Search
  • Follow NativePlanet
Share
» »ప్రసిద్ధ శైవ క్షేత్రం - బండాజె జలపాతం !!

ప్రసిద్ధ శైవ క్షేత్రం - బండాజె జలపాతం !!

స్థానికంగా ఈ జలపాతంను 'బండాజె ఆర్బి' అని పిలుస్తారు . తుళు భాషలో 'ఆర్బి' అంటే 'జలపాతం' అని అర్థము. కాలినడకన వెళ్లే వారికి దారి చూపించటానికి ఆ గ్రామంలో కూడా 'గైడ్ ' లు అందుబాటులో ఉంటారు.

By Venkata Karunasri

స్థలము : బండాజె ఆర్బి మరియు బల్ల రాయనదుర్గ కోట, కర్ణాటక రాష్ట్రంలో ధర్మస్థల సమీపములో కలదు.

దూరము : ధర్మస్థలంకు 22 కిలోమీటర్ల దూరంలో మరియు బెంగళూరుకి సుమారు 300 కిలోమీటర్ల దూరంలో ఉంది.

ఆర్బి జలపాతం చేరుటకు మార్గము: బెంగుళూరు - ధర్మస్థలం - యూజిరె - గౌడ్ర మనె - బండాజె ఫాల్స్ ట్రైల్ - బల్ల రాయనదుర్గ కోట - సుంకశాలె - మడికెరి - బెంగుళూరు.

ఖర్చు: ఒక్కొక్కరికి రూ. 2400/-

దర్శించుటకు తగిన సమయం : మార్చి నుండి నవంబరు వరకు.

పశ్చిమ కనుమలలోని ఆహ్లాదకరమైన దృశ్యాలు పర్యాటకులను ఎల్లప్పుడూ మంత్రముగ్దులను చేస్తుంటాయి. ఈ కనుమలను నడక ద్వారా చేరుకోవడానికి ఒక పెద్ద గుంపుగా సమూహంగా వెళ్ళాలి. ఇటువంటి అందాలను, ఆహ్లాదకరమైన దృశ్యాలను అరుదుగా కలిగిన "బండాజె జలపాతం" పశ్చిమ కనుమలలో ఒకటి. జలపాతం యొక్క నీటి ప్రవాహం 200 అడుగుల ఎత్తు నుంచి పడుతుంది. దీనిని చేరుకోవడానికి ఒక పెద్ద గుంపుగా తయారై పచ్చికబయళ్ళు మరియు దట్టమైన అడవుల గుండా 6 గంటలపాటు నడక ద్వారా చేరుకోవచ్చు. కర్ణాటక రాష్ట్రంలోని ప్రసిద్ధ శైవక్షేత్రాలలో "బండాజె" ప్రముఖమైనది.

ప్రసిద్ధ శైవ క్షేత్రం - బండాజె జలపాతం !

బండాజే ట్రెక్ ఆస్వాదిస్తున్న పర్యాటకులు

చిత్రకృప : brunda Nagaraj (FB)

కర్ణాటక రాష్ట్రంలో పశ్చిమ కనుమలలో చర్మాడీ ఘాట్ పరిధిలో ఉన్న "బండాజె ఆర్బి" అనేది ఒక జలపాతం. కాలినడకన వెళ్లే ప్రయాణికులకు బండాజె జలపాతం యొక్క ఒక అద్భుతమైన కనువిందు.

నడక మార్గములు

బండాజె జలపాతమునకు నడిచి వెళ్ళుటకు రెండు మార్గములు కలవు.

మార్గము 1: ఉజిరె వైపు నుండి నడిచివెళ్లినట్లయితే - బండాజె జలపాతం - బల్ల రాయనదుర్గ కోట - సుంకశాలె వైపుకు క్రిందకు.
మార్గము 2: సుంకశాలె వైపు నుండి నడిచివెళ్లినట్లయితే -బల్ల రాయనదుర్గ కోట- బండాజె జలపాతం-ఉజిరె వైపుకు క్రిందకు.

బండాజె అనేది కర్ణాటకరాష్ట్రంలోని దక్షిణకన్నడ జిల్లాలోని బెల్తంగాడీ తాలూకాలోని చర్మాడీ ఘాట్ పరిధిలో గల ఒక జలపాతం. ఇది ఒక అద్భుతమైన జలపాతం. ఈ జలపాతం యొక్క ఎత్తు సుమారు 200 అడుగులు ఉంటుంది. కొండ క్రింది భాగము నుండి పైకి చేరుకోటానికి 15కి.మీ ప్రయాణించవలసి ఉంటుంది.

ప్రసిద్ధ శైవ క్షేత్రం - బండాజె జలపాతం !

బండాజే జలపాతం

చిత్రకృప : Sumesh Always

ఇక్కడ ఆహ్లాదకరంగా ప్రవహించే జలపాతమును చూచుటకు అక్కడ అందుబాటులో ఉన్న గైడ్ ల సహాయంతో కాలినడక ద్వారా దట్టమైన అడవులు, పచ్చికబయళ్ళు గల మార్గము ద్వారా ప్రయాణించవలసి ఉంటుంది. ఈ జలపాతం యొక్క ఎత్తు 200 అడుగులు . బండాజె జలపాతం నేత్రావతి నది యొక్క ఉపనది.ఈ జలపాతం పశ్చిమకనుమలలో గల ఒక మారుమూల ప్రాంతం.ఈ జలపాతంను కాలినడకన గైడ్ సహాయంతో చేరుకోగలం. నిజానికి, బండాజె జలపాతమునకు కాలినడకన వెళ్ళేది అక్కడి అద్భుతమైన అందం వీక్షించడానికి మాత్రమే.

బండాజె జలపాతం అద్భుతమైన దృశ్యాలను మనకు అందిస్తాయి. బండాజె జలపాతంను సందర్శించటానికి రెండు మార్గాలున్నాయి. మంగళూరు నుండి ఉజిరే మార్గములో ప్రయాణించినట్లయితే ఉజిరే నుండి 25కి.మీ పడుతుంది. ఉజిరే నుండి చర్మాడీ ఘాట్ వైపు ప్రయాణించినట్లయితే 6 కి.మీ సోమంతడ్కా వద్ద వదిలి పడుతుంది. అక్కడ నుండి మరో 6 కి.మీ ప్రయాణించి కుడివైపుకు తిరిగి 2 కి.మీ ప్రయాణం చేసినట్లయితే కదిరుద్యావర అనే గ్రామమును చేరుకోవచ్చును. ఇక్కడ నుండి జలపాతంను దూరం నుండి చూడవచ్చును. అయితే కదిరుద్యావర నుండి జలపాతంను చేరుకోవడానికి 10 కి.మీ. దూరం ఎక్కువగానే కాలినడకన ప్రయాణించవలసి ఉంటుంది.

ప్రసిద్ధ శైవ క్షేత్రం - బండాజె జలపాతం !

బండాజే - అద్భుత సూర్యోదయం

చిత్రకృప : Brunda Nagaraj (FB)

స్థానికంగా ఈ జలపాతంను 'బండాజె ఆర్బి' అని పిలుస్తారు . తుళు భాషలో 'ఆర్బి' అంటే 'జలపాతం' అని అర్థము. కాలినడకన వెళ్లే వారికి దారి చూపించటానికి ఆ గ్రామంలో కూడా 'గైడ్ ' లు అందుబాటులో ఉంటారు. 300 నుండి 500 రూపాయల వరకు చెల్లించవలసి ఉంటుంది. మార్చి నుండి నవంబర్ నెలల మధ్య జలపాతంలో నీరు పుష్కలంగా ఉంటుంది. సందర్శించడానికి ఉత్తమ సమయం ఉంది. మరెందుకాలస్యం మీకు ఎంతో ఉత్సాహం కలిగించే బండాజె జలపాతంను సందర్శిద్దామా!

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X