Search
  • Follow NativePlanet
Share
» »బిర్యానీ రుచుల కోసం బెంగళూరులో ఇక్కడకు వెళ్లాల్సిందే

బిర్యానీ రుచుల కోసం బెంగళూరులో ఇక్కడకు వెళ్లాల్సిందే

బెంగళూరులో రుచికరమైన బిర్యానీ దొరికే ప్రాంతాలకు సంబంధించిన కథనం.

బిర్యానీ అన్న తక్షణం మనకు హైదరాబాద్ గుర్తుకు వస్తుంది. హైదరాబాద్ కు బిర్యానీకి విడదీయరాని బంధం ఉందని ఇట్టే అర్థమవుతుంది. ఒక్క హైదరాబాద్ లో ఉన్న వారే కాకుండా దేశంలోని చాలా మంది హైదరాబాద్ కు వెళితే అక్కడ బిర్యానీ రుచి చూడకుండా వెనుతిరగరు.

అయితే విద్యా, వ్యాపారా, ఉద్యోగాల కోసం చాలా మంది హైదరాబాదీలతో పాటు మిగిలిన ప్రాంతాల వారు బెంగళూరులో స్థిరపడ్డారు. వీరిలో చాలా మందికి అప్పుడప్పుడు లేదా కనీసం వీకెండ్ సమయంలోనైనా హైదరాబాద్ బిర్యానీ రుచి చూడాలని పించడం సహజం.

అటువంటి వారి కోసమే ఈ కథనం. ఇందులో హైదరాబాద్ బిర్యానీతో పాటు నాటుకోడి బిర్యానీ, దొన్నే బిర్యానీ లకు కూడా ఫేమస్ అయిన కొన్ని రెస్టోరెంట్ల వివరాలు అక్కడ ఇద్దరు బిర్యానీ తినడానికి అయ్యే ఖర్చు తదితర వివరాలన్నీ ఉంటాయి. మరెందుకు ఆలస్యం...

హైదరాబాద్ బిర్యాని హౌస్

హైదరాబాద్ బిర్యాని హౌస్

P.C: You Tube

అచ్చం హైదరాబాద్ బిర్యానీ టేస్ట్ చికెన్, మటన్ బిర్యానీ తినాలనుకొంటే మీరు హైదరాబాద్ బిర్యానీ హౌస్ కు వెళ్లాల్సిందే. నగరంలో చాలా చోట్ల ఈ సంస్థకు శాఖలు ఉన్నాయి. ముఖ్యంగా ఓల్డ్ ఎయిర్ పోర్ట్ రోడ్, బన్నేరుగట్టా రోడ్, మారత్ హళ్లి, వైట్ ఫీల్డ్, జయనగర తదితర చోట్ల ఈ హైదరాబాద్ బిర్యాని హౌస్ శాఖలు ఉన్నాయి. ఇద్దరు ఇక్కడ మస్త్ గా బిర్యాని తినడానికి రూ.600 ఖర్చుచేస్తే చాలు.

మేఘనా ఫుడ్స్

మేఘనా ఫుడ్స్

P.C: You Tube

ఆంధ్రస్టైల్ బిర్యానికి మేఘనా ఫుడ్స్ చాలా ఫేమస్. ఇక్కడ మనకు వెజ్, నాన్ వెజ్ రకం బిర్యానీలు చాలా దొరుకుతాయి. ఈ బిర్యానీలు కొంచెం స్పైసీగా ఉంటుంది. ఆ బిర్యానీలన్నింటిలో బోన్ లెస్ చికెన్ బిర్యానీ మరింత రుచిగా ఉంటుంది. ఈ సంస్థకు బెంగళూరులో కోరమంగళ, మారత్ హళ్లి, జయనగర, రెసిడెన్సీ రోడ్, ఇందిరానగర్ లో ఔట్ లెట్స్ ఉన్నాయి. ఔట్ లెట్స్ లో ఎప్పుడూ రష్ గా ఉంటుంది. అందువల్ల టేక్ అవే ఉత్తమం. ఇద్దరు బిర్యాని తినడానికి రూ.500 ఖర్చుపెడితే చాలు.

నాగార్జున

నాగార్జున

P.C: You Tube

నాగార్జున రెస్టోరెంట్ బెంగళూరులో చాలా ప్రాచూర్యం చెందినది. ఆంధ్రస్టైల్ స్పైసీ బిర్యానీకి పెట్టింది పేరు. బెంగళూరులో చాలా చోట్ల నాగార్జున రెస్టోరెంట్లు ఉన్నాయి. ఇక్కడ బిర్యానీతో పాటు దొరికే స్టాటర్స్ చాలా బాగుంటాయి. ఇద్దరు ఇక్కడ బిర్యాని తినడానికి రూ.600 ఖర్చుచేయాల్సి ఉంటుంది.

ప్యారడైజ్

ప్యారడైజ్

P.C: You Tube

బిర్యాని అంటే మొదట గుర్తుకు వచ్చేది హైదరాబాద్. అందులోనూ ప్యారడైజ్ బిర్యాని చాలా ఫేమస్. అదే ప్యారడైజ్ సంస్థ బెంగళూరులో తన శాఖలను అందుబాటులోకి తీసుకువచ్చింది. అచ్చమైన హైదరాబాద్ బిర్యానీ తినాలంటే ప్యారడైజ్ కు మించిన రెస్టోరెంట్ మరొకటి లేదని చెప్పవచ్చు. ఇక్కడ ఇద్దరు బిర్యాని తినడానికి రూ.800 ఖర్చుపెట్టాల్సి ఉంటుంది.

సమర్ ఖండ్

సమర్ ఖండ్

P.C: You Tube

నగరంలోని ఇన్ ఫాట్రీ రోడ్ లో ఈ సమర్ ఖండ్ రెస్టోరెంట్ ఉంది. అచ్చమైన దమ్ బిర్యానీకి చాలా ఫేమస్. ముఖ్యంగా ఈ రెస్టోరెంట్ హోమ్ డెలివరీని అందజేయడం లేదు. ఇక్కడ ఇద్దరు బిర్యానీ తినడానికి రూ.1,600 చెల్లించాల్సి ఉంటుంది.

నాటీ మనే

నాటీ మనే

P.C: You Tube

నాటి కోడి బిర్యానీ తినాలంటే మాత్రం కోరమంగళలోని నాటి మనే కు వెళ్లాల్సిందే. దక్షిణ భారతదేశ ఫ్లేవర్ బిర్యానీ ఇక్కడ చాలా ఫేమస్. ఇక్కడ ఇద్దరు బిర్యానీ తినడానికి రూ.800 ఖర్చవుతుంది.

మనీ దమ్ బిర్యానీ

మనీ దమ్ బిర్యానీ

P.C: You Tube

హైదరాబాద్ దమ్ బిర్యానీకి ఏ మాత్రం తీసిపోని దమ్ బిర్యానీ తినాలంటే మాత్రం మనీ దమ్ బిర్యానీ హౌస్ కు వెళ్లాల్సిందే. ఇక్కడ బోన్ లెస్, మటన్ బిర్యానీ చాలా ఫేమస్. మనీ దమ్ బిర్యానీ ఔట్ లెట్స్ కోరమంగళ, బెలందూర్, జీవన్ భీమా నగర్ తదితర చోట్ల మనీ దమ్ బిర్యానీ ఔట్ లెట్స్ ఉన్నాయి. ఇక్కడ ఇద్దరు బిర్యానీ తినడానికి రూ.400 ఖర్చు చేయాల్సి ఉంటుంది.

శివాజీ మిలటరీ హోటల్

శివాజీ మిలటరీ హోటల్

P.C: You Tube

దాదాపు మూడు దశాబ్దాలుగా ఈ హోటల్ నడపబడుతోంది. జయనగర్ లో ఈ శివాజీ మిలటరీ హోటల్ ఉంది. స్పైసీ దొన్నే బిర్యానీ కోసం ఇక్కడ క్యూ కడుతారు. హోమ్ డెలివరీ అందుబాటులో ఉండదు. ఇద్దరు ఇక్కడ బిర్యానీ తినడానికి రూ.300 ఖర్చు చేస్తే చాలు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X