Search
  • Follow NativePlanet
Share
» »తమిళనాడు లో అద్భుత పిక్నిక్ ప్రదేశాలు!

తమిళనాడు లో అద్భుత పిక్నిక్ ప్రదేశాలు!

తమిళనాడు సంస్కృతి ఎంతో ఉన్నతమైనది. ఈ రాష్ట్రం ఇండియా లోని ఎన్నో అద్భుత పర్యాటక ప్రదేశాలకు నెలవై వుంది. ఈ దక్షినాది రాష్ట్రానికి దేశంలోని వివిధ ప్రాంతాలనుండి టూరిస్ట్ లు పర్యటనకు వస్తారు. ఇక్కడ అనేక దేవాలయాలు, బీచ్ లు, ఇతర సహజ మరియు మానవ నిర్మిత పర్యాటక ఆకర్షణలు అనేకం కలవు.

మీరు ఒంటరిగా లేదా స్నేహితులతో లేదా కుటుంబ సమేతంగా ...ఎలా ప్రయానిస్తున్నప్పటికి వివిధ అభిరుచులు కల వారికి వారి అవసరాలకు తగినట్లు మంచి ప్రదేశాలు కలవు. సహజ సిద్ధమైన ప్రదేశాలు, సాహస క్రీడల ప్రదేశాలు, వన్య జంతువుల ప్రదేశాలు, అన్నీ ఈ రాష్ట్రంలో కలవు. మరి తమిళనాడు లోని కొన్ని ఉత్తమ ప్రదేశాలు మీకు పూర్తి విశ్రాంతిని అందించ గలిగినవి కొన్ని పరిశీలిద్దాం.

తమిళనాడు లో బెస్ట్ పిక్నిక్ ప్రదేశాలు

 ఊటీ

ఊటీ

ఊటీ ని ఉదకమండలం అని కూడా అంటారు. తమిళనాడులో అత్యంత సుందరమైన పట్టణం. పర్వత శ్రేణులు, పచ్చటి తోటలు, ఆహ్లాదకర వాతావరణం అన్ని కలిపి సౌత్ ఇండియా లో కల ఈ ఊటీ ని ఒక గొప్ప పర్యాటక ప్రదేశం గా చేసాయి .

కొడైకెనాల్

కొడైకెనాల్

కోడై కెనాల్ ను పర్వత పట్టణాల యువ రాణిగా పిలుస్తారు. మంత్ర ముగ్ధులను చేసే అందాలతో దక్షిణ భారత దేశంలో ఇది ఒక హనీ మూన్ స్వర్గం గా విలసిల్లుతోంది. ఇక్కడ కల కోడై సరస్సు, బేర్ షోలా జలపాతాలు, కోకర్స్ వాక్ టాప్ మొదలైనవి పర్యాటకులకు ఆనందాలను కలిగిస్తాయి.

చెన్నై నగరం

చెన్నై నగరం

తమిళనాడు టూరిజం గురించి చెప్పెట పుడు, దానిలో చెన్నై నగర సందర్సన తప్పక వుండి తీరాలి. చెన్నై తమిళనాడు రాష్ట్ర రాజధాని. రాష్ట్రంలో ఒక బెస్ట్ పిక్నిక్ స్పాట్. ఇక్కడ కల మెరీనా బీచ్, ప్రపంచంలోనే రెండవ అతి పొడవైన బీచ్ గా చెప్పబడుతుంది. దక్షిణ చిత్ర ఆడిటోరియం లో దక్షిణ రాష్ట్రాల సంస్కృతి కి సంబంధించిన అనేక ప్రోగ్రాములు చూడవచ్చు.

ఎర్కాడ్

ఎర్కాడ్

ఏర్కాడ్ పట్టణం చెన్నై అంత ప్రసిద్ధి కాదు. ఐనప్పటికీ తమిళనాడు లో ఒక మంచి టూరిస్ట్ ప్రదేశం. ఏర్కాడ్ హిల్ స్టేషన్ చాలా అందమైనది. నగర బిజి జీవితం నుండి దూరంగా ఉండాలనుకునే వారికి ఈ పట్టణం హాయి గా వుంటుంది. ఈ పట్టణాన్ని పేదవారి ఊటీ అని కూడా పిలుస్తారు.

కన్యాకుమారి

కన్యాకుమారి

అద్భుత సూర్యోదయాలు, ఆకాశం రంగులు మారటాలు చూడాలనుకుంటున్నారా ? కన్యాకుమారి తప్పక సందర్శించండి. ఈ ప్రదేశంలో హిందూ మహాసముద్రం, బంగాళా ఖాతం మరియు అరేబియా సముద్రం మూడూ కలిసి ఉదయం నుండి సాయంత్రం వరకూ అద్భుత అందాలను ప్రదర్శిస్తాయి.

మదురై

మదురై

తమిళనాడు లో మదురై ఒక మంచి పిక్నిక్ స్పాట్. ఇక్కడ ప్రసిద్ధి చెందిన అనేక దేవాలయాలు కలవు. ప్రసిద్ధ మీనాక్షి టెంపుల్ మాత్రమే కాక ఇంకనూ అనేక ఇతర టెంపుల్స్ కూడా కలవు.

ఏలగిరి

ఏలగిరి

తమిళనాడు లోని ఏలగిరి చిన్న పట్టణమే అయినప్పటికీ ఎంతో సుందరమైనది. ఇది సుమారు 14 చిన్న గ్రామాలు ఒక గుంపుగా కల జానపదుల ప్రదేశం. లగేజ్ ఎక్కువ లేకుంటే, కొండలపైకి తేలికగా వెళ్లి ఆనందించవచ్చు.

రామేశ్వరం

రామేశ్వరం

రామేశ్వరం తమిళనాడు లో ఒక మంచి పిక్నిక్ ప్రదేశం. అంతేకాదు ఒక ప్రసిద్ధ యాత్రా స్థలం కూడాను. హిందూ పురాణాల మేరకు రామేశ్వరంలో శ్రీ రాముడు తన పాప ప్రక్షాలనకై స్నానాలు చేసాడు. ఇక్కడ కల శ్రీ రామనాథస్వామి టెంపుల్, పంబన్ బ్రిజ్ మరియు ధనుష్కోడి ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణలు.

ముడుమలై

ముడుమలై

తమిళనాడు లోని ముడుమలై లో ప్రసిద్ధ టెంపుల్స్ మరియు హిల్ స్టేషన్ లు కలవు. ఇక్కడ వన్య జంతువుల అభయ అరణ్యాలు కూడా కలవు.

వేలన్ కన్ని

వేలన్ కన్ని

వేలన్ కన్ని క్రిస్టియన్ మతస్తులకు ఒక పవిత్ర ప్రదేశం. ఇక్కడ మేరి మాత కొలువ బడుతుంది. వేలన్ కన్ని చర్చి మరియు బీచ్ ఇక్కడ ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణలు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X