» »అరకు లోయ అందాలు చూడాల్సిందే

అరకు లోయ అందాలు చూడాల్సిందే

Written By: Venkatakarunasri

ప్రశాంతంగాను, పరిశుభ్రంగానూ వుండే ఈ హిల్ స్టేషన్ తప్పక చూడదగినది. విశాఖపట్నం నుండి అరకు లోయ కు వెళ్ళే మార్గం అనేక అందమైన దృశ్యాలను కూడా అందిస్తుంది. అరకు వాలీ ఎలా చేరాలి ? అక్కడ ఏమేమి చూడాలి ? ఏమి తినాలి ? ఎక్కడ వుండాలి ? షాపింగ్ ఎక్కడ చేయాలి ? అనే అంశాలు వివరిస్తున్నాం, పరిశీలించండి.

అరకు లోయ ఆంధ్ర ప్రదేశ్ లోని విశాఖపట్నం జిల్లాలో కలదు. పచ్చటి ప్రదేశాలతో అనేక వృక్షాలతో ఈ లోయ ఒక స్వర్గం వాలే వుంటుంది. కొండలపై పాకే పొగ మంచు అద్భుత దృశ్యాలు చూపుతుంది. అరకు లోయ పరతనలో మీరు ఇంకనూ ఇక్కడే కల బొర్రా గుహలు కూడా చూడవచ్చు. ఈ కొండలలో కల ఈ గుహలు ఇప్పటి వరకూ ఒక మిస్టరీ. అంతులేని సహజ అందాల ఈ ప్రదేశం ఇప్పటి వరకూ పర్యాటక ఒత్తిళ్ళ కు కొంత దూరంగానే వుంది. 

అరకు లోయ అందాలు చూడాల్సిందే

చాపరాయ్ జలపాతాలు

చాపరాయ్ జలపాతాలు

సుందరమైన అరకు లోయలో అనేక జలపాతాలు కలవు. వీటిలో ఆనందంగా మీరు జలకాలాడుతూ విహరించవచ్చు. చాప రాయ్ జలపాతాలు అరకు లోయకు సుమారు 15 కి. మీ. ల దూరంలో కలవు. వీటి చుట్టూ దట్టమైన అరణ్యం వుంటుంది. ఒక పిక్నిక్ లంచ్ కూడా ఇక్కడ ప్లాన్ చేసికొనవచ్చు.

Photo Courtesy: Satyam

బొర్రా గుహలు

బొర్రా గుహలు

విశాఖపట్నం నుండి అరకు వెళ్ళే మార్గంలో అద్భుతమైన బొర్రా గుహలు చూడవచ్చు. ఇవి అరకు లోయకు సుమారు 35 కి. మీ. లు. బొర్రా గుహలు దేశంలో అతి పెద్దవి సముద్ర మట్టానికి సుమారు 70 5 మీ. ల ఎత్తున కలవు. ఈ గుహలలో ఏర్పడిన సున్నపు రాయి జారుడు మిమ్మల్ని ఆశ్చర చకితులను చేస్తుంది. ఈ సున్నపు రాయి జారుడు మీకు వివిధ రంగులలో కూడా కనపడుతుంది.

Photo Courtesy: vijayvenkatesh

గాలి కొండలు వ్యూ పాయింట్

గాలి కొండలు వ్యూ పాయింట్

గాలి కొండలు వ్యూ పాయింట్ అరకు లోయకు సుమారు 15 కి. మీ. ల దూరంలో కలదు. సముద్ర మట్టానికి సుమారు 38 00 అడుగుల ఎత్తు న కల ఈ ప్రదేశం మీకు కొండల పైన, లోయ లోను కల ఎన్నో అద్భుత ప్రకృతి దృశ్యాలను చూపుతుంది.

Photo Courtesy: roadconnoisseur

ట్రైబల్ మ్యూజియం

ట్రైబల్ మ్యూజియం

అరకు లోయ లో కల ట్రైబల్ మ్యూజియం చాలా ఆసక్తికరమైన ప్రదేశం. ఈ మ్యూజియం లోని సేకరణలు ప్రదేశ చరిత్రను, స్థానిక అటవీ తెగల జీవన విధానాలను తెలుపుతాయి. ఈ మ్యూజియం లో ట్రైబల్ ఆర్ట్ మరియు క్రాఫ్ట్ సెంటర్ కూడా కలదు. ఇక్కడ ఎగ్జి బిషన్ లు మరియు వర్క్ షాప్ లు రెగ్యులర్ గా జరుగుతాయి.

Photo Courtesy: Adityamadhav

అనంతగిరి జలపాతాలు

అనంతగిరి జలపాతాలు

అనంతగిరి జలపాతాలు అరకు వాలీ కి సుమారు 30 కి. మీ. ల దూరంలో కలవు. సుమారు వంద అడుగుల ఎత్తు నుండి పడే జలపాతాలు వర్ష రుతువులో పర్యాటకులను ఆశ్చర్య పరుస్తాయి. ప్రధాన మార్గం నుండి సుమారు రెండు కి. మీ. లు నడక సాగించాలి. జలపాతాల వద్ద జారుడు అధికం కనుక తగిన జాగ్రత తీసుకోవాలి.

చంపి మరియు మాడుగుల ట్రెక్కింగ్

చంపి మరియు మాడుగుల ట్రెక్కింగ్

అరకు వాలీ నుండి కల ట్రెక్కింగ్ మార్గాలలో చంపి మరిఉ మాడుగుల విలేజ్ లు చూడవచ్చు. దట్టమైన ఈ పచ్చటి మార్గాల ప్రయాణం కొద్దిపాటి సాహసమే. వర్షా కాలంలో ఈ మార్గాలలో జారుడు అధికం కనుక జాగ్రత్త వహించాలి.

Photo Courtesy: roadconnoisseur

కాటికి జలపాతాలు

కాటికి జలపాతాలు

అరకు వాలీ లో చూడదగిన మరో ప్రదేశం కాటికి జలపాతాలు. ఈ జలపాతాలు బొర్రా గుహల సమీపంలోనే కలవు. దీనికి గల మార్గం చాలా ఏటవాలుగా వుండి చేరేందుకు కష్టం గా వుంటుంది. మార్గం చాలా వరకూ ట్రెక్కింగ్ లో శ్రమ కు ఓర్చి వెళ్ళాలి.

Photo Courtesy: Satyam

ఆహారం మరియు వసతి

ఆహారం మరియు వసతి

స్థానికంగా దొరికే బంబూ చికెన్ బహు రుచి కరంగా వుంటుంది. ఈ వంటకం మాంసాన్నిపచ్చని వెదురు బొంగులలో మసాలా దినుసులు వేసి మంటలపై ఉడి కిస్తారు.

Photo Courtesy: Ryan McLaughlin

అరకు లోయలో షాపింగ్

అరకు లోయలో షాపింగ్

ఇక్కడి స్థానిక దుకాణాలలో అనేక చేతితో తయారు చేయబడిన కొయ్య వస్తువులు వివిధ రంగులలో దొరుకుతాయి.

Photo Courtesy:Rajib Ghosh

ఎలా చేరాలి ?

ఎలా చేరాలి ?

కోరిక మేరకు స్వంత వాహనాలలో ప్రయాణించ వచ్చు. విశాఖపట్నం నుండి ప్రధాన నగరాలకు బస్సు లు టాక్సీ లు లభిస్తాయి. ఆంధ్ర ప్రదేశ్ టూరిజం అరకు లోయ పర్యటనకు గాను అనేక పాకేజ్ లు కూడా అందిస్తుంది. అరకు లో రైల్వే స్టేషన్ కలదు. ఇక్కడి నుండి విశాఖపట్నం రైలు మార్గంలో చేరవచ్చు. విమాన ప్రయాణం చేయగోరే వారు విశాఖపట్నం ఎయిర్ పోర్ట్ చేరాలి. అక్కడ నుండి గల 11 5 కి. మీ. ల దూరం టాక్సీ లేదా బస్సు లో చేరవచ్చు.

Photo Courtesy: Raj