Search
  • Follow NativePlanet
Share
» »ఆంద్ర ప్రదేశ్ లో అయిదు బెస్ట్ బీచ్ లు !

ఆంద్ర ప్రదేశ్ లో అయిదు బెస్ట్ బీచ్ లు !

నాకు మంచి ఎండా, ఇసుక, సముద్రం కావాలి, నేను ఆంద్ర ప్రదేశ్ వెళుతున్నాను అని ఎవరైనా తరచుగా అనటం విన్నారా ? లేదు...గోవా వెళుతున్నాను లేదా కేరళ వెళుతున్నాను అనటం మాత్రం వింటాము. కాని దేశంలో, ఆంధ్ర ప్రదేశ్ లో కల కోస్తా తీరం రెండవ అతి పొడవైన కోస్తా తీరం మరియు పొడవైన బీచ్ రోడ్. అందాలతో అంతు లేకుండా సాగే ఈ ఆంద్ర ప్రదేశ్ కోస్తా తీరం లోని బీచ్ ల గురించి కొంత తెలుసుకుందాం !

రిషికొండ బీచ్
విశాఖపట్నం కు పోర్ట్ సిటీ అయిన రిషి కొండ బీచ్ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నుండి 600 కి. మీ. ల దూరం కలదు. దీనిని తూర్పు కోస్తా ఆభరణం అని కూడా అంటారు. నిర్మానుష్య మైన అందమైన రిషికొండ బీచ్ వైజాగ్ కు ఎనిమిది కి. మీ. ల దూరంలో కలదు. ఇక్కడి ఇసుక బంగారు వన్నెతో వుండి , అలల ప్రవాహం మెల్లగా సాగుతుంది. ఈ బీచ్ లో అనేక వాటర్ స్పోర్ట్స్ కూడా కలవు. విండ్ సర్ఫింగ్, జెట్ స్కై ఇంగ్ వంటివి ఆచరించవచ్చు.

భీమునిపట్నం బీచ్
భీమునిపట్నం బీచ్ ని సింపుల్ గా భీమిలి అని కూడా అంటారు. ఇక్కడ కల స్వచ్చమైన నీరు స్విమ్మర్స్ కు ఈ బీచ్ ని ఒక స్వర్గంగా చేసింది. ప్రత్యేకించి వేసవి నెలల లో అధిక సంఖ్యలో జనాలు ఇక్కడకు వస్తారు. భీముని పట్నంకు ఒక గొప్ప చరిత్ర కూడా కలదు. ఈ ప్రదేశం ఒకప్పుడు డచ్ దేశపు వలస ప్రాంతంగా వుండేది. తూర్పు కోస్తా భాగంలో పురాతన అవశేషాలు ఇప్పటికి కనపడతాయి. టవున్ లో 1850 లలో నిర్మించిన ఒక పురాతన చర్చి మరియు లైట్ హౌస్ లు కలవు. ఆధ్యాత్మికులు ఇక్కడ ఒక పురాతన లక్ష్మి నరసింహ టెంపుల్ కూడా చూడవచ్చు.

రామకృష్ణ బీచ్
ఈ బీచ్ కు ఈ పేరు ఇక్కడ కల ప్రసిద్ధ రామకృష్ణ మిషన్ ఆశ్రమం కారణంగా వచ్చింది. ఈ బీచ్ సన్ బాతింగ్ లకు, సర్ఫింగ్ కు ప్రసిద్ధి. సమీపంలోనే లాసంస్ బీచ్ కలదు. ఈ రెంటిని కలిపి జంట బీచ్ లు గా పిలుస్తారు. తూర్పు కోస్తా ప్రాంతం లో ఈ బీచ్ లు చక్కటి అందాలు అందిస్తున్నాయి. ఇక్కడకు వచ్చినపుడు, ఐ ఎం ఎస్ కుర్సూర సబ్ మెరైన్ మ్యూజియం చూడటం మరువకండి.

ఆంద్ర ప్రదేశ్ లో అయిదు బెస్ట్ బీచ్ లు !

మై పాడ్ బీచ్
నెల్లూరు పట్టణం నుండి సుమారు 25 కి. మీ. ల దూరంలో మై పాడ్ బీచ్ కలదు. ఇక్కడ కల కొబ్బరి తోటలు, ఎమేరల్ద్ గ్రాస్ ప్రాంతం బీచ్ కు అందాలు జత చేసాయి. ఈ బీచ్ ప్రశాంత నీటితో వుండి, వారాంతాలలో సైతం నిర్మానుష్యంగా వుంటుంది. బీచ్ లో మత్స్య కారులు తమ చేప వలలను ఒడ్డున బాగు చేసుకోవటం, బోటు లలో సముద్రంలోకి వెళ్ళడం వంటివి చూడగలరు. సమీపంలో కల నేలపట్టు బర్డ్ సంక్చురి లో వివిధ రకాల పక్షులు అంటార్కిటికా, చైనా లనుండి వలసలు వచ్చి ఆశ్రయం పొందటం చూడ దగినది.

యారాడా బీచ్

యారాడా బీచ్ విశాఖపట్నం కు 15 కి. మీ. ల దూరం. ఈ బీచ్ లో ఇసుక బంగారు వన్నె లో వుండి ఆకర్షనీయం గా వుంటుంది. ఒకవైపు కొండలతోను, మరో మూడు వైపులా బంగాళా ఖాతం తోను ఈ బీచ్ ఎంతో సుందరంగా వుంటుంది. దీనికి కొద్ది దూరంలో డాల్ఫిన్స్ నోస్ లైట్ హౌస్ బ్లాకు మొరెస్ హిల్ పై కలదు. నేటికీ ఈ లైట్ హౌస్ ఉపయోగించబడుతోంది. శక్తివంతమైన దాని వెలుగులు ప్రతి పది సెకండ్ లకు ప్రసరిస్తాయి. ఈ కిరణాలు సుమారు 65 కి. మీ. ల దూరం ప్రసరిస్తాయి. సమీపంలోని కొండపై ఒక వెంకటేశ్వర స్వామీ దేవాలయం మరియు దాని సమీపంలోనే ఒక రోస్స్ హిల్ చాపెల్ చర్చి కూడా కలదు.

ఎలా చేరాలి ?
దేశంలోని ప్రధాన నగరాలనుండి విశాఖపట్నం చేరి అక్కడ నుండి ఈ బీచ్ లు చేరవచ్చు.

ఎక్కడ వసతి పొందాలి ?
విశాఖపట్నం లోని హోటల్ గేటు వే బీచ్ రోడ్ లేదా ది పార్క్ మొదలైన హోటళ్ళలో వసతి పొందవచ్చు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X