Search
  • Follow NativePlanet
Share
» »ఆంధ్రప్రదేశ్‌లోని ఈ వారసత్వ సంపదలను చూసొద్దాం?

ఆంధ్రప్రదేశ్‌లోని ఈ వారసత్వ సంపదలను చూసొద్దాం?

ఆంధ్రప్రదేశ్‌లోని వారసత్వ సంపదలకు సంబంధించిన జాబితా.

ఈ భూమి పై ప్రతి ప్రాంతానికి తనదైన సంస్కతి, సంప్రదాయం, చరిత్ర ఉంటుంది. ఈ మూడు ఆ ప్రాంతాల వారసత్వ సంపదకు ప్రతీకలుగా ఉంటాయి. ఇందుకు ఆంధ్రప్రదేశ్ అతీతం కాదు. ఈ ఆంధ్రప్రదేశ్ ప్రస్తావన పురాణ కాలం నుంచి కూడా ఉంది. అటువంటి ఆంధ్రప్రదేశ్ లో వారసత్వ సంపదకు నిలువెత్తు సాక్షాలైన ఐదు ప్రఖ్యాతి గాంచిన పర్యాటక ప్రాంతాల వివరాలు మీ కోసం...

లేపాక్షి

లేపాక్షి

P.C: You Tube

ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో లేపాక్షి ఉంది. ఇది బెంగళూరు నుంచి 120 కిలోమీటర్ల దూరంలో ఉంది. రావణాసురుడు సీతాదేవిని లంకకు బలవంతంగా తీసుకొని వెలుతున్న సమయంలో జటాయువు ఆ రావణుడితో పోరాడి ప్రాణాల మీదకు తెచ్చుకొంటుంది. సీతాన్వేషణలో భాగంగా ఇక్కడికి వచ్చిన రాముడు ఆ పక్షికి సహాయం చేస్తూ లేపక్షి...లే పక్షి అన్నాడు.

పురాణ ప్రాధాన్యత కలిగినది

పురాణ ప్రాధాన్యత కలిగినది

P.C: You Tube

అదే లేపాక్షిగా మారిపోయింది. ఇక్కడ విరూపాక్షదేవాలయం చూడదగినది. శ్రీక`ష్ణ దేవరాయల కాలంలో దీనిని నిర్మించినట్లు చెబుతారు. ఇక్కడి శిల్పాలు చాలా అందంగా ఉంటాయి. వీటిని చూడటానికే విదేశఆల నుంచి కూడా పర్యాటకులు వస్తారు.

గండికోట

గండికోట

P.C: You Tube

గండికోట ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లాలో ఉంది. ఇది చారిత్రాత్మకంగా ఎంతో ప్రాధాన్యత కలిగిన ప్రాంతం. ఇది ఒక గిరిదుర్గం. దీనిని 13వ శతాబ్దంలో నిర్మించినట్లు చరిత్ర చెబుతుంది. వృత్తాకారంలో ఉండే కోట చుట్టుకొలత దాదాపు ఐదు మైళ్ళుంటుంది. కోట ముఖద్వారానికి ఎత్తైన కొయ్య తలుపులు ఇనుప రేకుతో తాపడం చేయబడి ఉంటాయి. తలుపుల పై ఇనుప సూది మేకులు ఉన్నాయి. అప్పట్లో ఈ కోటను రాజకీయ ఖైదీలను ఉంచడానికి వినియోగించేవారు. దీనిని సందర్శిస్తే రాయలసీమ చరిత్రను తెలుసుకోవడానికి వీలవుతుంది.

 ఉండవల్లి గుహలు

ఉండవల్లి గుహలు

P.C: You Tube

ఉండవల్లి గుహలు కేవలం ఆంధ్రప్రదేశ్ చరిత్రతోనే కాకుండా భారత దేశ చరిత్రతో కూడా ముడిపడి ఉన్న పర్యాటక ప్రదేశం. ఇక్కడ ఒక పర్వతాన్ని కొన్ని గుహలుగా మలిచినతీరు మనలను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అంతేకాకుండా ఈ గుహల్లో దాదాపు 20 అడుగుల ఏక శిలా అనంతపద్మనాభస్వామితో పాటు ఎన్నో గుహలు పర్యాటకులను ఇట్టే ఆకర్షిస్తాయి. ఈ గుహలు మొత్తం నాలుగు అంతస్తుల్లో ఉంటాయి. మొదటి అంతస్తు పై ఉన్న మునులు, సింహ విగ్రహాలను ఎంతసేపు చూసినా ఇంకా చూడలనే అనిపిస్తుంది.

చంద్రగిరి

చంద్రగిరి

P.C: You Tube

చంద్రగిరి కోట చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి అనే చిన్న పట్టణంలో ఉంది. ఇది క్రీస్తుశకం 1640లో నిర్మించారు. శ్రీ కృష్ణదేవరాయలు ఆస్థానములో వుండిన మహామంత్రి తిమ్మరుసు జన్మస్థలం చంద్రగిరి. ఈ కోట నిర్మాణాన్ని చూస్తే ఆనాటి యుద్ధ నైపుణ్యం స్పురణకు రావణం ఖచ్చితం. ఈ కోట వల్ల విజయనగర సామ్రాజ్యంతో పాటు దక్కన్ ప్రాంతం ముస్లీం రాజ్యాల చరిత్ర కూడా మనకు అవగతమవుతుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X