» »అనంత వాసుదేవ ఆలయం, భువనేశ్వర్ !!

అనంత వాసుదేవ ఆలయం, భువనేశ్వర్ !!

Written By:

భువనేశ్వర్ ఒడిశా రాష్ట్ర రాజధాని. ఈ ప్రదేశాన్ని 'భారతదేశం యొక్క ఆలయాల నగరం' గా పిలుస్తారు. సుమారు మూడువేల సంవత్సరాల క్రితం నాడే ఈ పట్టణం ఏర్పడి ఉండవచ్చని కధనం. భువనేశ్వర్ భూభాగం రెండు వేల కంటే ఎక్కువ గుళ్ళను కలిగి ఉంది. బహుశా వీటిని గమనిస్తే నాటి కాలం నాటి కళింగ రాజుల నిర్మాణ శైలి, శిల్పకళ గుర్తుకువస్తుంది. భువనేశ్వర్ అన్న పేరు హిందూ దేవుడైన శివుడు పేరు త్రిభుబనేశ్వర్ నుండి వచ్చింది. అలా అని ఇక్కడ ఉన్నవన్నీ శివాలయాలే అనుకుంటే పొరబడినట్లే ! ఇక్కడ శ్రీకృషుడికి అంకితం చేసిన అనంత వాసుదేవ ఆలయం తప్పక చూడదగినది.

ఇది కూడా చదవండి : బాలాసోర్ పర్యాటక ప్రదేశాలు !!

అనంత వాసుదేవ ఆలయం శ్రీకృష్ణునికి అంకితమైన ప్రసిద్ధ హిందూ దేవాలయం. ఈ దేవాలయం శ్రీమహావిష్ణువు అవతారమైన శ్రీకృష్ణుడు ప్రధాన దైవంగా గలది. ఇది భారతదేశంలోని ఒడిషా రాష్ట్రం లోని భువనేశ్వర్ లో ఉంది. ఈ దేవాలయం 13వ శతాబ్దంలో నిర్మించబడింది. ఈ దేవాలయంలో ప్రధానంగా శ్రీకృష్ణుడు, బలరాముడు మరియు సుభద్ర అనే దేవతలను ప్రదానంగా కొలుస్తారు.

ఇతిహాసం

ఇతిహాసం

ఈ దేవాలయం 13 వ శతాబ్దంలో కట్టబడింది. దీనికి పూర్వం ఈ ప్రాంతంలో నిజమైన విష్ణువు చిత్రాన్ని కొలిచేవారు. "తూర్పు గంగా రాజ్యం" యొక్క రాణి అయిన చంద్రిక ఈ స్థానంలో కొత్త దేవాలయం కట్టుటకు నిశ్చయించుకుంది. అదే ప్రదేశంలో అనంత వాసుదేవ ఆలయాన్ని నిర్మించింది.

చిత్రకృప : Kalinga03

వైష్ణవాలయం

వైష్ణవాలయం

ఈ ప్రాంతంలో విష్ణుమూర్తి చిత్రంతో కూడిన పాత దేవాలయం తప్పినిసరిగా ఉంటుంది. "మహానది" వరకు తన సామ్రాజ్యాన్ని విస్తరించిన "మరాఠాలు" 17 వ శతాబ్దం చివరలో భువనేశ్వర్ లో వైష్ణవాలయం పునరుద్ధరణకు బాధ్యత వహించారు.

చిత్రకృప : Nayansatya

నిర్మాణం

నిర్మాణం

రూపంలో ఈ దేవాలయం లింగరాజ ఆలయంతో పోలి ఉంటుంది. కానీ ఇది వైష్ణవ శిల్పాలను కలిగి ఉంటుంది.ఈ ఆలయం, సూక్ష్మ రేఖాంశ పట్టీలను కలిగిన శిఖరాలు (విగ్రహాలు) కచ్చితంగా లింగరాజ ఆలయం వలెనే కలిగి ఉంటుంది. కానీ శిఖరాల సంఖ్య ఒక రేఖాంశపట్టీకి మూడు చొప్పిన కలిగి ఉంటుంది.

చిత్రకృప : Satyabrata

గోడలపై గల శిల్పాలు

గోడలపై గల శిల్పాలు

ఈ దేవాలయ భాహ్య గోడలపై గల శిల్పాలు భువనేశ్వర్ లో గల ప్రతి దేవాలయం వలెనే లక్షణాలను కలిగి ఉంటాయి. ఈ దేవాలయంలో స్త్రీ శిల్పాలు మితిమీరిన ఆభరణాలు కలిగి యున్నందున వాస్తవికత కనిపించదు. ఈ దేవాలయం "భానుదేవుని" పరిపాలనా కాలంలో "అనంగాభిమ III" యొక్క కుమార్తె అయిన చంద్రికాదేవి కాలంలో నిర్మితమైనది.

చిత్రకృప : Oo91

జగన్నాథ దేవాలయం, పూరి తో గల తేడాలు

జగన్నాథ దేవాలయం, పూరి తో గల తేడాలు

ఈ దేవాలయంలో గల "గర్భగృహం"లో గల విగ్రహాలు పూర్తిగా తయారైనవి. అవి పూరీ లోని జగన్నాధ దేవాలయంలోని విగ్రహాలకు భిన్నంగా ఉంటాయి. ఇచట శ్రీమూర్తులు (విగ్రహాలు) పూరీ దేవాలయంలో వలెనే చెక్కతో కాకుండా నలుపు గ్రానైట్ శిలల నుండి తయారుచేశారు.

చిత్రకృప : Benjamín Preciado

శంఖ క్షేత్రము

శంఖ క్షేత్రము

దేవాలయం మూలంగా ఈ పట్టనానికి "చక్ర క్షేత్రం" (వృత్తాకార స్థలం) గా పిలువబడుతుంది. పూరీలో గల దేవాలయం "శంఖ క్షేత్రము" (వక్రాకార స్థలం) గా పిలువబడుతుంది.

చిత్రకృప : Sarba

బలరాముడు, కృష్ణుడు, సుభద్ర

బలరాముడు, కృష్ణుడు, సుభద్ర

ఈ దేవాలయంలో దేవతలైన బలరాముడు ఏడు పడగలు గల సర్పం క్రింద నిలుచుంటాడు. సుభద్ర రత్నాల కుండ మరియు తామరపువ్వు లను ఇరు చేతులతో కలిగి యుండి. ఎడమ పాదాన్ని వేరొక రత్నాల కుండపై ఉంచేటట్లుంటుంది. శ్రీకృష్ణుడు గదను, చక్రాన్ని, కమలాన్ని మరియు శంఖాన్ని కలిగియుండేటట్లుంటుంది.

చిత్రకృప : Nayansatya

భువనేశ్వర్ లో చూడవలసిన శివాలయాలు

భువనేశ్వర్ లో చూడవలసిన శివాలయాలు

లింగరాజ్ టెంపుల్, జలేశ్వర్, కపిలేశ్వర్, భాస్కరేశ్వర్, పూర్వేశ్వర్, నాగేశ్వర్, మంగళేశ్వర్, భ్రింగేశ్వర, లభేశ్వర, గోకర్ణేశ్వర ... ఇలా మొదలైన శివాలయాలు అనేకం భువనేశ్వర్ లో చూడవచ్చు.

దౌలి గురి, ఇస్కాన్ టెంపుల్, ఉదయగిరి, ఖండగిరి గుహలు, నందన్కనాన్ జూ, బిజూ పట్నాయక్ పార్క్, బుద్ధ జయంతి పార్క్, బిందు సాగర్ లేక్, చందక వైల్డ్ లైఫ్ సంచురీ, పిప్లి మొదలగునవి ఇతర ఆకర్షణలుగా ఉన్నాయి.

చిత్రకృప : Achilli Family | Journeys

భువనేశ్వర్ ఎలా చేరుకోవాలి ?

భువనేశ్వర్ ఎలా చేరుకోవాలి ?

భువనేశ్వర్ చేరుకోవటానికి రోడ్డు రైలు మరియు రోడ్డు మార్గాలు కలవు.
భువనేశ్వర్ లో ఎయిర్ పోర్ట్, రైల్వే స్టేషన్ లు కలవు. వైజాగ్, కోల్కతా మరియు దాని చుట్టుప్రక్కల గల సమీప ప్రాంతాల నుండి కూడా భువనేశ్వర్ ప్రవేట్/ప్రభుత్వ బస్సు సౌకర్యాలను కలిగి ఉన్నది.

చిత్రకృప : Anubhav2010

Please Wait while comments are loading...