Search
  • Follow NativePlanet
Share
» »భారత దేశంలోని బెస్ట్ బంగీజంప్ ప్రాంతాలు ఇవే.

భారత దేశంలోని బెస్ట్ బంగీజంప్ ప్రాంతాలు ఇవే.

సాహస క్రీడలు ఇష్టపడేవారికి బంగీజంప్ అంటే చాలా ఇష్టపడుతారు.ఈ నేపథ్యంలో బంగీజంప్ కు భారత దేశంలో అనుకూలమైన ప్రాంతాల గురించి కథనం

By Kishore

సాహస క్రీడలకు భారత దేశంలో ఇటీవల మక్కువ పెరుగుతూ ఉంది. ముఖ్యంగా యువత ఈ రంగం పట్ల ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. మౌంట్ క్లైంబింగ్, కేవింగ్, మొదలుకొని పారగ్లైండిగ్, బంగీజంప్ తదితర క్రీడల పట్ల వారు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత దేశంలో బంగీజంప్ కు అనేక అనుకూలమైన ప్రాంతాలు ఉన్నాయి. అందులో గోవా, ఢిల్లీ, బెంగళూరు, రిషికేష్ తదితర ప్రాంతాలు ముఖ్యమైనవి ఉన్నాయి. ఇందులో కొన్ని ప్రాంతాలు కొత్తగా బంగీజంప్ చేయాలనుకొనేవారికి కూడా అనుకూలం. ఇక్కడ ఒక్కొక్క జంప్ రూ.400 లకు మొదలవుతుంది. బంగీజంప్ ఖరీదు మనం ఎంత ఎత్తు నుంచి దూకుతున్నాం అనే విషయం పై ఆధారపడి ఉంటుంది. అయితే సరైన టైనర్స్, సహాయకులు లేకుండా బంగీజంప్ చేయడం క్షేమం కాదు.

ఇక్కడ పార్వతి దేవికి శివుడు భర్త కాదు..ఇక్కడ పార్వతి దేవికి శివుడు భర్త కాదు..

రిషికేష్, ఉత్తరాఖండ్

రిషికేష్, ఉత్తరాఖండ్

Image Source:

భారత దేశంలో రిషికేష్ అడ్వెంచర్ టూరిజానికి కేంద్ర బిందువు అని అంటారు. ఈ రాష్ట్రంలో జల క్రీడలతో పాటు బంగీజంప్ కు అనువైన అనేక ప్రాంతాలు ఉన్నాయి. కనిష్టంగా 50 మీటర్ల నుంచి 83 మీటర్ల ఎత్తు నుంచి ఇక్కడ బంగీజంప్ కు అవకాశం కల్పిస్తారు. ధర రూ.2500 నుంచి 3,500 వరకూ ఉంటుంది.

లోనావాల మహారాష్ట్ర

లోనావాల మహారాష్ట్ర

Image Source:

డెల్లా అడ్వెంచర్ స్పాట్, మహారాష్ట్ర లోని అతి పెద్దదైన అడ్వెంచర్ పార్క్. ఇక్కడే అందుబాటులో ఉండని అడ్వెంచర్ స్పోర్ట్స్ లేదంటే అతిశయోక్తి కాదేమో. ఈ నేపథ్యంలోనే మహారాష్ట్రలోనే మొదటిసారిగా ఇక్కడ బంగీజంప్ ను స్థానిక పర్యాటక శాఖ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇక్కడ 45 మీటర్ల ఎత్తు నుంచి బంగీజంప్ చేయడానికి అవకాశం ఉంది. దీనికి రూ.2500 చెల్లించాల్సి ఉంటుంది.

గోవా

గోవా

Image Source:

గోవాలోని అంజునా బీచ్ ప్రాంతంలో బంగీజంప్ కు అవకాశాలు ఉన్నాయి. మొదటిసారిగా బంగీజంప్ చేయడానికి అనుకూలమైన ప్రాంతం. ఇక్కడ 25 మీటర్ల ఎత్తు నుంచి బంగీజంప్ చేయడానికి అవకాశం ఉంది. ధర రూ.500 మాత్రమే.

ఢిల్లీ

ఢిల్లీ

Image Source:

ఢిల్లీలోని వండర్ లాస్ట్ ఎడ్వంచర్ స్పోర్ట్స్ కంపెనీ ఢిల్లీ వాసులకు ఈ బంగీజంప్ ను పరిచయం చేస్తోంది. బంగీజంప్ అంటే భయం పోగొట్టుకొనాలనుకొనేవారికి ఈ సంస్థ సహకారం అందిస్తుంది. కైలాష్ అనే ప్రాంతంలో రూ.1500 ఫీజుతో బంగీజంప్ ను అందిస్తుంది.

బెంగళూరు

బెంగళూరు

Image Source:

బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో బంగీజంప్ ఇటీవల అందుబాటులోకి వచ్చింది. 25 మీటర్ల ఎత్తు నుంచి మనం బంగీజంప్ చేయవచ్చు. ఇందుకు రూ.400 చెల్లించాల్సి ఉంటుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X