» »హంపి దేవాలయంలో మనకు తెలియని ఎన్నో రహస్యాలు !

హంపి దేవాలయంలో మనకు తెలియని ఎన్నో రహస్యాలు !

Written By: Venkatakarunasri

మనస్సు పెట్టి వినాలే కాని రాళ్ళలో కూడా సంగీతాన్ని వినొచ్చు అని ఊరికే అన్నారా! నిజమండీ !సంగీతం ఎన్నో రోగాలను నయం చేస్తుంది. అటువంటి సంగీతాన్ని ప్రశాంతత కలిగిన దేవాలయాలలోనే ఆ కాలపు రాజుల నైపుణ్యానికి చిహ్నాలుగా కలిగిన ఎన్నో దేవాలయాలు మన దేశంలో వున్నాయి.

కేదార్ నాద్ ...మంచు కొండల్లో మహా రహస్యాలు !

సంగీతం గురించి భారతదేశానికి తెలిసినంతగా మరే దేశానికి తెలిసిఉండదు. సంగీతం ఆది ప్రణవనాదం నుండి ఉద్భవించింది అని అందరికీ విదితమే. సినిమా సంగీతానికి, భారతీయ సంగీతానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. అది వినటంలోనూ, ప్రదర్శించడంలోనూ..! సంగీతం అంటే శబ్దాన్ని కాలంతోపాటు మేళవించి వినసొంపుగా వినిపించే అద్భుత ప్రక్రియ.

టాలీవూడ్ హీరోలు- జన్మస్థానాలు!!

సంగీతవాయిద్యాలతో చేసే సంగీత సాధనే కష్టంరా దేవుడా అనుకుంటే ... రాతిని తాకితే సరిగమపదనిస స్వరాలు వచ్చే స్థంభాలు భారతదేశంలో నిజంగా అద్భుతమనే చెప్పాలి. భారతదేశంలో ఈ రాతి స్థంభాలు భారతీయ కళలకు, సాంకేతికతకు నిలువెత్తు నిదర్శనాలు. ఇలాంటి రాతి స్థంభాలను సుమారు వెయ్యి సంవత్సరాల క్రితమే ఉద్భవించాయి. దక్షిణ భారతదేశాన్ని పాలించిన ఎంతో మంది రాజులకు సంగీతం అంటే మహా ఇష్టం.

బాహుబలి షూటింగ్ ప్రదేశాలు !!

వీరికెప్పుడు కాలక్షేపం దొరికినా సంగీతాన్ని వినేవారు, ఆస్వాదించేవారు. సంగీతం ను విశ్వవ్యాప్తం చేయాలనే ఉద్దేశ్యంలో అప్పటి రాజులు కంకణం కట్టుకొని యాత్రికులు ఎక్కువగా దర్శించే ఆలయాలలో మ్యూజికల్ పిల్లర్స్ ను ఏర్పాటుచేశారు. ఎప్పుడైనా రాజులు దేవాలయానికి వెళితే గుడి మధ్యలో కూర్చొని ఈ స్థంభాల దగ్గర విద్వాంసులు చేసే కచేరీలను, అందుకు తగ్గట్టు నాట్యం చేసే నర్తకీమణుల నృత్యాలను చూస్తూ ఉండేవారట.

రాతిని తాకితే సరిగమపదనిస స్వరాలు వచ్చే స్థంభాలు !

ఈ నెలలో టాప్ 5 ఆర్టికల్స్ కొరకు క్రింద చూడండి

1. హంపి విఠల దేవాలయం

1. హంపి విఠల దేవాలయం

విఠల దేవాలయం విష్ణమూర్తి దేవాలయం. ఇది 16వ శతాబ్దం నాటిది. ఎంతో అందమైన శిల్పశైలికల దీనిని హంపి వెళ్ళే పర్యాటకులు తప్పక చూడాలి. ఈ ప్రాంతంలోని దేవాలయాలలో ఇది ప్రధాన ఆకర్షణ. దీనికి సాటి అయిన దేవాలయం మరొకటి లేదు. ఈ దేవాలయం తుంగభద్ర నది దక్షిణం ఓడ్డున కలదు.

ఇది కూడా చదవండి:హంపిలో గల భూగర్భ శివ ఆలయం గురించి మీకు తెలుసా?

2. విఠల దేవాలయం

2. విఠల దేవాలయం

అసలైన దక్షిణ భారత ద్రవిడ దేవాలయ శిల్పశైలి దీనిలో కనపడుతుంది. విఠల దేవాలయం రాజు దేవరాయ II పాలనలో నిర్మించబడింది. విజయనగర సామ్రాజ్య తీరుతెన్నులు పుణికి పుచ్చుకొంది.

హంపి బడవ శివలింగం - ప్రపంచంలో అతి పెద్ద శివలింగాలలో ఒకటి !

PC:Vtanurag

3. 56 మ్యూజికల్ స్తంభాలు

3. 56 మ్యూజికల్ స్తంభాలు

అలంకరించబడిన స్తంభాలు, చెక్కడాలు కల ఈ దేవాలయం పర్యాటకులకు అద్భుత ఆనందం కలిగిస్తుంది. ఇక్కడ మీరు చూడవలసినది రంగ మంటపం మరియు 56 మ్యూజికల్ స్తంభాలు. వాటిని ముట్టుకుంటే చాలు సంగీతం వస్తుంది.

మూడు రోజులపాటు జరిగే హంపి ఉత్సవాలలో ప్రధాన ఘట్టాలు !

PC:Dr Murali Mohan Gurram

4. గర్భగుడి

4. గర్భగుడి

విగ్రహాలను లోపల గర్భగుడిలో ప్రధాన పూజారి మాత్రమే ప్రవేశం కల ప్రదేశంలో ఉంచారు. చిన్న గర్భగుడి లోకి భక్తులు ప్రవేశించవచ్చు. అలంకరణ అంతా బయటే కనపడుతుంది. ఏక శిలతో నిర్మించిన రధం ప్రధాన ఆకర్షణ. ప్రాంగణంలో తూర్పు వైపున, కల ఇది రధం ఎంత బరువైనప్పటికి రాతి చక్రాలతో తేలికగా కదిలిపోతుంది.

రాయల వారి కీర్తిని ప్రపంచానికి చాటిచెప్పే హంపి ఉత్సవాలు !

5. అవశేషాలు

5. అవశేషాలు

అనేక మంటపాలు, దేవాలయాలు, హాళ్ళు కూడా దేవాలయ సముదాయంలో కలవు. విజయనగరసామ్రాజ్యానికి విజయనగరం లేదా హంపి రాజధాని. దక్షిణ భారతదేశములోని అతి పెద్ద సామ్రాజ్యాలలో విజయంగరసామ్రాజ్యం ఒకటి. 14వ శతాబ్దం నగర అవశేషాలు 26 చదరపు కి.మి విస్తీర్ణంలో విస్తరించి ఉంటాయి.

ఐహోళే - రాతి శిల్పాల నగరం !!

6. పెద్ద పెద్ద ప్రాకారాలు

6. పెద్ద పెద్ద ప్రాకారాలు

ఉత్తరం వైపు తుంగ భద్ర నది మిగతా మూడు వైపుల పెద్ద పెద్ద గ్రానైటు శిలలతో అప్పటి విజయనగర వీధుల వైభవాన్ని తెలుపుతూ ఉంటుంది. ఈ పట్టణంలోకి ప్రవేశిస్తుంటే కనిపించే విశాలమైన భవంతులు, పెద్ద పెద్ద ప్రాకారాలు అప్పటి నగర నిర్మాణ చాతుర్యాన్ని, సుల్తానుల అవివేక వినాశన వైఖరిని వెల్ల బుచ్చుతాయి.

హనుమంతుడు జన్మించిన ప్రదేశం !

7. సుందరమైన ఇళ్ళు

7. సుందరమైన ఇళ్ళు

800 గజాల పొడవు 35 గజాల వెడల్పు ఉన్న హంపి వీదులలో అత్యంత సుందరమైన ఇళ్ళున్నాయి. విరుపాక్ష దేవాలయం - హంపి వీధికి పశ్చిమ చివర విరుపాక్ష దేవాలయం ఉంది. 50 మీటర్ల ఎత్తు ఉన్న తూర్పు గాలి గోపురం విరుపాక్ష దేవాలయంలోనికి స్వాగతం పలుకుతుంది.

హంపి ... విజయనగర కాలానికి ప్రయాణం !

8. నిర్విఘ్నమైన చరిత్ర

దేవాలయంలో ప్రధాన దైవం విరుపాక్షుడు (శివుడు). ప్రధాన దైవానికి అనుసంధానంగా పంపా దేవి గుడి, భువనేశ్వరి దేవి గుడి ఉంటుంది. ఈ దేవాలయానికి 7 వ శతాబ్దం నుండి నిర్విఘ్నమైన చరిత్ర ఉంది. విరుపాక్ష-పంపా ఆలయం విజయనగర సామ్రాజ్యం కంటే ముందు నుండి ఉన్నదని శిలాశాసనాలు చెబుతున్నాయి.

బెల్గాం నగరం - చరిత్ర మరియు సంస్కృతుల సంగమం !!

9. చాళుక్యుల, హోయస్లల పరిపాలన

9. చాళుక్యుల, హోయస్లల పరిపాలన

10-12 శతాబ్దానికి చెందినవి అయి ఉండవచ్చని చరిత్రకారుల అంచనా. చరిత్ర ఆధారాల ప్రకారం ప్రధాన దేవాలయానికి చాళుక్యుల, హోయస్లల పరిపాలన మార్పులు చేర్పుల జరిగాయని అయితే ప్రధాన ఆలయం మాత్రం విజయనగ రాజులే నిర్మించారు. విజయనగర రాజుల పతనమయ్యాక దండయాత్రల వల్ల 16 వ శతాబ్ధానికి హంపి నగరంలోని అత్యాద్బుత శిల్ప సౌందర్యం నాశమైపోయింది.

మహారాజులా ప్రయాణించండి !

10. శిల్ప కళా సంపత్తి

10. శిల్ప కళా సంపత్తి

హంపికి ఈశాన్య భాగంలో అనెగొంది గ్రామానికి ఎదురుగా ఉన్న విఠల దేవాలయ సముదాయం అప్పటి శిల్ప కళా సంపత్తికి ఒక నిదర్శనం. ఈ దేవాలయం మరాఠీలు విష్ణుమూర్తిగా ప్రార్థించే విఠలుడిది. ఈ ఆలయం 16 వ శతాబ్ధానికి చెందినది. విఠలేశ్వర దేవాలయం ఆకర్షణీయమైన విశేషం సప్త స్వరాలు పలికే ఏడు సంగీత స్తంభాలు.ఈ దేవాలయంలోనే పురందరదాస ఆరాధనోత్సవాలు జరుతాయి.

11. శిలా రథం

11. శిలా రథం

ఈ ఏక శిలా రథం విఠల దేవాలయ సముదాయానికి తూర్పు భాగంలో ఉంది. ఇంకో విశేషం ఏమంటె ఈ రథానికి కదిలే చక్రాలు ఉంటాయి.

12. గజ శాల

12. గజ శాల

పట్టపు ఏనుగులు నివాసం కొరకు వాటి దైనందిన కార్యకలాపాల కొరకు రాజ ప్రసాదానికి దగ్గరలోనే గజశాల ఉంది. ఏనుగులు కవాతు చేయడానికి వీలుగా ఈ గజశాలకు ఎదురుగా ఖాళీ ప్రదేశం ఉంది.

13. సైనిక స్థావరా

13. సైనిక స్థావరా

ఈ గజశాల గుమ్మాలు కొప్పు ఆకారంలో ఉండి ముస్లిం కట్టడ శైలి చూపుతున్నాయి. మావటి వారు సైనికులు ఉండడానికి గజశాలకు ప్రక్కన సైనిక స్థావరాలు ఉన్నాయి.

14. ఇతర విశేషాలు

14. ఇతర విశేషాలు

గోపురం నీడ ప్రధాన ఆలయం లోని ఒక చిన్న రంద్రంలో నుండి క్రింద నుండి పైకి అనగా తలక్రిందులుగా కనపడటం అప్పటి కళా చాతుర్యంకి నిదర్శనం.

నీటిలో తేలియాడే 15 కిలోల బరువు వున్న మహిమ గల రాయి ఎక్కడుందో మీకు తెలుసా?

శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయం వెనుక దాగి వున్న నిజాలు

అంతుచిక్కని మిస్టరీ చెట్టు ఎక్కడుందో మీకు తెలుసా ?

భైరవకోన గురించి మీకు తెలియని ఎన్నో నిజాలు !

శృంగార బావి యొక్క రహస్యం మీకు తెలుసా?