Search
  • Follow NativePlanet
Share
» »బక్రీద్ ను ఈ పర్యాటక నగరాల్లో బాగా జరుపుకొంటారు.

బక్రీద్ ను ఈ పర్యాటక నగరాల్లో బాగా జరుపుకొంటారు.

బ్రక్రీద్ పర్వదినాన్ని బాగా జరుపుకొనే కొన్ని నగరాలకు సంబంధించిన కథనం.

ముస్లీం సోదరులు బక్రీద్ ను త్యాగానికి ప్రతీకగా జరుపుకొంటారు. రంజాన్ లాగే బక్రీద్ పండుగను కూడా ధార్మిక ప్రసంగాలతో మొదలు పెడుతారు. అటు పై ఈద్గా మైదానంలో సామూహిక ప్రార్థలు చేస్తారు. ఆ తర్వాత వారు నెమరు వేసే జంతువులను మాత్రమే ఖుర్బానీ అంటే బలి ఇస్తారు. బలి ఇచ్చిన తర్వాత మొత్తం మాంసాన్ని మూడు భాగాలుగా విభజించి ఒక భాగాన్ని పేదలకు, మరొక భాగాన్ని బంధువులకు పంచుతారు. ఇంకొక భాగాన్ని తమ కోసం ఉంచుకొంటారు.

అల్లాహ్ ఆదేశానుసారం ఇబ్రహీం తన ఏకైక పుత్రుడైన ఇస్మాయిల్ ను బలి ఇవ్వడానికి సిద్ధమౌతారు. ఆ సంప్రదాయన్ని పురస్కరించుకొనే ఈముస్లీంలు ఈ బక్రీద్ ను జరుపుకొంటారు. ఇటువంటి ముఖ్యమైన పండుగను అత్యంత వైభవంగా జరుపుకొనే కొన్ని పర్యాటక నగరాలకు సంబంధించిన వివరాలు నేటివ్ ప్లానెట్ పాఠకులైన మీ కోసం...

ఢిల్లీ

ఢిల్లీ

P.C: You Tube

భారత దేశంలో అత్యంత ఆకర్షనీయ పర్యాటక నగరాల్లో ఢిల్లీ శిఖరాగ్రాన ఉంటుంది. ఇక్కడ బక్రీద్ ను ముస్లీం సోదరులు చాలా బాగా జరుపుకొంటారు. ముఖ్యంగా మొఘల్ చక్రవర్తులు పరిపాలించిన ఈ దేశరాజధానిలో కొన్ని విభిన్న సంప్రదాయాలను పాటిస్తారు. పాత ఢిల్లీ ప్రాంతం రూపురేఖలే మారిపోతాయి. ఈ ప్రాంతంల్లోని దుకానాలన్నింటినీ అందంగా అలంకరిస్తారు. ముఖ్యంగా ఫొటోగ్రఫీ అంటే ఇష్టమున్నవారికి బక్రీద్ రోజు పాత ఢిల్లీ మంచి అనుకూలమైన ప్రాంతం.

లక్నో

లక్నో

P.C: You Tube

లక్నో నగరానికి నవాబుల నగరంగా పేరుంది. ముఖ్యంగా లక్నో బిర్యానీ, కబాబ్ లకు పెట్టింది పేరు. అందువల్లే ఈ నగరంలో ఎక్కడ చూసిన మనకు బక్రీద్ పర్వదినం కొట్టొచ్చినట్టు కనిపిస్తాయి. ఇళ్లతో పాటు రెస్టోరెంట్లు కూడా వివిధ రకాల మాంసాహారాలను ప్రత్యేకంగా వండుతారు. ఇక్కడ ముస్లీంలతో పాటు హిందువులు కూడా బక్రీద్ పండుగ సంబరాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు.

శ్రీనగర్

శ్రీనగర్

P.C: You Tube

భారత దేశంలో ముస్లీం జనాభా ఎక్కువగా ఉన్న పర్యాటక నగరాల్లో శ్రీనగర్ కూడా ఒకటి. ఈ నగరంలో రీగల్ చౌక్, లాల్ చౌక్, గౌనీ మార్కెట్, దాల్ సరస్సు తదితర ప్రాంతాల్లో మనకు పండుగ వాతావరణం ఎక్కువగా కనిపిస్తుంది. కాశ్మీర్ కు మాత్రమే ప్రత్యేకమైన మాంసాహార వంటకాలతో పరిసర ప్రాంతాలన్నీ ఘుమ, ఘుమలాడిపోతాయి. కొన్నిచోట్ల పర్యాటకులకు ఉచితంగా భోజనసదుపాయాలు కూడా కల్పిస్తారు.

బెంగళూరు

బెంగళూరు

P.C: You Tube

ఐటీ నగరంగా పేరుగాంచిన బెంగళూరులో శివాజీనగర్ ప్రాంతంలో ఈ బక్రీద్ సంబరాలు అంబరాన్ని అంటుతాయి. ఇక్కడ వీధి వీధికి మసీదులు ఉన్నాయి. పవిత్రమైన ప్రార్థనల తర్వాత ముస్లీం సోదరులు ఒకరికి ఒకరు శుభాకాంక్షలు చెప్పుకొంటారు. అటు పై కుర్బానీ పంపకాలు ఉంటాయి. ఇక్కడ ఉన్నటు వంటి మసీదుల్లో ప్రార్థనలు చేయడానికి నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ముస్లీంలు వస్తారు. అదే విధంగా నగరంలో ఉన్న వివిధ రెస్టోరెంట్లు బ్రక్రీద్ కు సంబంధించి ప్రత్యేక వంటకాలను సిద్ధం చేస్తాయి.

హైదరాబాద్

హైదరాబాద్

P.C: You Tube

హైదరాబాద్ అన్న తక్షణం మనకు గుర్తుకు వచ్చేది ఛార్మినార్. ఇక ముస్లీం సోదరులు పవిత్రంగా జరుపుకొనే బక్రీద్ పర్వదినాన ఛార్మినార్ పరిసర ప్రాంతాలు పండుగ శోభను సంతరించుకొంటాయి. ఇక్కడ ఉన్నటువంటి దుకాణాలు రంగురంగుల దీపపు కాంతులతో మెరుస్తూ ఉంటాయి. ఇక్కడ కుర్బాని పెద్ద ఎత్తున చేపడుతారు. కుర్బాని ఇవ్వడం వల్ల ఆ అల్లాహ్ తమను, తమ కుటుంబ సభ్యులను చల్లగా చూస్తారని ముస్లీం సోదరులు నమ్ముతారు. ఇక హైదరాబాద్ లోని పలు రెస్టోరెంట్లు కూడా బ్రక్రీద్ కోసం ప్రత్యేక మాంసాహార రుచులను సిద్ధం చేస్తాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X