Search
  • Follow NativePlanet
Share
» »జులై నెలలో ఈ ప్రదేశాలకు వెళ్ళడం మనస్సుకు ఆహ్లాదం మాత్రమే కాదు ఒక అద్భుత అనుభవం..

జులై నెలలో ఈ ప్రదేశాలకు వెళ్ళడం మనస్సుకు ఆహ్లాదం మాత్రమే కాదు ఒక అద్భుత అనుభవం..

భారత దేశ పర్యాటక ప్రదేశ అందాలు సంవత్సరం పొడవునా చెప్పుకో దగినవే, కాని కొన్ని ప్రదేశాలలో ఈ వర్షాకాలం మరింత పునరుజ్జీవిమ్పబడి ఆహ్లాదకరంగా వుంటుంది. తొలకరి చినుకులు ఆనందం ఈ ప్రదేశాలలో మరువ లేనిది. ఇక ప్రకృతి కొత్త అందాలను సంతరించుకునే జులై మాసంలో పలు ప్రాంతాలు మరింత అందంగా కనిపిస్తాయి. మనస్సుకు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి.

ఇందులో నదీలోయ ప్రాంతాలు, జలపాతాలు కూడా ఉన్నాయి. ప్రకృతి కి పర్యాయ పదంగా నిలిచే అందాలు మన ఇండియాలోనే ఉన్నాయి. ఈ సీజన్లో కూడా ట్రావెలర్స్‌కు అనుకూలించే కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. వర్షాకాలంలో ఆ ప్రాంతంలో భలే అందంగా స్వర్గసీమను తలపిస్తాయి.

మరి వర్ష రుతువులో భారత దేశంలో ఏ ఏ ప్రదేశాలకు వెళితే బాగుంటుంది అని కొన్ని ప్రదేశాలను ఎంపిక చేయడం జరిగింది. మరి ఆ ప్రదేశాలేంటో మీరు కూడా తెలుసుకుంటే ఏ ప్రదేశానికి వెళ్ళాలా అని మీరు ఆలోచనలో పడటం కూడా ఖాయం, మరి ప్రదేశాలు అంత అందంగా వుంటాయి. మరి ఇండియాలో జులై నెలలో సందర్శనకు అనుకూలంగా ఉండే ప్రదేశాలేంటో ఒకసారి తెలుసుకుందాం..

అలెప్పి:

అలెప్పి:

కేరళ వర్షాలకు పెట్టింది పేరు. అందుకే ఇక్కడ పర్యాటక ప్రదేశాలు కూడా అందుకు అనుగుణంగా ఉంటాయి. ఒక వైపు బీచ్...మరోవైపు బీచ్ అందమైన కాలువల్లో పడవ విహారం పర్యాటకుల్ని మంత్రముగ్దుల్ని చేస్తుంది. కేరళలోని అల్లెప్పి ని తూర్పు దేశపు వెనిస్ నగరం అంటారు. సౌత్ ఇండియా లో వర్ష రుతువులో కుటుంబ సభ్యులతో, స్నేహితులతో లేదా మీ ప్రియమైన వారితో తప్పక చూడదగిన ప్రదేశం. ఎన్నో ప్రకృతి దృశ్యాలు. బ్యాక్ వాటర్ అనుభవాలు, నీటి కాలువలు, బీచ్ లు హౌస్ బోటు లు నీల ఆకాశాలు, పొడవైన కొబ్బరి చెట్లు, అన్నీ కలిసి మీకు ఒక స్వర్గం అందిస్తాయి.

లఢక్:

లఢక్:

సింధు నదీ తీరాన ఉన్న లడఖ్, జమ్మూ & కాశ్మీర్ రాష్ట్రం లోని ఒక ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం. లడఖ్ పేరు చెప్పగాని అనేక ఉత్సాహాలు పెల్లుబుకుతాయి. సముద్ర మట్టానికి ఎంతో ఎత్తున కల ఈ ప్రదేశం, మంచుతో పూర్తిగా కప్పబడిన ఆకాశంలోకి చొచ్చుకు పోయే శిఖరాలు కల దృశ్యాలు పర్యాటకులకు పూర్తి ఆనందం కలిగిస్తాయి. అంత ఎత్తులో చుట్టూ పూర్తిగా కొండలచే చుట్టుముట్టబడి పర్యటించటం ఒక అద్భుత అనుభవం కాగలదు. ఇక లెహ్ పర్యటనకు వస్తే, ఈ ప్రదేశం అంతా ఒక టూరిస్ట్ స్వర్గంగా వుంటుంది. ఉత్తర భారత దేశపు స్వర్గం అని చెప్పవచ్చు. టవున్ లో ఎక్కడ చూసినా టాటూ లు వేసుకున్న టూరిస్ట్ లు, ఎం ఫీల్డ్ బుల్లెట్లు, వివిధ రకాల డిష్ లు తయారు చేసే రెస్టారెంట్ లు మీకు దర్శనం ఇస్తాయి.

లాహౌల్, హిమాచల్ ప్రదేశ్:

లాహౌల్, హిమాచల్ ప్రదేశ్:

ఇండియా కి, టిబెట్ కి సరిహద్దు రాష్ట్రం అయిన హిమాచల్ ప్రదేశ్ లో లాహౌల్ వుంది. ఇక్కడి ఎక్కువ మంది భౌద్దాన్ని అనుసరిస్తూ ఆ సాంప్రదాయాలు, ఆచారాలు పాటిస్తారు. విహారాలకు, కిబ్బర్ వన్యప్రాణి అభాయారణ్యానికి ప్రసిద్ది పొందిన కిబ్బర్ గ్రామం ఇక్కడి ప్రధాన పర్యాటక ఆకర్షణ. పిన్ వాలీ నేషనల్ పార్క్, కీ విహారం, కున్ జుమ్ పాస్ ఇక్కడి ఇతర ఆకర్షణలు. అడవి దున్నలు, డోజోల్లాంటి జంతువులు ఇక్కడ స్వేచ్చగా తిరుగాడుతూ కనిపిస్తాయి.

శిమొగ్గ:

శిమొగ్గ:

షిమోగా అంటే అర్ధం ‘శివుడి యొక్క ముఖం' అని చెపుతారు. ఈ పట్టణం బెంగుళూరుకు 275 కి.మీ. ల దూరంలో ఉంది. దీనిని స్ధానికులు మల్నాడ్ ప్రాంతం అని అంటారు. ఈ ప్రాంతం పశ్చిమ కనుమలకు ఆనుకుని ఇతర నగరాలతో రోడ్డు మరియు రైలు మార్గాలలో దేశంలోని ఇతర ప్రాంతాలతో బాగా కలుపబడింది. షిమోగా కు సంబంధించిన కొన్ని వాస్తవాలు ఈ జిల్లాగుండా షుమారు అయిదు ప్రధాన నదులు ప్రవహిస్తాయి. కనుక షిమోగా ఎంతో సారవంతమైన భూమి అని, కర్నాటక రాష్ట్రానికి అన్నపూర్ణగా ప్రసిద్ధి చెందిందని చెప్పవచ్చు. సహ్యాద్రి పర్వతాలు నిరంతరం వర్షపాతం కలిగి సంవత్సరంకు సరిపడా కర్నాటక రాష్ట్ర ప్రజలకు వర్షాలనిస్తాయి. స్ధానికులు షిమోగా ప్రాంతాన్ని భూమిపై అవతరించిన స్వర్గంగా పిలుస్తారు. ఈ ప్రాంతం అందరికి అన్నిఅవసరాలను ప్రసాదిస్తుంది. పర్యాటకులకు, యాత్రికులకు వీనుల విందు చేసే దేవాలయాలు, ఎత్తైన కొండలు, పచ్చటి పచ్చిక మైదాన ప్రాంతాలు, ప్రపంచ ప్రఖ్యాత జోగ్ ఫాల్స్ వంటి జలపాతాలు ఇక్కడ ఉన్నాయి. జోగ్ ఫాల్స్ దేశంలోనే అతి పెద్ద జలపాతాలుగా చెపుతారు.

కొడైకెనాల్:

కొడైకెనాల్:

కొడైకెనాల్ పశ్చిమ కనులమలలోని పళని కొండలలో ఉన్న అందమైన..సుందరమైన హిల్ స్టేషన్. ఈ పట్టణం దాని అత్యద్భుతమైన అందం, ప్రజాదరణ కారణంగా పర్వత యువరాణి అని నామకరణం చేయబడినది. తమిళంలో కొడైకెనాల్ అంటే అర్ధం అడవుల బహుబతి. ఇది హనీమూన్ జంటలకి అనువైనది. ఈ ప్రాంతంలో ఉన్న దట్టమైన అడవుల మధ్య ఉండే మంత్రముగ్ధులని చేసే ప్రకృతి సౌందర్యంతో కూడిన చెట్లు, రాళ్ళు, జలపాతాలు తప్పక సందర్శించాలి.

Aruna

షిల్లాంగ్

షిల్లాంగ్

'తూర్పు స్కాట్లాండ్ ' అని పిలవబడే షిల్లాంగ్ నిస్సందేహంగా ఈశాన్య ప్రాంతంలో అత్యంత ప్రసిద్ది చెందిన పర్యాటక కేంద్రాలలో ఒకటిగా ఉంది. షిల్లాంగ్ లో పచ్చని పొలాలు,సుందరమైన ప్రకృతి దృశ్యాలు, మేఘాలతో కూడిన ఎత్తైన పర్వతాలు,తియ్యని స్మెలింగ్ పువ్వులు,పుస్తకాలుతో కూడిన ప్రదేశం, స్నేహపూర్వకమైన ప్రజలు మరియు వలస అతిథి మర్యాద మొదలైన వాటి వల్ల షిల్లాంగ్ ఆకర్షనీయంగా ఉంటుంది. షిల్లాంగ్ చుట్టూ పచ్చదనంతో నిండి షిల్లాంగ్ పర్యాటన ఉత్సాహపూరితంగాను మరియు నగరం జీవితం సందడిగా ఉంటుంది.

లోనావాలా:

లోనావాలా:

మహారాష్ట్రలోని పశ్చిమ ప్రాంతంలో ఉండే అద్భుతమైన సహ్యాద్రి శ్రేణిలో గల ప్రసిద్ధ పర్వత ప్రాంతం. జాలువారే జలపాతాలు, పరచుకున్న పచ్చదనంతో ప్రకృతి ఇక్కడ చాలా రమణీయంగా ఉంటుంది. మీరు పర్వతారోహణ లేదా పురాతన భారతీయ నిర్మాణాలను ఇష్టపడే వారైతే తుంగ్, తిలోనా, లోహ ఘడ్ కోటలను చూడండి. ఎత్తైన, పచ్చటి చెట్లుగల రైవుడ్ పార్క్ లోనావాలాలో పెద్ద ఉద్యానవనం. సరదాలు పంచే మరో ప్రదేశం శివాజీ ఉద్యాన్. ఈ స్వర్గపు తునకకి ఆగస్ట్ మాసంలో వెళ్ళకపోతే ఏమీ కోల్పోతున్నారో మీకు తెలీదు.

 గోవా :

గోవా :

ఇండియా లోని పడమటి తీరంలో గోవా ఎంతో కాలంగా ఒక ఆకర్షణీయ విహార స్ధలంగా పేరుగాంచింది. ఏ సీజన్లో అయినా అందాలతో మంత్రముగ్ధులను చేసే సొగసరి. ఇక్కడ లభించే చవకైన ఆల్కహాల్ నుండి అందమైన బీచ్ వరకు అన్ని ఆకర్షణీయమే.పోర్చ్ గీస్ బిల్డింగ్..కొబ్బరి చెట్లు..అందమైన బీచ్ ఇంకా ఎన్నో అందాలు మిమ్మల్ని ఆకట్టుకుంటాయి. గోవా ప్రాంతాన్ని ఎక్కువగా జూలై-ఆగస్టు మాసం లో ఎక్కువ మంది సందర్శిస్తుంటారు . కారణం నీటి క్రీడలు ఆగస్ట్ మాసంలోనే జరుగుతుంటాయి. అన్ని బీచ్ లలోను వాటర్ స్పోర్ట్స్ ఉంటాయి. వీటిని కొంతమంది బ్రోకర్లు నిర్వహిస్తారు. జెట్ స్కైస్, బనానా రైడ్, పారా సైలింగ్ వంటివి ఎంచుకోవచ్చు. బీచ్ లో కల గుడిసెలలో లభించే అచ్చమైన గోవా సీఫుడ్ తో బాటుగా బీర్ పుచ్చుకోవడం మరచిపోకండి.

పాండిచేరి :

పాండిచేరి :

ఒక విభిన్న పర్యాటక అనుభవాన్ని కోరుకొనే ప్రయాణీకునికి పాండిచేరి ఒక అద్భుతమైన పర్యాటక ప్రదేశం. సూర్యోదయ నగరంగా కూడా పేరొందిన ఆరోవిల్లె నగరం చక్కని నిర్మాణ శైలితో పర్యాటకులను ఆకర్షిస్తుంది. గాంధీ విగ్రహం, ఫ్రెంచి యుద్ధ స్మారకం, జోసెఫ్ ఫ్రాంకోయిస్ డుప్లెక్స్ విగ్రహం వంటి అనేక స్మారక చిహ్నాలు ఇక్కడ మనకు కనిపిస్తాయి. ఫ్రెంచి, తమిళ సంస్కృతుల ప్రభావాలతో నిండిన పాండిచేరి, భోజన ప్రియుల కోసం అద్భుతమైన వంటకాలను అందిస్తుంది. ఈ నగరంలోని వీధులు, అంగళ్లు షాపింగ్ అంటే ఇష్టపడే వారికి స్వర్గంలా ఉంటాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X