» »ఈ వేసవికి ఛలో "ఆంధ్రా ఊటీ"!

ఈ వేసవికి ఛలో "ఆంధ్రా ఊటీ"!

By: Venkata Karunasri Nalluru

ఆంధ్రప్రదేశ్ లోని ప్రసిద్ధ వేసవి విడిది చిత్తూరు జిల్లా దగ్గర ఉన్న మదనపల్లె హార్సిలీ హిల్స్. ఆంధ్రా ఊటీ అని దీనికి పేరు. ఏనుగు మల్లమ్మ కొండ అని కూడా అంటారు.

తూర్పు కనుమలలోని దక్షిణ భాగపు కొండలనే వరుసే హార్సిలీ హిల్స్ అంటారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోకెల్లా ఎత్తైన ప్రదేశం హార్సిలీ హిల్స్ లోనే ఉంది.

హార్సిలీ హిల్స్ కు వెళ్ళే కొండదారి ఎంతో అందంగా ఉంటుంది. రెండు వైపులా నీలగిరి (యూకలిప్టస్) వంటి అనేక జాతుల చెట్లతో కళ్ళకింపుగా ఉంటుంది. జింకలు, చిరుతపులుల వంటి వన్యమృగాలు కూడా ఈ ప్రాంతంలో సంచరిస్తుంటాయి.

ఆంధ్రా ఊటీ

1. దూరం

1. దూరం

హార్సిలీ హిల్స్ బెంగళూరు నుండి 160 కి.మీ., తిరుపతి నుండి 140 కి.మీ. దూరంలో ఉంది. సముద్ర మట్టానికి 1,314 మీ ఎత్తులో ఉంది. చలికాలంలో 3 డిగ్రీల సెంటీగ్రేడు నుండి మండు వేసవిలో 32 డిగ్రీల సెంటీ గ్రేడు వరకు ఉష్ణోగ్రత ఉంటుంది.

pc: Ram Prasad

2. భవనం యొక్క చరిత్ర

2. భవనం యొక్క చరిత్ర

డబ్ల్యూ.హెచ్.హార్సిలీ అనే బ్రిటిషు అధికారి 1863 - 67 మధ్య కాలంలో ఈ ప్రాంతంలో కలెక్టరుగా పనిచేసాడు. 1863 లో వేసవి విడిదిగా ఇక్కడ ఒక ఇంటిని నిర్మించాడు. దీన్ని ఫారెస్టు బంగ్లా అంటారు. ఆ తరువాత కార్యాలయ భవనం నిర్మించారు. ఈ భవనాలు ఇప్పటికీ నివాస యోగ్యంగా ఉండి, వాడుకలో ఉన్నాయి. ఫారెస్టు బంగ్లాలోని నాలుగు గదుల్లో ఒక దానికి హార్సిలీ పేరు పెట్టారు.

pc:Bipin Gupta

3. సందర్శించదగ్గ స్థలాలు

3. సందర్శించదగ్గ స్థలాలు

హార్సిలీ హిల్స్ కు వెళ్ళే కొండదారి ఎంతో అందంగా ఉంటుంది. రెండు వైపులా నీలగిరి (యూకలిప్టస్) వంటి అనేక జాతుల చెట్లతో కళ్ళకింపుగా ఉంటుంది. జింకలు, చిరుతపులుల వంటి వన్యమృగాలు కూడా ఈ ప్రాంతంలో సంచరిస్తుంటాయి.

pc:Colin Smith

4. ఇక్కడి ప్రత్యేకతలు

4. ఇక్కడి ప్రత్యేకతలు

ఆహ్లాదకరమైన వాతావరణం, ప్రకృతి సౌందర్యం ఇక్కడి ప్రత్యేకతలు.

pc:Andrew Curtis

5. ఇక్కడ చూడదగ్గ ఇతర ప్రదేశాలు

5. ఇక్కడ చూడదగ్గ ఇతర ప్రదేశాలు

142 సంవత్సరాల వయసు కలిగిన యూకలిప్టస్ చెట్టు ఇక్కడి ప్రధాన పర్యాటక ఆకర్షణల్లో ఒకటి. అంతేకాకుండా జూ పార్క్, గవర్నర్ బంగ్లా, జిడ్డు కృష్ణమూర్తి నెలకొల్పిన రిషివ్యాలీ విద్యాలయము ఉంది.

pc:Adam Morse

6. హిల్ రిసార్ట్

6. హిల్ రిసార్ట్

హార్స్లే హిల్స్ ఆంధ్రప్రదేశ్ లో మదనపల్లె పట్టణం సమీపంలో ఉన్న చాలా ప్రజాదరణ పొందిన వేసవి హిల్ రిసార్ట్.

pc:NAYASHA WIKI

7. ఎలా చేరుకోవాలి

7. ఎలా చేరుకోవాలి

ఈ రిసార్ట్ కు బెంగుళూర్, హైదరాబాద్ మరియు తిరుపతి వంటి దక్షిణ ప్రధాన నగరాల నుండి సులభంగా చేరుకోవచ్చు.

pc:Peter Trimming

8. సందర్శించవలసిన సమయం

8. సందర్శించవలసిన సమయం

ఏప్రిల్ మరియు మే నెలల్లో ఈ ప్రాంతానికి పర్యాటకులు ఎక్కువగా వస్తారు. ఈ సుందరమైన పర్వతం వేడి వాతావరణం నుంచి బాగా అవసరమైన ఉపశమనంను కలిగిస్తుంది.

pc:Colin Smith

9. ఏనుగు మల్లమ్మ కొండ

9. ఏనుగు మల్లమ్మ కొండ

ఈ కొండలను ఇంతకు ముందు ఏనుగు మల్లమ్మ కొండ అని పిలిచేవారు. ఆ ప్రదేశంలో మల్లమ్మ చిన్న పిల్లగా ఉన్నప్పుడు ఏనుగులు సంరక్షించాయి. అందుకే ఏనుగు మల్లమ్మ కొండ అని పేరు వచ్చింది.

pc:suffering_socrates

10. మల్లమ్మ చరిత్ర

10. మల్లమ్మ చరిత్ర

మల్లమ్మ సమీపంలోని గిరిజన జాతులు మరియు రోగాల బారిన పడిన వ్యక్తుల కోసం శ్రద్ధ తీసుకునేది. ఆమె ఒక రోజు అకస్మాత్తుగా అదృశ్యమవడంతో గిరిజన ప్రజలు తన కోసం ఒక ఆలయం నిర్మించాలని నిర్ణయించారు.

pc:Ram Prasad

11. బ్రిటిష్ అధికారి, డబ్ల్యూడి హార్స్లే

11. బ్రిటిష్ అధికారి, డబ్ల్యూడి హార్స్లే

వేసవి విడిది కోసం వచ్చిన ఒక బ్రిటిష్ అధికారి డబ్ల్యూడి హార్స్లే ఈ హిల్ స్టేషన్ లో రెండు ఇళ్ళు, కరాచీ రూమ్ మరియు పాల బంగళా నిర్మించడం ద్వారా అయన పేరుతో పిలవబడుతుంది.

pc:Bidgee

Please Wait while comments are loading...