Search
  • Follow NativePlanet
Share
» »అప్సరసలకు నిలయం ... 'అప్సరకొండ' !

అప్సరసలకు నిలయం ... 'అప్సరకొండ' !

By Mohammad

ప్రకృతి అందాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇవి ఎవ్వరినైనా మైమరిపిస్తాయి, ఎంతటి వారినైనా అక్కున చేర్చుకుంటాయి. వీటికి కుల - మత, ధనిక -పేద, చిన్న - పెద్ద, ఆడ - మగ వంటివి ఏమీ తెలియవు. తెలిసిందల్లా .. తన దగ్గరకు వచ్చిన వారిని హత్తుకొని ఆనందపరచటమే. తన ఒడిలో తల్లిలాగా లాలించడమే !!

ప్రకృతి రమణీయతలకు దేవుళ్ళైన, దేవతలైన లేక వేరెవరైనా మంత్రముగ్ధులవకతప్పదు. మన భారతదేశంలో ఇటువంటి ప్రదేశాలు అనేకం. వర్షంలో తడిసి ముద్దైన ప్రకృతి ప్రదేశాలను ఈ సమయంలో చూస్తే ఎవ్వరైనా ఆకర్షితులవ్వకమానరు.

ఇది కూడా చదవండి : డియాండమోల్ - కర్ణాటకలో రెండవ ఎత్తైన శిఖరం !

మన ఇండియాలో ఇటువంటి కోవలోకి చెందిన ఒక ప్రదేశం ఉంది. అప్సరసలు సైతం దీన్ని చూసి ఈర్ష పడుతారు. చుట్టూ పచ్చని పచ్చదనంతో అలరారే ఆ ప్రదేశం చూడాలని మీకు లేదూ! అయితే పొందాం పదండి !!

ఎక్కడ ?

ఎక్కడ ?

కర్ణాటక రాష్ట్రంలోని ఉత్తర కన్నడ జిల్లాలో హొన్నావర్ అనే పోర్ట్ పట్టణం ఉన్నది. అక్కడికి సమీపంలో అంటే సుమారు 8 కిలోమీటర్ల దూరంలో అప్సరకొండ అనే అందమైన ప్రదేశం ఒకటుంది. 'భూమి మీద ఎటువంటి స్వర్గం లేదు కానీ దాని భాగాలు మాత్రం అక్కడక్కడా ఉన్నాయి' అని ప్రముఖ పర్యాటకుడు జూల్స్ రెనార్డ్ అభివర్ణించారు. ఇది నిజంగా సత్యమే, స్వర్గం లోని ఒక భాగం ఈ అప్సరకొండ.

చిత్రకృప : brunda.nagraj

అప్సరకొండ గురించి

అప్సరకొండ గురించి

అప్సర కొండ ప్రదేశంలో ఎటువంటి వాహనాలకు అనుమతించరు. కనుక, మీ మీ వాహనాలను ఎంట్రీ వద్దనే పార్క్ చేసి లోనికి ప్రవేశించాలి. లోనికి ప్రవేశించగానే ముందు ఒక బ్రిడ్జి కనపడుతుంది. ఆ బ్రిడ్జి కు ఇరువైపులా పందిరివలె చెట్లు మిమ్మల్ని స్వాగతం పలుకుతుంటాయి. బ్రిడ్జి కింద పారే నీటి సెలయేరు, చిన్ని చిన్ని చాపలు ఆనందాన్ని ఇస్తాయి.

చిత్రకృప : brunda.nagraj

అప్సరకొండ గురించి

అప్సరకొండ గురించి

అప్సరకొండ అంటే "అప్సరసల నిలయం" అని అర్థం. నిజం మరి ఇక్కడ ఉండే కొలనులు, జలపాతాలు, పచ్చదనం వీటన్నింటిని అప్సరసలతో పోల్చవచ్చు. పూర్వం అప్సరసలు ఈ ప్రదేశానికి ముగ్ధులై, కొంత కాలం ఇక్కడే నివాసం ఏర్పరుచుకొని, విశ్రాంతి పొందేవారట. అంతేకాదు ఇక్కడి కొండల మధ్య ప్రవహించే సెలయేర్లు, కొండ పై నుండి జాలువారే జలపాతాల చెంత స్నానాలు చేసేవారట. ఈ ప్రదేశం అప్సరసలకు నిలయం కనుకనే దీనికి అప్సరకొండ అనే పేరొచ్చిందని చెబుతారు.

చిత్రకృప : brunda.nagraj

అప్సరకొండ గురించి

అప్సరకొండ గురించి

పూర్వం సాధువులు మరియు సన్యాసులు ప్రశాంతమైన అప్సరకొండ ప్రదేశానికి ఆకర్షితులై ఇక్కడే ఉండిపోయారు. సమీప గుహలలో గంటల తరబడి ధాన్య ముద్రలో ఉండేవారు. కొంత మంది సన్యాసులు ఉమాంబ మహాగణపతి దేవాలయం, ఉగ్ర నరసింహ దేవాలయం నిర్మించారు. వీటిని కూడా ప్రకృతి ప్రేమికులు చూడవచ్చు. పాండవుల గుహ కూడా చూడవలసిందే. వనవాస సమయంలో పాండవులు కొంత కాలం ఇక్కడ నివసించారు.

చిత్రకృప : brunda.nagraj

అప్సరకొండ ఆకర్షణ ప్రదేశాలు

అప్సరకొండ ఆకర్షణ ప్రదేశాలు

ఇటువంటి ప్రదేశాలలో ప్రకృతే పెద్ద ఆకర్షణ. పర్యాటకులు 155 మెట్లు ఎక్కి దేవాలయాలను, జలపాతాలను సందర్శించవచ్చు. అలానే కుడివైపు మళ్ళి కొంత దూరం నడిస్తే బీచ్ వెళ్ళవచ్చు.

చిత్రకృప : brunda.nagraj

అప్సరకొండ ఆకర్షణ ప్రదేశాలు

అప్సరకొండ ఆకర్షణ ప్రదేశాలు

అప్సరకొండ లో వాటర్ ఫాల్స్ మరో ఆకర్షణ. గుడి వద్ద ఉన్న జలపాతం 10 అడుగుల ఎత్తునుండి కింద పడుతుంది. పర్యాటకులు స్నానాలు ఆచరించి గుడిలోని దేవుణ్ణి దర్శిస్తారు. గుహల వద్ద కూడా కొన్ని జలపాతాలు ఉన్నాయి. ఇక్కడ జలకాలాటడం నిషేధం. పాములు తిరుగుతుంటాయి.

చిత్రకృప : brunda.nagraj

అప్సరకొండ ఆకర్షణ ప్రదేశాలు

అప్సరకొండ ఆకర్షణ ప్రదేశాలు

ఉమాంబ మహాగణపతి, ఉగ్ర నరసింహ దేవాలయాలను పూర్వం సిద్దులు గుహ గుండా వెళ్లి దర్శించుకొనేవారు. ఇప్పుడు ఆ గుహలను మూసివేశారు. భక్తులు వేరే మార్గం ద్వారా దేవాలయాల్లోకి ప్రవేశించవచ్చు. ఇప్పటికీ గుడి వద్ద ఉన్న జలపాటిహాలను దేవుళ్లను అభిషేకించటానికి ఉపయోగిస్తారు.

చిత్రకృప : brunda.nagraj

అప్సరకొండ ఆకర్షణ ప్రదేశాలు

అప్సరకొండ ఆకర్షణ ప్రదేశాలు

బీచ్

ఎకో బీచ్ లేదా అప్సరకొండ బీచ్ ప్రకృతి దృశ్యాలను అందించే అందమైన వ్యూ పాయింట్. ఈ బీచ్ ఎటువంటి షాప్ లు, అరుపులు లేకుండా నిర్మానుష్యంగా ఉంటుంది.

చిత్రకృప : brunda.nagraj

అప్సరకొండ ఆకర్షణ ప్రదేశాలు

అప్సరకొండ ఆకర్షణ ప్రదేశాలు

అప్సరకొండ లో ప్రతి అడుగు ఒక వ్యూ పాయింట్ ను తలపిస్తుంది. జలపాతాల వెంట ట్రెక్కింగ్ మీకు ఒక చక్కటి అనుభూతి కాగలదు.

చిత్రకృప : brunda.nagraj

అప్సరకొండ - ఆసక్తికర విషయం

అప్సరకొండ - ఆసక్తికర విషయం

అప్సరకొండ 5 కిలోమీటర్ల పరిధి వరకు నీరు తియ్యగా ఉంటుంది. మీరు బోర్ వేసినా ఆ నీరు తియ్యదనాన్ని ఇస్తుంది. ఈ పరిధిని దాటితే నీరు ఉప్పగా ఉంటుంది.

చిత్రకృప : brunda.nagraj

అప్సరకొండ ఎప్పుడు సందర్శించాలి ?

అప్సరకొండ ఎప్పుడు సందర్శించాలి ?

జులై నుండి అక్టోబర్ మధ్య అప్సరకొండ సందర్శించవచ్చు. చలికాలం అక్టోబర్ - డిసెంబర్ మధ్య కూడా పర్యాటకులు వెళ్ళవచ్చు.

చిత్రకృప : brunda.nagraj

అప్సరకొండ ఎలా చేరుకోవాలి ?

అప్సరకొండ ఎలా చేరుకోవాలి ?

ఉడిపి నుండి హొన్నావర్ 125 కిలోమీటర్ల దూరంలో కలదు. ముందుగా, హొన్నావర్ చేరుకొని అక్కడి నుండి అప్సరకొండ వెళ్ళవచ్చు.

బస్సు ద్వారా : ఉడిపి నుండి హొన్నావర్ కు రెగ్యులర్ గా బస్సులు నడుస్తాయి. హుబ్లీ, సిర్సి వెళ్లే గవర్నమెంట్ బస్సులు హొన్నావర్ మీదుగా వెళతాయి. ఉడిపి నుండి క్యాబ్ అద్దెకు తీసుకొని కూడా హొన్నావర్ వెళ్ళవచ్చు. హొన్నావర్ చేరుకున్నాక, అక్కడి నుండి ఆటోలో అప్సరకొండ వెళ్ళవచ్చు.

ట్రైన్ ద్వారా : హొన్నావర్ రైల్వే స్టేషన్ అప్సరకొండ సమీప రైల్వే స్టేషన్.

చిత్రకృప : brunda.nagraj

గమనిక

గమనిక

పర్యావరణాన్ని రక్షించడం మన భాద్యత. దయచేసి పాస్టిక్ వస్తువులను, బాటిళ్లను పడేయకండి.

చిత్రకృప : brunda.nagraj

అప్సరకొండ గురించి ఇంకొన్ని విషయాలు

అప్సరకొండ గురించి ఇంకొన్ని విషయాలు

అప్సరకొండ కు 4 వైపులా ఎంట్రీ కలదు. ఒంటిరిగా ప్రయాణించడం, రాత్రుళ్ళు స్టే చేయటం సూచించదగినది కాదు.

నీరు తాగి జలపాతంలో దూకొద్దు. పాములు సంచరిస్తుంటాయి. ప్రమాదకరం.

చిత్రకృప : brunda.nagraj

అప్సరకొండ లో ఏది మిస్ కాకూడదు ?

అప్సరకొండ లో ఏది మిస్ కాకూడదు ?

ఉమాంబ షాప్ వద్ద లభించే మజ్జిగ తప్పక తాగండి. ఇది తాగకపోతే మీ పర్యటన పూర్తికాదు. కోతులు అధికం. కనుక మీ వస్తువులు జాగ్రత్త. అప్సరకొండ లో పర్యాటక శాఖ కూర్చోవటానికి ఇనుప బెంచీలు, సిమెంట్ బెంచీ లు ఏర్పాటుచేసింది.

ఇటువంటి కొత్త కొత్త ప్రదేశాల గురించి మరింత తెలుసుకోవాలంటే ఇప్పుడే మా నేటివ్ ప్లానెట్ లో చందాదారులుకండి. మరిన్ని వివరాలకై / సందర్శించండి.

చిత్రకృప : brunda.nagraj

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X