• Follow NativePlanet
Share
» »తెలుగు నేలలో కూడా అనంత పద్మనాభ స్వామి

తెలుగు నేలలో కూడా అనంత పద్మనాభ స్వామి

Written By: Kishore

ఆ నిధి కోసమేనా ఇక్కడ అన్వేషణ? మీకు ప్రవేశం లేదు

ఆ కొత్త దంపతులు ఇక్కడ చేసిన 'ఆ పని' మీరు ఎట్టి పరిస్థితుల్లో చేయకండి

ఈ నగరాలకు వెలితే అటువైపు అసలు వెళ్లకండి ఎందుకంటే 'సుఖాల ఊబి'ఉంది

అనంత పద్మనాభ స్వామి అంటే మనకు వెంటనే గుర్తుకు వచ్చేది కేరళనే. కొన్ని లక్షల కోట్ల సంపదలకు నిలయమైన ఆ ఆలయం ఇటీవల వార్తల్లో నిలుస్తూ ఉండటమే ఇందుకు కారణం. అయితే మన తెలుగు నేల పై కూడా ఒక అనంత పద్మనాభ స్వామి ఆలయం ఉంది. ఈ దేవాలయాన్ని ముస్లీం రాజు నిర్మించడం మరింత విశేషం. కేవలం ఆధ్యాత్మికంగానే కాకుండా ఈ ప్రాంతం పర్యవరణ ప్రేమికులను కూడా విశేషంగా ఆహ్వానిస్తోంది. అన్నట్టు ఇక్కడ పుట్టే ఒక నది మనలను 'ముక్కు మూసుకొనేలా' చేస్తోంది. వీకెండ్ స్పాట్ గా, సమ్మర్ హిల్ స్టేషన్ గా కూడా ఈ ప్రాంతం పేరుగాంచింది. ఈ వివరాలన్నీ మీ కోసం

1.అనంతగిరి కొండలు

1.అనంతగిరి కొండలు

Image Source:

అనంతగిరి కొండలు తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలో ఉన్నాయి. జిల్లా కేంద్రమైన వికారాబాద్ కు దాదాపు 5 కిలోమీటర్ల దూరంలో ఈ కొండలు ఉన్నాయి. ఇక్కడ ప్రాచీన కాలం నుంచి మనుష్యులు నివశించారని చెప్పడానికి అనేక గుర్తులు ఉన్నాయి. అంతే కాకుండా కోటలను కూడా చూడవచ్చు.

2. స్థల పురాణం ప్రకారం

2. స్థల పురాణం ప్రకారం

Image Source:

ఈ ఆలయం మొదట్లో దట్టమైన అడవి ప్రాంతం. ఇక్కడ అనేక మంది రాక్షసులు ఉండేవారు. వీరు స్థానక ప్రజలను, మునులను తీవ్రంగా హింసించేవారు. దీంతో వారు ఇంద్రుడుకి మొర పెట్టుకున్నారు. ఆయన విష్ణువు అంశతో జన్మించిన ముచుకుందుడి సహాయం కోరాడు.

3. చాలా ఏళ్లపాటు

3. చాలా ఏళ్లపాటు

Image Source:

మిక్కిలి బలవంతుడైన ముచుకుందుడు అనేక ఏళ్లపాటు రాక్షసులతో యుద్ధం చేసి వారిని ఓడించాడు. దీనికి సంతోషించిన ఇంద్రుడు ఏమైన వరం కోరుకోవాలని సూచించారు.

4. నిద్రాభంగం కలిగించరు

4. నిద్రాభంగం కలిగించరు

Image Source:

దీంతో ముచుకుందుడు తాను యుద్ధం చేసి అలసి పోయాని తాను కొన్ని ఏళ్లపాటు సుఖంగా నిద్రించేలా వరం కావాలని కోరుకొన్నాడు. దీంతో ఇంద్రుడు అనంతగిరి గొండల పై ఉన్న ఒక గుహను చూపించి అందులో నిద్రించాలని నీవు లేచే వరకూ ఎవరూ నిద్రాభంగం కలిగించరని చెప్పాడు.

5. అనంత పద్మనాభ స్వామి

5. అనంత పద్మనాభ స్వామి

Image Source:

ముచుకుందుడు నిద్ర లేచిన తర్వాత విష్ణువు ప్రత్యక్షమయ్యి మోక్షం ప్రసాదించాడు. ఆ సమయంలో తాను నిద్రించిన ప్రదేశంలోనే మీరు కూడా శయన మూర్తిగా ఉండాలని ముచుకుందుడు స్వామి వారిని కోరాడు. దీంతో స్వామి వారు అనంత పద్మనాభుడి రూపంలో ఇక్కడ కొలవయినట్లు స్థల పురణం చెబుతుంది.

6. మూసినది పుట్టుక

6. మూసినది పుట్టుక

Image Source:

ఇక మూసిననది పుట్టుక కూడా ఈ అనంతగిరి కొండల్లోనే. స్వామి వారు ప్రత్యక్షమైన తర్వాత మిక్కిలి సంతోషించిన ముచుకుందుడు స్వామి వారి పాదాలను తన కమండలంలోని నీటితో కడిగాడు. ఈ నీరే జీవనదిగా మారి మూసినదిగా ప్రవహించిందని చెబుతారు.

7. 2,168 అడుగుల ఎత్తులో

7. 2,168 అడుగుల ఎత్తులో

Image Source:

ఈ మూసి నది సముద్రమట్టానికి దాదాపు 2,168 అడుగుల ఎత్తులో అనంతగిరి కొండల్లో పుట్టి తూర్పు దిశగా ప్రవేశించి హైదరాబాద్ నగరాన్ని చేరుతుంది. అటు పై నల్గొండ జిల్లాలోని వాడపల్లి వద్ద క`ష్ణానదిలో కలుస్తుంది.

8. నిజాం నవాబుచే

8. నిజాం నవాబుచే

Image Source:

ఈ స్థల మహత్యాన్ని తెలుసుకున్న నిజాం నవాబు దాదాపు 400 ఏళ్ల క్రితం ఇక్కడ అనంత పద్మనాభస్వామికి చూడ చక్కని దేవాలయాన్ని నిర్మించాడు. ప్రశాంత వాతావరణంలో పచ్చడి అడువుల మధ్య ఉన్న ఈ దేవాలయ సందర్శనం వల్ల కోరుకొన్న కోరికలన్నీ తీరుతాయని భక్తులు విశ్వసిస్తారు.

9. సర్వరోగాలు నయమవుతాయి

9. సర్వరోగాలు నయమవుతాయి

Image Source:

ఈ దేవాలయం పక్కనే భవననానిశిని అనే భగీరథ గుండం ఉంది. ఇందులో స్నానం చేస్తే ఆయురారోగ్యాలతో పాటు సమస్త రోగాలు నయమవుతాయని చెబుతారు. అందువల్లే ఇక్కడకు వచ్చిన వారు తప్పకుండా ఈ గుండంలో స్నానం చేస్తారు.

10. చూడదగిన ప్రాంతాలు

10. చూడదగిన ప్రాంతాలు

Image Source:

అనంతగిరి కొండలో హిల్ వివ్యూ పాయింట్ ఉంది. దేవాలయం నుంచి సరిగ్గా ఒక కిలోమీటరు దూరం పశ్చిమ దిక్కుగా ప్రయాణిస్తే దీనిని చేరుకోవచ్చు. ఇక్కడి నుంచి కింది చూడటం మరిచిపోలేని అనుభూతిని ఇస్తుంది. ఇక ఇక్కడి నుంచి అనంతగిరి కొండల్లోపలికి వెళ్లడం ప్రస్తుతం నిషేదించారు. ఈ ప్రాంతాన్ని రక్షిత అభయారణ్యంగా ప్రకటించడమే ఇందుకు కారణం.

11. దామ లింగేశ్వరుడు

11. దామ లింగేశ్వరుడు

Image Source:

ఇక ఇక్కడకు దాదాపు 10 కిలోమీటర్ల దూరంలో రామలింగేశ్వర స్వామి దేవాలయం ఉంది. ఈ ప్రాంతాన్ని దామగుండంగా పిలుస్తారు. అందువల్లే ఈ దేవాలయంలోని మూల విరాట్టును దామ లింగేశ్వరుడిగా కూడా పిలుస్తారు. ఇది కూడా చూడదగిన ప్రదేశమే.

12. ఇక రోజులో వెళ్లి రావచ్చు

12. ఇక రోజులో వెళ్లి రావచ్చు

Image Source:

అనంతగిరి విరాకారాబద్ రైల్వేస్టేషన్ దగ్గరగా ఉంటుంది. సికింద్రాబాద్ నుంచి వికారాబాద్ కు 70 కిలోమీటర్లు. ఉదయం 8 గంటల తర్వాత రెండు రైళ్లు అటుగా వెలుతాయి. ఒకటి పూర్ణా ప్యాసింజర్, రెండోది వికారాబాద్ ప్యాసింజర్.

13. వీకెండ్ ట్రిప్

13. వీకెండ్ ట్రిప్

Image Source:

ఇప్పుడిప్పుడే ఈ ప్రాంతాన్ని తెలంగాణ ప్రభుత్వం పర్యాటక కేంద్రంగా అభివ`ద్ధి చేస్తోంది. దీంతో చాలా మంది వీకెండ్ లో ఇక్కడకు వెళ్లి వస్తుంటారు. మనకు అనంత గిరిలో అంత మంచి హోటల్స్ ఉండవు. అందువల్ల ఇంటి నుంచి తినడానికి తీసుకు వెళితే మంచిది.

14. ట్రెక్కింగ్

14. ట్రెక్కింగ్

Image Source:

చాలా ఎత్తులో ఉండే ఈ ప్రాంతం ట్రెక్కింగ్ ప్రియులను ఆకర్షిస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ముఖ్యంగా శని, ఆదివారాల్లో ఇక్కడ ట్రెక్కర్స్ ఎక్కువగా కనిపిస్తుంటారు. ఒక్క హైదరాబాద్ నుంచే కాకుండా బెంగళూరు వంటి నగరాల నుంచి కూడా ఇక్కడకు ట్రెక్కర్స్ ఎక్కువ సంఖ్యలో వస్తుంటారు. ట్రెక్కింగ్ వెళ్లే ముందు అటవి, పోలీసు సిబ్బందికి సమాచారం అందించడం మరిచిపోకూడదు.

పర్యాటకానికి సంబంధించిన వివరాలు తెలుసుకోండి
పర్యాటక చిట్కాలు, పర్యాటకానికి సంబంధించిన కథాలు తక్షణం పొందండి