India
Search
  • Follow NativePlanet
Share
» » బెంగుళూరు ద‌గ్గ‌ర్లోని ఈ మూడు ప‌ర్యాట‌క ప్రాంతాలను చూసొద్దాం!

బెంగుళూరు ద‌గ్గ‌ర్లోని ఈ మూడు ప‌ర్యాట‌క ప్రాంతాలను చూసొద్దాం!

బెంగళూరు పేరువిన‌గానే పచ్చదనం క‌ళ్ల‌ ముందు మెద‌లాడుతుంది. చల్లటి వాతావరణం స్నేహంగా పలకరిస్తుంది.

అందుకే ఆ ప్రదేశం అందమైన పర్యాటక కేంద్రమైంది. కుటుంబ‌స‌మేతంగా విహ‌రించాలి అనుకునేవారికి బెంగ‌ళూరు చుట్టుప‌క్క‌ల చాలా ప్ర‌దేశాలు ఆహ్వానం ప‌లుకుతాయి. ప్ర‌కృతిసిద్ద‌మైన ఆవాసాలు కొన్న‌యితే, చారిత్ర‌క నిర్మాణాలు మ‌రికొన్ని. అందుకే ఇది మహానగరం మాత్రమే కాదు.. ప‌ర్యాట‌క ప్రేమికుల విడిది కేంద్రం కూడా.. మ‌రెందుకు ఆల‌స్యం సిటీ చుట్టుపక్కల చూడదగిన ప్రదేశాలలో ఓ మూడింటిని చేసేద్దాం రండి!

బెంగుళూరు ద‌గ్గ‌ర్లోని ఈ మూడు ప‌ర్యాట‌క ప్రాంతాలను చూసొద్దాం!

బెంగుళూరు ద‌గ్గ‌ర్లోని ఈ మూడు ప‌ర్యాట‌క ప్రాంతాలను చూసొద్దాం!

బెంగళూరు పేరువిన‌గానే పచ్చదనం క‌ళ్ల‌ ముందు మెద‌లాడుతుంది. చల్లటి వాతావరణం స్నేహంగా పలకరిస్తుంది. అందుకే ఆ ప్రదేశం అందమైన పర్యాటక కేంద్రమైంది. కుటుంబ‌స‌మేతంగా విహ‌రించాలి అనుకునేవారికి బెంగ‌ళూరు చుట్టుప‌క్క‌ల చాలా ప్ర‌దేశాలు ఆహ్వానం ప‌లుకుతాయి.

ప్ర‌కృతిసిద్ద‌మైన ఆవాసాలు కొన్న‌యితే, చారిత్ర‌క నిర్మాణాలు మ‌రికొన్ని. అందుకే ఇది మహానగరం మాత్రమే కాదు.. ప‌ర్యాట‌క ప్రేమికుల విడిది కేంద్రం కూడా.. మ‌రెందుకు ఆల‌స్యం సిటీ చుట్టుపక్కల చూడదగిన ప్రదేశాలలో ఓ మూడింటిని చేసేద్దాం రండి!

స్కందగిరి..

స్కందగిరి..

ఇది బెంగళూరుకు 70 కిలో మీటర్ల దూరంలో ఉంది. స్కందగిరి 'కల వరదుర్గ' అనే పర్వతాల కోట. బ్రిటిషర్లతో పోరాడేందుకు వీలుగా టిప్పు సుల్తాన్ ఈ ప్రదేశంలో ఎన్నో కోటలు కట్టించాడు. తర్వాతి కాలంలో ఈ కోటలు కూలిపోయినా వాటి ఆనవాళ్లు ఇప్పటికీ మిగిలే ఉన్నాయి. ఈ కొండ ప్రాంతం మీద ట్రెక్కింగ్ చేస్తూ అందాలను వీక్షించొచ్చు. అయితే ఇక్కడ దొంగలు, మోసగాళ్లు ఎక్కువ. గైడ్ల పేరుతో తప్పు దారిలో తక్కువ దూరం చుట్టి తీసుకొచ్చి ఎక్కువ డబ్బులు వసూలు చేస్తుంటారు. కాబట్టి బృందంగా ఏర్పడి స్వయంగా ట్రెక్కింగ్‌కు వెళ్లిరావటం ఉత్తమం.

చీకటి పడుతున్న సమయంలో ట్రెక్కింగ్ చేయకపోవటమే మంచిది. ఇక్కడ ట్రెక్కింగ్ ప్రారంభంలోనే పాపాగ్ని మర్ అనే గుడి ఉంటుంది. గుడికి కుడివైపున తిరిగి వంద మీటర్లు నడిస్తే పైకి దారి కనిపిస్తుంది. ఈ దారివెంటే ప్రయాణిస్తూ కొండల మీద గీసిన బాణం గుర్తులను అనుసరిస్తే ఎటువంటి ఇబ్బంది లేకుండా కొండంతా చుట్టిరావొచ్చు. రాత్రివేళ మూన్‌లైట్‌ ట్రెక్కింగ్ కూడా చేయొచ్చు. ఇందుకోసం రాత్రి 12 నుంచి బయలుదేరి కొండపైకి 3-4 గంటలకు చేరుకోవచ్చు. సాహసంగా ఉండాలనుకుంటే టెంట్స్, స్లీపింగ్ బ్యాగ్స్ తీసుకెళ్లాలి. మంచినీళ్లు, స్వెటర్లు, స్నాక్స్, టార్చ్ తప్పనిసరి.

అవళబెట్ట

అవళబెట్ట

బెంగళూరుకు 90 కిలోమీట‌ర్ల‌ దూరంలో ఉంది అవ‌ళ‌బెట్ట‌. స‌ర‌దాగా కుటుంబంతో కలిసి ఒక్కరోజులో ట్రిప్ ముగించే వీలున్న టూరిస్ట్ ప్లేస్ ఇది. అవలబెట్టకు ఓ చారిత్రక విశిష్టత ఉంది. కామధేను కాలుమోపిన ప్రదేశమని నమ్ముతారు. ఇక్కడి కొండ మీద ఆలయం ఉంది. ట్రెక్కింగ్ అవకాశం కూడా ఉంది. అసలే పచ్చదనం, ఇక వర్షాకాలంలో అయితే ఎటుచూసినా చెట్లు, పూలతో పరిసరాలన్నీ ఆహ్లాద కరంగా ఉంటాయి.

కొండ పైనున్న హిల్ టాప్, దానికి కొంచెం దిగువన ఉండే క్లిఫ్ ప్రత్యేక ఆకర్షణ. క్లిఫ్ చేరుకోవటం తేలిక. అయితే ఫొటోలు దిగేవాళ్లతో అక్కడ ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. ఈ కొండపై కోతులు కూడా ఎక్కువ. అందుకే తినే వస్తువుల విషయంలో జాగ్రత్త తప్పనిసరి. ఇక్కడ రెస్టారెంట్లు లాంటివి ఉండవు కాబట్టి ఆహారం వెంట తీసుకెళ్లాల్సిందే!

బిలిగిరి రంగన్ హిల్స్..

బిలిగిరి రంగన్ హిల్స్..

ఇది బెంగళూరుకు 180 కిలో మీటర్ల దూరంలో ఉంది. కర్నాటక, తమిళనాడు సరిహద్దు పర్వత సముదాయం. బి.ఆర్. హిల్స్ అని పిలిచే ఈ ప్రదేశం బర్డ్ వాచింగ్‌కు అనుకూలమైనది. అప్పుడప్పుడూ అడవి జంతువులు కూడా కనిపిస్తూ ఉంటాయి.

ఇక్కడున్న బిఆర్‌టి వైల్డ్ లైఫ్ శాంక్చురీలో రకరకాల జంతువులు చూడొచ్చు. కావేరి, తుంగభద్ర నదుల మధ్య నెలవైన ప్రదేశం కాబట్టి పచ్చదనం, చల్లదనాలకు ఇక్కడ కొదవే ఉండదు. బిఆర్ హిల్స్‌లోని ఎత్తయిన కొండ మీద బిలిగిరి రంగస్వామి దేవాలయం సందర్శించుకోవచ్చు. ఇక్కడున్న రెండువేల ఏళ్లనాటి దొడ్డ సంపెగ మార అనే ఓ పెద్ద చంపక చెట్టు ఉంది. దీని ఎత్తు 34 మీటర్లు, వెడల్పు 20 మీటర్లు. అంతేకాదు, బిఆర్ హిల్స్‌లో ఫిషింగ్, రివర్ రాఫ్టింగ్, ట్రెక్కింగ్ చేయెచ్చు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X