Search
  • Follow NativePlanet
Share
» » ఇక్కడ అందాలను అస్వాదించాలంటే అందమైన మనస్సు ఉండాలి.

ఇక్కడ అందాలను అస్వాదించాలంటే అందమైన మనస్సు ఉండాలి.

భారత దేశంలోని పర్యాటక అనుకూలమైన ద్వీపాలకు సంబంధించిన కథనం.

భారతదేశం ప్రకృతి సంపదలకు నిలయం. అందులో సముద్రాలు, నదులు, పర్వతాలు, నదీ లోయలు, పర్వతాలు ఇలా చెప్పుకొంటూ పోతే ఎన్నో ఉన్నాయి. అందులో ద్వీపాలు కూడా విస్మరించదగినవి కాదు. భారత దేశంలో ఉన్న ద్వీపాల్లో కొన్ని విదేశీయులను కూడా ఆకర్షిస్తున్నాయంటే అక్కడి ప్రకృతి సంపద అందంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో భారత దేశంలో అత్యంత అందమైన ఐదు ద్వీపాలకు సంబంధించిన విశేషాలు మీ కోసం...

మజూలి ద్వీపం

మజూలి ద్వీపం

P.C: You Tube

నదీ ద్వీపాలకు సంబంధించి మజూలి ద్వీపం ప్రపంచంలోనే పెద్దది. అత్యంత విశిష్ట లక్షణాలు ఉన్న ఈ మజూలి ద్వీపం లో సూర్యోదయం, సూర్యాస్తమయాలు చూడటానికి చాలా అందంగా కనిపిస్తాయి. అచ్చమైన అస్సామీ సంస్క`తి సంప్రదాయాలను మనం తిలకించవచ్చు.

మజూలి ద్వీపం

మజూలి ద్వీపం

P.C: You Tube

ఈశాన్య భారత దేశానికి చెందిన సముద్ర, నదీ ఆహార పదార్థాలు ఇక్కడ చాలా రుచిగా ఉంటాయి. అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య ఈ ఐల్యాండ్ ను సందర్శించడానికి అనుకూలంగా ఉంటుంది. జోర్ధార్ నుంచి ఈ మజూలి ఐ ల్యాండ్ కు రెండు పడవులు వెలుతాయి. ఉదయం 10, మధ్యాహ్నం 3 గంటలకు. వసతి సౌకర్యం బాగుంది. అద్దెకు బైకులు దొరుకుతాయి. వాటి ద్వారా ఈ ఐల్యాండ్ ను చుట్టేసిరావచ్చు.

డయ్యూ ద్వీపం

డయ్యూ ద్వీపం

P.C: You Tube

గుజరాత్ లో ఉన్నటువంటి ఈ డయ్యూ ద్వీపం లో పోర్చుగీసు సంప్రదయాలు ఇప్పటికీ కనిపిస్తాయి. ఇక్కడి భవనాల వాస్తు శైలి కూడా పోర్చుగీసు వాస్తుశైలిని గుర్తుకు తెస్తాయి. గుజరాతీ శైలి సముద్ర ఆహారం మనకు అందుబాటులో ఉంటుంది.

 డయ్యూ ద్వీపం

డయ్యూ ద్వీపం

P.C: You Tube

డయ్యూ ద్వీపం చేరడానికి భారత దేశంలోని చాలా ఎయిర్ పోర్టుల నుంచి మనకు విమాన సర్వీసులు ఉన్నాయి. అయితే రైల్వే సదుపాయం మాత్రం లేదు. ఇక్కడ నగోయా బీచ్ దగ్గర మనకు రిసార్టులు అందుబాటులో ఉంటాయి. అయితే వీటి ఖరీదు కాస్త ఎక్కువ. ఇక్కడ మనం డయ్యూ ఫోర్ట్, షీ షెల్ మ్యూజియం చూడదగినవి. అద్దెకు బైకులు దొరుకుతాయి.

దివార్ ఐల్యాండ్

దివార్ ఐల్యాండ్

P.C: You Tube

గోవాలోని పాంజిమ్ కు దాదాపు 10 కిలోమీటర్ల దూరంలో దివార్ ఐల్యాండ్ ఉంటుంది. మండోవి లేదా మహానది ప్రాంతంలో ఉన్న దివార్ ఐ ల్యాండ్ లో మొత్తం గోవా సంస్క`తి సంప్రదాయాలు మనకు కనిపిస్తాయి.

దివార్ ఐల్యాండ్

దివార్ ఐల్యాండ్

P.C: You Tube

నవంబర్ నుంచి ఫిబ్రవరి మధ్య కాలం ఈ ద్వీపంలో పర్యటించడానికి అనువైనది. దివార్ ఐ ల్యాండ్ గెస్ట్ హౌస్ లో వసతి సౌకర్యం ఉంటుంది. దిల్ ఛాహ్ తా హై వంటి ఎన్నో హింది సినిమాలను ఇక్కడ చిత్రీకరించారు.

సెయింట్ మేరీ ఐ ల్యాండ్

సెయింట్ మేరీ ఐ ల్యాండ్

P.C: You Tube

అనేక చిన్నదీవుల సముదాయమే సెయింట్ మేరీస్ ఐ ల్యాండ్. ఇక్కడ ప్రక`తి సిద్ధంగా ఏర్పడిన ఘనాకారపు శిలలను చూడటానికే చాలా మంది పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. విదేశీయులు ఎక్కువగా ఆకర్షించబడుతున్న భారత దేశంలోని పర్యాటక ప్రాంతాల్లో సెయింట్ మేరీ ఐ ల్యాండ్ కూడా ఒకటి.

సెయింట్ మేరీ ఐ ల్యాండ్

సెయింట్ మేరీ ఐ ల్యాండ్

P.C: You Tube

కర్నాటకలోని ఉడిపి జిల్లాలో ఉన్న ఈ ఐ ల్యాండ్ డిసెంబర్ నుంచి జనవరి మధ్య సందర్శించడానికి అనువుగా ఉంటుంది. మాల్పే నుంచి పడవ ద్వారా మాత్రమే ఇక్కడ చేరుకోగలం. ఇక్కడ వసతి సౌకర్యం అంతగా ఉండదు. అందువల్ల మాల్పే లో వసతి సౌకర్యం చూసుకోవాల్సి ఉంటుంది.

లిటిల్ అండమాన్

లిటిల్ అండమాన్

P.C: You Tube

భారత దేశంలోని అత్యంత అందమైన ద్వీపాల్లో అండమాన్ ఒకటి. ఇక్కడ పర్యాటకుల సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. అందువల్ల ప్రశాంతంగా మనం పర్యాటకాన్ని ఎంజాయ్ చేయవచ్చు. ప్రక`తి ప్రేమికులను దీనికి మించిన పర్యాటక స్థలం మరొకటి లేదంటే అతిశయోక్తి లేదు.

లిటిల్ అండమాన్

లిటిల్ అండమాన్

P.C: You Tube

డిసెంబర్ నుంచి ఫిబ్రవరి మధ్య కాలంలో లిటిల్ అండమాన్ ను సందర్శించడానికి అనువైన ప్రాంతం. ఇక్కడ అనేక అందమైన జలపాతాల హోయలను చూడవచ్చు. అంతే కాకుండా స్కూబా డైవింగ్ కు కూడా అనుకూలం. సర్ఫింగ్ అంటే ఆసక్తి ఉన్నవారికి ఈ లిటిల్ అండమాన్ స్వర్గధామం.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X