Search
  • Follow NativePlanet
Share
» »దీపావళి షాపింగ్ ఇక్కడ ఉత్తమం

దీపావళి షాపింగ్ ఇక్కడ ఉత్తమం

ఈ దిపావళికి షాపింగ్ కు సంబంధించి ఉత్తమమైన ప్రాంతాలు ఇవే.

ఇక కొన్ని రోజుల్లో ఆనంద వెలుగులను పంచే దీపావళి వచ్చేస్తోంది. పండుగ అంటే ప్రతి ఒక్కరికీ కొత్తబట్టలు, వస్తువులు తదితర షాపింగ్ చేయాలని ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ సారి దీపావళికి ఈ బెంగళూరులో ఎక్కడెక్కడ షాపింగ్ చేయోచ్చొ ఒకసారి చూద్దామా

బ్రిగేడ్ రోడ్

బ్రిగేడ్ రోడ్

P.C: You Tube

బ్రిగేడ్ రోడ్. బెంగళూరులో అత్యంత ప్రజాదరణ పొందిన షాపింగ్ ప్లేస్ బ్రిగేడ్ రోడ్. ఇక్కడ దొరకని వస్తువంటూ లేదు. బెంగళూరులోని ఎం.జీ రోడ్, బ్రిగేడ్ రోడ్ మధ్యలో ఉంటుంది. ఇక్కడ దొరకని వస్తువంటూ లేదు. ఇక్కడ స్థానిక తయారీ వస్తువుల నుంచి అంతర్జాతీయ బ్రాండ్ ల వరకూ ప్రతి ఒక్కొటీ దొరుకుతుంది.

చిక్కపేట

చిక్కపేట

P.C: You Tube

చిక్కపేట బెంగళూరులో షాపింగ్ చేయడానికి అత్యుత్తమ ప్రాంతం. ఇక్కడ మన బడ్జెట్‌లోనే అన్ని రకాల వస్తువులు దొరుకుతాయి. తక్కువ ధరకే అన్ని రకాల వస్తువులు దొరుకుతాయి. ఇక్కడ హోల్‌సేల్ దుకాణాలు కూడా ఉన్నాయి.

ఎంజీ రోడ్

ఎంజీ రోడ్

P.C: You Tube

మహాత్మాగాంధీ రోడ్. బెంగళూరులో ఇది ఎం.జీ రోడ్డుగానే ప్రాచూర్యం చెందింది. ఇక్కడ ఖాదీతో మొదలుకొని ఇంటర్నేషనల్ బ్రాండ్ దుస్తుల వరకూ దొరుకుతాయి. మీకు బేరం చేసే శక్తి ఉంటే అంతర్జాతీయ బ్రాండ్ దుస్తులను తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు.

రెసిడెన్సీ రోడ్

రెసిడెన్సీ రోడ్

P.C: You Tube

దీపావళి షాపింగ్ అంటే కేవలం దుస్తులే కాదు. ఇంటికి కావాల్సిన అనేక వస్తువులను కొనుక్కోవాల్సి ఉంటుంది. ఇందుకోసం రెసిడెన్సీ రోడ్ ఉత్తమమైనది. బెంగళూరులోనే ప్రాచూర్యం పొందిన సెంట్రల్ మాల్ తో పాటు స్థానికంగా తయారుచేసే మట్టిప్రమిదలు కూడా ఇక్కడ దొరుకుతాయి. అందువల్ల చాలా మంది రెసిడెన్సీ రోడ్ లో షాపింగ్ చేయడానికి ఇష్టపడుతారు.

జయనగర

జయనగర

P.C: You Tube

జయనగర కూడా బెంగళూరులో షాపింగ్ కు పేరుగాంచింది. ఇక్కడ దుస్తుల నుంచి ఎలెక్ట్రిక్ వస్తువులే కాకుండా బంగారు, వెండి ఆభరణాలు కూడా దొరుకుతాయి. జయనగర స్ట్రీట్ షాపింగ్ కూడా చాలా ఫేమస్. దీంతో మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ఇక్కడ షాపింగ్ చేస్తుంటారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X