Search
  • Follow NativePlanet
Share
» »డిసెంబర్ నెల‌లో అడుగుపెట్టాల్సిన బెస్ట్‌ హిల్‌స్టేషన్‌లు

డిసెంబర్ నెల‌లో అడుగుపెట్టాల్సిన బెస్ట్‌ హిల్‌స్టేషన్‌లు

డిసెంబర్ నెల‌లో అడుగుపెట్టాల్సిన బెస్ట్‌ హిల్‌స్టేషన్‌లు

డిసెంబర్ నెల సంవత్సరంలో చివరి నెల. ఈ చివరి నెలలో దాదాపు ప్రతి ఒక్కరూ తమ ఏడాది మొత్తం జ్ఞాపకాలను ఒకచోట ఉంచుకోవాలని కోరుకుంటారు. అందుకోసం చాలా మంది ఔత్సాహిక‌లు తమ బ్యాగులను సర్దుకుని ఏదో ఒక‌ హిల్ స్టేషన్ వైపు నడక కోసం వెళతారు. డిసెంబర్ నెలలో దాదాపు అనేక‌ హిల్ స్టేషన్‌ల‌లో హిమపాతం ప్రారంభమవుతుంది. ఆ హిమపాతంలో ఉల్లాసంగా గడిపేందుకు భారతదేశం నుంచే కాకుండా విదేశీ పర్యాటకులు కూడా వస్తుంటారు.

ముఖ్యంగా జంటగా సందర్శించేందుకు ఎక్కువ మంది ఆస‌క్తి చూపుతారు. మీరు కూడా డిసెంబర్‌లో కొన్ని ఉత్తమ హిల్ స్టేషన్‌లను సందర్శించాలని ప్లాన్ చేస్తుంటే, మీ భాగస్వామి, స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో కలిసి ఆ హిమ‌పాత‌పు మార్గాల్లో నడవడానికి వెళ్లేందుకు సిద్ధంగా ఉంటే.. ఇదిగో మీకోసం డిసెంబ‌ర్‌లో పేరుగాంచిన కొన్ని హిమ‌పాత‌పు హిల్ స్టేష‌న్‌లు..

కులు మరియు మనాలి, హిమాచల్ ప్రదేశ్

కులు మరియు మనాలి, హిమాచల్ ప్రదేశ్

హిమాచల్ ప్రదేశ్‌లో సందర్శించడానికి అత్యంత ప్రసిద్ధ ప్రదేశాలు కులు మరియు మనాలి. ప్రతి నెలా పర్యాటకుల రద్దీ ఉన్నప్పటికీ డిసెంబర్ నెలలో ఇక్కడ సందర్శకుల‌కు భిన్నమైన వినోదం ఉంటుంది.

కులు మరియు మనాలిలోని పచ్చని అడవులు, మంచుతో కప్పబడిన పర్వతాలు, పూలతో నిండిన పచ్చికభూములు ప్ర‌కృతి ప్రేమికుల‌కు ఆహ్వానం ప‌లుకుతాయి. కొన్ని సాహస క్రీడ‌ల‌కు ఈ హిల్ స్టేష‌న్‌లు ప్ర‌సిద్ధి చెందాయి. మ‌రి డిసెంబ‌ర్‌లో ఇంతకంటే మంచి హిల్ స్టేషన్ ఏం ఉంటుంది చెప్పండి. కులు మరియు మనాలిలో చూడదగిన మ‌రికొన్ని ప్రదేశాలు..

- సోలాంగ్ వ్యాలీ

- రోహ్తంగ్ పాస్

- మణికరణ్ గురుద్వారా

- హిడిమాంబ దేవి ఆలయం

- పార్వతి లోయ

చోప్తా హిల్ స్టేషన్, ఉత్తరాఖండ్

చోప్తా హిల్ స్టేషన్, ఉత్తరాఖండ్

డిసెంబరులో ఉత్తరాఖండ్‌లో సందర్శించడానికి ఇది ఉత్తమమైన హిల్ స్టేషన్‌లలో ఒకటి. ముఖ్యంగా, చోప్తాలో ఉండే వినోదం మరే ప్రదేశంలోనూ ఉండదు. డిసెంబరు ప్రారంభం నుండి చోప్తాలో హిమపాతం మొదలవుతుంది. ఇక్క‌డి పర్వతాలు తెల్లటి మంచుతో కప్పబడి ప‌ర్యాట‌కుల‌ను మంత్ర‌ముగ్దుల‌ను చేస్తాయి. చోప్తాలో హిమపాతాన్ని ఆస్వాదించడంతో పాటు ట్రెక్కింగ్, రాక్ క్లైంబింగ్ మొదలైన కొన్ని సాహస కార్యకలాపాలను కూడా చేయవచ్చు. చోప్తాలో చూడదగిన మ‌రికొన్ని ప్రదేశాలు..

- తుంగనాథ్ ఆలయం

- డియోరియా తాల్

- కంచుల ఖరక్ కస్తూరి జింక అభయారణ్యం

- ఉఖిమత్

జొవాయి, మేఘాలయ

జొవాయి, మేఘాలయ

డిసెంబరు నెలలో సందర్శించడానికి ఉత్తమమైన హిల్ స్టేషన్లలో జొవాయి ఒకటి. డోకీని సందర్శ‌న‌లో వ‌చ్చే మజా మరే ఇతర ప్రదేశంలో కనిపించదు. ఇది మేఘాలయ రాజధాని షిల్లాంగ్ నుండి సుమారు యాభై కిలోమీట‌ర్ల దూరంలో భారత్-బంగ్లాదేశ్ సరిహద్దులో ఉన్న చాలా అందమైన హిల్ స్టేషన్.

ఈ అస్సామీ ప్ర‌కృతి అందాలను చూసేందుకు ఏటా డిసెంబ‌ర్‌లో లక్షల మంది పర్యాటకులు ఇక్కడికి చేరుకుంటారు. మీరు ఈశాన్య లోయలలో తిరగాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇక్కడకు చేరుకోండి. జొవాయిలో చూడదగిన ప్రదేశాలు..

- జాఫ్లాంగ్ జీరో పాయింట్

- ఇండియా-బంగ్లాదేశ్ ఫ్రెండ్‌షిప్ సైట్

- ఉమ్‌గోట్ నది

బిన్సార్ హిల్ స్టేషన్, ఉత్తరాఖండ్

బిన్సార్ హిల్ స్టేషన్, ఉత్తరాఖండ్

బిన్సార్ ఉత్తరాఖండ్‌లోని ఒక చిన్న మరియు చాలా అందమైన హిల్ స్టేషన్. అల్మోరా నుండి దాదాపు 30 కిలోమీట‌ర్ల‌ దూరంలో ఉన్న బిన్సార్ మంచుతో కప్పబడిన పర్వతాలకు ప్రసిద్ధి చెందింది. డిసెంబరు నెలలో మంచు కురవడం ఆస్వాదించడానికి, పర్యాటకులు నవంబర్ నెలలోనే ఇక్కడికి చేరుకుంటారు. పచ్చని అడవిలో సంచరించడంతో పాటు, సాహస కార్యకలాపాలు కూడా చేయవచ్చు. బిన్సార్‌లో చూడదగిన ప్రదేశాలలో ముఖ్య‌మైన‌ది బిన్సార్ వన్యప్రాణుల అభయారణ్యం.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X