్తుంది.

PC: ASIM CHAUDHURI

 జలపాతం ఎర్ర రంగులో

జలపాతం ఎర్ర రంగులో

ఆహ్లాదకర వాతావరణానికి తోడు రకరకాల పక్షులు జలపాత పరిసరాల్లో సందడి చేస్తుంటాయి. వర్షపు నీళ్ళు మట్టితో కలవడం వల్ల జలపాతం ఎర్ర రంగులోకి మారుతుంది.

Photo Courtesy : en.wikipedia.org

జూలై నుంచి అక్టోబర్ మధ్య కాలం

జూలై నుంచి అక్టోబర్ మధ్య కాలం

చిత్రకూట్ జలపాతానికి ఏ రుతువులోనైనా వెళ్లవచ్చు. కానీ జూలై నుంచి అక్టోబర్ మధ్య కాలంలో నీరు ఎక్కువగా ఉండటంతో జలపాతం మరింత అందంగా కనిపిస్తుంది. స్పందించే మనస్సుండాలే కానీ ఈ జలపాతం అందాలు మాటలకందని ముగ్ధత్వంతో కనిపిస్తాయి.

Photo Courtesy : en.wikipedia.org

సూర్యుడు మనకు బైబై చెప్పే సమయంలో

సూర్యుడు మనకు బైబై చెప్పే సమయంలో

వర్షాకాంలో గోధుమ వర్ణంలోకి మారి వింత అందాల్ని ప్రక్రుతి ప్రేమికులకు పరిచయం చేస్తుంది. అలాగే సూర్యకాంతిని బట్టి ఈ జలపాతం రంగు మారుతూ కనిపిస్తుంది. ఉదయాన ధవళ వర్ణంలో ఉన్న ఈ జలపాతం సూర్యకాంతి తీక్షణతను బట్టి గోధుమ, నారింజ రంగులోకి మారి సూర్యాస్తమయానికి అరుణవర్ణంలో మనోజ్ఝంగా కనిపిస్తుంది. సూర్యుడు మనకు బైబై చెప్పే సమయంలో అంటే అస్తమించే సమయంలో జలపాత అందాలు చూడటం నయన మనోహరం, అద్భుతమనే చెప్పాలి.

Photo Courtesy : Debsourabh Ghosh

పాలలాంటి తెలుపుతో

పాలలాంటి తెలుపుతో

ఎర్రగా మారిన నీళ్ళు శీతాకాలం వచ్చే సరికి పాలలాంటి తెలుపుతో కిందకు జళజళ దూకడం చూస్తే మనస్సు పరవళ్ళు తొక్కుతుంది. ఛత్తీస్ ఘడ్ లోని బస్తర్ అందమైన గ్రామం. వింద్య పర్వత సానుష్టల నడుమ దట్టమైన అడవి మధ్య ఎన్నో సరస్సులు, కొండలు, గుట్టలు, గుహలు, జలపాతాలలో నిండిన ప్రాంతం బస్తర్.

Photo Courtesy : Aashishsainik

ఈ జలపాతానికి సమీపంలో

ఈ జలపాతానికి సమీపంలో

ఈ జలపాతానికి సమీపంలో శివాలయం, పార్వతి గుహలు కూడా ఉన్నాయి. అనేక చిన్న చిన్న శివలింగాలు, త్రిశూలం, వినాయక, శివ విగ్రహాలు జలపాతం తీరంలో ఉన్నాయి. ఇక్కడ ఉన్న శ్రీహరి ఆలయానికి వేలకొద్దీ భక్తులు వస్తుంటారు. ఆ ఆలయాలను దర్శించిన వారు చిత్రకూట్ జలపాతాన్ని తప్పక సందర్శిస్తుంటారు.

PC: Ksh85

సహజ సిద్ధమైన ఈ జలపాతాన్ని

సహజ సిద్ధమైన ఈ జలపాతాన్ని

సహజ సిద్ధమైన ఈ జలపాతాన్ని ప్రభుత్వ పర్యాటక శాఖ పర్యాటక స్థలంగా తీర్చిదిద్దింది. పర్యాటక శాఖనే ప్రత్యేకంగా ఓ హౌటల్‌ని ఏర్పాటు చేయడంతో పాటు, పిల్లల కోసం పార్కులు కట్టించింది.సందర్శకుల కోసం చిన్న చిన్న కుటీరాలను ఏర్పాటు చేసింది. అలాగే ప్రైవేట్ రిసార్టులు, లాడ్జీలు కూడా ఉన్నాయి.

PC: Moulina kumar

ఉవ్వెత్తున ఉరుకుతూ ప్రవహించే జలపాతాన్ని

ఉవ్వెత్తున ఉరుకుతూ ప్రవహించే జలపాతాన్ని

పైన ఉన్న విద్యుత్ దీపాలు అలంకరించిన పార్కు నుంచే కాక క్రిందకు దిగి పైనుంచి ఉవ్వెత్తున ఉరుకుతూ ప్రవహించే జలపాతాన్ని చూడవచ్చు.

Photo Courtesy : en.wikipedia.org

 రాత్రి సమయాల్లో ఫ్లడ్ లైట్లు వెలుగులో

రాత్రి సమయాల్లో ఫ్లడ్ లైట్లు వెలుగులో

Chitrakoot - PC : Official Website For Uttar Pradesh Tourism

రాత్రి సమయాల్లో ఫ్లడ్ లైట్లు వెలుగులో నిశ్శబద్ద వాతావరణంలో చల్లనిగాలులు వీస్తుంటే చంద్రుని వెన్నెలకాంతిలో జలపాతాన్ని వీక్షించేందుకు సందర్శకులు ఆసక్తి చూపుతారు. బోటింగ్ సదుపాయం ఉండటం వల్ల బోటులో నుండి జలపాతం చుట్టూ ఉన్న పరిసరాలను తిలకించవచ్చు.

చిత్రకూట్‌ వాటర్‌ఫాల్స్‌ని

చిత్రకూట్‌ వాటర్‌ఫాల్స్‌ని

చిత్రకూట్‌ వాటర్‌ఫాల్స్‌ని చూడటానికి మన దేశంతో పాటు, విదేశీ సందర్శకులు కూడా వేల మంది వస్తుంటారు. చిత్రకూట్ గుర్రపు డెక్క ఆకారంలో విస్తరించి ఉవ్వెత్తున ఎగిసిపడే ఈ జలపాత అందాల్ని తమ కెమెరాల్లో బంధించాలని ఎంతో మంది పోటీపడుతూ కనిబడతారు.

Photo Courtesy : Mashooque

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X