Search
  • Follow NativePlanet
Share
» »బారాబంకి - పారిజాత చెట్టుకు పుట్టినిల్లు !!

బారాబంకి - పారిజాత చెట్టుకు పుట్టినిల్లు !!

బారాబంకి లో చూసేందుకు అనేక ప్రదేశాలు కలవు. ఇది పారిజాతం చెట్టుకు పుట్టినిల్లు. బారాబంకి ఘంటాఘర్ లేదా క్లాక్ టవర్ సిటీకి ప్రవేశ ద్వారంగా వుంటుంది.

By Mohammad

రాష్ట్రం - ఉత్తర ప్రదేశ్

జిల్లా - బారాబంకి

ప్రసిద్ధి - పారిజాత చెట్టు, మహాదేవ, దేవా.

బారాబంకి ఉత్తర ప్రదేశ్ లోని పూర్వాంచల్ ప్రాంతానికి చెందినది. ఈ జిల్లాను పూర్వాంచల్ కు గేటువే లేదా ప్రవేశ ద్వారం అంటారు. ఒకప్పుడు ఇది అనేక మంది మునులకు, ఋషులకు తపోస్తలి గా వుండేది. ఈ ప్రదేశాన్ని మొదటగా క్రి.శ.1000 లో కనుగొన్నారని చెపుతారు. దీనిని 12 భాగాలు చేయటం వలన ఆ పేరు వచ్చినది (బారా - పన్నెండు).

శిల్పకళా కాణాచి ... మహోబా !శిల్పకళా కాణాచి ... మహోబా !

బారాబంకి లో చూసేందుకు అనేక ప్రదేశాలు కలవు. ఇది పారిజాతం చెట్టుకు పుట్టినిల్లు. బారాబంకి ఘంటాఘర్ లేదా క్లాక్ టవర్ సిటీకి ప్రవేశ ద్వారంగా వుంటుంది. ఈ జిల్లాలో కల మహాదేవ టెంపుల్ పురాతన టెంపుల్స్ లో ఒకటి. హాజీ వారిస్ అలీ షా క్షేత్రం, బదో సరయి అనే యాత్రా స్థలం, కుంతీ దేవి పుట్టిన స్థలం కిన్టూర్ మొదలైనవి కలవు.

బాదోసరాయి

బాదోసరాయి

బదోసరాయి బాబా జగదివాన్ దాస్ పేరుతో నిర్మించ బడిన ఒక ప్రదేశం. దీనిని కోత్వా ధామం అంటారు. ఇక్కడ ప్రధాన ఆకర్షణ ఒక కొలను. అక్టోబర్ నుండి ఏప్రిల్ వరకూ ఇక్కడ స్నానాలు చేస్తారు. ఇక్కడే మరొక ఆకర్షణ ఒక మసీదు.

చిత్రకృప : AMMAR9UL3ISLAM

ఘంటాఘర్

ఘంటాఘర్

బారాబంకి ఘంటాఘర్ అనేది పట్టణంలో మధ్యగా ఉంచబడిన ఒక క్లాక్ టవర్, ఇది సిటీకి ఒక ప్రవేశ ద్వారం. ఈ స్టోన్ ఆర్చ్ భారతీయ కాలమానం చూపుతూ సిటీ లో ఒక ప్రధాన ప్రదేశంగా వుంటుంది. అందమైన ఈ కట్టడం అనేక చెక్కడాలు, గుర్తులు కలిగి జిల్లాలో ఒక ఆకర్షణగా వుంటుంది.

చిత్రకృప : Faizhaider

పారిజాత వృక్షం

పారిజాత వృక్షం

బారాబంకి లో కల పారిజాత చెట్టు ప్రపంచంలోని మొదటిది. ఇది ఏక లింగ పురుష చెట్టు. ఇది పండ్లు లేదా విత్తనాలు ఉత్పత్తి చేయలేదు. ఈ చెట్టు 5000 సంవత్సరాల నాటిదని చెపుతారు.

చిత్రకృప : Faiz Haider

స్వర్గంలో మాత్రమే

స్వర్గంలో మాత్రమే

ఈ చెట్టు ఆకులు అయిదు కొనలుగా చీలి మానవుల చేయిగా వుంటుంది. దీనికి వచ్చే పూవులు అందంగా వుంది వికసిన్చినపుడు మంచి వాసనవస్తాయి. ఈ రకం చెట్టు స్వర్గం లో మాత్రమే వుంటుంది అని పురాణాలు చెపుతాయి.

చిత్రకృప : Faizhaider

దేవా

దేవా

దేవా లేదా దేవా శారిఫ్ఫ్ లో హాజీ వారిస్ అలీ షా అనే ఒక సూఫీ ప్రవక్త క్షేత్రం వుంటుంది. స్మారకం కట్టిన ప్రదేశం లోనే ఈ ప్రవక్త మరణించాడు. మొదటగా అక్కడ సమాధి చేసారు. తరవాత ఆయన శిష్యులు టూంబ్ నిర్మించారు. ఎక్కువ మంది ప్రజలు లేని ఈ చిన్న ప్రదేశం చాలా ప్రశాంతంగా వుంటుంది.

చిత్రకృప : Arpan Mahajan

కిన్టూర్

కిన్టూర్

కిన్టూర్ గ్రామం బదో సారాయి కి తూర్పు వైపున కలదు. దీనికి పాండవుల తల్లి కుంతీ పేరుపై పెట్టారు. ఈ గ్రామం కున్తేస్వర్ టెంపుల్ కి ప్రసిద్ధి. అనేకమంది భక్తులు, చరిత్రకారులు ఈ టెంపుల్ సందర్శిస్తారు.

మహాదేవ టెంపుల్

మహాదేవ టెంపుల్

బారాబంకి జిల్లా లోని మహాదేవ టెంపుల్ అతి పురాతన శివాలయాలలో ఒకటి. దీనిలో అరుదైన శివలింగం వుంటుంది. భక్తులు ఎంతో విశ్వాసంతో శివుడిని అర్చిస్తారు. ఈ టెంపుల్ గురించి మహాభారతంలో కూడా పేర్కొనబడింది. మహా శివరాత్రి నాడు ఈ టెంపుల్ లో విశేష పూజలు రాత్రి అంతా నిర్వహిస్తారు.

చిత్రకృప : Nitin1485

సిద్ధౌర్

సిద్ధౌర్

సిద్ధౌర్ అనేది ఒక చారిత్ర పట్టణం. ఇక్కడ సిద్దేశ్వర్ మహాదేవ టెంపుల్ కలదు. ప్రతి సంవత్సరం డిసెంబర్ మరియు జనవరి ల మధ్య శివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. ఈ సమయంలో భక్తులు అధిక సంఖ్య లో వచ్చి పూజలు, బలులు నిర్వహిస్తారు.

చిత్రకృప : Faizhaider

ఇతర ఆకర్షణలు

ఇతర ఆకర్షణలు

బారాబంకి లో చూడవలసిన ఇతర ఆకర్షణలు : భాయితౌళి, మసౌలి, సాత్రిఖ్, బాబా నాగేశ్వర్ నాథ్ మందిర్, హనుమాన్ మందిర్, గాయత్రి మందిర్, విశ్వ్ కర్మ మందిర్, సీమోరన్ చర్చి, హజారా బాగ్ మరియు మొదలుగునవి.

చిత్రకృప : Sayed Mohd Faiz Haider Rizvi

బారాబంకి ఇలా చేరండి

బారాబంకి ఇలా చేరండి

విమాన ప్రయాణం

బారాబంకి కి సమీప ఎయిర్ పోర్ట్ లక్నోలో కలదు.

ట్రైన్ ప్రయాణం

బారాబంకి రైలు స్టేషన్ నుండి అహ్మదాబాద్, బరేలీ, గోరఖ్పూర్, లక్నో, బెంగుళూరు, ఓల్డ్ ఢిల్లీ, అమ్రిత్సర్, వారాణాసి లకు ట్రైన్ లు కలవు.

బస్సు ప్రయాణం

బారా బంకి నుండి ఇతర ప్రధాన నగరాలకు ప్రభుత్వ బస్సులు కూడా కలవు.

చిత్రకృప : Faizhaider

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X